
ముఖ్యమంత్రి చవాన్‌తో అమెరికా రాయబారి భేటీ
భారత్‌లో అమెరికా రాయబారి నాన్సీ పావెల్ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌తో భేటీ అయ్యారు. సహ్యాద్రి అతిథిగృహంలో మంగళవారం వీళ్లు పలు విషయాలపై చర్చించారు.
సాక్షి ముంబైః భారత్‌లో అమెరికా రాయబారి నాన్సీ పావెల్ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌తో భేటీ అయ్యారు. సహ్యాద్రి అతిథిగృహంలో మంగళవారం వీళ్లు పలు విషయాలపై చర్చించారు. ఈనెల చివరివారంలో నాన్సీ పావెల్ పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రితో ఆమె భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చవాన్ ఆమెకు అజంతా గుహల పెయింటింగ్‌ను బహూకరించారు. పారిశ్రామికరంగల్లో రాష్ట్రం అగ్రగామిగా ముందుకు దూసుకెళ్తున్నదంటూ నాన్సీ చవాన్‌ను అభినందించారు. దౌత్యపరంగా మహారాష్ట్ర ప్రభుత్వం తమకు అన్ని విధాలా సహకరించిందని, మున్ముందుకూడా ఇలాంటి సహకారమే లభిస్తుందని ఆశిస్తున్నట్టు ఆమె చెప్పారు. ముఖ్యమంత్రి చవాన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అమెరికన్ యూనివర్సిటీలు భారత విద్యార్థుల కోసం ముంబై వంటి నగరాల్లో ప్రత్యేక క్యాంపస్‌లు ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు.