సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి మొదటి ప్రధాన మంత్రి కావాల్సిందని మోడీ చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి పృథ్వీరాచ్ తప్పుబట్టారు.
ముంబై: సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి మొదటి ప్రధాన మంత్రి కావాల్సిందని మోడీ చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి పృథ్వీరాచ్ తప్పుబట్టారు. నెహ్రూను ప్రధానిగా మహాత్మా గాంధీ ఎంపిక చేశారని, నెహ్రూ ప్రధాని కావడం సరికాదంటే మహాత్ముడి నిర్ణయం తప్పా? అని ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి మరోసారి చరిత్రను విశ్లేషించుకోవాలన్నారు. శుక్రవారం తన నివాసమైన వర్షభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చవాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆనాడు మహాత్ముడు సరైన నిర్ణయమే తీసుకున్నారని, తప్పుగా భావించేవారు చరిత్రను మరోసారి విశ్లేషించుకోవాలన్నారు. ఇక ఎన్సీపీ ప్రతినిధి త్రిపాఠీ మూడో కూటమి సభకు హాజరు కావడంపై స్పందిస్తూ ఎవరికైనా లౌకికవాదానికి అనుకూలంగా పోరాడే స్వేచ్ఛ ఉందన్నారు.