సోనియాతో మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్ భేటి!
సోనియాతో మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్ భేటి!
Published Sat, Jun 21 2014 6:56 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్ సమావేశమయ్యారు. మహారాష్ట్ర సీఎం పదవి, ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్ రావు ఠాక్రేను మారుస్తున్నారనే వార్తల నేపథ్యంలో సోనియాతో పృథ్వీరాజ్ చవాన్ భేటి రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
పత్రికలు, టెలివిజన్ వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని శుక్రవారం చవాన్ ఖండించారు. అయితే మార్పు లేదని చవాన్ వెల్లడించినప్పటికి.. మహారాష్ట్రలో సీఎం మార్పు తప్పదని రాజకీయవర్గాలు తమ వాదనల్ని బలంగా ప్రచారం చేస్తున్నాయి.
Advertisement
Advertisement