సాక్షి, ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ రాజీనామా చేయాలని పార్టీలో ఒత్తిడి పెరుగుతోంది. కొంత మంది ముఖ్య నేతలతో పాటు కింది స్థాయి కార్యకర్తలు కూడా కెప్టెన్ మారితే మంచి రోజులు వస్తాయని అంతర్గతంగా వ్యాఖ్యానిస్తున్నారు. అధికారంలో ఉన్న ప్రజాస్వామ్య కూటమి దారుణంగా చతికిలబడిపోవడంపై లోలోన మధన పడుతున్నారు.
బీహర్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జేడీయూ పార్టీ చెత్త ప్రదర్శన కనబరచడంతో ఆ పార్టీకి చెందిన సీఎం నితీశ్ పదవికి రాజీనామా చేసినట్టుగానే ఇక్కడ కూడా పృథ్వీరాజ్ చవాన్ ముఖ్యమంత్రి పదవికి రాజీ నామా చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. ఇటు సొంతపార్టీలోని నేతలతో పాటు ప్రతిపక్ష నాయకు లు సీఎం రాజీనామా చేయాలనే పట్టుబడుతున్నా రు. అయితే చవాన్ మాత్రం సీఎం పదవిని వదులుకునేందుకు ఏ మాత్రం ఇష్టపడటం లేదు. తొందర్లోనే అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా తనను మార్చకపోవచ్చనే ధీమా లో పృథ్వీరాజ్ చవాన్ ఉన్నారు.
ఎన్నాడూ లేని ఓటమి...
గతంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఇంత దారుణంగా ఓడిపోలేదు. ఆగస్టు ఆఖరు, లేకుంటే సెప్టెంబరులో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. తాజా పరి ణామాలను పరిగణనలోకి తీసుకోని ముఖ్య నేతను మార్చాలనే పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నా రు. కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి కూడా ఈ విషయా న్ని తీసుకెళ్లాలనే యోచనలో ఉన్నారు.
సోమవారం ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో లోక్‌సభ ఎన్నికల ఓటమిపై సమీక్షించనున్న అగ్రనేతలు పనిలోపనిగా రాష్ట్ర రాజకీయాల గురించి కూడా చర్చించే అవకాశం కనబడుతోంది. అయితే అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీయడంతో అంత తొందరగా చవాన్‌ను మారుస్తారా? అది కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ సాహసం చేస్తారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
మార్పులకు పట్టు...
లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రజలు ఇచ్చిన తీర్పును బట్టి కాంగ్రెస్‌లో పెను మార్పులు చేయాల్సిన అసరముందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే కొంకణ్ ప్రాంతంలో కాంగ్రెస్ ఓటమికి బాధ్యత వహిస్తూ పరిశ్రమల శాఖ మంత్రి పదవీకి రాజీనామా చేసిన నారాయణ్ రాణే శనివారం సాయంత్రం మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రేతో భేటీ అయి దాదాపు అర గంటసేపు చర్చించారు. తమకు లోక్‌సభ ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పగించని అధిష్టానం ఈసారైనా అసెంబ్లీకి ఆ అవకాశమివ్వాలని ఒత్తిడి తెస్తున్నారు. నాందేడ్ లోక్‌సభ నుంచి గెలిచి న మాజీ సీఎం అశోక్ చవాన్ కూడా అసెంబ్లీ ప్రచా ర బాధ్యతలు తీసుకోవాలని ఉవ్విళూరుతున్నారు.
సీఎం పృథ్వీరాజ్ చవాన్ నేతృత్వంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు వెళితే మొదటికే మోసం వస్తుం దనే వాదనను వినిపిస్తున్నారు. ఇలా పార్టీలోని నేతలంతా ఒకేబాటన ఉండకపోవడం కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో మరింత దెబ్బతీసే అవకాశముం టుందనే చర్చ జరుగుతోంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అనూహ్య మార్పులు చేసినా, అది ప్రజల్లోకి ఎలాం టి సంకేతాలు తీసుకెళుతుందన్న అంతర్మథనంలో అధిష్టానం ఉంది. దీంతో సీఎం చవాన్‌ను మార్చే అవకాశం ఉం డకపోవచ్చని వాదన వినవస్తున్నా... ఏ సమయం లో ఏం జరుగుతుందో తెలియకపోవడంతో ఏమై నా జరగవచ్చన్న ఆశలో సీఎం ప్రత్యర్థులు ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే రాష్ట్రంలో
మిగతా 6వ పేజీలో ఠసీఎంకుసెగ కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలమే నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది.
రాజీనామా కోరే హక్కు లేదు: పీసీసీ
లోక్‌సభ ఎన్నికల్లో పేలవ ప్రదర్శన చేసిన కాంగ్రెస్ పార్టీ సీఎం పృథ్వీరాజ్ చవాన్ రాజీనామా చేయాలన్న నైతిక హక్కు బీజేపీకి లేదని పీసీసీ అధికార ప్రతినిధి బస్వరాజ్ పాటిల్ నగ్రల్కర్ అన్నారు. తమ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అవసరం ఆ పార్టీకి లేదని తెలిపారు. ఐదేళ్ల పాటు ప్రభుత్వాన్ని నడపాలని ప్రజలు తమల్ని ఎన్నుకున్నారని, అలాం టప్పుడు వాళ్లను అవమానించేలా మేం ఎందుకు వ్యవహరిస్తామని బీజేపీని నిలదీశారు.
పృథ్వీరాజ్ చవాన్ రాజీనామా చేయాలని పార్టీలో ఒత్తిడి
Published Sun, May 18 2014 10:48 PM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM
Advertisement
Advertisement