సాక్షి, ముంబై: మోనో రైల్లో ప్రయాణించేందుకు ముంబైకర్లు ఆసక్తి చూపుతున్నారు. ఊహించిన దానికంటే వారినుంచి ఎక్కువ స్పందన వస్తోంది.దేశ ఆర్థిక రాజధానిలో ప్రజలకు ఆధునిక సేవలు అందించాలనే ఉద్ధేశ్యంతో ముంబై ప్రాంతీయ అభివృద్ధి సంస్థ(ఎమ్మెమ్మార్డీయే) మోనో రైలును ప్రారంభించిన విషయం విధితమే. ఈ రైలు సేవలను ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఈ నెల ఒకటో తేదీన ప్రారంభించినప్పటికీ ప్రత్యక్షంగా రెండో తేదీ నుంచి సేవలు ప్రారంభమయ్యాయి. గడచిన వారం రోజుల్లో ఏకంగా 1.36 లక్షలకు పైగానే ప్రయాణికులు మోనో రైలు సేవలను ఆస్వాధించినట్లు జారీ చేసిన టికెట్లను బట్టి వెల్లడైంది.
నగర ప్రజలకు సేవలు అందిస్తున్న లోకల్ రైళ్లు, బెస్ట్ బస్సులతో పోలిస్తే మోనోరైలు ప్రయాణం ఎంతో హాయిగా ఉంది. పైగా చార్జీలు కూడా తక్కువే కావడంతో అత్యధిక శాతం ఇందులో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా శని, ఆదివారాల్లో అన్ని స్టేషన్లలో విపరీతంగా రద్దీ కనిపించింది. ప్రారంభంలో రద్దీని దృష్టిలో ఉంచుకుని గంటన్నర వరకు సేవలను పొడగించాల్సి వచ్చింది. ఆ తర్వాత ఈ పరిస్థితి రాలేదని ఎమ్మెమ్మార్డీయే వర్గాలు తెలిపాయి.
మరికొన్ని రోజుల్లో నెరవేరనున్న లక్ష్యం
వ్యాపారులు, ఉద్యోగుల సౌకర్యార్థం ఈ సేవలను ప్రారంభించినా చాలామంది జాయ్ రైడ్ చేసేందుకు ప్రయాణించినట్లు అంచనా వేశారు. ఈ రద్దీ మరికొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. ఆ తరువాత ఏ లక్ష్యం కోసం ఈ సేవలు ప్రారంభించామో అది నెరవేరనుందని అధికారులు వెల్లడించారు.
మొదటి విడతలో ప్రారంభించిన చెంబూర్-వడాల టర్మినస్‌ల మధ్య వారం రోజుల్లో మొత్తం 592 ట్రిప్పులు నడవగా అందులో సుమారు 1.36 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. 1,400 స్మార్ట్ కార్డులు అమ్ముడుపోగా 1,32,523 టోక న్లు, 1,33,932 టికెట్లు విక్రయాలు జరిగాయి. అయితే వీరంత కేవలం మోనో రైలు ప్రయాణాన్ని ఆస్వాధించేందుకు అందులో ప్రయాణిస్తున్నట్లు సమాచారం.
‘మోనో’ల్లాసం
Published Tue, Feb 11 2014 11:33 PM | Last Updated on Sat, Sep 2 2017 3:35 AM
Advertisement