శివసేన నుంచి కేంద్రమంత్రిగా సురేష్ ప్రభాకర్ ప్రభు
జననం:
మహారాష్ట్రలోని ముంబైలో 1953 జూలై 11 తేదిన జన్మించారు. ఆయనకు భార్య ఉమా ప్రభు. ఉమా జర్నలిస్ట్ గా పని చేశారు. కుమారుడు అమెయా ప్రభు ఉన్నారు.
వృత్తి
చార్టెడ్ అకౌంటెంట్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా సభ్యుడు.
రాజకీయ ప్రస్థానం:
సుదీర్ఘ కాలంగా శివసేన పార్టీకి సేవలందిస్తున్న సురేష్ ప్రభు నాలుగు సార్లు రాజాపూర్ లోకసభ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2009 సంవత్సరంలో ఆయన ఓటమి పాలయ్యారు.
1998 నుంచి 2004 మధ్య కాలంలో వాజ్ పేయ్ ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రిగా, పర్యవరణం, అడవులు, ఎరువులు, రసాయన, విద్యుత్, భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖల మంత్రిగా సేవలందించారు.
నదుల అనుసంధానంపై ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీకి చైర్మన్ గా వ్యవహరించారు.
ప్రపంచ బ్యాంక్ పార్లమెంటరీ నెట్ వర్క్ సభ్యుడిగా ఎంపిక
సౌత్ ఆసియా వాటర్ కాన్ఫరెన్స్ చైర్మన్ గా ఎన్నికయ్యారు.