సాక్షి, ముంబై: ఎప్పుడెప్పుడు వస్తుందా అని నాగపూర్ వాసులు ఆశగా ఎదురుచూస్తున్న మెట్రో రైలు ప్రాజెక్ట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దాదాపు 40 కి.మీ. పొడవున చేపట్టే ఈ ప్రాజెక్ట్‌కు రూ.8,680 కోట్లు మంజూరుచేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అప్పట్లో రూ.9,007 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసిన ఈ ప్రాజెక్ట్‌కు ప్రస్తుత పరిస్థితుల్లో మరింత వ్యయం పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
సాధ్యమైనంత త్వరగా 2019లోపు ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి నగరవాసులకు అందుబాటులోకి తీసుకరావాలని అనుకుంటున్నారు. ఈ ప్రాజెక్టు పనుల కోసం 2012 ఫిబ్రవరి 22న ఢిల్లీ మెట్రో రైల్వే కార్పొరేషన్‌తో అధికారులకు ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత అధ్యయనం పనులు పూర్తిచేశారు. అయితే నాగపూర్‌వాసులందరికి మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రావాలనే ఉద్ధేశంతో కామ్టీ మార్గంలో ఆటోమోటివ్ చౌక్ నుంచి మిహాన్ (ఉత్తర-దక్షిణ) మార్గాలను ఎంపికచేశారు.
అందరికీ ఉపయోగపడే విధంగా మెట్రో రైళ్లు పరుగులు తీసేలా రూపకల్పన చేశారు. ‘మిహాన్‌లో మెట్రో రైలు డిపో ఉంటుంది. హింగణ మార్గంలో మరో డిపో ఉంటుంది. అక్కడ డిపో ఏర్పాటుకు అవసరమైన స్థలానికి సైనిక, విమానయాన శాఖలు అనుమతినిచ్చాయి. దీంతో కార్ డిపోలు ఏర్పాటు ఏర్పాటుచేసేందుకు మార్గం సుగమమైంద’ని సంబంధిత అధికారులు తెలిపారు.
మెటో రైలు మార్గం, స్టేషన్లు....
ఉత్తర-దక్షిణ మార్గం (21.60 కి.మీ.)లో అటోమోటివ్ చౌక్, నారీ రోడ్, ఇందోర్ కడ్బీ చౌక్, గడ్డి గోదాం, కస్తూర్‌చంద్ పార్క్, జీరో మైల్, సీతా బర్డీ, కాంగ్రెస్ నగర్, రహాటే కాలని, నిరీ, దేవ్‌నగర్, మథురేష్ అపార్ట్‌మెంట్, శంకర్‌నగర్, జునా విమానాశ్రయం, నయా మిమానాశ్రయం, మిహాన్ సిటీ, మెట్రో సిటీ స్టేషన్లు ఉంటాయి. తూర్పు-పశ్చిమ మార్గం (18.20 కి.మీ.)లో ప్రజాపతి నగర్, వైష్ణోదేవి చౌక్, అంబేద్కర్ చౌక్, టెలిఫోన్ ఎక్ఛేంజ్, చితార్ ఓళ్, అగ్రసేన్ చౌక్, మేయో హాస్పిటల్, నాగపూర్ రైల్వే స్టేషన్, నేతాజీ మార్కెట్, ఝాన్సీరాణి చౌక్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్, బ్యాంక్ ఆఫ్ ఇండియా (శంకర్‌నగర్), లాడ్ అపార్ట్ట్‌మెంట్, ధరంపేట్ సైన్స్ కాలేజీ చౌక్, సుభాష్ నగర్, రచనా అపార్ట్‌మెంట్, వాసుదేవ్ నగర్, బన్సీనగర్, లోక్‌మాన్య నగర్ స్టేషన్లు ఉంటాయి.
నాగపూర్ మెట్రోకు ఆమోదం
Published Wed, Jan 29 2014 11:44 PM | Last Updated on Fri, Oct 19 2018 7:37 PM
Advertisement
Advertisement