లాలూ కూతురిపై విజయం: కేంద్రమంత్రిగా రామ్ కృపాల్ యాదవ్ | Profile of Ram Kripal Yadav | Sakshi
Sakshi News home page

లాలూ కూతురిపై విజయం: కేంద్రమంత్రిగా రామ్ కృపాల్ యాదవ్

Published Sun, Nov 9 2014 2:17 PM | Last Updated on Thu, May 24 2018 2:09 PM

లాలూ కూతురిపై విజయం: కేంద్రమంత్రిగా రామ్ కృపాల్ యాదవ్ - Sakshi

లాలూ కూతురిపై విజయం: కేంద్రమంత్రిగా రామ్ కృపాల్ యాదవ్

రాష్ట్రీయ జనతా పార్టీ (ఆర్జేడి) తో చాలా కాలం కొనసాగిన రామ్ కృపాల్ యాదవ్ 2009 మార్చి 12 తేదిన బీజేపీలో చేరారు. గత లోకసభ ఎన్నికల్లో ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు మిసాపై సంచలన విజయం సాధించారు. 2014 నవంబర్ 09 తేదిన జరిగిన మంత్రివర్గ విస్తరణలో కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. 
 
జననం, కుటుంబం
బీహార్ రాష్ట్రంలోని పాట్నా లో 1957 అక్టోబర్ 12 తేదిన జన్మించారు. ఆయనకు భార్య కిరణ్ దేవి, ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. 
 
విద్యార్హతలు
  • బీఏ (హానర్స్)
  • మగధ్ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్ బీ
 
రాజకీయ ప్రస్థానం
  • 1985-1986 పాట్నా మున్సిపల్ కార్పోరేషన్ డిప్యూటీ మేయర్ 
  • 1992-1993 బీహార్ విధాన మండలి సభ్యుడు
  • 1993-1996 10వ లోకసభ సభ్యుడు
  • 1996-1997 11వ లోకసభ సభ్యుడు
  • 2004-2009 14వ లోకసభ సభ్యుడు
  • 2010 జూలైలో రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక
  • 2010 ఆగస్టులో రక్షణ శాఖ కమిటీ సభ్యుడిగా నియామకం
  • 2010లో సెప్టెంబర్ లో బొగ్గు శాఖా మంత్రిగా సేవలు
  • బీహార్ లోని డాక్టర్ అంబేద్కర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ కల్చర్ చైర్మన్ గా వ్యవహరించారు.
  • 1998-2005 మధ్యకాలంలో బీహార్ లోని బీహార్ ధార్మిక్ నయాస్ చైర్మన్ గా సేవలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement