ram kripal yadav
-
Lok Sabha Election 2024: పాటలీపుత్ర లాలుకు లిట్మస్ టెస్టు
పాటలీపుత్ర లోక్‌సభ స్థానం బీజేపీ, ఆర్జేడీ మధ్య హోరాహోరీ పోరుకు వేదికైంది. బీజేపీ సిట్టింగ్ ఎంపీ రామ్ కృపాల్ యాదవ్ హ్యాట్రిక్‌పై గురిపెట్టారు. ఆయన చేతిలో రెండుసార్లు ఓడిన ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతి ముచ్చటగా మూడోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కూతురిని ఎలాగైనా గెలిపించుకోవాలని లాలు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు... బిహార్‌లోని పాటలీపుత్ర లోక్‌సభ స్థానం 2008లో డీలిమిటేషన్ తర్వాత ఏర్పాటైంది. 2009లో లాలు కూడా ఇక్కడ ఓటమి చవిచూడటం విశేషం. అది కూడా ఒకప్పటి తన శిష్యుడు జేడీ(యూ) నేత రంజన్ ప్రసాద్ యాదవ్ చేతిలో! తర్వాత మీసా భారతిని బరిలో దింపారు. తనను కాదని కూతురికి టికెటివ్వడంతో లాలుతో విభేదించిన రామ్‌కృపాల్ 2014లో ఆర్జేడీని వీడి బీజేపీలో చేరారు. 2014, 2019ల్లో రెండుసార్లు మీసా భారతిని ఓడించారు. విద్యార్థి సంఘాల నుంచి ఎదిగిన రామ్ కృపాల్ 1993లో ఆర్జేడీ టికెట్‌పై తొలిసారి ఎంపీగా గెలిచారు. తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. 1996లో, 2004లో కూడా లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఐదుసార్లు ఎంపీగా చేసిన ఆయనకు బిహార్‌లో గట్టి రాజకీయ బలం ఉంది. పాటలీపుత్ర నియోజకవర్గ ప్రజలతో మంచి అనుబంధముంది. పిలిస్తే పలికే నాయకునిగా పేరు తెచ్చుకున్నారు. నియోజకవర్గమంతా కలియదిరుగుతూ ఓటర్లను ప్రత్యక్షంగా కలుస్తున్నారు. రామమందిర నిర్మాణ ప్రభావం కూడా ఇక్కడి ఓటర్లపై బాగా ఉండటం ఆయనకు మరింత కలిసి రానుంది.మీసా... మూడోసారిపాటలీపుత్రలో ఆర్జేడీ ఓటమి పరంపరకు ఈసారి ఎలాగైనా బ్రేక్ వేయడానికి మీసా ప్రయతి్నస్తున్నారు. లాలు, భార్య రబ్రీ, కుమారుడు తేజస్వీ యాదవ్‌తో సహా కుటుంబమంతా ఆమె గెలుపు కోసం పని చేస్తోంది. 2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం 2019లో మీసాకు బాగా మైనస్‌గా మారింది. ప్రజలకు అందుబాటులో ఉండరన్న అపప్రథను కూడగట్టుకున్నారు. ఈసారి కూడా ఎన్నికలవగానే మాయమవుతారా, గెలుపోటములతో నిమిత్తం లేకుండా నియోజకవర్గంలో ఉండి పని చేస్తారా అంటూ ప్రచారం పొడవునా ప్రజలు ఆమెను నిలదీస్తున్న పరిస్థితి! అయితే ఇక్కడ మోదీ ఫ్యాక్టర్ 2019లో ఉన్నంత బలంగా లేకపోవడం మీసాకు కాస్త ఊరట. పైగా పాటలీపుత్ర లోక్‌సభ స్థానం పరిధిలోని 6 అసెంబ్లీ స్థానాలూ ఆర్జేడీ, దాని మిత్రపక్షాల చేతిలోనే ఉన్నాయి. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం తదితరాలను ప్రచారా్రస్తాలుగా సంధిస్తున్నారామె.కుల సమీకరణాలు... బీజేపీకి మద్దతిచ్చే బ్రాహ్మణులతో సహా అగ్రవర్ణాల ఓట్లు పాటలీపుత్రలో లక్షకు పైగా ఉన్నాయి. దాదాపు 4 లక్షల ఓట్లున్న భూమిహార్ ఓటర్లలోనూ ఆ పార్టీకి బలముంది. 5 లక్షల యాదవ, 1.7 లక్షల కుర్మీ, 3 లక్షల దళిత ఓట్లు రామ్ కృపాల్, మీసా మధ్య చీలనున్నాయి. యాదవులతో పాటు 1.5 లక్షల ముస్లిం ఓట్లను మీసా నమ్ముకున్నారు. కాకపోతే మజ్లిస్ బరిలో ఉండటంతో ముస్లిం ఓట్లు చీలి ఆర్జేడీకి గట్టి నష్టమే చేసేలా కన్పిస్తోంది. హోరాహోరీ పోరు లో ఈసారి పాటలీపుత్రలో లాంతరు వెలుగుతుందో, ముచ్చటగా మూడోసారీ కమలమే వికసిస్తుందో చూడాలి.– సాక్షి, నేషనల్ డెస్క్ -
పడవ నుంచి అమాంతం పడిపోయిన ఎంపీ..!
పట్నా: చుట్టూ భారీగా వరద నీరు.. ఈ వరద నీటిలో ట్యూబులతో తయారుచేసిన తాత్కాలిక పడవలో ప్రయాణించి.. వరద బాధితులను పరామర్శించాలని ఓ ఎంపీ ప్రయత్నించారు. కానీ, వరదనీరు భారీగా ఉండటంతో ఎలాంటి రక్షణలు లేని తాత్కాలిక బోటులో ప్రయాణించాలని చూసిన ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ట్యూబులో తయారుచేసిన బోటులో ఎక్కువమంది ఉండటంతో.. అది అమాంతం మునిగిపోయింది. ఎంపీతోపాటు ఆయన వెంట ఉన్నవారు నీళ్లలో పడిపోయారు. సమయానికి అక్కడ ఉన్న స్థానికులు సహాయం చేయడంతో ఎంపీ సురక్షితంగా బటయపడ్డారు. ఈ ఘటన బిహార్ పాట్నా జిల్లా మసౌర్హిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానిక బీజేపీ ఎంపీ రాంకృపాల్ యాదవ్ తాత్కాలిక బోటులో ప్రయాణించి.. వరద బాధితులను పరామర్శించేందుకు ప్రయత్నించారు. అయితే, ఎలాంటి రక్షణలు లేకుండా ఈ బోటు ప్రమాదకరంగా ఉండటం, దానిపై ఐదారుగురు ప్రయాణించడంతో నీళ్లలో కొద్దిదూరం వెళ్లకముందే.. ఇది అదుపుతప్పి నీళ్లలో మునిగిపోయింది. దానిపై ఉన్నవారంతా అమాంతం నీళ్లలో పడిపోయారు. సమయానికి అక్కడ ఉన్న స్థానికులు సహాయం చేయడంతో ఈ ప్రమాదం నుంచి ఎంపీతోపాటు అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. -
‘ఏపీకి 18 వేల కోట్లు ఇచ్చాం’
సాక్షి, న్యూఢిల్లీ : గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కింద నాలుగేళ్ళ వ్యవధిలో ఆంధ్ర ప్రదేశ్‌కు 18 వేల 562 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినట్లు రాజ్య సభలో సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి రామ్ కృపాల్ యాదవ్ వెల్లడించారు. నరేగా కింద ఏపీకి 2015-16లో 2856.85 కోట్లు, 2016-17లో 3997.46 కోట్లు, 2017-18లో 5287.32 కోట్లు 2018-19 (ఫిబ్రవరి 5 నాటికి) 6420.94 కోట్లు నిధులను కేంద్రం విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. ఉపాధి హామీ చట్టం కింద డిమాండ్‌ను బట్టి ఉపాధి కల్పించే పథకం ఇది. అందువలన ఏ రాష్ట్రానికి కేటాయింపు ముందుగా జరగదని మంత్రి తెలిపారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని 13 జిల్లాల్లో డిమాండ్‌కు తగినట్లుగా ఉపాధి కల్పించడానికి శాయశక్తులా కృషి చేసినట్లు తెలుపుతూ మంత్రి అందుకు అనుగుణంగా గణాంకాలను వివరించారు. ఈ పథకం అమలులో నిధుల దారి మళ్ళింపు, అవకతవకలకు సంబంధించి తమ మంత్రిత్వ శాఖకు అందే ఫిర్యాదులపై తగు విచారణ, చర్యల కోసం పథకాన్ని అమలు చేస్తున్న ఆయా రాష్ట్రాలకు పంపించడం జరుగుతుందని మంత్రి చెప్పారు. చిత్తూరు, విశాఖ జిల్లాల్లో 2288 పంచాయతీలకు బ్రాడ్ బాండ్ మూడు దశల కింద దేశంలోని ప్రతి గ్రామ పంచాయతీకి బ్రాడ్ బాండ్ కనెక్షన్ సదుపాయం కల్పించే ఉద్దేశంతో ప్రారంభించిన ప్రారంభించిన భారత్‌నెట్ ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఇప్పటి వరకు 2288 గ్రామ పంచాయతీలకు బ్రాడ్ బాండ్ సర్వీసును అందించినట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సోమవారం రాజ్య సభకు వెల్లడించారు. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ రెండు జిల్లాల్లో మిగిలిన 614 గ్రామ పంచాయతీలకు భారత్‌నెట్ రెండో దశ కింది బ్రాడ్ బాండ్ కనెక్టివిటీ ఇవ్వడం జరుగుతుందన్నారు. భారత్‌నెట్ ప్రాజెక్ట్‌లో మూడు దశల కింద దేశంలోని 2 లక్షల గ్రామ పంచాయతీలకు 2019 మార్చి నాటికల్లా బ్రాడ్ బాండ్ సదుపాయం కల్పించాలన్నది లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఏపీలో 670 కి.మీ మేర రహదారుల విస్తరణ ఆంధ్రప్రదేశ్‌లో 670 కిలో మీటర్ల మేర రహదారులను నాలుగు లేదా ఆరు లేన్లుగా విస్తరించే పనులను చేపట్టినట్లు రహదారుల శాఖ సహాయ మంత్రి మన్సుఖ్ మాండవీయ సోమవారం రాజ్య సభకు తెలిపారు. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ మరో 505 కిలో మీటర్ల మేర రహదారుల విస్తరణ కోసం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) రూపకల్పన జరుగుతోందని చెప్పారు. రాష్ట్రంలో 550 కిలో మీటర్ల మేర సింగిల్ లేన్ జాతీయ రహదారులు, 3459 కిలో మీటర్ల మేర డబుల్ లేన్ రహదారులు ఉన్నాయని మంత్రి చెబుతూ పెరిగే ట్రాఫిక్, నిధుల అందుబాటును బట్టి వీటిని దశల వారీగా విస్తరించడం జరుగుతుందని తెలిపారు. -
‘ఆయన చేతులు నరికేయాలనిపించింది’
పాట్నా : కేంద్ర మంత్రి రామ్ కృపాల్ యాదవ్‌ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె, ఆర్జేడీ నాయకురాలు మీసా భారతి. పాట్నాలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో పాల్గొన్న మీసా భారతి రామ్ కృపాల్ యాదవ్ గురించి మాట్లాడుతూ.. ‘అతన్ని మేము చాలా గౌరవించే వాళ్లం. కానీ 2014లో అతను మా పార్టీని వీడి.. సుశీల్ కుమార్ మోదీతో చేతులు కలిపినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. ఆయన చేతులను నరికేయాలనిపించిందం’టూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాక రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు మీసా భారతి. అయితే ఆర్జేడీకి విధేయుడిగా పేరు పొందిన రామ్ కృపాల్‌కు 2014 ఎన్నికల్లో ఆ పార్టీ టికెట్ ఇవ్వలేదు. దాంతో ఆయన బీజేపీలో చేరారు. అనంతరం ఎన్నికల్లో గెలుపొంది ప్రస్తుతం నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పని చేస్తున్నారు. -
లాలూ కూతురిపై విజయం: కేంద్రమంత్రిగా రామ్ కృపాల్ యాదవ్
రాష్ట్రీయ జనతా పార్టీ (ఆర్జేడి) తో చాలా కాలం కొనసాగిన రామ్ కృపాల్ యాదవ్ 2009 మార్చి 12 తేదిన బీజేపీలో చేరారు. గత లోకసభ ఎన్నికల్లో ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు మిసాపై సంచలన విజయం సాధించారు. 2014 నవంబర్ 09 తేదిన జరిగిన మంత్రివర్గ విస్తరణలో కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. జననం, కుటుంబం బీహార్ రాష్ట్రంలోని పాట్నా లో 1957 అక్టోబర్ 12 తేదిన జన్మించారు. ఆయనకు భార్య కిరణ్ దేవి, ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. విద్యార్హతలు బీఏ (హానర్స్) మగధ్ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్ బీ రాజకీయ ప్రస్థానం 1985-1986 పాట్నా మున్సిపల్ కార్పోరేషన్ డిప్యూటీ మేయర్ 1992-1993 బీహార్ విధాన మండలి సభ్యుడు 1993-1996 10వ లోకసభ సభ్యుడు 1996-1997 11వ లోకసభ సభ్యుడు 2004-2009 14వ లోకసభ సభ్యుడు 2010 జూలైలో రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక 2010 ఆగస్టులో రక్షణ శాఖ కమిటీ సభ్యుడిగా నియామకం 2010లో సెప్టెంబర్ లో బొగ్గు శాఖా మంత్రిగా సేవలు బీహార్ లోని డాక్టర్ అంబేద్కర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ కల్చర్ చైర్మన్ గా వ్యవహరించారు. 1998-2005 మధ్యకాలంలో బీహార్ లోని బీహార్ ధార్మిక్ నయాస్ చైర్మన్ గా సేవలు -
మీసా భారతి దెబ్బా.. మజాకా!
లాలూ ప్రసాద్ పెద్ద కూతురు మీసా భారతి దెబ్బకు ఆర్జేడీ ఎంపీ ఒకరు ఏకంగా తన ఇల్లు వదిలి వెళ్లిపోయి.. మళ్లీ తిరిగొస్తే ఒట్టు! అంతేకాదు, ఆయన ఆర్జేడీకి రాజీనామా కూడా చేసిపారేశారు. తన పెద్ద కూతురు మీసా భారతి ఈసారి బీహార్‌లోని పాటలీపుత్ర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుందని లాలూ ప్రకటించారు. దాంతో లాలూకు రెండు దశాబ్దాలుగా సన్నిహితుడిగా పేరొందిన రాం కృపాల్ యాదవ్ తాను పార్టీ పదవులన్నింటికీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వాస్తవానికి ఆయన పాటలీపుత్ర నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. దాంతో.. మీసాభారతి నేరుగా రాంకృపాల్ యాదవ్ ఇంటికి వెళ్లి, రాజీ ప్రయత్నాలు చేద్దామనుకున్నారు. కానీ ఆమె వస్తున్న విషయం తెలిసి రాంకృపాల్ బయటకు వెళ్లిపోయారు. ''నేను రాంకృపాల్ బాబాయ్‌ని కలవాలని వచ్చాను. ఆయన నా అభ్యర్థిత్వం పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన కోసం కావాలంటే నేను పోటీనుంచి తప్పుకుంటా. చాచాతో మాట్లాడకుండా ఇక్కడినుంచి వెళ్లేది లేదు. ఎప్పటికైనా ఆయన తిరిగొస్తారు'' అని ఆమె చెప్పారు. కానీ ఎంతసేపటికీ ఆయన రాకపోవడంతో మళ్లీ వస్తానంటూ వెళ్లిపోయారు. అంతర్గత భద్రతా నిర్వహణ చట్టం (మీసా) కింద లాలూ ప్రసాద్ ఎమర్జెన్సీ సమయంలో 1975-77 మధ్య కాలంలో జైల్లో ఉన్న లాలూ, తన పెద్ద కూతురికి ఆ పేరే పెట్టేశారు. లాలూకు మొత్తం తొమ్మిది మంది సంతానం ఉండగా, వారిలో పెద్దకుమార్తె మీసా (37). ఆయన కుమారులు తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వి యాదవ్ కూడా రాజకీయాల్లో చురుగ్గానే ఉన్నా.. వాళ్లకింకా ఎన్నికల్లో పోటీచేసేంత వయసు లేదు.