సాక్షి, ముంబై: రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వ అధికార నివాసమైన ‘వర్షా బంగ్లా’ లోకి వచ్చే వారం గృహప్రవేశ ం చేయనున్నారు. మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ రెండు రోజుల కిందటే వర్షా బంగ్లా ఖాళీ చేసి వెళ్లారు. దీంతో కొత్తగా అందులోకి వచ్చే ముఖ్యమంత్రికి, కుటుంబ సభ్యులకు అనుకూలంగా, నచ్చే విధంగా బంగ్లాలో మార్పులు, చేర్పులు చేయడం రివాజు.
కాని ఆ బంగ్లాలో మార్పులు చేయడానికి ఫడ్నవిస్ అంతగా ఆసక్తి కనబర్చడం లేదు. అందులో ఉన్న ఫర్నిచర్, ఇతర సౌకర్యాలతోనే సరిపెట్టుకోవాలని ఆయన భావిస్తున్నారు. రెండు రోజుల్లో బంగ్లాను శుభ్రం చేసే పనులు పూర్తవుతాయి. మంగళవారం ఫడ్నవిస్‌తోసహా కుటుంబ సభ్యులు బంగ్లాను సందర్శిస్తారు. ఆ త ర్వాత అందులో ఏమైనా మార్పులు చేయాల్సి వస్తే వారి సూచనల మేరకు ఆధునికీకరణ పనులు చేపడతారు.
వచ్చే వారంలో ముహూర్తం చేసుకుని సీఎం వర్షా బంగ్లాలోకి గృహ ప్రవేశం చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి. దీంతో సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తిచేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆయన మాజెస్టిక్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని నాలుగో అంతస్తులోని 421 ఫ్లాట్‌లో నివాసముంటున్న సంగతి తెలిసిందే.
వారంలోగా సీఎం ‘వర్షా బంగ్లా’కి..
Published Mon, Nov 3 2014 12:13 AM | Last Updated on Sat, Sep 2 2017 3:46 PM
Advertisement