నాలుగవసారి కేంద్రమంత్రిగా బండారు దత్తాత్రేయ
- 1965లో ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరిక
- 1975-77లో లోక్ సంఘర్ష సమితి రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా బాధ్యతలు
- 1980లో బీజేపీలో చేరిక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా నియామకం
- 1997-98, 2006లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు
- 2004లో బీజేపీ జాతీయ కార్యదర్శిగా, పార్టీ తమిళనాడు రాష్ట్ర ఇన్‌చార్జిగా బాధ్యతలు
- 2010లో పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియామకం. కేరళ ఇన్‌చార్జిగా బాధ్యతలు
- ముఖ్య పదవులు..
- 1991-1996 మధ్య సికింద్రాబాద్ ఎంపీగా ఉన్నారు.
- 1998లో మరోసారి సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచి.. 1998-1999 మధ్య వాజ్‌పేయి ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రిగా పనిచేశారు.
- 1999 సికింద్రాబాద్ ఎంపీగా మూడోసారి విజయం.. 1999-2001 మధ్య కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రిగా బాధ్యతలు
- 2001-2003 రైల్వే శాఖ సహాయ మంత్రి, 2003-04 పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా)
- 2004, 2009 వరుస ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్‌సభ స్థానంలో ఓటమి
- 2014లో సికింద్రాబాద్ ఎంపీగా మరోసారి విజయం.. తాజాగా కేంద్ర మంత్రి పదవి
- కోకోనట్ బోర్డు, టెలిఫోన్ అడ్వైజరీ బోర్డు, రైల్వే అడ్వైజరీ బోర్డు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీల్లో సభ్యుడిగా పనిచేసిన అనుభవం
- ఓటములు..