ముంబై: అసమర్థ ముఖ్యమంత్రి.. అంటూ ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలను పృథ్వీరాజ్ చవాన్ తనదైన శైలిలో తిప్పికొట్టారు. ఆగడాలు కొనసాగకుండా అడ్డుపడుతున్నందునే తనపై ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చవాన్ అనేక విషయాలపై మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే... ‘ప్రభుత్వం చేపడుతున్న అనేక పథకాల్లో పారదర్శకతను తీసుకురావాలనుకున్నాను.
ఆ దిశగా కొన్ని చర్యలు తీసుకున్నాను. భూమి ధరల పెరుగుదల ఏ కొందరికో లాభం చేకూర్చదని భావించాను. రియల్ ఎస్టేట్ సెక్టార్‌ను ప్రక్షాళను చేశాను. ఈ నిర్ణయాలు కొందరికి ఇబ్బం దిని కలిగించాయి. దీంతో వారు నాపై లేనిపోని ఆరోపణలు చేయడం, వాటిని పనిగట్టుకొని ప్రచారం చేయడం ప్రారంభిం చారు. అవి నన్ను ఎంతగానో బాధపెట్టాయి. ఆ బిల్డరు ఎవరనే విషయం చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రజా ప్రయోజనాల కోసం నా వైఖరిని మార్చుకోకూడాదని నిర్ణయించుకున్నా.
ప్రత్యర్థులు చేస్తున్నట్లు నేను అసమర్థుడినే అయితే కీలక నిర్ణయాలు ఎలా తీసుకునేవాడిని..? ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న మరాఠా రిజర్వేషన్ బిల్లును సభముం దుకు తెచ్చే ధైర్యం ఇంతకు ముందు ఎవరూ చేయలేదు. 2000 మురికివాడలను క్రమబద్ధీకరిస్తామని 2004, 2009 ఎన్నికల్లో హామీ కాంగ్రెస్ హామీ ఇచ్చింది. వాటిని నా ప్రభుత్వ హయాం లో పూర్తి చేశాం. కరువును సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. ఇప్పటికీ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అగ్రస్థానంలోనే నిలబెట్టాం.
గుజరాత్‌తో రాష్ట్రాన్ని పోల్చేందుకు నేను ఇప్పటికీ సిద్ధ మే. మరాఠా ఎలా ముందుందో నేను వివరిస్తాను. పోషకాహార లోపాన్ని కూడా తగ్గించాం. నేను అసమర్థుడినైతే ఇవన్నీ ఎలా జరుగుతాయి. రాష్ట్ర ప్రజలకు ఈ సందర్భంగా ఒకటి చెప్పాలనుకుంటున్నా... పనిచేసినవారెవరో.. చేయనివారెవరో స్వయంగా మీరే నిర్ణయించుకోండి. నాకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంలో నిజమెంతో గమనించండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది. ఏ కొంతమందికో ప్రయోజనం కలిగించడానికి కాద’న్నారు.
రాణే విమర్శలను ఎప్పుడో మర్చిపోయా...
తనపై విమర్శలు చేస్తూ.. తన పనితీరుపై అంసతృప్తి వ్యక్తం చేస్తూ మంత్రిపదవికి రాజీనామా చేసిన రాణేపై చవాన్ సానుభూతి ధోరణి కనబర్చారు. రాణే చేసిన విమర్శలన్నింటిని తానెప్పుడో మర్చిపోయానని చెప్పారు. జరిగిందేదో జరిగిపోయిందని, ఉధ్వేగంతో ఆయన ఏవేవో మాట్లాడారని, వాటన్నిం టిని నేను మర్చిపోయానని,కాంగ్రెస్ కార్యకర్తలు కూడా వాటిని మర్చిపోయారని తాను ఆశిస్తున్నానన్నారు.
ముప్పుగ్రామాలను గుర్తిస్తామని హామీ
Published Wed, Aug 6 2014 10:48 PM | Last Updated on Mon, Oct 8 2018 5:57 PM
Advertisement