దేశ రక్షణ కోసం సీఎం పదవి త్యాగం!
కేంద్ర మంత్రిగా మనోహర్ పారికర్ ఆదివారం ప్రమాణ స్వకారం చేశారు. రక్షణ శాఖను ఆయనకు అప్పగించే అవకాశముంది. భారత రాజకీయాల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న మనోహర్ పారికర్ పాలనదక్షుడిగా తనదైన ముద్ర వేశారు. గోవాకు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనను నరేంద్ర మోదీ పట్టుబట్టి మరీ ఢిల్లీకి తీసుకొచ్చారు. కీలక శాఖల్లో ఒకటైన రక్షణ శాఖను ఆయనకు అప్పగించనున్నారు. ఉన్నత విద్యావంతుడైన పారికర్.. ఆర్ఎస్ఎస్ తో ఉన్న అనుబంధంతో బీజేపీలో పైకొచ్చారు. గోవా సీఎంగా ఉన్నప్పుడు పలుమార్లు వివాదస్పద వ్యాఖ్యలు చేసి ఇరుకునపడ్డారు. నిరాడంబరుడు, నిజాయతీపరుడిగా ఆయనకు పేరుంది.
వ్యక్తిగత, కుటుంబ వివరాలు
పూర్తిపేరు: మనోహర్ గోపాలకృష్ణ ప్రభు పారికర్
జన్మదినం: 1955 డిసెంబర్ 3
జన్మస్థలం: మపూసాలీ(గోవా)
వయసు: 58
భార్య: మేధా పారికర్ (2000లో మరణం)
పిల్లలు: ఇద్దరు
విద్యార్హత: ఐఐటీ (బాంబే)
పార్టీ: బీజేపీ
రాష్ట్రం: గోవా
రాజకీయ నేపథ్యం
ఆర్ఎస్ఎస్లో పనిచేశారు.
రామజన్మభూమి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.
1994లో గోవా అసెంబ్లీకి ఎన్నిక
1999లో గోవా శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఎన్నిక
2000 అక్టోబర్ 24న గోవా ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణం
2002 జూన్ 5న రెండో సారి ముఖ్యమంత్రిగా ఎన్నిక (2005 వరకు )
2012 నుంచి 2014 నవంబర్ వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు
2014 నవంబర్ 9న కేంద్ర మంత్రిగా ప్రమాణం