చవాన్ డుమ్మా కరెక్టే: నితిన్ రౌత్ | NitinRaut defends Chavan on boycotting Modi's function | Sakshi
Sakshi News home page

చవాన్ డుమ్మా కరెక్టే: నితిన్ రౌత్

Published Fri, Aug 22 2014 5:13 PM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM

పృథ్విరాజ్ చవాన్(ఫైల్) - Sakshi

పృథ్విరాజ్ చవాన్(ఫైల్)

నాగపూర్: ప్రధాని నరేంద్ర మోడీ కార్యక్రమానికి తమ ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చవాన్ గైర్హాజరు కావడాన్ని మహారాష్ట్ర ఉపాధి కల్పన శాఖ మంత్రి నితిన్ రౌత్ సమర్థించారు. సోలాపూర్ లో మోడీ సభలో పరాభవం ఎదువడంతో చవాన్ ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ముఖ్యమంత్రులను అవమానించడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్దమని అన్నారు. 

ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ముఖ్యఅతిథిగా నాగపూర్ జిల్లాలో గురువారం నిర్వహించిన రెండు కార్యక్రమాలకు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ గైర్హాజరయ్యారు. హర్యానా, జార్ఖండ్ ముఖ్యమంత్రులు భూపిందర్‌సింగ్ హూడా,  హేమంత్ సోరెన్‌కు కూడా మోడీ మద్దతుదారుల నుంచి అవమానం ఎదురైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement