ముంబై: శాసనసభ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఘోరపరాజయం ఎదుర్కొన్న అధికారపక్షాలు కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వంపై విమర్శల దాడికి విపక్షాలు సిద్ధమయ్యాయి. 2009 అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఇచ్చిన హామీలను నెరవేర్చని పృథ్వీరాజ్ చవాన్ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని మహాకూటమి ఆదివారం విమర్శించింది. సమావేశాల ప్రారంభానికి సూచికగా ముఖ్యమంత్రి ఆదివారం ఏర్పాటు చేసిన తేనిటి విం దును బహిష్కరించామని సభలో విపక్ష నాయకుడు ఏక్‌నాథ్ ఖడ్సే ప్రకటించారు.
చవాన్ ప్రభుత్వ అసమర్థత, అవినీతి వల్ల రాష్ట్రం రూ.మూడు లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిందని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న విషయాన్ని పట్టించుకోకుండా చవాన్ 500 ఎకరాల భూమిని బిల్డర్లకు కట్టబెట్టారని శివసేన నాయకుడు సుభాష్ దేశాయ్ మండిపడ్డారు. ఆదర్శ్ కుంభకోణంతో ప్రమేయమున్న ఎన్సీపీ నాయకుడు జితేంద్ర అవాడ్‌కు మంత్రిపదవి కట్టబెట్టడం సరికాదని తావ్డే స్పష్టం చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎఫ్ కూటమికి ఓటమి తప్పదని చెప్పారు.
నేటి నుంచి అసెంబ్లీ
Published Sun, Jun 1 2014 10:55 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement