మరోసారి కేంద్రమంత్రిగా ముక్తార్ అబ్బాస్ నఖ్వీ | Profile of Mukhtar Abbas Naqvi | Sakshi
Sakshi News home page

మరోసారి కేంద్రమంత్రిగా ముక్తార్ అబ్బాస్ నఖ్వీ

Published Sun, Nov 9 2014 1:52 PM | Last Updated on Thu, May 24 2018 2:09 PM

మరోసారి కేంద్రమంత్రిగా ముక్తార్ అబ్బాస్ నఖ్వీ - Sakshi

మరోసారి కేంద్రమంత్రిగా ముక్తార్ అబ్బాస్ నఖ్వీ

హిందూ సైద్దాంతిక విధానాలు, ఆశయాలు, లక్ష్యాలున్న బీజేపీలో షియా మతస్తుడైన ముక్తార్ అబ్బాస్ నఖ్వీ జాతీయ ఉపాధ్యుడిగా ఉన్నారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుఢి హోదాలో, అధికార ప్రతినిధిగా పార్టీకి సేవలందిస్తున్నారు. 
 
జననం: 
1957 అక్టోబర్ 15 తేదిన ఉత్తరప్రదేశ్ లో అలహాబాద్ లోని షియా ముస్లింల కుటుంబంలో జన్మించారు. ఆయనకు భార్య సీమా నఖ్వీ, ఓ కుమారుడు ఉన్నారు. 
 
విద్యాభ్యాసం: 
అలహాబాద్ యూనివర్సిటీలో విద్యను అభ్యసించారు. 
 
నఖ్వీ జీవితంలో కీలక ఘట్టాలు:
  • 1975-77 సంవత్సరాల మధ్య అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించినపుడు జైలు జీవితాన్ని అనుభవించారు. 
  • 1980లో జనతపార్టీ అభ్యర్థిగా అలహాబాద్ పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేశారు. 
  • 1989లో ఆయోధ్య నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటి.
  • 1991, 1993 లో మావ్ అసెంబ్లీకి ఎన్నిక
  • 1998లో రాంపూర్ నియోజకవర్గం నుంచి లోకసభకు ఎన్నిక
  • 1998లో వాజ్ పేయి ప్రభుత్వ హాయంలో సమాచార, ప్రసార శాఖామంత్రి, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రిగా సేవలందించారు. 
  • 2010లో బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక
  • ఉత్తర ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నిక
 
ఇతర బాధ్యతలు:
  • ఆర్ధిక కమిటి సభ్యుడిగా..
  • వాణిజ్య కమిటి సభ్యుడిగా, 
  • వక్ఫ్ బోర్డు జాయింట్ కమిటి సభ్యుడిగా
  • ఐటీ కమిటి మెంబర్ గా
 
రచయితగా
1991లో సైయా, 1998లో దాంగా అనే పుస్తకాల్ని రచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement