natural disasters
-
అమెరికాలో వరదలు
లూయిస్విల్లే: ప్రకృతి వైపరీత్యాలు అమెరి కాను వణికిస్తున్నాయి. ఆగ్నేయాన భారీ వర్షాలు, ప్రమాదకరమైన వరదలు అతలా కుతలం చేస్తుండగా ఈశాన్య ప్రాంతంలో తీవ్రంగా మంచు కురుస్తోంది. మైదాన ప్రాంతాల్లో చలి వణికిస్తోంది. కెంటకీలోని క్లే కౌంటీలో సంభవించిన వరదల్లో శనివారం ఒకరు ప్రాణాలు కోల్పోయారు. వరద హెచ్చరికల నేపథ్యంలో జాక్సన్లోని కెంటకీ రివర్ మెడికల్ సెంటర్‌ను మూసివేశారు. కెంటకీలో నివాస భవనాలు, కార్లు వరదల్లో చిక్కుకుపోగా వర్జీనియాలోని రోడ్లను బురద కమ్మేసింది. టెన్నెస్సీ, అర్కా న్సాస్లోనూ అధికారులు వరద ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. 10 దక్షిణాది రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. న్యూఇంగ్లండ్, న్యూయార్క్‌ల్లో చాలా ప్రాంతాలను భారీగా మంచు కప్పేసింది. నెబ్రస్కా, అయోవా, విస్కాన్సిన్, మిషిగన్, డెన్వర్‌లో ఉష్ణోగ్రతలు మైనస్ 10 డిగ్రీలకు పడిపోయాయి. మొంటానా, డకోటా, మిన్నెసోటాల్లో మైనస్ 51 డిగ్రీల వరకు పడిపోయతాయని అధికారులు చెప్పారు. -
విద్యపై ప్రకృతి ప్రకోపం
సాక్షి, అమరావతి: ప్రకృతి వైపరీత్యాలు విద్యా వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వేడి గాలులు, తుపానులు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా పాఠశాల విద్యకు అంతరాయం కలుగుతోంది. ఈ విషయం యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్స్ (యునిసెఫ్) అధ్యయనంలో వెల్లడైంది. గతేడాది ప్రకృతి విపత్తులతో 85 దేశాల్లో 242 మిలియన్ల మంది విద్యార్థులు ప్రీ–ప్రైమరీ నుంచి అప్పర్ సెకండరీ వరకూ విద్యలో అంతరాయాన్ని ఎదుర్కొన్నట్టు పేర్కొంది. ప్రతి ఏడుగురు విద్యార్థుల్లో ఒకరి పాఠశాల విద్యపై వాతావరణ సంక్షోభం ప్రతికూల ప్రభావం చూపుతున్నట్టు స్పష్టం చేసింది. విపత్తుల కారణంగా విద్యలో అంతరాయాన్ని ఎదుర్కొంటున్న దేశాల్లో దిగువ, మధ్య ఆదాయ దేశాలే అధికంగా ఉన్నట్టు వెల్లడైంది. గతేడాది విద్య అంతరాయానికి గురైన 242 మిలియన్ల మంది విద్యార్థుల్లో 74 శాతం మంది అల్పాదాయ దేశాలకు చెందిన వారున్నారు. భారత్‌లోనూ 5 కోట్ల మంది 2024 విద్య అంతరాయానికి తీవ్రమైన వేడిగాలులు ప్రధాన కారణంగా నిలిచాయని చెప్పవచ్చు. తీవ్రమైన వేడిగాలుల కారణంగా గతేడాది భారత్‌లో 5 కోట్ల మంది విద్యార్థులు ప్రభావితమయ్యారు. వేడిగాలుల కారణంగా భారత్‌తో పాటు బంగ్లాదేశ్, కంబోడియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్ వంటి దేశాలు గణనీయమైన ప్రభావాలను చవిచూశాయి. ఈ దేశాల్లో కనీసం 118 మిలియన్ల మంది పిల్లలకు చదువుల్లో అంతరాయం ఎదురైంది. ఈ కారణంతో ప్రపంచవ్యాప్తంగా ఇబ్బంది పడినవారు 171 మిలియన్ల మంది ఉంటారని అంచనా వేశారు. ఇక ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్‌లో ప్రకృతి వైపరీత్యాల కారణంగా అత్యంత తరచుగా విద్య అంతరాయాలు సంభవించాయి. 18 దేశాలలో తరగతులు నిలిపేశారు. తూర్పు ఆసియా, పసిఫిక్ దేశాలలో 16 మిలియన్ల మంది పిల్లలపై ప్రభావం పడింది. ఆఫ్రికాలో 107 మిలియన్ల మంది పిల్లలు ఇప్పటికే పాఠశాలలకు దూరంగా ఉండగా.. వీరిలో 20 మిలియన్ల మంది వాతావరణ సంక్షోభం కారణంగానే పాఠశాలల నుంచి తప్పుకున్నట్టు స్పష్టమైంది. 2050–2059 మధ్య తీవ్ర వాతావరణ సంక్షోభాలను ప్రపంచ దేశాలు చవిచూడనున్నాయని అధ్యయన నివేదిక వెల్లడించింది. 26వ స్థానంలో భారత్ ప్రకృతి వైపరీత్యాల ద్వారా పిల్లలు ఎదుర్కొంటున్న తీవ్రమైన ప్రమాదాలపై యునిసెఫ్ గతంలోనే అధ్యయనం చేసింది. 163 దేశాలకు చిల్డ్రన్స్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ (సీసీఆర్‌ఐ) పేరిట స్కోరింగ్ ఇచ్చింది. ఇందులో భారత్‌కు 26 స్థానం దక్కింది. పాకిస్తాన్ 14, బంగ్లాదేశ్, 15, ఆఫ్ఘనిస్తాన్ 25 స్థానాల్లో ఉన్నాయి. -
ఎందుకీ కార్చిచ్చు?!
లాస్ ఏంజెలెస్‌కు కార్చిచ్చుకు కారణం ఏమిటన్నది చర్చనీయంగా మారింది. ఇలాంటి విపత్తులకు ప్రకృతి కంటే మానవ తప్పిదాలే ఎక్కువగా కారణమవుతుంటాయి. అడవుల్లో సాధారణంగా పిడుగుపాటు వల్ల కార్చిచ్చులు రగులుతుంటాయి. కరెంటు స్తంభాలు నేలకొరిగినప్పుడు చెలరేగే మంటలూ కార్చిచ్చుగా మారుతుంటాయి. ఇవిగాక మనుషుల నిర్లక్ష్యం కూడా ఈ ఉత్పాతానికి దారితీస్తుంటుంది. కాల్చిపడేసిన సిగరెట్ సైతం పెనువిపత్తుగా మారొచ్చు. తాజాగా లాస్ ఏంజెలెస్‌ను బుగ్గిపాలు చేస్తున్న కార్చిచ్చు సైంటిస్టులనే నిర్ఘాంతపరుస్తోంది. మంటలు ఇంత వేగంగా వ్యాప్తించడం మునుపెప్పుడూ చూడలేదని అగ్నిమాపక అధికారులు అంటున్నారు. వాతావరణ పరిస్థితులూ ఇందుకు దోహదం చేశాయని చెబుతున్నారు. లాస్ ఏంజెలెస్‌లో చాలా రోజులుగా వానలే లేవు. దాంతో చెట్లు చేమలతోపాటు కొండల దిగువ ప్రాంతాల్లో గడ్డి పూర్తిగా ఎండిపోయింది. కనుకనే మంటలు సులభంగా అంటుకుని వ్యాపించాయి. బలమైన ఈదురు గాలులతో పరిస్థితి మరింత విషమించింది. ఏటా ఇదే సీజన్లో ‘శాంటా అనా’ గాలులు వీస్తుంటాయి. వీటి వేగం గంటకు 129 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అగ్నికి ఆజ్యంలా కార్చిచ్చుకు ఈ గాలులు జతకలిశాయి. వాటి ధాటికి విమానాలు, హెలికాప్టర్లు ఎగిరే పరిస్థితి లేకపోవడంతో ఆకాశం నుంచి నీరు, అగ్నిమాపక రసాయనాలు చల్లే వీల్లేకుండాపోయింది. దాంతో మంటలను అదుపులోకి తేవడం మరింత కష్టసాధ్యంగా మారింది. మానవ తప్పిదాలతో భారీ మూల్యం లాస్ ఏంజెలెస్ కార్చిచ్చు వంటివాటి రూపంలో వాతావరణ మార్పుల దు్రష్పభావాన్ని స్పష్టంగా చూస్తున్నామని నిపుణులు చెబుతున్నారు. ‘‘మానవ తప్పిదాల వల్ల మున్ముందు ఇలాంటి విపత్తుల ముప్పు మరింత పెరుగుతుంది. అవి వ్యాప్తి చెందే వేగమూ పెరుగుతుంది’’ అని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా పర్యావరణ పరిరక్షణపై దృష్టి పెట్టకపోతే ప్రకృతి విపత్తులు మరింతగా విరుచుకుపడడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. ‘‘కార్చిచ్చు అమెరికాకు పరిమితమైంది. కాదు. నేడు ప్రపంచమంతా ఈ ముప్పు ముంగిట ఉంది’’ అని తేల్చిచెబుతున్నారు. చిన్న మంటగా మొదలయ్యే కార్చిచ్చులు క్షణాల్లోనే విస్తరించి నియంత్రించలేని స్థాయికి చేరుకుంటాయి. మానవ కార్యకలాపాల పుణ్యమా అని విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పరిస్థితిని మరింతగా దిగజారుస్తున్నాయి. → లాస్ ఏంజెలెస్‌లో 2022, 2023లో వరుసగా రెండేళ్లు భారీగా వర్షాలు కురిశాయి. ఏకంగా 133 సెంటీమీటర్ల వర్షం పడింది. దీంతో చెట్లు బాగా పెరిగాయి. పచ్చదనం పరుచుకుంది. 2024లో పరిస్థితి ఒక్క సారిగా తారుమారైంది. వర్షాల్లేక కరువు తాండవించింది. చెట్లు ఎండిపోయాయి. దక్షిణ కాలిఫోర్నియా మొత్తం కరువు ఛాయలే! కార్చిచ్చు ఊహాతీత వేగంతో వ్యాపించడానికి ఇదే ప్రధాన కారణమని సైంటిస్టు మాట్ జోన్స్ విశ్లేషించారు. → కాలిఫోరి్నయా వంటి నగరాల్లో జనాభా అధికం. ప్రకృతి విపత్తులు పొంచి ఉన్న ఇ లాంటి నగరాల్లో నివసించడం క్షేమమేనా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. → ఇటీవలి కాలంలో బీమా సంస్థలు కూడా అప్రమత్తమయ్యాయి. లాస్ ఏంజెలెస్, పరిసర నివాసాలకు బీమా రక్షణ కలి్పంచేందుకు కొంతకాలంగా నిరాకరిస్తూ వస్తున్నాయి. ప్రమాదాలు జరిగితే భారీ మొత్తంలో బీమా సొమ్ము చెల్లించాల్సి ఉండటమే ఇందుకు కారణం. → లాస్ఏంజెలెస్లో ధ్వంసమైన ఇళ్ల స్థానంలో కొత్తవి నిర్మించబోతున్నారు. అందుకు ప్రభుత్వం సాయం అందించబోతోంది. కార్చిచ్చులను దృష్టిలో పెట్టుకొని వాటి నిర్మాణంలో మరిన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వయనాడ్ To విజయవాడ.. దేశాన్ని ముంచేసిన విషాదాలు
-
Year Ender 2024: భారత్‌ను వణికించిన ప్రకృతి విపత్తులు
ప్రస్తుతం నడుస్తున్న 2024వ సంవత్సరం కొద్దిరోజుల్లో ముగియనుంది. ఈ నేపధ్యంలో 2025 నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అందరూ సిద్ధమవుతున్నారు. అయితే 2024 మన దేశానికి కొన్ని చేదు గుర్తులను మిగిల్చింది. వాటిలో ప్రకృతి వైపరీత్యాలు తీవ్ర విషాదాన్ని అందించాయి.2024లో మనదేశం ఫెంగల్ తుఫాను, వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటం లాంటి అనేక భీకర విపత్తులను ఎదుర్కొంది. వీటి కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పలు చోట్ల జనజీవనం స్తంభించింది. 2024లో భారతదేశంలో సంభవించిన అత్యంత భయంకరమైన ప్రకృతి వైపరీత్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి..2024, జూలై 30న కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి 420 మందికి పైగా జనం మృతిచెందారు. 397 మంది గాయపడ్దారు. 47 మంది గల్లంతయ్యారు. 1,500కు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులుగా మారారు.రెమాల్ తుఫాను తాకిడికి..2024లో సంభవించిన రెమాల్ తుఫాను ఉత్తర హిందూ మహాసముద్రంలో సంభవించింది. ఇది 2024, మే 26న పశ్చిమ బెంగాల్- బంగ్లాదేశ్‌లోని సుందర్బన్ డెల్టాను తాకింది. ఈ తుఫాను కారణంగా సంభవించిన పలు ప్రమాదాలలో 33 మంది మృతి చెందారు. పలు చోట్ల భారీ విధ్వంసం సంభవించింది. ఈ తుఫాను బెంగాల్, మిజోరం, అస్సాం, మేఘాలయలో భారీ నష్టం వాటిల్లింది.ఫెంగల్ తుఫాను 2024, నవంబర్ 30న ఫెంగల్ తుఫాను పుదుచ్చేరి సమీపంలోని తీరాన్ని తాకింది. ఈ తుఫాను కారణంగా సంభవించిన ప్రమాదాల్లో 19 మంది మృతిచెందారు. వేలమందిని ఈ తుఫాను ప్రభావితం చేసింది. భారీ వర్షాలతో ఈ తుఫాను బీభత్సం సృష్టించింది. నాడు పుదుచ్చేరిలో 46 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో రోడ్లు, పొలాలు జలమయమయ్యాయి. తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో ఫెంగల్ తుఫాను కారణంగా భారీ నష్టం వాటిల్లింది.విజయవాడ వరదల్లో..2024, ఆగస్ట్ 31 నుండి సెప్టెంబర్ 9 వరకు భారీ వర్షాలతో పాటు నదులు ఉప్పొంగిన కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో వరదలు సంభవించాయి. ఈ వరదల్లో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. 2.7 లక్షల మందికి పైగా జనం ప్రభావితమయ్యారు. బుడమేరు వాగు, కృష్ణా నది నీరు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తడంతో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.హిమాచల్‌లో వరదలు2024 జూన్ నుండి ఆగస్టు వరకు హిమాచల్ ప్రదేశ్‌లో వరదలు సంభవించాయి. ఈ సందర్భంగా సంభవించిన పలు దుర్ఘటనల్లో 31 మంది మృతిచెందారు. 33 మంది గల్లంతయ్యారు. లాహౌల్, స్పితి జిల్లాలో అత్యధిక నష్టం సంభవించింది. 121 ఇళ్లు ధ్వంసమవగా, 35 చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ విపత్తు కారణంగా హిమాచల్ రాష్ట్రానికి రూ.1,140 కోట్ల నష్టం వాటిల్లింది.అస్సాం వరదలు2024లో అస్సాంలో సంభవించిన వరదల కారణంగా చోటుచేసుకున్న వివిధ ప్రమాదాల్లో 117 మంది మృతిచెందారు. 2019 నుంచి ఇప్పటి వరకు అస్సాంలో వరదల కారణంగా మొత్తం 880 మంది మృత్యువాత పడ్డారు. వరదల కారణంగా జనజీవనం పూర్తిగా అతలాకుతలమైంది.ఇది కూడా చదవండి: నేడు సుబ్రహ్మణ్య షష్టి: ఈ 10 ఆలయాల్లో విశేష పూజలు -
వరదలు.. పెనుగాలులు.. భూకంపం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్రంలోని గోదావరి తీర ప్రాంతాలు ప్రకృతి విపత్తులకు నిలయంగా మారుతున్నాయి. కొన్నేళ్ల నుంచి జరిగిన ఘటనలను పరిశీలిస్తే.. ఏటా ఏదో ఒక విపత్తు ఎదురవుతోంది. ముఖ్యంగా ములుగు జిల్లా పరిసర ప్రాంతాల్లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు కలకలం రేపుతున్నాయి. వరుసగా అతి భారీ వర్షాలు, వరదలు, పెనుగాలులు టోర్నడోలు, ఇప్పుడు భూకంపం వంటివి తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి.అతి భారీ వర్షాలతో..2022 జూలై 14 నుంచి 16 వరకు ఈ ప్రాంతాల్లో కురిసిన కుంభవృష్టి కారణంగా గోదావరికి భారీగా వరదలు వచ్చాయి. ఏ క్షణమైనా కరకట్ట కొట్టుకుపోయి భద్రాచలం మునిగిపోతుందనే పరిస్థితి ఏర్పడింది. 2023 జూలై 27న భూపాలపల్లి, ములుగు జిల్లాల పరిధిలో అత్యంత భారీ వర్షం కురిసింది. ములుగు జిల్లా లక్ష్మీదేవిపేటలో ఏకంగా ఒక్కరోజే 64.9 సెంటీమీటర్ల వాన పడింది. అందులో కేవలం మూడు గంటల్లోనే 46.4 సెంటీమీటర్ల అతి భారీ వాన పడింది. అదేరోజు జయశంకర్ జిల్లా చిట్యాలలో 61.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వాగులు ఉప్పొంగి గ్రామాలు నీట మునిగి పన్నెండు మంది మృత్యువాత పడ్డారు. ఈ ఏడాది ఆగస్టు 31న నర్సంపేట, పాలకుర్తి, మహబూబాబాద్ నియోజకవర్గాల పరిధిలో భారీ వర్షంపడి మున్నేరు, ఆకేరు, పాలేరు వాగులకు కనీవినీ ఎరుగని రీతిలో వరద వచ్చింది. ఖమ్మం పట్టణం, పరిసర గ్రామాలు చిగురుటాకులా వణికిపోయాయి.లక్ష చెట్లను కూల్చేసిన పెనుగాలులుఈ ఏడాది ఆగస్టు 31, సెప్టెంబర్ ఒకటో తేదీల మధ్య ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో తీవ్ర పెను సుడిగాలులు వీచాయి. ఏటూరునాగారం అభయారణ్యంలో ఏకంగా 334 హెక్టార్ల పరిధిలో లక్ష వరకు చెట్లు కూలిపోయాయి. ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఆ వాయు విధ్వంసానికి కారణాలను ఇప్పటికీ స్పష్టంగా తేల్చలేదు. ఇక్కడే భూకంప కేంద్రాలురాష్ట్రంలోని సిర్పూర్, జైనూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, మంథని, భూపాలపల్లి, వరంగల్, ములుగు, నర్సంపేట, మహబూబాబాద్, ఖమ్మం, మణుగూరు, కొత్తగూడెం, భద్రాచలం ప్రాంతాలు భూకంప సీస్మిక్ జోన్–3 పరిధిలో ఉన్నాయి. బొగ్గు గనులు విస్తృతంగా ఉన్న ఈ ప్రాంతాల్లో తరచూ భూమి నుంచి భారీ శబ్దాలు రావడం సాధారణంగా మారిపోయింది. ఇదే ప్రాంతంలోని భద్రాచలంలో 1969లో 5.7 తీవ్రతతో భూకంపం రాగా.. ఇప్పుడు 5.3 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. గత ఆరేళ్లలో మణుగూరులో స్వల్ప స్థాయిలో మూడు సార్లు ప్రకంపనలు వచ్చాయి కూడా. భారీగా నీటి ప్రాజెక్టుల నిర్మాణం, బొగ్గు తవ్వకాలు, గోదావరిలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు వంటివి విపత్తులకు దారితీస్తున్నాయని పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు.వేడి నీటిబుగ్గలకూ కేంద్రంములుగు జిల్లాలోని రామన్నగూడెం ప్రాంతంలో వేడి నీటిబుగ్గలు ఉన్నాయి. 1954లో ఇక్కడ చమురు నిక్షేపాల అన్వేషణ కోసం తవ్వకాలు జరిపి వదిలేసిన బోరులోనుంచి ఇప్పటికీ వేడి నీళ్లు వెలువడుతూ ఉన్నాయి. భూమి పొరల్లో పగుళ్ల వల్ల నీళ్లు మరింత లోతుకు వెళ్లి... అక్కడి అధిక ఉష్ణోగ్రతల వల్ల వేడై పైకి ఉబికివస్తాయని నిపుణులు చెబుతున్నారు.మానవ తప్పిదాలపై ప్రకృతి హెచ్చరికలివి!మానవ తప్పిదాలపై ప్రకృతి చేసిన హెచ్చరికలను మనం పట్టించుకోలేదు. మూడు నెలల క్రితం తాడ్వాయి అడవుల్లో టోర్నడోల తీవ్రత కారణంగా లక్ష చెట్లు నేలకొరిగినప్పుడే భూకంపాలపై హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆ ఘటన జరిగాక కారణాలేమిటన్న దానిపై ప్రభుత్వం, వర్సిటీలు, ఎన్జీఆర్ వంటి సంస్థలు ఎలాంటి పరిశోధనలు చేయలేదు. మనం గోదావరి బెల్ట్‌ను నాశనం చేశాం. ప్రాజెక్టుల కోసం అడవులు నరికేశాం. భూమి లోపల పొరలు ఎలా ఉన్నాయి? డ్యామ్‌ల వల్ల వాటికి ఏ మేరకు నష్టం అన్నది సాంకేతికంగా పరిశీలించలేదు. అది భూకంపాలకు కారణమవుతోంది.– పాకనాటి దామోదర్‌రెడ్డి, పర్యావరణవేత్త -
మానవ తప్పిదాలే విలయ హేతువులు
కేరళలోని వయనాడ్‌లో జూలై 30న వానరూపంలో మృత్యువు చేసిన కరాళ నృత్యానికి 375 మంది మృత్యు వాతపడగా మరో 400 మంది తీవ్రంగా గాయపడ్డారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ విలయం కంటే ముందు 2019 ఆగస్ట్‌లో పుతుమల ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి భారీ ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించాయి. ఇక, 2018లో కనివిని ఎరుగని విధంగా కేరళ రాష్ట్రాన్ని ముంచెత్తిన వర్షాలు, వరదలకు 433 మంది మృత్యువాత పడగా, దాదాపు 6 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయినట్లు అధికారిక లెక్కలు వెల్లడించాయి. ఇంతకూ ఎందుకు కేరళ రాష్ట్రంలో పదేపదే ప్రకృతి ప్రకోపిస్తోంది? ఈ ప్రశ్నకు జవాబు ప్రభుత్వాలకు చెంప పెట్టుగా నిలుస్తుంది. నిజానికి ప్రకృతి తనంతట తాను ప్రకో పించదు. దాన్ని ధ్వంసం చేసినప్పుడు మాత్రమే కన్నెర్ర జేస్తుంది. మనిషి అంతులేని స్వార్థంతో ప్రకృతి సంపదను ఇష్టానుసారం దోచుకోవడానికి చేసే విధ్వంసమే ప్రకృతి గతి తప్పడానికి కారణం అవుతోంది. ఇది ఒక్క కేరళలో మాత్రమే కాదు... గత దశాబ్ద కాలంగా హిమాలయ ప్రాంతంలోని ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలలో సైతం ఇదే జరుగు తోంది. అందుకే అక్కడా తరచుగా భారీ వర్షాలు కురిసి కొండ చరియలు విరిగి పడుతున్నాయి. వాటి వల్ల ప్రాణ, ఆస్తి నష్టాలు జరగడం పరిపాటిగా మారింది. బెంగళూరులోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్’కు చెందిన ప్రొఫెసర్ సీపీ రాజేంద్రన్ ‘వయనాడ్’లో ప్రకృతి ప్రకోపానికి కారణమవుతున్న అంశాలను శాస్త్రీయంగా వివరించారు. 50వ దశకం వరకు వయనాడ్‌లో 85 శాతం దట్టమైన అడవులు ఉండగా, అవి క్రమంగా క్షీణిస్తూ 2018 నాటికి 62 శాతానికి చేరుకొన్నాయి. అడవులను నరికి వేసి ఆ ప్రాంతంలో విస్తారంగా తేయాకు తోటల పెంపకం ప్రారంభించారు. దాంతో అక్కడ అనేక జనావాసాలు పుట్టు కొచ్చాయి. మానవ కార్యకలాపాలు విస్తృతం అయ్యాయి. కాలుష్య కారకాల వల్ల కర్బన ఊద్గారాలు పెరిగి వాతా వరణంలో వేడి అధికమైంది. ఫలితంగా, ఆగ్నేయ ప్రాంతంలోని అరేబియా సముద్రం వేడెక్కి ఒక్కసారిగా కుండపోత వానలు పడటం మొదలైంది. అడవులు ఉన్నప్పుడు వర్షపు నీటి ప్రవాహ వేగం తక్కువుగా ఉండి ఒక క్రమపద్ధతిలో పల్లపు ప్రాంతానికి చేరేది. కానీ, అడవుల్ని నరకడం వల్ల ప్రవాహ ఉధృతి పెరిగిపోవడం, వర్షపునీటి సాంద్రత అధికమవడంతో... రాతి శకలాల మధ్య ఉన్న మట్టి తొందరగా కరిగిపోయి ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడు తున్నాయి. వయనాడ్ కొండప్రాంతం లేటరైట్ మృత్తిక, రాతిశకలాల మిశ్రమంతో నిండి ఉండటం వల్ల భారీ వర్షాలు, వరదనీటి తాకిడికి కొండలు పెళ్లలు ఊడిపడినట్లు పడతా యని ఎప్పటి నుంచో శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తూనే ఉన్నారు.పశ్చిమ కనుమల పర్యావరణ స్థితిగతుల నిపుణుల బృందం (వెస్ట్రన్ ఘాట్స్ ఎకాలజీ ఎక్స్పర్ట్ ప్యానెల్)కు నేతృత్వం వహించిన మాధవ్ గాడ్గిల్ 2010 నుంచి దాదాపు ఏడాదిపాటు ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. కేరళ నుంచి ఇటు తమిళనాడు; అటు కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ వరకు విస్తరించిన పశ్చిమ కనుమల ప్రాంతాన్ని సున్నితమైన 3 జోన్లుగా వర్గీకరించి... ఒకటవ జోన్లో ఉన్న వయనాడ్ ప్రాంతంలో పర్యావరణాన్ని నష్టపరిచే కార్యకలా పాల్ని నిషేధించాలని సిఫారసు చేశారు. కనుమల స్థిరత్వాన్ని దెబ్బతీసే భారీ కట్టడాల్ని నిర్మించడం శ్రేయస్కరం కాదని హెచ్చరించారు.అయితే, అపరిమితమైన ప్రకృతి సంపద గలిగిన ఆ ప్రాంతంపై కన్నేసిన కొందరు తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి మాధవ్ గాడ్గిల్ కమిషన్ నివేదికను బుట్ట దాఖలా చేయాలని చూశారు. స్థానికంగా ఉన్న ప్రజల్ని రెచ్చ గొట్టారు. ఆ ప్రాంతంలో వాణిజ్య కార్యకలాపాలు పెరిగితే స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయన్న ప్రచారం ముమ్మరం కావడంతో మెజార్టీ ప్రజల అభిప్రాయాలకు తలొగ్గిన ప్రభుత్వాలు మాధవ్ గాడ్గిల్ కమిషన్ చేసిన సూచనలకు సవరణలు ప్రతిపాదించి, పరిమితమైన వాణిజ్య కార్యకలాపాలకు అనుమతులు ఇచ్చాయి. ఫలితంగా వయ నాడ్ ప్రాంతంలో మైనింగ్, క్వారీ కార్యకలాపాలు పెరిగి పోయాయి. అలాగే కాలుష్య కారక పరిశ్రమల ఏర్పాటు సజావుగా సాగిపోయింది. ఈ చర్యలన్నింటి వల్లనే కేరళ తరచుగా విపత్తులకు గురవుతోందని శాస్త్రజ్ఞులు అంటున్నారు. దేశంలో ఎటువంటి ఉపద్రవం సంభవించినా దాని చుట్టూ రాజకీయ రంగు పులుముకోవడం సహజమైపోయింది. వయనాడ్ మృత్యు విలయంపై ఆ మరుసటి రోజునే పార్లమెంట్లో హోమ్ మంత్రి అమిత్‌షా ‘కాలింగ్ అటెన్షన్’ రూపంలో చర్చను ప్రారంభించారు. ముందుగా ఆయన భారత వాతావరణ శాఖ చేసిన హెచ్చరిక (అలెర్ట్) లను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. అదే సమయంలో పశ్చిమ కనుమలలో దాదాపు 60 వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని పర్యావరణం పరంగా సున్నిత ప్రాంతంగా గుర్తిస్తున్నట్లు ప్రకటించారు. అందులో వయనాడ్‌లోని కనుమ ప్రాంతం కూడా ఉంది. అయితే, కేంద్రం తాజాగా ప్రకటన నేపథ్యంలో 5 రాష్ట్రాల పశ్చిమ ప్రాంతంలో విస్తరించిన ఈ కనుమలలో ఇప్పటికే జరుగుతున్న పర్యావరణ విధ్వంసకర కార్యకలాపాలను నిలుపుదల చేయాలంటే అక్కడి పరిశ్రమలను వెంటనే తరలించాలి. ఆ పరిశ్రమలలో పనిచేస్తున్న సిబ్బందికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలి. పరిశ్రమల యజమానులకు తగిన పరిహారం ఇవ్వాలి. ఈ చర్యలన్నీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే జరగాలి. ఇవన్నీ జరగాలంటే.. రాజకీయ చిత్తశుద్ధి అవసరం. ప్రజల ప్రాణాలకంటే విలువైనదేదీ లేదన్న స్పృహ పాలకుల్లో కలిగినప్పుడే విపత్తుల్లో చోటుచేసుకునే ప్రాణ, ఆస్తి నష్టాలు గణనీయంగా తగ్గుతాయి. డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి -
Catastrophe Insurance: మీ ఇంటికి బీమా ఉందా..?
దీపావళి రోజున హైదరాబాద్‌కు చెందిన రామన్ కుటుంబం ఓ పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. స్కై షాట్ క్రాకర్ గతితప్పి ఎనిమిదో అంతస్తులోని రామన్ అపార్ట్మెంట్లోకి దూసుకెళ్లింది. దాంతో మంటలు మొదలయ్యాయి. ఇంట్లోని ఫరి్నచర్, విలువైన ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, వ్రస్తాలు కాలిపోయాయి. ఒకింత అదృష్టం ఏమిటంటే రామన్ కుటుంబ సభ్యులు అందరూ ఫ్లాట్ నుంచి బయటకు వచ్చేశారు. ఎవరికీ గాయాలు కాలేదు. కానీ, ఇంట్లోని విలువైన వస్తువులు కాలిపోవడం వల్ల రూ.20 లక్షల ఆస్తి నష్టం జరిగింది. ఇది ఊహించని నష్టం. ఇలాంటి ప్రమాదం ఏర్పడుతుందని ఎవరూ అనుకోరు. కానీ, ప్రమాదాలు అన్నవి చెప్పి రావు. అందుకే ఇంటికి, ఇంట్లోని విలువైన వాటికి బీమా ఉండాలని నిపుణులు తరచూ చెబుతుంటారు. కానీ, దీన్ని పాటించే వారు చాలా తక్కువ మందే అని చెప్పుకోవాలి. హోమ్ ఇన్సూరెన్స్ ఇంటితోపాటు, ఇంట్లోని విలువైన వస్తువులకు ప్రమాదాలు, విపత్తుల కారణంగా ఏర్పడే నష్టం నుంచి రక్షణనిస్తుంది. చౌక ప్రీమియానికే వస్తుంది. రోజుకు ఒక టీకి పెట్టేంత ఖర్చు కూడా కాదు. హోమ్ ఇన్సూరెన్స్ ఎందుకు తప్పనిసరి అనేది వివరంగా చూద్దాం... ‘‘ప్రజలు తమ జీవిత కాల పొదుపును ఇంటి కొనుగోలు కోసం వెచి్చస్తున్నారు. మరి అంతటి విలువైన ఆస్తిని కాపాడుకునేందుకు కావాల్సిన చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. ఎంతో విలువైన ఆస్తికి ఎల్లప్పుడూ రిస్క్ పొంచి ఉంటుంది’’అని ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ అండర్‌రైటింగ్ , ప్రాపర్టీ క్లెయిమ్స్ చీఫ్ గౌరవ్ అరోరా తెలిపారు. నిజానికి ప్రతి 20 ఇళ్లల్లో కేవలం ఒక ఇంటికే ప్రస్తుతం బీమా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. సగటు వ్యక్తికి ఇల్లు అనేది పెద్ద పెట్టుబడి అవుతుంది. అందుకే ఆ విలువైన ఆస్తికి తప్పకుండా రక్షణ తీసుకోవాలి. ‘‘విపత్తులు రావడం అన్నది అరుదే. కానీ, వచి్చనప్పుడు వాటిల్లే నష్టం భారీగా ఉంటుంది’’అని డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ డైరెక్ట్ సేల్స్ హెడ్ వివేక్ చతుర్వేది పేర్కొన్నారు. అనుభవాలను మర్చిపోవద్దు.. జీవిత బీమా తీసుకోవాలని చాలా మంది ఏజెంట్లు అడగడం వినే ఉంటారు. కానీ, అదే స్థాయిలో హోమ్ ఇన్సూరెన్స్ మార్కెటింగ్ కనిపించదు. దీన్ని తీసుకున్నామని, తీసుకోవాలని సూచించే వారు కూడా అరుదు. విపత్తులు, ప్రమాదాలే హోమ్ ఇన్సూరెన్స్ దిశగా అడుగులు వేయించేవిగా భావించాలి. నిజానికి ప్రకృతి విపత్తుల సమయాల్లో హోమ్ ఇన్సూరెన్స్ విక్రయాలు పెరుగుతుంటాయి. 2018లో కేరళను వరదలు తీవ్రంగా నష్టపరిచాయి. ఆ తర్వాతి ఏడాదిలో హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఆదాయం 34 శాతం పెరిగింది. ఇంటి బీమా కోసం ఆసక్తి పెరిగింది. 2020లో యాంఫాన్ తుపాను పశి్చమబెంగాల్ను నష్టపరచగా ఆ తర్వాతి ఆరి్థక సంవత్సరంలో పై ప్రీమియం ఆదాయం 27 శాతం పెరగడం గమనించొచ్చు. కానీ, ఇదంతా తాత్కాలిక ధోరణిగానే ఉంటోంది. విపత్తులు లేదా ప్రమాదాలు తలెత్తినప్పుడు సహజంగా హోమ్ ఇన్సూరెన్స్ విక్రయాలు పెరుగుతుంటాయి. తిరిగి ఏడాది రెండేళ్ల తర్వాత అక్కడి ప్రజలు వాటిని మరిచిపోతుంటారు. దీంతో విక్రయాలు మళ్లీ తగ్గుతుంటాయి. ఇదే పరిస్థితి ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ విభాగంలోనూ కనిపిస్తోంది. కరోనా మహమ్మారి సమయంలో వైద్య బిల్లులు గణనీయంగా పెరిగాయి. దీంతో ఆరోగ్య బీమా తీసుకునే వారిలో పెద్ద ఎత్తున పెరుగుదల కనిపించింది. ఇప్పుడు కరోనా విపత్తు బలహీనపడింది. దీంతో హెల్త్ ఇన్సూరెన్స్ విక్రయాలు తిరిగి సాధారణ స్థాయికి చేరాయి’’అని డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్‌కు చెందిన చతుర్వేది తెలిపారు. ఫ్లాట్ యజమానులు హౌసింగ్ సొసైటీ తీసుకున్న హోమ్ ఇన్సూరెన్స్‌పై ఆధారపడడం సరికాదని నిపుణుల సూచన. తమ ఫ్లాట్‌తోపాటు, అందులోని విలువైన వస్తువులకు విడిగా కవరేజీ తీసుకోవడం అన్ని విధాలుగా మెరుగైన నిర్ణయం అవుతుంది. ఇంటికి భూకంపాలు, తుపాను, వరదల ముప్పు మాత్రమే కాదు, ఎత్తయిన భవనాలు, ఖరీదైన గాడ్జెట్ల వినియోగం నేపథ్యంలో అగ్ని ప్రమాదాల ముప్పు కూడా ఉంటుందన్న విషయాన్ని గ్రహించాలి. ముంబైలో ఏటా 5,000 వరకు అగ్ని ప్రమాదాలు నమోదవుతున్నట్టు ఒక అంచనా. ఇందులో 70 శాతానికి విద్యుత్తే కారణంగా ఉంటోంది. ఢిల్లీ, బెంగళూరు తదితర పట్టణాల్లో ఏటా 2,500 మేర అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ‘‘ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్ గాడ్జెట్ల వినియోగం పెరిగిపోవడంతో, ఎలక్ట్రికల్ వైరింగ్‌పై భారం అధికమై అగ్ని ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి’’అని ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ చతుర్వేది తెలిపారు. అపార్ట్మెంట్లలో అగ్ని ప్రమాదానికి సంబంధించి అలారమ్ మోగిన వెంటనే, స్ప్రింక్లర్ సిస్టమ్ నుంచి నీరు ఎంతో ఒత్తిడితో ఎగజిమ్మడం మొదలవుతుంది. ఈ నీటి కారణంగా ఇంట్లోని విలువైన గాడ్జెట్లు, ఇంటీరియర్ దెబ్బతింటాయి. కనుక అగ్ని ప్రమాదం జరగకపోయినప్పటికీ, ఇంటి యజమా ని చాలా నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అద్దె ఇంట్లో ఉంటే హోమ్ ఇన్సూరెన్స్ అవసరం లేదని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ, ఇది ఎంత మాత్రం సరైనది కాదు. హోమ్ ఇన్సూరెన్స్ అన్నది కేవలం ఇంటి నిర్మాణానికి జరిగిన నష్టానికే పరిమితం కాదు. ఇంట్లోని వస్తువులు దెబ్బతింటే ఏర్పడే నష్టం నుంచి గట్టెక్కడానికి బీమా అక్కరకు వస్తుంది. దోపిడీ, దొంగతనాల వల్ల ఏర్పడే నష్టాన్ని సైతం భర్తీ చేసుకోవచ్చు. కవరేజీ చాలినంత.. హోమ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ముందు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. తమ అవసరాలకు తగిన పాలసీ కీలకం అవుతుంది. భారత్ గృహ రక్ష (బీజీఆర్) అన్నది ఐఆర్డీఏఐ ఆదేశాల మేరకు అన్ని సాధారణ బీమా సంస్థలు తీసుకొచి్చన ప్రామాణిక నివాస బీమా. ప్రకృతి విపత్తులు అయిన వరదలు, భూకంపాలతోపాటు అగ్ని ప్రమాదాలు, చెట్టు విరిగి పడడం, వాహనం డ్యాష్ ఇవ్వడం కారణంగా ఇంటికి వాటిల్లే నష్టానికి ఈ పాలసీలో పరిహారం లభిస్తుంది. శిధిలాల తొలగింపునకు, ఇంజనీరింగ్ లేదా ఆర్కిటెక్ట్ ఫీజులకు అయ్యే మొత్తాన్ని కూడా చెల్లిస్తుంది. కానీ, ఇందులో పరిమితులు కూడా ఉన్నాయి. రూ.10 లక్షలు లేదా తీసుకున్న కవరేజీలో 20 శాతం ఏది తక్కువ అయితే అంత మేరే ఈ పాలసీ కింద పరిహారం లభిస్తుంది. ఓ సాధారణ మధ్య తరగతి ఇంటికి రూ.10 లక్షలు బీమా సరిపోదు. ఇంట్లో అధిక విలువ కలిగిన వస్తువులు ఉంటే, వాటి కోసం ప్రత్యేక కవరేజీ తీసుకోవాలని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ప్రాపర్టీ అండ్ రైటింగ్ హెడ్ గురుదీప్ సింగ్ బాత్రా సూచించారు. ఇంటి మార్కెట్ విలువ ఆధారంగా బీమా కవరేజీపై నిర్ణయానికి రావద్దు. ఇంటి నిర్మాణం దెబ్బతింటే, పునరుద్ధరించడానికి అయ్యే వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. చదరపు అడుగుకు ఎంత వ్యయం అవుతుందో ఇంజనీర్లను అడిగితే తెలుస్తుంది. ఇంట్లో విలువైన ఫిట్టింగ్‌లు ఏర్పాటు చేసుకున్న వారు, ఆ విలువను కూడా బీమా కవరేజీకి అదనంగా జోడించుకోవాలి. హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఏటా ఎంతో కొంత పెరుగుతుంటుంది. కనుక ఏడాదికి కాకుండా ఒకేసారి రెండు, మూడేళ్ల కాలానికి పాలసీ తీసుకోవచ్చు. ‘‘ఇంటికి తీసుకునే బీమాని ఏటా రెన్యువల్‌కు ముందు ఆ కవరేజీని సమీక్షించుకోవాలి. ఎందుకంటే ద్రవ్యోల్బణం ప్రభావంతో ఏటా ఇంటి నిర్మాణ వ్యయం పెరిగిపోతుంటుంది. అందుకు అనుగుణంగా ఏటా నిర్ణీత శాతం మేర కవరేజీని పెంచుకోవాలి. ఏటా 10 శాతం మేర కవరేజీ పెరుగుతూ వెళ్లే వాటిని పరిశీలించొచ్చు. ఇంట్లో ఉన్న ఒక్కో పరికరం, కొనుగోలు చేసిన సంవత్సరం, మోడల్ నంబర్, దాని విలువ ఈ వివరాలన్నీ సిద్ధం చేసుకోవాలి. ఇన్సూరెన్స్ సంస్థలు ఈ వివరాల ఆధారంగానే పరిహారాన్ని నిర్ణయిస్తాయి. అవి ఎన్నేళ్ల పాటు వాడారన్న వివరాల ఆధారంగా ప్రామాణిక తరుగును అమలు చేస్తాయి. ఎలక్ట్రానిక్ పరికరాల విలువ ఏటా తగ్గుతూ ఉంటుంది. రూ.50 వేలు పెట్టి రెండేళ్ల క్రితం కొనుగోలు చేసిన వస్తువు విలువ ఇప్పుడు సగానికి తగ్గిపోతుంది. కనుక పాడైపోయిన దాని స్థానంలో కొత్తది కొనుగోలుకు అయ్యే మొత్తాన్ని బీమా సంస్థ చెల్లిస్తుందని అనుకోవద్దు. ఇంట్లో విలువైన కళాకృతులు ఉంటే, వాటికి సైతం బీమా కవరేజీ కోరుకుంటే.. సరి్టఫైడ్ ఏజెన్సీ నుంచి వ్యాల్యూషన్ సరి్టఫికెట్ తీసుకోవాలి. ఒకవేళ కళాఖండాల మొత్తం విలువ రూ.5 లక్షలు, విడిగా ఒక్కోటి విలువ రూ.లక్ష మించకపోతే వ్యాల్యూషన్ సరి్టఫికెట్ అవసరం పడదు. ఎలాంటి కవరేజీ..? ప్రతి ఇంటికి కనీసం హోమ్ ఇన్సూరెన్స్ బేసిక్ పాలసీ అయినా ఉండాలి. భూకంపాలు, పిడుగులు, తుపానులు, వడగళ్లు, వరదలు తదితర ప్రకృతి విపత్తులు, అగ్ని ప్రమాదం, విధ్వంసం, అల్లర్ల కారణంగా ఇంటి నిర్మాణానికి నష్టం ఏర్పడితే బేసిక్ పాలసీలో పరిహారం లభిస్తుంది. మరమ్మతులు లేదంటే తిరిగి నిర్మాణం వీటిల్లో సరైన దానికి కవరేజీనిస్తుంది. రూ.లక్ష కవరేజీకి ప్రీమియం రూ.30 వరకు ఉంటుంది. ఇక ఇంటి నిర్మాణానికి అదనంగా, ఇంట్లోని వస్తువులకు కూడా రక్షణ తీసుకోవచ్చు. ఈ తరహా కవరేజీకి ప్రతి రూ.లక్షకు గాను ప్రీమియం రూ.60 వరకు ఉంటుంది. దోపిడీ, దొంగతనాల నుంచి సైతం రక్షణ అవసరం. ఇంట్లోని ఫరి్నచర్, కళాఖండాలు, వ్రస్తాలు, గృహోపకరణాలు, గాడ్జెట్ల వంటి వాటికి దొంగతనాల నుంచి రక్షణ కోరుకుంటే ప్రతి రూ.లక్షకు రూ.200 వరకు ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. ఇంట్లో గాడ్జెట్లు పనిచేయకుండా పోవడం చూస్తుంటాం. ఇలా ఉన్నట్టుండి ఇంట్లో పరికరం పనిచేయకుండా పోతే, పరస్పర అంగీకారం మేరకు పరిహారం అందించే ‘బ్రేక్‌డౌన్’ కవర్ కూడా ఉంటుంది. దీనికి ప్రీమియం రూ.లక్షకు రూ.200–300 వరకు ఉంటుంది. రుణంపై ఇంటిని తీసుకున్న వారు ఈఎంఐ ప్రొటెక్షన్ కవర్ తీసుకోవచ్చు. ఇంటి నిర్మాణం దెబ్బతిన్న సందర్భాల్లో పునరుద్ధరణ లేదా పునర్నిర్మాణం వరకు రుణ ఈఎంఐని బీమా కంపెనీ చెల్లించాలని కోరుకుంటే ఈఎంఐ ప్రొటెక్షన్ కవర్ తీసుకోవచ్చు. ఆరు నెలల ఈఎంఐ రక్షణకు ప్రీమియం రూ.2,500 వరకు ఉంటుంది. ఇంటి నిర్మాణం దెబ్బతిన్నప్పుడు అందులో ఉండే కిరాయిదారు ఖాళీ చేయాల్సి రావచ్చు. అదే జరిగితే అప్పటి వరకు ప్రతి నెలా క్రమం తప్పకుండా వస్తున్న అద్దె ఆదాయానికి బ్రేక్ పడుతుంది. ఇలా అద్దె ఆదాయాన్ని నష్టపోకుండా, బీమా సంస్థ చెల్లించేలా యాడాన్ కవర్ తీసుకోవచ్చు. దీనికి ప్రతి నెలా రూ.25వేల అద్దె చొప్పున ఆరు నెలల పాటు చెల్లించే కవర్‌కు ప్రీమియం రూ.2,000 ఉంటుంది. వ్యక్తిగత ప్రమాద బీమా ప్రత్యేకంగా ఉంటే, హోమ్ ఇన్సూరెన్స్‌తో తీసుకోవాల్సిన అవసరం లేదు. భారం తగ్గాలంటే..? హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గించుకునేందుకు కొన్ని మార్గాలున్నాయి. ఇల్లు, ఇంట్లోని వస్తువులకు నష్టం వాటిల్లినప్పుడు, కొంత మొత్తాన్ని తామే భరించేట్టు అయితే ప్రీమియం తగ్గుతుంది. కొన్ని కంపెనీలే ఈ ఆప్షన్ ఇస్తున్నాయి. ఇంట్లో అన్నింటికీ బీమా అవసరం ఉండదు. బాగా పాత పడిపోయిన వాటికి, పెద్దగా వ్యాల్యూ లేని (తరుగు బాగా పడే) వాటికి బీమా అనవసరం. అగ్ని ప్రమాదం జరిగితే హెచ్చరించి, అప్రమత్తం చేసే అలారమ్ వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటే, అగ్ని ప్రమాదాన్ని అదుపు చేసే పరికరాలు ఏర్పాటు చేసుకుంటే ప్రీమియంలో 15 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. స్వయం ఉపాధిలోని నిపుణులు లేదా వ్యాపారులు అయితే హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై పన్ను మినహాయింపు పొందొచ్చు. వేతన జీవులకు ఈ వెసులుబాటు లేదు. ఏడాదికి కాకుండా, ఏడాదికి మించి ఎక్కువ కాలానికి పాలసీ తీసుకుంటే ప్రీమియంలో 10 శాతం తగ్గింపు వస్తుంది. -
శిలాజ ఇంధనాలకు బైబై
దుబాయ్: హరిత గృహ వాయువుల ఉద్గారానికి, తద్వారా భూతాపానికి, భూగోళంపై ప్రకృతి విపత్తులకు, జీవకోటి మనుగడకు పెనుముప్పుగా పరిణమించిన శిలాజ ఇంధనాల వాడకానికి వీడ్కోలు చెప్పే దిశగా అడుగులు వేసేందుకు దాదాపు 200 దేశాలు అంగీకారానికి వచ్చాయి. ఈ మేరకు దుబాయ్‌లో జరుగుతున్న ‘కాప్–28’ సదస్సులో చరిత్రాత్మక ఒప్పందానికి అన్ని దేశాలు మద్దతు పలికాయి. ‘శిలాజ ఇంధనాల వాడకం మానేద్దాం.. మార్పు సాధిద్దాం’ అంటూ ప్రతిన బూనాయి. కాప్–28 సదస్సులో బుధవారం చివరి సెషన్ జరిగింది. శిలాజ ఇంధనాలకు వ్యతిరేకంగా కీలక ఒప్పందాన్ని సభ్యదేశాల ప్రతినిధులంతా ముక్తకంఠంలో ఆమోదించారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణం కరతాళ ధ్వనులతో మార్మోగింది. 2050 నాటికి నెట్‌జీరో(సున్నా) ఉద్గారాలే లక్ష్యంగా ఒప్పందంలో 8 సూత్రాల ప్రణాళికను జోడించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఈ ఏడాది కాప్ సదస్సులో చెప్పుకోదగ్గ తీర్మానాలేవీ ఉండబోవన్న అనుమానాలు పటాపంచలయ్యాయి. భూగోళాన్ని కాపాడుకుంటేనే భవిష్యత్తు తరాలకు మనుగడ ఉంటుందని కాప్–28 అధ్యక్షుడు సుల్తాన్ అల్–జబేర్ తేలి్చచెప్పారు. పారిస్ ఒప్పందాన్ని పరిగణనలోకి తీసుకుంటూ, ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలని, ఇందుకోసం ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా పని చేయాలని, పటిష్టమైన, నిర్మాణాత్మక చర్యలకు శ్రీకారం చుట్టాలని కాప్–28 సదస్సు పిలుపునిచ్చింది. ప్రమాదకరమైన గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాన్ని గణనీయంగా తగ్గించాల్సిన బాధ్యత అన్ని దేశాలపైనా ఉందని స్పష్టం చేసింది. చేతలు కావాలి: బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని తగ్గించుకోవాలని గతంలో జరిగిన కాప్ సదస్సుల్లో ప్రత్యేకంగా సూచించారు. ఈసారి మాత్రం ఈ ప్రస్తావన లేకపోవడం గమనార్హం. బొగ్గుతో విద్యు త్ను ఉత్పత్తి చేయడంలో ప్రపంచంలో చైనా, భారత్ ముందంజలో ఉన్నాయి. తమ విద్యుత్ అవసరాలు తీర్చుకోవడానికి బొగ్గుపై ఆధారపడుతున్నాయి. ఉష్ణోగ్రతల పెరుగుదలను నియంత్రించడానికి బుధవారం ఆమోదించిన ఒప్పందమే అతిపెద్ద కార్యాచరణ ప్రణాళిక అని సుల్తాన్ అల్–జబేర్ అన్నారు. కాప్–28 టాప్ 10 చరిత్రాత్మక శిలాజ ఇంధన ఒప్పందంతో కాప్–28 సదస్సు ముగిసింది. ఇలాంటి కాలుష్య ఇంధనాల వాడకాన్ని క్రమంగా నిలిపివేయడానికి ప్రపంచ దేశాలు అంగీకరించాయి. పెట్రోల్, డీజిల్, బొగ్గు వినియోగం అంతమయ్యే దిశగా అడుగులు పడ్డాయని చెప్పొచ్చు. 1. చరిత్రాత్మక శిలాజ ఇంధన ఒప్పందంతో కాప్–28 సదస్సు ముగిసింది. ఇలాంటి కాలుష్య ఇంధనాల వాడకాన్ని క్రమంగా నిలిపివేయడానికి ప్రపంచ దేశాలు అంగీకరించాయి. పెట్రోల్, డీజిల్, బొగ్గు వినియోగం అంతమయ్యే దిశగా అడుగులు పడ్డాయని చెప్పొచ్చు. 2. సంపన్న దేశాల నిర్వాకం వల్లే వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. వాటి వల్ల పేద దేశాలు నష్టపోతున్నాయి. పేద దేశాలకు వాటిల్లుతున్న నష్టానికి గాను బడా దేశాలు పరిహారం ఇవ్వాలన్న ప్రతిపాదన చాలాఏళ్లుగా ఉంది. ఈ సదస్సులో దానికి కార్యరూపం వచి్చంది. వాతావరణ మార్పుల వల్ల నష్టపోయే పేద దేశాలకు ఆర్థిక సాయం అందించడం కోసం ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడానికి ఆమోదం లభించింది. 3. నిర్దేశిత గడువు కంటే నెట్జిరో కర్బన ఉద్గారాల లక్ష్యాన్ని సాధిస్తామని కెనడా, బెల్జియం వంటి దేశాలు ప్రకటించాయి. 2030 నాటికి ఉద్గారాలను 50 శాతం తగ్గించుకుంటామని దుబాయ్ వెల్లడించింది. 4. 2030 కంటే ముందే గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారాన్ని అరికట్టడానికి శుద్ధ ఇంధనాల వనరుల వాడకాన్ని గణనీయంగా పెంచుకోవాలని నిర్దేశించారు. 5. క్లైమేట్ యాక్షన్ కోసం సంపన్న దేశాల నుంచి నిధులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలకు బదిలీ చేయాలన్న ప్రతిపాదనపై చర్చలు జరిగాయి. 6. జీవ వైవిధ్యానికి, మానవళికి ఎలాంటి హాని కలగకుండా వాతావరణ మార్పుల నియంత్రణకు కార్యాచరణ ప్రణాళిక చేపట్టాలని నిర్దేశించారు. 7. ప్రస్తుతం అమల్లో ఉన్న పారిస్ ఒప్పందం లక్ష్యాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా శిలాజ ఇంధనాల వినియోగం, ఉత్పత్తిని తగ్గించుకోవాలని ఆదేశించారు. 8. పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ క్లైమేట్ ఫండ్ తరహాలో క్లైమేట్ ఫైనాన్స్, సపోరి్టంగ్ ఫండ్స్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనకు కొన్నిదేశాలు, సంస్థలు మద్దతు ప్రకటించాయి. 9. కాప్–26 సదస్సు ఫలితాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత కర్బన్ ఉద్గారాల సమాచారాన్ని నమోదు చేసే విషయంలో నిబంధనలు సవరించారు. 10. అన్ని దేశాల, అన్ని వర్గాల అవసరా లను దృష్టిలో పెట్టుకొని శిలాజ ఇంధనాల నుంచి ఇతర ప్రమాద రహిత ఇంధనాల వైపు క్రమానుగతంగా మారాలని సూచించారు. -
వాతావరణ మార్పులతో కోట్ల డాలర్ల నష్టం
న్యూఢిల్లీ: వాతావరణంలో వస్తున్న భారీ మార్పులు ప్రపంచ దేశాలను ఆర్థికంగా దెబ్బ తీస్తున్నాయి. ప్రకృతి విపత్తుల కారణంగా ప్రపంచంలోని మౌలిక సదుపాయాల రంగంలో ఏడాదికి సగటున 30,000వేల కోట్ల డాలర్ల నుంచి 33 వేల కోట్ల డాలర్ల వరకు నష్టం వస్తోందని కొయిలేషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (సీడీఆర్ఐ) నివేదిక వెల్లడించింది. ఆరోగ్యం, విద్యా రంగానికి సంబంధించిన భవంతులు ఇతర సదుపాయాలకు జరిగిన నష్టాన్ని కూడా చేరిస్తే 73,200 కోట్ల డాలర్ల నుంచి 84 వేల కోట్ల డాలర్ల వరకు ఉంటుందని అంచనా. 2021–22లో ప్రపంచ స్థూల ఆదాయం పెరుగుదలలో ఈ నష్టం ఏడో వంతు వరకు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. -
Libya Floods: లిబియాలో ఊహకందని మహా విషాదం
డెర్నా: అస్థిర ప్రభుత్వాలు, సంక్షోభం, ఎవరికీ పట్టని ప్రజా సంక్షేమంతో సమస్యల వలయంలో చిక్కిన లిబియాపై ప్రకృతి కత్తి గట్టింది. ఊహించని వరదలు, వరద నీటి ధాటికి పేకమేడల్లా కుప్పకూలిన రెండు డ్యామ్‌లు.. వరద విలయాన్ని మరింత పెంచాయి. డ్యామ్‌ల నుంచి దూసుకొచ్చిన నీటిలో కొట్టుకుపోయి జలసమాధి అయిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బుధవారం నాటి గణాంకాల ప్రకారం డెర్నా సిటీలో వరద మృతుల సంఖ్య ఏకంగా 5,100 దాటింది. ఇంకా వేలాది మంది జాడ గల్లంతయిందన్న కథనాలు చూస్తుంటే అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. వరద ఉధృతికి ఇళ్లుసహా సర్వం కోల్పోయి నిరాశ్రయులైన వారు వేలాదిగా ఉన్నారు. డెర్నా సిటీ తీరప్రాంతంలోని పర్వతాలు, లోయలతో నిండిన నగరం. వరదల కారణంగా చాలా రోడ్లు దెబ్బతిని సహాయక బృందాలు వరద ముంపు ప్రాంతాలకు చేరుకోలేని పరిస్థితి. దీంతో చాలా చోట్ల సహాయక చర్యలు మొదలేకాలేదు. అతికష్టం మీద కొన్ని బృందాలు చేరుకుని జలమయమైన ఇళ్లలో బాధితుల కోసం అన్వేషణ మొదలుపెట్టాయి. నేలమట్టమైన భవనాలు, శిథిలాల కింద వెతికే కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. 30 వేలు దాటిన వలసలు వరద ధాటికి సర్వం కోల్పోవడంతో దాదాపు 30 వేల మంది స్థానికులు పొట్టచేత పట్టుకుని వేరే ప్రాంతాలకు వలసవెళ్లారని ఐక్యరాజ్యసమితికి చెందిన మైగ్రేషన్ ఏజెన్సీ తెలిపింది. అయితే ఈ సంఖ్య 40,000కుపైనే ఉంటుందని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్‌క్రాస్ సొసైటీ లిబియా ప్రతినిధి తమెర్ రమదాన్ అంచనావేశారు. రెండు ప్రభుత్వాల మధ్య నలిగి.. తూర్పు ప్రాంతంలో ఒక ప్రభుత్వం, మరో దిశలో ఇంకో ప్రభుత్వాల నిర్లక్ష్య ఏలుబడిలో ఉన్న లిబియాలో మౌలిక వసతుల కల్పన అరణ్యరోదనే అయ్యింది. ‘నగరంలో ఉన్న ఏకైక శ్మశానానికి తరలించేందుకు మృతదేహాలను ఒక దగ్గరకు చేరుస్తాం. ఈ జల విలయంలో 11 మంది కుటుంబసభ్యులను కోల్పోయి గుండెలవిసేలా రోది స్తున్న ఒకాయనను ఓదార్చడం ఎవరి తరం కావట్లేదు’ అని సహాయక బృంద సభ్యుడొకరు చెప్పారు. ‘ నా కుటుంబం మొత్తాన్నీ కోల్పోయా. వరదల్లో మా వాళ్ల మృతదేహాలు సముద్రం ఒడ్డుకు కొట్టుకొచ్చాయి’ అని అబ్దల్లా అనే వ్యక్తి వాపోయారు. రోడ్లలో పేరుకుపోయిన బురదను తొలగించేందుకు బుల్డోజర్లుతో రెండు రోజులుగా నిరంతరంగా పనిచేయిస్తున్నారు. అప్పుడుగానీ అత్యవసర సరుకుల్ని తరలించలేని దుస్థితి. వేరే పట్టణాలకు మృతదేహాల తరలింపు సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు జరిపించే పరిస్థితు లు డెర్నీ సిటీలో కరువవడంతో వందలాది మృతదేహా లను సమీపంలోని పట్టణాలకు తరలిస్తున్నారు. మరణించిన వారిలో 84 మంది ఈజిప్టువాసులూ ఉన్నారు. దక్షిణాన ఉన్న బెనీ సుయెఫ్ రాష్ట్రంలో ఎల్–షరీఫ్ గ్రామంలో డజన్లకొద్దీ ఈజిప్షియన్లు జలసమాధి అయ్యారు. డెర్నాలో భీతావహ దృశ్యం నగరంలో చాలా చోట్ల మృతదేహాలు కనపడుతు న్నాయి. బురదనీటిలో కూరుకుపోయి, వీధుల్లోకి కొట్టుకొచ్చి, సముద్ర తీరం వెంట.. ఇలా చాలా ప్రాంతాల్లో స్థానికులు విగతజీవులై కనిపించారు. ఒక్కసారిగా నీరు రావడంతో ఎటూ తప్పించుకోలేని నిస్సహాయక స్థితి. ‘నగరంలో ఏ ప్రాంతంలో సహాయం చేసేందుకు వెళ్లినా అక్కడ మాకు చిన్నారులు, మహిళల మృతదేహాలే కనిపిస్తున్నాయి’ అని బెంఘాజీకి చెందిన ఒక సహాయకుడు ఫోన్లో మీడియా సంస్థకు చెప్పారు. ‘సిటీ శివార్లలోని డ్యామ్ బద్దలైన శబ్దాలు మాకు వినిపించాయి. నగరం గుండా ప్రవహించే వాదీ డెర్నీ నదిలో ప్రవాహ ఉధృతి అమాంతం ఊహించనంతగా ఎగసి జనావాసాలను ముంచేసింది. ‘ డ్యామ్ బద్దలవడంతో ఏకంగా ఏడు మీటర్ల ఎత్తులో దూసుకొచ్చిన ప్రవాహం తన మార్గంలో అడ్డొచ్చిన అన్నింటినీ కూల్చేసింది’ అని లిబియాలో రెడ్ క్రాస్ కమిటీ ప్రతినిధి బృంద సారథి యాన్ ప్రైడెజ్ చెప్పారు. మధ్యధరా ప్రాంతంలో సన్నని తీరప్రాంతంలో పర్వత పాదాల చెంత ఈ నగరం ఉంది. పర్వతాల నుంచి వచ్చిన వరద నీరు నగరాన్ని ముంచేస్తూ తీరం వైపు కిందకు ఉరకలెత్తడంతో వరద తీవ్రత భయంకరంగా ఉంది. వరద ధాటికి దక్షిణం వైపు కేవలం రెండు రోడ్లు మాత్రమే మిగిలిపోయాయి. కూలిన వంతెనలు నగరం మధ్య భాగాన్ని రెండుగా చీల్చాయి. దీంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. గాయపడిన ఏడు వేలకుపైగా స్థానికులను మైదానాల్లోని తాత్కాలిక వైద్యశాలల్లో చికిత్సనందిస్తున్నారని తూర్పు లిబియాలోని అంబులెన్స్, అత్యవసర కేంద్రం అధికార ప్రతినిధి ఒసామా అలీ చెప్పారు. -
నాలుగు రోజుల గ్యాప్‌లో 6వేల మంది మృతి!
రెండూ ఆఫ్రికన్ దేశాలే. కానీ, ప్రకృతి ప్రకోపానికి తీరని నష్టంతో తల్లడిల్లిపోతున్నాయి. కేవలం నాలుగే రోజుల వ్యవధిలో.. ఈ రెండు దేశాల్లో ఆరు వేలమంది ప్రాణాలు పోయాయి. ఒకవైపు మొరాకోలో సంభవించిన భూ విలయం.. మరోవైపు లిబియాలో పోటెత్తిన జల విలయం.. వేల మందిని బలిగొనడమే కాకుండా.. ఊహించని స్థాయిలో ఇరు దేశాలకు నష్టం కలగజేశాయి. ఆఫ్రికా దేశం లిబియాలోని దెర్నా నగరాన్ని వరదలు ఒక్కసారిగా ముంచెత్తాయి. ఒక్క ఆ నగరంలో వరదల ధాటికి 2 వేల మందికిపైగా మృతి చెందారు. మిగతా అన్నిచోట్లా కలిపి మృతుల సంఖ్య వెయ్యికి పైనే ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ మరణాలు కాకుండా.. కొన్ని వేల మంది గల్లంతయ్యారు. 48 గంటలు గడిచినా వాళ్ల జాడపై ఇంకా స్పష్టత రాలేదు. జాడ లేకుండా పోయిన వాళ్ల సంఖ్య పదివేలకు పైనే ఉండొచ్చని అధికారిక వర్గాల అంచనా. అంటే.. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయని లిబియా ప్రధాని ఒసామా హమద్ చెబుతున్నారు. మధ్యధరా సముద్రంలో సంభవించిన డేనియల్ తుపాను.. లిబియాను అతలాకుతలం చేస్తోంది. తుపాను ధాటికి వారం రోజులుగా ఆ దేశంలో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. దెర్నా సహా ప్రధాన నగరాలను డిజాస్టర్ జోన్‌గా ప్రకటించారు. ఒక్కసారిగా డ్యామ్‌లు తెగిపోయి ఉప్పెన.. ఊళ్లను ముంచెత్తింది. జనాలు ఎటూ తప్పించుకోలేని పరిస్థితుల్లో ప్రాణాలు పొగొట్టుకున్నారు. దెర్నాలో అయితే వరద పెను విలయం సృష్టించింది. మరోవైపు విద్యుత్ లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపింది. తాగు నీరు, ఆహారం లేక ఆకలితో అలమటిస్తున్నట్లు వెల్లడించింది. దేశంలో మరికొన్ని రోజులపాటు భారీ వర్షాలు పడనున్నట్లు అక్కడి వాతావరణ శాఖ ప్రకటించడంతో.. జనం బిక్కుబిక్కమంటూ గడుపుతున్నారు. మొరాకోలో మృత్యుఘోష శుక్రవారం రాత్రి మొరాకోలో సంభవించిన భూకంపం.. 3 వేల మందికిపైగా ప్రజల ప్రాణాల్ని బలితీసుకుంది. సహయాక చర్యల్లో ఇంకా మృత దేహాలు బయటపడుతూనే ఉన్నాయి. దీంతో ప్రకృతి విలయం దాటిచ మృతుల సంఖ్య ఇంకా పెరిగేలా కనిపిస్తోంది. భూకంపం వచ్చి నాలుగు రోజులు గడుస్తుండడంతో.. బాధితులు సజీవంగా బయటపడతారన్న ఆశలు కనుమరుగైపోయాయని అధికారులు అంటున్నారు. మొరాకోలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మర్రాకేశ్‌కు నైరుతి దిశగా 71 కిలోమీటర్ల దూరంలో శుక్రవారం రాత్రి ఈ పెను విపత్తు సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రత నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భూకంపం ధాటికి అల్ హౌజ్, మర్రాకేశ్, క్వార్జాజేట్, అజిలాల్ సహా పలు ప్రాంతాలు వణికిపోయాయని తెలిపింది. దీంతో చాలా భవనాలు నేలమట్టం అయ్యాయి. -
విపత్తులు ఎదుర్కొనే యంత్రాంగం బలోపేతం
సాక్షి, అమరావతి: ప్రకృతి విపత్తులను సమర్థంగా ఎదుర్కొనే వ్యవస్థాగత యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేస్తోంది. ఇందుకోసం శాశ్వత ప్రాతిపదికన రాష్ట్ర విపత్తుల నిర్వహణ బలగాల (ఎస్డీఆర్ఎఫ్) ప్రధాన కేంద్రాన్ని ఏర్పాటుచేయనుంది. యుద్ధప్రాతిపదికన సహాయ, పునరావాస చర్యలు చేపట్టేందుకు అత్యాధునిక మౌలిక వసతులతో ఏర్పాటుచేసే ఈ ప్రధాన కేంద్రంలోనే శిక్షణా కేంద్రాన్ని కూడా నెలకొల్పనుంది. కృష్ణాజిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో 50 ఎకరాల్లో ఎస్డీఆర్ఎఫ్ ప్రధాన కేంద్రం, శిక్షణ కేంద్రం నిర్మాణానికి సవరించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (రివైజ్డ్ డీపీఆర్)ను ఖరారు చేసింది. ఈ మేరకు హోంశాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. రూ.99.73 కోట్లతో ప్రధాన కేంద్రం దేశంలో గుజరాత్ తర్వాత అతి పొడవైన సముద్రతీరం (దాదాపు 972 కి.మీ) ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంది. దీంతో ఏటా తుపాన్లు, వరదల ముప్పును రాష్ట్రం ఎదుర్కొంటోంది. విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను యుద్ధప్రాతిపదికన ఆదుకునేందుకు.. విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉండే వ్యవస్థను ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన జాతీయ విపత్తుల నిర్వహణ బలగాలు (ఎన్డీఆర్ఎఫ్), జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్ఐడీఎం)లతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఎస్డీఆర్ఎఫ్ ప్రధాన కేంద్రాలను కృష్ణాజిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో ఏర్పాటుచేయనున్నారు. ఇందుకోసం ఎన్డీఆర్ఎఫ్కు 50 ఎకరాలు, ఎన్ఐడీఎంకు 10 ఎకరాలు, ఎస్డీఆర్ఎఫ్కు 50 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఎస్డీఆర్ఎఫ్కు కేటాయించిన 50 ఎకరాల్లో ప్రధాన కేంద్రం, కమాండ్ కంట్రోల్ సెంటర్, శిక్షణ కేంద్రాలను నెలకొల్పుతారు. ఈ మేరకు ఎస్డీఆర్ఎఫ్ ప్రణాళికకు సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ప్రధాన కేంద్రంలో 154 మంది.. ఎస్డీఆర్ఎఫ్ ప్రధాన కేంద్రంలో 154 మంది అధికారులు, సిబ్బందిని నియమించాలని నిర్ణయించారు. వీరిలో పర్యవేక్షణ స్థాయి ఉన్నతాధికారులు నలుగురు ఉంటారు. అలాగే, రెండు రెస్క్యూ టీమ్‌లలో అత్యవసర సేవలు అందించే అధికారులు, సిబ్బంది 94 మంది ఉండనున్నారు. అదేవిధంగా క్వార్టర్ మాస్టర్ గ్రూప్ సభ్యులు 15 మంది, కమాండ్ కంట్రోల్ సెంటర్ అధికారులు, సిబ్బంది 8 మంది, రవాణా విభాగం అధికారులు, సిబ్బంది 15 మంది, ప్రధాన కేంద్రంలోని ఆరోగ్య కేంద్రంలో వైద్య అధికారులు ఇద్దరు, ఫార్మసిస్టులు నలుగురు, మినిస్టీరియల్ సిబ్బంది 12 మంది ఉంటారు. ఆధునిక మౌలిక వసతులతో.. తుపాన్లు, వరదలు, ఇతర విపత్తులు సంభవించినప్పుడు సమర్థంగా రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించేందుకు ఆధునిక మౌలిక వసతులను ఎస్డీఆర్ఎఫ్కు సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.65 కోట్లతో ప్రతిపాదనలకు సూత్రప్రాయంగా ఇప్పటికే ఆమోదం తెలిపింది. రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించేందుకు ఎస్డీఆర్ఎఫ్ ప్రధాన కేంద్రంలో 309 అధునాతన పరికరాలను రూ.21.74 కోట్లతో కొనుగోలు చేయనున్నారు. అలాగే, రూ.39 కోట్ల వ్యయంతో వాహనాలను కూడా కొంటారు. ఇక కమాండ్ కంట్రోల్ సెంటర్ కోసం రూ.77 లక్షలతో కంప్యూటర్లు, జీపీఎస్ ట్రాకర్లు, ఇతర సాంకేతిక పరికరాలను కొనుగోలు చేస్తారు. అలాగే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమాచారాన్ని అనుసంధానించేందుకు అధునాతన సాంకేతిక, సమాచార పరికరాలను రూ.1.50 కోట్లతో కొంటారు. అదేవిధంగా శిక్షణ కేంద్రంలో 10 రకాల శిక్షణ అందించేందుకు రూ.2 కోట్లతో పరికరాలను కొనుగోలు చేస్తారు. -
ప్రకృతి వైపరీత్యాలతో 2,038 మంది మృతి
న్యూఢిల్లీ: దేశంలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రుతుపవనాల కారణంగా సంభవించిన వరదలు, పిడుగులు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 2,038 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర హోం శాఖ తెలిపింది. ఇందులో అత్యధికంగా బిహార్‌లో 518 మంది, ఆ తర్వాతి స్థానంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్‌లో 330 మంది చనిపోయారని వివరించింది. ఏప్రిల్ 1–ఆగస్ట్ 17వ తేదీ మధ్య కాలంలో వర్షాలు, వరదలకు సంబంధించిన ఘటనల్లో 101 మంది జాడ తెలియకుండా పోగా 1,584 మంది గాయపడినట్లు పేర్కొంది. వర్షాలు, కొండచరియలు విరిగిపడటం, పిడుగుపాటు ఘటనలతో 335 జిల్లాలు ప్రభావితమైనట్టు తెలిపింది. -
ప్రకృతి హిత జీవనమే పరిష్కారం
ప్రపంచ వ్యాప్తంగా అనేక చోట్ల భారీ వరదలు వచ్చి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించడం సాధారణ దృశ్యం అయ్యింది. ఇందుకు నానాటికీ పెరిగి పోతున్న కాలుష్యమే అసలు కారణం. ఈ కాలుష్యానికి అభివృద్ధి పేరుతో మానవుడు సాగిస్తున్న ప్రకృతి విధ్వంసమే హేతువని సైన్స్ చెబుతోంది. భూ స్వరూపాలను ఇష్టమొచ్చినట్లు మార్చడం, పేరాశతో సహజవనరులను విచక్షణారహితంగా వినియోగించడం, ప్రకృతి నియమాలకు ఎదురీదాలని ప్రయత్నించడం నేటి కరువులకూ, వరదలకూ అసలైన కారణాలని అధ్యయనాలు చెబుతున్నాయి. సహజ ప్రకృతి నియమాలకు అనుగుణంగా మనిషి జీవించడం ఒక్కటే ప్రకృతి విపత్తుల నుంచి బయటపడడానికి ఉన్న ఏకైక పరిష్కారం. వాతావరణ మార్పులు, పెరుగుతున్న విపరీ తమైన వాతావరణ సంఘటన వల్ల గత 50 ఏళ్లుగా ప్రకృతి వైపరీత్యాలు పెరుగు తున్నాయి. ఇవి పేద దేశాలను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ), యూఎన్ ఆఫీస్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ సంస్థలు చెబుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వరదలు వస్తున్న వార్తలు ఇటీవల ఎక్కువగా చూస్తున్నాం. ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఒకే రోజు పడే వర్షం ఎక్కువగా ఉండడం వాతావరణంలో వచ్చిన మార్పుల పరిణామం. అందులో అనుమానం లేదు. వాతావరణంలో విపరీత మార్పులకు మానవ కార్యకలాపాల నుంచి ఉద్భవించిన కాలుష్య ఉద్గారాలు కారణం. కర్బన ఉద్గారాల వల్ల భూమి ఉష్ణోగ్రత పెరిగి, సముద్ర జలాలు, గాలి, మంచు వంటి వాటిమీద దుష్ప్రభావం పడుతోంది. వరదలు నివారించాలంటే కాలుష్యం తగ్గించడమే ఉత్తమమైన మార్గం. అంటే, మానవులు ఏర్పరచుకున్న ‘శక్తి’ వనరులలో తీవ్ర మైన, సత్వర మార్పులు చేస్తేనే కాలుష్యం తొందరగా తగ్గుతుంది. ఈ విధంగా చూస్తే వరదలకు ‘స్థానిక’ కారణాలు ఉన్నట్టు అనిపించదు. ఎందుకంటే, కాలుష్యం ఒక భౌగోళిక పరి ణామం కాబట్టి. చైనాలో వరదల బీభత్సం ఈ మధ్య ఎక్కువ అయ్యింది. ఈ ఏడాదే దాదాపు 3 కోట్ల మంది ప్రజలు వరదల బారిన పడ్డారు. బీజింగ్‌లో 2012లో సంభవించిన వరదల్లో 79 మంది ప్రాణాలు కోల్పోయిన తరువాత తీవ్రమైన వర్షాల నుంచి రక్షించడానికి చైనా ఇటీవలి సంవత్సరాల్లో బిలియన్ల డాలర్లను పెట్టుబడి పెట్టింది. అధ్యక్షుడు జిన్‌పింగ్ ‘స్పాంజ్‌ల వంటి నగరాలను‘ నిర్మించాలని పిలుపునిచ్చారు. మిద్దె తోటలు, నీరు ఇంకే ఫుట్‌పాత్‌లు, భూగర్భ నిల్వ ట్యాంకులు, ఇతర స్పాంజ్ లాంటి వ్యవస్థలను ఉపయోగించి భారీ వర్షపాతాన్ని ఇంకే విధంగా చేసి, తరువాత నెమ్మదిగా నదులు లేదా జలాశయాల్లోకి విడుదల చేయడం. చైనాలో వరదల నివారణకు ‘స్పాంజి’ నగరాల కార్యక్రమం చేపట్టినా ఫలితం కానరాలేదు. ప్రకృతి సహజంగా చేసే ‘స్పాంజి’ పని... మానవ నిర్మిత వ్యవస్థల ద్వారా సాధ్యం కాదు అని రుజువు అయ్యింది. భారత దేశంలో అనేక రాష్ట్రాలలో ఈ మధ్య కాలంలో ప్రతి ఏటా వరదలు వస్తున్నాయి. కోస్తా నగరాలైన ముంబాయి, చెన్నైల్లో వస్తున్న వరదలు అక్కడి భౌగోళిక పరిస్థితుల్లో తీవ్ర మార్పుల వల్ల సంభవిస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. బెంగళూరు, హైదరా బాద్ నగరాలలో చెరువులు, వరద నీటి కాలువలు, నదులు కబ్జా కావడం వల్ల వరదలు వస్తున్నాయి. 2023 జూలైలో లోక్‌సభలో కేంద్ర మంత్రి ఒక ప్రశ్నకు సమాధా నంగా ఇచ్చిన సమాచారం గమనించదగింది. ‘కేంద్ర జల కమిషన్’ ప్రకారం గత మూడేళ్లుగా (2020, 2021, 2022) దేశంలో 465 తీవ్ర మైన, అతి తీవ్రమైన వరదలు సంభవించాయి. ఈ సంవత్సరం కూడా వరదలు పెరిగాయి. 23 రాష్ట్రాలలో అత్యధికంగా బిహార్ (99), ఉత్తర ప్రదేశ్ (75), అసోం (60)లలో తీవ్రమైన, అతి తీవ్రమైన వరదలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో 18, తెలంగాణ లో 14 వచ్చాయి. ఈ ఏడు హిమాచలప్రదేశ్, హరియాణాల్లో తీవ్రమైన వరదలు వచ్చాయి. అయితే, సాధారణ వర్షాలకే వరదలు రావడానికి స్థానిక పరిస్థి తులే కారణం. అధిక వర్షాల సంగతి చెప్పనవసరం లేదు. వరదల తీవ్రత, నష్టం పెరగడానికి స్థానిక వనరుల విధ్వంసం ప్రధాన కారణం. నీటి వనరులైన నదులు, వాగులు, తటాకాల ‘సరిహద్దు లను’ మనం చెరిపేస్తే, వాటి సామర్థ్యం మనం రకరకాలుగా తగ్గిస్తే, నీరు ఒలుకుతుంది. చెరువులు, కుంటలు, వాగుల ఆక్రమణల వల్ల వాటి సామర్థ్యం తగ్గిస్తున్నాం. మన నెత్తి మీద పడి, మన కాళ్ళ కింద ప్రవహించే నీటిని ఒడిసిపట్టుకునే సహజ వ్యవస్థను ‘అభివృద్ధి’ పేరిట నాశనం చేసి, నీళ్ళ కొరకు పెద్ద ఆనకట్టలు కట్టి నీటి సరఫరా ‘సుస్థిరం’ చేసుకుంటున్నాం అనే భ్రమలో మనం ఇప్పటికీ ఉన్నాము. ఇక్కడ పడ్డ నీటిని వదిలిపెట్టి, ఎక్కడో వాటిని ఆపి, ఆ నీటిని పైపుల ద్వార సరఫరా చేస్తూ, విద్యుత్ వినియోగిస్తూ, అది ఆధునికతగా భావిస్తూ తరిస్తున్నాము. కాగా, ఈ అసహజ నీటి వ్యవస్థ కారణంగా ప్రకృతి దెబ్బతిని కుదేలు అయితే ఆ నష్టం భరి స్తున్నది ఎవరు? చిన్న ప్రవాహాలను నిర్లక్ష్యం చేసి, నదులుగా మారిన తరువాత అడ్డు కట్టలు కట్టి మనం ఉపయోగించే నీటికి ‘విలువ’ పెరుగుతుంది. ఎందుకంటే పెట్టుబడికి, నిర్వహణకు ఖర్చు అయ్యింది కనుక. ఈ ‘విలువ’ పెంచిన నీరు రకరకాల కారణాల వల్ల కొందరికే అందుతుంది. సామాజిక అసమానతలకు కారణం అవుతుంది. కొండల వెంబడి నీరు జాలువారడానికి అనువుగా ప్రకృతి ఏర్పరుచుకున్న దారులను మనం రోడ్ల కొరకు నాశనం చేస్తే, కొండ చరియలు పడడం చూస్తున్నాము. కొండలు, గుట్టల మీద సహజ కవ చంగా ఉండే చెట్లు, అడవి, గడ్డి తదితర పచ్చదనాన్ని మనం హరిస్తే మట్టి కొట్టుకుని పోయి, నీటి వేగానికి, ప్రవాహానికి ‘సహజ’ అడ్డంకులు ఉండవు. వరద నీరు తగ్గినప్పుడు ప్రభావిత ప్రాంత భూములలో సాధారణంగా పూడిక బురదతో నిండి ఉంటాయి. ఈ రకమైన అవ శేషాలు పోషకాలతో నిండి ఉండి ఆ ప్రాంతంలోని రైతులకు వ్యవ సాయానికి ప్రయోజనం చేకూర్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి అంతటా లేదు. కొన్ని చోట్ల వరద... ఉన్న సారవంతమైన భూమిని కోసేస్తే, ఇంకొక చోట ఇసుకను నింపుతున్నది. పట్టణాల నుంచి వచ్చిన వరద అనేక రకాల కలుషితాలను వదిలిపెడుతున్నది. కొండ ప్రాంతం నుంచి మైదానాలకు వచ్చే వరద బండ రాళ్ళు, చెట్టు కొమ్మలు, ఈ మధ్య కార్లు, మోటార్ సైకిళ్ళు, ఇండ్లు, ఇండ్ల గోడలు, సిమెంటు కట్టడాల అవశేషాలను కూడా తీసుకువస్తున్నది. వరద నీటిలో తమ ‘పాపాలను’ (వ్యర్ధాలు, కాలుష్య జలాలు) పడేసే పరిశ్రమలు కూడా ఉన్నాయి. పశువులు సాధారణంగా నీళ్ళలో ఈదగలవు. కాని, వేగంగా ప్రవహించే వరదలో చాల మటుకు అవి చనిపోతుంటాయి. అసలు పాడి పశువుల సంఖ్య తగ్గిపోతున్న క్రమంలో పశువుల మరణాల గురించి ఆలోచించేందుకు ఆధునిక సమాజం సిద్ధంగా లేదు. వరదలు చేసే ఆస్తి నష్టం వల్ల పేదలు ఇంకా పేదరికంలోకి నెట్టబడుతున్నారు. రోడ్లు, బ్రిడ్జిలు, పైపులైన్లు, విద్యుత్ స్తంభాలు తదితర ప్రజా ఆస్తులకు హాని కలిగి ప్రభుత్వ నిధుల మీద భారం పెరుగుతున్నది. వరదల నివారణకు భూమి వినియోగం మీద అధ్యయనం చాలా అవసరం. ప్రకృతిలో, భూమితో ముడిపడి ఉన్న నీటి సహజ చక్రా లను అర్థం చేసుకోవాలి. నదులు పుట్టే ప్రదేశంలో అర్థరహిత కాంక్రీ టికరణ చేటు చేస్తున్నది. గోదావరి నది పుట్టే నాసిక్ నగరంలో ఇట్లా చేసి నాలుక కరుచుకున్నారు. హైదరాబాద్‌కు నీటిని అందించే మూసీ నది పరివాహక ప్రాంతం, ముఖ్యంగా అనంతగిరి కొండలలో ఉన్న అడవి నాశనం వల్ల, కింది ప్రాంతాలలో వరద ముప్పు పెరుగు తున్నది. చెరువులు వరద నివారణకు ఉపయోగపడతాయి. కాని, వాటిని దుర్వినియోగపరుస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లో కొల్లేరు సరస్సు విధ్వంసం వల్ల చుట్టూ పరిసర ప్రాంతాలలో వరద ముప్పు పెరుగు తున్నది. తూర్పు కనుమల ద్వార ప్రవహించే అనేక నదులు బంగా ళాఖాతంలో కలుస్తాయి. కానీ, వాటి పరివాహక ప్రాంతంలో మైనింగ్ వల్ల, అడవుల నరికివేత వల్ల వరద ముప్పు పెరిగింది. శారద నది, రుషికుల్య తదితర నదులు మైదాన ప్రాంతాలలో, కోస్తాలో ప్రమా దకరంగా మారడానికి మానవ ప్రకృతి విధ్వంసకర కార్యకలాపాలే. ఇప్పటికైనా ప్రభుత్వాలు చేసిన, చేస్తున్న, చేయబోతున్న కార్య క్రమాలు, నిర్మాణాలను సమీక్ష చేసి, వరద నివారణకు, వరద ముప్పు తగ్గించటానికి సుస్థిర ప్రణాళికలు చేపట్టాలి. ఆలస్యం మరింత వినాశనానికి కారణమవుతుందనే సంగతి మరువరాదు. వ్యాసకర్త: దొంతి నరసింహారెడ్డి, విధాన విశ్లేషకులు 90102 05742 -
ఖర్చు తగ్గించుకోకుంటే ఎలా? నేటినుంచి మనమంతా భూమికి అప్పే!
ప్రపంచ దేశాల పర్యావరణ బడ్జెట్ బుధవారంతో పూర్తిగా ఖర్చయిపోయింది. గురువారం నుంచి భూమి అప్పుగా సమకూర్చేదే. కాస్త వింతగా అన్పించినా ఇది వాస్తవం. ఆర్థిక వనరులకు సంబంధించి వార్షిక బడ్జెట్లు, లోటు బడ్జెట్లు, అప్పులు ఉన్నట్టే పర్యావరణ వనరులకు కూడా బడ్జెట్ ఉంది. గ్లోబల్ ఫుట్‌ప్రింట్ నెట్వర్క్ తాజా అంచనా ప్రకారం.. ఆ బడ్జెట్ ఆగస్టు 2తో అయిపోయింది. అంటే.. భూగోళానికున్న పర్యావరణ వనరుల సామర్థ్యం (బయో కెపాసిటీ) అంతవరకేనన్నమాట. దీన్నే ‘వరల్డ్ ఎర్త్ ఆఫ్ షూట్ డే’అని పిలుస్తున్నారు. ఇక ఆగస్టు 3 నుంచి మనం వాడేదంతా భూమితన మూలుగను కరిగించుకుంటూ కనాకష్టంగాసమకూర్చే అప్పు (అదనపు వనరులు) మాత్రమే. 1.75 భూగోళాలు కావాలి గత ఏడాది ఈ పర్యావరణ బడ్జెట్ ఆగస్టు 1తోనే అంటే ప్రస్తుత ఏడాదితో పోల్చుకుంటే ఒకరోజు ముందే అయిపోయింది. ఈ ఏడాదిలో కొద్దోగొప్పో పర్యావరణ స్పృహ పెరగడంతో ఒక రోజు అదనంగా సమకూరిందన్నమాట. పర్యావరణ బడ్జెట్ 1971 వరకు భూగోళం ఇవ్వగలిగే పరిమితులకు లోబడే ఉండేదట. అంటే 365 రోజులూ లోటు లేకుండా ఉండేదని గ్లోబల్ ఫుట్‌ప్రింట్ నెట్వర్క్ అంచనా వేసింది. ఆ తర్వాత నుంచి క్రమంగా ప్రపంచవ్యాప్తంగా జనాభా పెర గడంతో పాటు వినియోగంలో విపరీత పోకడల వల్ల భూగోళంపై ఒత్తిడి పెరిగిపోయింది. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ కలిసి 175% మేరకు ప్రకృతి వనరులు వాడేస్తున్నాయి. అంటే.. మనకు అవసరమైన వనరులు సునాయాసంగా సమకూర్చాలంటే 1.75 భూగోళాలు కావాలన్నమాట. ఎక్కువ వ్యయం చేస్తున్న సంపన్న దేశాలు ప్రకృతి వనరుల వినియోగం అన్ని దేశాల్లో ఒకేలా ఉండదు. సంపన్న దేశాలు ఎక్కువ వనరులను ఖర్చు చేస్తున్నాయి. ఉదాహరణకు.. అమెరికా వాసుల మాదిరిగా ప్రకృతి వనరులను వాడితే 5.1 భూగోళాల పర్యావరణ సేవలు మనకు అవసరమవుతాయి. చైనీయుల్లా జీవిస్తే 2.4 భూగోళాలు కావాలి. ఇక ప్రపంచ పౌరులందరూ భారతీయుల్లా జీవిస్తే 0.8 భూగోళం చాలు. అంటే.. పర్యావరణ బడ్జెట్ 20% మిగులులోనే ఉంటుందన్న మాట. ఖతార్ బడ్జెట్ ఫిబ్రవరి 10నే ఖతం! ప్రపంచవ్యాప్తంగా తలసరి వార్షిక పర్యావరణ వనరుల సామర్ధ్యం (బయో కెపాసిటీ) 1.6 గ్లోబల్ హెక్టార్లు (బయో కెపాసిటీని, ఫుట్‌ప్రింట్ (ఖర్చు)ని ‘గ్లోబల్ హెక్టార్ల’లో కొలుస్తారు). దీనికన్నా ఖర్చు (ఫుట్‌ప్రింట్) ఎక్కువగా ఉంటే పర్యావరణ బడ్జెట్ అంత తక్కువ రోజుల్లోనే అయిపోతుంది. తక్కువ ఖర్చు చేస్తే ఎక్కువ రోజులు కొనసాగుతుంది. భారత్‌లో తలసరి వార్షిక పర్యావరణ బడ్జెట్ 1.04 గ్లోబల్ హెక్టార్లు. అంటే లభ్యత కన్నా ఖర్చు తక్కువగా (20% మిగులు బడ్జెట్) ఉందన్న మాట. ఇక అత్యంత సంపన్న ఎడారి దేశం ఖతార్ పర్యావరణ బడ్జెట్ ఫిబ్రవరి 10నే అయిపోవడం గమనార్హం. కెనడా, యూఏఈ, అమెరికాల బడ్జెట్ మార్చి 13తో, చైనా బడ్జెట్ మే 1తో అయిపోగా, ఆగస్టు 12న బ్రెజిల్, డిసెంబర్ 20న జమైకా బడ్జెట్లు అయిపోతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలన్నీ ఇందుకే.. వనరులు సమకూర్చే శక్తి భూగోళానికి లేకపోయినా మనం వాడుకుంటూనే ఉన్నాం కాబట్టే భూగోళం అతలాకుతలమైపోతోంది. ఎన్నడూ ఎరుగనంత ఉష్ణోగ్రతలు, కుండపోత వర్షాలు, కరువు కాటకాలు.. ఈ ప్రకృతి వైపరీత్యాలన్నీ మనం పర్యావరణ వనరులు అతిగా కొల్లగొడు తున్న దాని ఫలితమే. పర్యావరణ లోటు బడ్జెట్‌తో అల్లాడుతున్న భూగోళాన్ని స్థిమితపరిచి మన భవిష్యత్తును బాగు చేసుకోవాలంటే.. పర్యావరణ వార్షిక బడ్జెట్ 365 రోజులకు సరిపోవాలంటే.. మానవాళి మూకుమ్మడిగా జీవన విధానాన్ని మార్చుకోవాలి. వనరులను పొదుపుగా వాడాలి. ముఖ్యంగా ఐదు పనులు చేయాలి. పర్యావరణ హితమైన ఇంధనాలు వాడాలి. ఆహారోత్పత్తి పద్ధతులను పర్యావరణ హితంగా మార్చుకోవాలి. నగరాల నిర్వహణలో ఉద్గారాలు, కాలుష్యం తగ్గించుకోవాలి. భూగోళంపై ప్రకృతి వనరులకు హాని కలిగించని రీతిలో పారిశ్రామిక కార్యక్రమాలు చేపట్టాలి. అన్నిటికీ మించి వనరుల తక్కువ వినియోగానికి వీలుగా జనాభా పెరుగుదలను అదుపులో ఉంచుకోవాలి. – సాక్షి సాగుబడి డెస్క్ -
విపత్తుల నుంచి రక్షణ ఉందా ?
ఏటా వానాకాలంలో భారీ వర్షాల కారణంగా ఎదురయ్యే నష్టం భారీగా ఉంటోంది. ఎడతెరిపి లేకుండా 24 గంటల పాటు వర్షం పడితే పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు వరద నీటి మధ్య చిక్కుకుపోవడం గురించి వింటూనే ఉన్నాం. వాహనాలు నీట మునగడం, ఇంటికి నష్టం, మౌలిక సదుపాయాలు దెబ్బతినడం చూస్తూనే ఉన్నాం. చెరువులు తెగి, నదులు పొంగడం వల్ల గ్రామాల్లోనూ పంటలకు, ఇతరత్రా ఎంతో నష్టం వాటిల్లుతోంది. ఇదంతా ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎదురయ్యే పరిణామం. ఈ విషయంలో మనం పెద్దగా చేయగలిగేదేమీ ఉండదు. కాకపోతే ఒక్క చర్యతో విపత్తుల వల్ల ఎదురయ్యే ప్రతికూల పరిణామాల తాలూకు నష్టాన్ని పరిమితం చేసుకోవచ్చు. తగినంత బీమా కవరేజీ కలి్పంచుకోవడమే ఇందుకు ఉన్న ఏకైక మార్గం. సమగ్రమైన కవరేజీతో, అన్ని నష్టాలకూ రక్షణ కల్పించే విధంగా బీమా కవరేజీ ఉండాలి. ఇందుకు ఏం చేయాలన్నది తెలియజేసే కథనమే ఇది. కార్లకు బీమా ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాల వల్ల ఎదురయ్యే నష్టాన్ని భర్తీ చేసే వాహన బీమా పాలసీలు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. సమగ్రమైన కవరేజీతోపాటు, స్టాండర్డ్ పాలసీల్లో నచి్చంది తీసుకోవచ్చు. కాకపోతే కారుకు కాంప్రహెన్సివ్ బీమా పాలసీ తీసుకున్నామని చెప్పి నిశి్చంతంగా ఉండడానికి లేదు. వరద నీరు కారణంగా ఇంజన్‌కు నష్టం ఏర్పడితే ఈ పాలసీల్లో పరిహారం రాదు. టైర్లు పేలిపోవడం, వరదనీరు కారణంగా వాహనం నిలిచిపోయినా పరిహారం రాదు. ‘‘వరద నీటి వల్ల ఇంజన్ ఆన్ అవ్వకపోతే అందుకు కాంప్రహెన్సివ్ ప్లాన్‌లో కవరేజీ రాదు. అంతేకాదు విడిభాగాలు మార్చాల్సి వచి్చనా లేదా విడిభాగాలకు మరమ్మతులు చేయాల్సి వచి్చనా కానీ, తరుగుదలకు చెల్లింపులు చేయవు. అందుకని వాహనదారు తప్పనిసరిగా ఇంజన్ ప్రొటెక్షన్ కవర్, స్పాట్ అసిస్టెన్స్, డిప్రీసియేషన్ కవర్ తప్పకుండా తీసుకోవాలి’’అని ప్రోబస్ ఇన్సూరెన్స్ బ్రోకర్ డైరెక్టర్ రాకేశ్ గోయల్ సూచించారు. సాధారణంగా ఈ కవరేజీలు యాడాన్ లేదా రైడర్ రూపంలో అందుబాటులో ఉంటాయని, వాహన బీమాతోపాటు వీటిని కూడా తీసుకోవాలన్నారు. వ్యాధుల నుంచి రక్షణ వర్షా కాలంలో దోమల వల్ల, నీరు కలుషితం కావడం వల్ల, వైరస్ల కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. డెంగీ, మలేరియా, వైరల్ ఫీవర్, టైఫాయిడ్ జ్వరం, డయేరియా, చికున్ గునియా ముప్పు వర్షాకాలంలో ఎక్కువ. వీటి కారణంగా ఆసుపత్రిలో చేరితే రూ. వేలు, లక్షల బిల్లు చెల్లించుకోవాల్సి రావచ్చు. అందుకుని వెక్టార్ బోర్న్ డిసీజ్ ఇన్సూరెన్స్‌ను ప్రతీ కుటుంబం తప్పకుండా తీసుకోవడం మంచిది. ఈ కవరేజీ కింద దోమలు, ఇతర కీటకాలు, బ్యాక్టీరియా, వైరస్ కారణంగా వచ్చే వ్యాధులకు సైతం కవరేజీ లభిస్తుంది. ముఖ్యంగా డెంగీ, టైఫాయిడ్, మలేరియా రిస్క్ ఈ కాలంలో ఎక్కువ ఉంటుంది. సరైన చికిత్స తీసుకోకపోత వీటిల్లో ప్రాణ ప్రమాదం ఏర్పడొచ్చు. మనదేశంలో డెంగీ, మలేరియా మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఏటా లక్షలాది మంది వీటి బారిన పడుతున్నారు. ‘‘కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ లేని వారు, తప్పకుండా వెక్టార్ కేర్ ఇన్సూరెన్స్ కవరేజీని తమకు, తమ కుటుంబ సభ్యులకు తీసుకోవాలి. కీటకాల వల్ల ఎదురయ్యే అనారోగ్యం చికిత్సలకు పరిహారాన్ని ఇవి చెల్లిస్తాయి’’అని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ హెడ్ భాస్కర్ నెరుర్కార్ సూచించారు. కీటకాల వల్ల ఎదురయ్యే అనారోగ్యానికి చికిత్స పొందేందుకు ఎక్కువ మొత్తంలో ఖర్చు అయ్యే రిస్క్ ఉంటుంది. డెంగీ బారిన పడితే కోలుకునేందుకు 8–10 రోజులు పట్టొచ్చు. చికిత్సా ఖర్చు రూ. లక్షల్లో ఉంటుంది. మెట్రోల్లో రూమ్ రెంట్ రూ. లక్ష ఉంటుందని, ఒక్కసారి ప్లేట్లెట్లు ఎక్కించేందుకు రూ.40,000 తీసుకుంటున్నారని పాలసీబజార్ అంచనా. డెంగీ కారణంగా ప్లేట్లెట్లు పడిపోతే ఒకరికి ఒకటికి మించిన సార్లు ప్లేట్లెట్లు ఎక్కించాల్సి రావచ్చు. బీమా పరిశ్రమ ప్రత్యేకంగా వెక్టార్ కేర్ ఇన్సూరెన్స్, వెక్టార్ బోర్న్ హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఆఫర్ చేస్తున్నాయి. డెంగీ జ్వరం, మలేరియా, ఫైలేరియా, కాలా అజార్, చికెన్ గునియా, జపనీస్ ఎన్సెఫలైటిస్, జికా వైరస్‌లకు వీటిల్లో కవరేజీ ఉంటుంది. ఈ ప్లాన్ తీసుకున్న వారు జీవిత కాలంలో ఒక్కసారే క్లెయిమ్ చేసుకోగలరు. ‘‘మీ బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో వీటికి కవరేజీ లేకపోతే.. ఒక్కో వ్యాధికి విడిగా కవరేజీ తీసుకోవచ్చు. డెంగీ, మలేరియా ఈ రెండూ మన దేశంలో ఎక్కువగా వచ్చే వ్యాధులు. కనుక వీటికి కవరేజీ కలిగి ఉండడం ఎంతో అవసరం’’అని పాలసీ బజార్ హెల్త్ ఇన్సూరెన్స్ హెడ్ అమిత్ చాబ్రా సూచించారు. ఇంటికి బీమా వర్షాలు, వరదలకు ఇంటికి కూడా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. వడగండ్లు, పిడుగులతో కూడిన వర్షాలకు ఇంటి నిర్మాణం దెబ్బతినొచ్చు. కుండపోతకు ఇంటి పైకప్పుకు నష్టం కలగొచ్చు. అలాగే, ఎలక్ట్రిక్ వైరింగ్, ఇతర వస్తువులు, ఫరి్నచర్ దెబ్బతినడం వల్ల ఆరి్థక నష్టం ఎదురుకావచ్చు. అలాంటి పరిస్థితుల్లో హోమ్ ఇన్సూరెన్స్ ఎంతో ఆదుకుంటుంది. దురదృష్టవశాత్తూ మన దేశంలో హోమ్ ఇన్సూరెన్స్‌ను తీసుకుంటున్న వారు చాలా తక్కువ మందే ఉన్నారు. హౌస్ ఇన్సూరెన్స్ పట్ల అవగాహన లేకపోవడం, తప్పుడు అభిప్రాయాల కారణంగా మన దేశంలో దీని విస్తరణ చాలా నిదానంగా ఉందని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ రిటైల్ నాన్‌మోటార్ నేషనల్ హెడ్ గురుదీప్ సింగ్ పేర్కొన్నారు. అయితే హోమ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ముందు తెలుసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ‘‘ప్రకృతి విపత్తుల (యాక్ట్ ఆఫ్ గాడ్) కారణంగా వాటిల్లే నష్టానికి కవరేజీనే ఈ బీమా పాలసీలు ఆఫర్ చేస్తాయి. అలాగే, ఊహించని ఇతర ఉత్పాతాల వల్ల నష్టానికి కూడా రక్షణనిస్తాయి. ఏడాదికి మించిన కవరేజీని ఒకేసారి తీసుకోవడం వల్ల ప్రీమియంలో ఆదా చేసుకోవచ్చు. కాంప్రహెన్సివ్ హోమ్ కవర్ తీసుకోవాలి. దోపిడీ, దొంగతనం, వ్యక్తిగత ప్రమాద కవరేజీ, ఇల్ల దెబ్బతినడం వల్ల నష్టపోయే అద్దె ఆదాయాన్ని భర్తీ చేసే కవరేజీలు ఉండాలి. ఇంట్లోని ఖరీదైన పెయింటింగ్‌లు, ఆభరణాలకూ బీమా రక్షణ కలి్పంచుకోవాలి. థర్డ్ పార్టీ లయబిలిటీ కవరేజీని కూడా తీసుకోవాలి’’ అని గురుదీప్ సింగ్ సూచించారు. ఇంటి నవీకరణ, పునరి్నర్మాణ సమయంలో ఏవైనా మార్పులు చేసినట్టయితే, హోమ్ ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో కచి్చతమైన విలువను పేర్కొనాలని సింగ్ పేర్కొన్నారు. ‘‘మీ ఇల్లు దీర్ఘకాలం పాటు ఖాళీగా ఉంటే, హోమ్ ఇన్సూరెన్స్ కలిగి ఉండడం ఎంతో అవసరం. సరైన చిరునామా, ప్రాపర్టీ విలువ సరిగ్గా పేర్కొనడం వల్ల పాలసీదారు తన వంతు నష్టాన్ని భరించాల్సిన అవసరం లేకుండా నివారిస్తుంది’’ అని సింగ్ తెలిపారు. ఇంట్లోని వస్తువులకు బీమా కవరేజీ కోసం విడిగా ఒక్కో ఆరి్టకల్ వివరాలను పూర్తిగా పేర్కొనడం, వాటి విలువను కూడా నమోదు చేయడాన్ని మర్చిపోవద్దు. రీప్లేస్మెంట్ లేదా రీఇన్స్టేట్మెంట్ కవర్‌ను తీసుకోవాలి. ‘‘హోమ్ ఇన్సూరెన్స్ విభాగంలో మార్కెట్ వేల్యూ కవరేజీ లేదంటే రీఇన్స్టేట్మెంట్ కవరేజీ తీసుకోవచ్చు. మార్కెట్ వేల్యూ కవర్లో తరుగుదల పోను మీ ఇంటి విలువలో మిగిలిన మొత్తాన్ని పరిహారం రూపంలో పొందుతారు. రీఇన్స్టేట్మెంట్ కవర్లో ఇంటి పునర్నిర్మాణానికి అయ్యే ఖర్చుకు సమాన స్థాయిలో బీమా పరిహారం లభిస్తుంది. ఉదాహరణకు వరదలు వచ్చి ఇల్లు దెబ్బతింటే, అప్పుడు ఇంటిని తిరిగి నిర్మించుకోవాల్సి రావచ్చు. అటువంటి సందర్భాల్లో హౌస్ రీఇన్స్టేట్మెంట్ కవర్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది’’అని ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ అండర్‌రైటింగ్ చీఫ్ సంజయ్‌దత్తా వివరించారు. ఇవి ఉండేలా చూసుకోవాలి ► ఆటో బీమా: ఇంజన్ ప్రొటెక్షన్ కవర్, రోడ్‌సైడ్ అసిస్టెన్స్, ఇంజన్ ఆయిల్, నట్లు, బోల్టులు, గ్రీజులు, వాషర్లతో కూడిన కన్జ్యూమబుల్ రైడర్లను కూడా తీసుకోవాలి. ► హోమ్ ఇన్సూరెన్స్: రీప్లేస్మెంట్ కాస్ట్ క్లాజ్ ఉందేమో చూసుకోవాలి. ఇది ఉంటే అప్పుడు ఇంటి పునరి్నర్మాణానికి కావాల్సినంత బీమా సంస్థ చెల్లిస్తుంది. ఇంట్లోని విలువైన గ్యాడ్జెట్లు, ఆభరణాలు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు సైతం కవరేజీ ఉండాలి. మరమ్మతులు, ప్లంబింగ్, కార్పెంటరీ, పెస్ట్‌కంట్రోల్ కవరేజీ ఉందేమో చూడాలి. దాదాపు అన్ని రకాల నష్టాలకు పరిహారం ఇచ్చే సమగ్రమైన ప్లాన్‌ను తీసుకోవడమే సరైనది. ► వెక్టార్ బోర్న్ డిసీజ్: తమ హెల్త్ ఇన్సూరెన్స్‌లో వెక్టార్ బోర్న్ డిసీజ్‌కు కవరేజీ ఉందేమో చూసుకోవాలి. లేకపోతే విడిగా కొనుగోలు చేసుకోవాలి. విడిగా ఒక్కో వ్యాధి, దానికి ఉప పరిమితుల గురించి అడిగి తెలుసుకోవాలి. బీమా లేక భారీ నష్టం ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టం ఏ స్థాయిలో ఉంటుందో ఒక్కోసారి గణాంకాలను చూస్తే కానీ అర్థం కాదు. 2001 నుంచి ప్రకృతి విపత్తుల కారణంగా 85,000 మంది మరణించగా, వేలాది కోట్ల రూపాయల నష్టం ఏర్పడినట్టు ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక తాజాగా స్పష్టం చేసింది. హోమ్ ఇన్సూరెన్స్ కేవలం 8 శాతం మందే కలిగి ఉండడంతో, పెద్ద మొత్తంలో నష్టపోవాల్సి వచి్చనట్టు వాస్తవాన్ని గుర్తు చేసింది. 1900 నుంచి ప్రకృతి వైపరీత్యాల పరంగా అమెరికా, చైనా తర్వాత భారత్ మూడో అతిపెద్ద బాధిత దేశంగా ఉంది. మన దేశంలో 764 సహజ విపత్తులు సంభవించాయి. తుపానులు, వరదలు, భూకంపాలు, కొండ చరియలు విరిగి పడడం, కరువు ఈ జాబితాలో ఉన్నాయి. ముఖ్యంగా 1900 నుంచి 2000 మధ్య 361 పెద్ద వైపరీత్యాలు నమోదు కాగా, ఆ తర్వాత 22 ఏళ్లలో (2001–2022) 402 విపత్తులు చోటు చేసుకున్నాయి. అంటే గతంతో పోలిస్తే ప్రకృతి విపత్తులు పెరిగిపోయినట్టు ఈ గణాంకాలు పరిశీలిస్తే తెలుస్తోంది. ముఖ్యంగా 41 శాతం వైపరీత్యాలు వరదల కారణంగా సంభవించినవే ఉన్నాయి. ఆ తర్వాత తుపానుల వల్ల ఎక్కువ ప్రమాదాలు జరిగాయి. 2020లో వచి్చన వరదల కారణంగా రూ. 52,500 కోట్ల నష్టం వాటిల్లింది. కానీ, ఇందులో బీమా కవరేజీ ఉన్నది కేవలం 11 శాతం ఆస్తులకే కావడం వాస్తవం. ఇంటికి, ఆస్తులకు, ఆరోగ్యానికి, జీవితానికి బీమా ఎంత ముఖ్యమో ఈ గణాంకాలు కళ్లకు కడుతున్నాయి. -
Kaushal Shetty: పచ్చటి గూడుతో...
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు నిరాశ్రయులైన ప్రజల కోసం 27 సంవత్సరాల కౌశల్ శెట్టి ‘నోస్టోస్ హోమ్స్’ పేరుతో స్వచ్ఛందసంస్థను ప్రారంభించి దేశవ్యాప్తంగా సహాయక కార్యక్రమాలలో పాల్గొంటున్నాడు. నిరాశ్రయుల కోసం ఈ సంస్థ తేలికపాటి, ఈజీ ట్రాన్స్‌పోర్టబుల్ షెల్టర్స్‌ను రూపొందించింది... ‘అనుభవమైతేగానీ తత్వం బోధపడదు’ అంటారు. ‘తత్వం’ మాట ఎలా ఉన్నా కౌశల్ షెట్టికి ‘కర్తవ్యం’ బోధపడింది. షెట్టిదీ కర్నాటకలోని ఉడిపికి సమీపంలోని మది అనే గ్రామం. పచ్చదనానికి ఈ గ్రామం పర్ఫెక్ట్ అడ్రస్. అలాంటి పచ్చటి ఊరు కాస్తా ఘటప్రభ నది పొంగి పొర్లడంతో అల్లకల్లోలం అయింది. అంతెత్తు చెట్లు నిలువునా కూలి పోయాయి. పొలాలు మునిగిపోయాయి. ఇండ్లు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఇంట్లో ఉండలేని పరిస్థితి. దీంతో ప్రజలు తట్టాబుట్టా సర్దుకొని ఊరు విడిచి తోచిన దిక్కుకు వెళ్లారు. షెట్టి కుటుంబం ముంబైకి వెళ్లింది. ముంబైకి వెళుతున్నప్పుడు షెట్టి మనసు బాధతో నలిగిపోయింది. దీనికి కారణం...ఎటు పోవాలో తెలియక, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ ఊళ్లోనే ఉండిపోయిన ప్రజలు. సంవత్సరాలు గడుస్తున్నా ఆ బాధ తన నుంచి దూరం కాలేదు. ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదుకునే రోజుల్లో మరోసారి తుఫాను బీభత్సాన్ని, బాధితులు, నిరాశ్రయుల కష్టాలు, కన్నీళ్లను దగ్గర నుంచి చూశాడు. ‘ఇలా బాధ పడుతూ కూర్చోవడం తప్ప నేను ఏం చేయలేనా!’ అనుకున్నాడు షెట్టి. ఎన్నో రకాలుగా ఆలోచించిన తరువాత... తన స్నేహితుడు మాధవ్ దత్తో కలిసి ‘నోస్టోస్ హోమ్’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించాడు. ‘ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రతి సంవత్సరం వందలాది మంది ప్రజలు నిరాశ్రయులవుతున్నారు. అలాంటి వారికి నిలువ నీడ కల్పించడానికి మా సంస్థ ద్వారా కృషి చేస్తున్నాం’ అంటున్నాడు షెట్టి. తమ సంస్థ ట్రాన్స్‌పోర్టబుల్ హోమ్స్ గురించి చెబుతూ... ‘పర్సనల్ డిగ్నిటీ, ప్రైవసీతో కూడిన హోమ్స్ ఇవి’ అంటాడు షెట్టి. ‘నోస్టోస్ హోమ్’ సంస్థ అస్సాం, నాగాలాండ్ రాష్ట్రాలతో పాటు ఆఫ్రిక దేశాలలోనూ సేవలు అందిస్తోంది. కౌశల్ చేపట్టే సేవాకార్యక్రమాలకు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు లభిస్తున్నాయి. ‘తక్కువ సమయంలోనే బాధితులకు సహాయం అందించి నిరాశ్రయులకు అండగా నిలబడింది కౌశల్ బృందం. నిపుణుల సహాయంతో సౌకర్యాలు సమకూర్చారు’ అంటున్నాడు హాబిటాట్ ఫర్ హ్యూమానిటీ మలావి నేషనల్ డైరెక్టర్ కపీరా. ఇక షెట్టి భవిష్యత్ లక్ష్యం విషయానికి వస్తే... తన సేవాకార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలనుకుంటున్నాడు. మారుమూల ప్రాంతాలలో వైద్య సౌకర్యాల మెరుగుదల కోసం కృషి చేయాలనుకుంటున్నాడు. ‘నోస్టోస్ హోమ్’తో తొలి అడుగు వేసినప్పుడు ‘నిజంగా నేను చేయగలనా?’ అనే సందేహం షెట్టికి వచ్చేది. మంచి పని కోసం బయలు దేరినప్పుడు ఎన్నో ద్వారాలు మన కోసం తెరుచుకుంటాయి...అన్నట్లుగా షెట్టికి ఎంతోమంది ఎన్నో రకాలుగా సహాయం అందించారు. కొన్ని అడుగులు పడిన తరువాత శెట్టికి తనపై తనకు ఎంతో నమ్మకం వచ్చింది. ఆ నమ్మకమే మరిన్ని సేవాకార్యక్రమాలు చేపట్టాలనే లక్ష్యం నిర్దేశించుకోవడానికి కారణం అయింది. -
1950 నుంచే పెనుముప్పు శకం ఆరంభం
భూగోళంపై గతంలో ఎన్నడూ కనిపించని ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. కాలుష్యం, భూతాపం, వాతావరణ మార్పులు పెరిగిపోతున్నాయి. రుతువులు గతి తప్పుతున్నాయి. ఒకవైపు భీకర వర్షాలు, వరదలు, మరోవైపు నిప్పులు కక్కే ఎండలు సర్వసాధారణంగా మారాయి. మొత్తం పుడమి ఉనికిని ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. అయితే, మానవుల నిర్వాకం వల్ల భూమిపై అవాంఛనీయ ఈ పరిణామం ఎప్పుడు మొదలైందో తెలుసా? 1950 నుంచి 1954 మధ్య మొదలైందని ‘ఆంథ్రోపొసీన్ వర్కింగ్ గ్రూప్’ సైంటిస్టులు గుర్తించారు. భూమాతను ప్రమాదంలోకి నెట్టివేసే కొత్త శకానికి అదొక ఆరంభమని అంటున్నారు. ఈ పరిణామానికి ఆంథ్రోపొసీన్ అని నామకరణం చేశారు. మనిషి, నూతన అనే అర్థాలున్న గ్రీక్ పదాలతో ఈ కొత్త పదం ఏర్పడింది. మొదట దీనిని 2000 సంవత్సరంలో పాల్ క్రట్జెన్, యూగీన్ స్టార్మర్ అనే శాస్త్రవేత్తలు ఉపయోగించారు. దీనిని ప్రస్తుత ‘జియోలాజికల్ టైమ్ ఇంటర్వెల్’గా పరిగణిస్తున్నారు. ‘ఆంథ్రోపొసీన్ వర్కింగ్ గ్రూప్’ సైంటిస్టులు ఇంకా ఏం చెప్పారంటే.. ► ఆంథ్రోపొసీన్లో భాగమైన పరిణామాలు, మార్పులు 1,000 లేదా అంతకంటే ఎక్కువ కాలం కొనసాగుతాయి. ► ఇవి మొత్తం భూమి ఆవరణ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. కొన్ని మార్పులు ప్రభావం భూమిపై శాశ్వతంగా ఉంటుంది. ► శిలాజ ఇంధనాల వాడకం, అణ్వాయుధాలను ఉపయోగించడం, పొలాల్లో రసాయన ఎరువుల విచ్చలవిడి వినియోగం, భూమితోపాటు నదులు, చెరువుల్లో ప్లాస్లిక్ వ్యర్థాలు పెరగడం వంటివి ఆంథ్రోపొసీన్‌కు కారణమవుతున్నాయి. ► మానవుల చర్యల భూమికి జరుగుతున్న నష్టం అనూహ్యంగానే ఉందని, ఈ నష్టం రానురాను మరింత పెరుగుతుందని యూనివర్సిటీ ఆఫ్ లీసెస్టర్‌కు చెందిన జియాలజిస్ట్ కోలిన్ వాటర్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ► సుమారు 6.6 కోట్ల సంవత్సరాల క్రితం బలమైన గ్రహ శకలాలు భూమిని ఢీకొట్టడం వల్ల రాక్షస బల్లులు అంతరించిపోయాయి. ఇప్పుడు మానవ చర్యలు సైతం అదే కేటగిరీకి సమానంగా ఉన్నాయి. 1950వ దశకం తర్వాత భూగోళంపై ఎన్నో రకాల జీవులు అంతరించిపోయాయి. ► గ్రహ శకలాలు ఢీకొట్టడం అనేది ఒక కొత్త శకానికి దారితీసింది. మనుషుల కార్యకలాపాలు కూడా భూమిపై కొత్త శకానికి నాంది పలికాయి. ► ఇప్పటికైనా మేల్కొని నష్ట నివారణ చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో మరిన్ని తీవ్ర పరిణామాలు తలెత్తుతాయనడంలో సందేహం లేదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
డేంజర్లో ఉన్నామా?.. సైంటిస్టుల షాకింగ్ రిపోర్ట్..
లండన్: శిలాజ ఇంధనాల వాడకం, కాలుష్యం, వాతావరణ మార్పులు, ఉష్ణోగ్రతల పెరుగుదల, ప్రకృతి విపత్తులు.. వీటి గురించి తరచుగా వింటూనే ఉన్నాం. అయినప్పటికీ ప్రపంచ దేశాలు నష్టనివారణ చర్యలు చేపట్టిన దాఖలాలు మాత్రం పెద్దగా కనిపించడం లేదు. ప్రమాదకరమైన గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారం గరిష్ట స్థాయికి చేరినట్లు తాజా నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిఏటా వెలువడుతున్న గ్రీన్‌హౌజ్ వాయువులు 54 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్తో సమానమని తెలియజేసింది. ప్రపంచవ్యాప్తంగా 50 మంది అగ్రశ్రేణి శాస్త్రవేత్తలు భూ ఉష్ణోగ్రతలపై విస్తృత అధ్యయనం నిర్వహించి, ఉమ్మడిగా నివేదిక విడుదల చేశారు. మానవ చర్యలు, గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారం భూతాపం, వాతావరణ మార్పులకు కారణమవుతున్నట్టు పేర్కొన్నారు. జీవజాలానికి ఇన్నాళ్లూ ఆవాసయోగ్యంగా ఉంటూ వస్తున్న భూగోళం క్రమంగా అగ్నిగుండంగా మారిపోతోందని హెచ్చరించారు. సైంటిస్టులు తమ నివేదికలో ఇంకా ఏం చెప్పారంటే.. ► 1800వ సంవత్సరంతో పోలిస్తే భూఉపరితల ఉష్ణోగ్రతలు ఇప్పుడు 1.14 డిగ్రీలు పెరిగాయి. ► ఉష్ణోగ్రత ప్రతి పదేళ్లకు రికార్డు స్థాయిలో 0.2 డిగ్రీల చొప్పున పెరుగుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే భూతాపం మానవాళిని కబళించడం ఖాయం. ► గతంతో పోలిస్తే ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. ► ప్రపంచవ్యాప్తంగా శిలాజ ఇంధనాల వాడకాన్ని యథాతథంగా కొనసాగిస్తే భూ ఉపరితల ఉష్ణోగ్రత సమీప భవిష్యత్తులోనే 2 డిగ్రీలు పెరిగిపోతుంది. ఇది చాలా ప్రమాదకరం. ► పారిశ్రామిక విప్లవం ముందునాటి సగటు కంటే ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీలకు మించి పెరగనివ్వరాదన్న పారిస్ ఒప్పంద లక్ష్యాన్ని సాధించడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా కృషి చేయాలి. మునుపెన్నడూ లేనిస్థాయిలో తక్షణమే పటిష్టమైన చర్యలు చేపట్టాలి. ► భూతాపం ముప్పు నుంచి మానవళి బయటపడాలంటే 2035 నాటికి ప్రపంచదేశాలు తమ గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారాలను 60 శాతానికి తగ్గించుకోవాలని సైంటిస్టు పియర్స్ ఫాస్టర్ చెప్పారు. -
Turkey and Syria Earthquake: బాల్యం శిథిలం
అమ్మ పొత్తిళ్లలో హాయిగా పడుకోవాల్సిన అభం శుభం తెలియని పసికందులు అందరినీ కోల్పోయి అనాథలుగా మారుతున్నారు. ఎందుకీ విపత్తు ముంచుకొచ్చిందో తెలీక నిలువ నీడ లేక ఎందుకు రోడ్లపైకొచ్చామో అర్థం కాక బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. తుర్కియే, సిరియాల్లో సంభవించిన భారీ భూకంపం ఎందరో చిన్నారుల్ని అనాథల్ని చేసింది. వీరిలో చాలా మంది రోజుల పసికందులే. ఇప్పటికే అంతర్యుద్ధంతో అల్లాడిపోతున్న సిరియాలో భూకంపం పిల్లల నెత్తిన పిడుగుపాటులా మారింది. ప్రకృతి వైపరీత్యాలు, అధికార కాంక్షతో మానవులు చేస్తున్న యుద్ధాలు చిన్నారులకు ఎలా శాపంగా మారుతున్నాయి..? తుర్కియే భూకంపంలో శిథిలాల మధ్యే ఒక పసిపాప భూమ్మీదకొచ్చింది. బిడ్డకి జన్మనిచ్చిన ఆ తల్లి ప్రాణాలు కోల్పోవడంతో పుడుతూనే అనాథగా మారింది. అయా (అరబిక్ భాషలో మిరాకిల్) అని పేరు పెట్టి ప్రస్తుతానికి ఆస్పత్రి సిబ్బందే ఆ బిడ్డ ఆలనా పాలనా చూస్తున్నారు. ఈ రెండు దేశాల్లో సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉంటే ఎక్కువగా పిల్లలే శిథిలాల కింద నుంచి ప్రాణాలతో బయటకి వస్తున్నారు. 10 రోజుల నుంచి 14 ఏళ్ల వయసున్న వారి వరకూ ప్రతీ రోజూ ఎందరో పిల్లలు ప్రాణాలతో బయటకి వస్తున్నారు. వారంతా తల్లిదండ్రులు, బంధువుల్ని కోల్పోయి అనాథలుగా మారడం ఆందోళన కలిగిస్తోంది. ఈ చిన్నారులకు అండగా యునిసెఫ్ బృందం తుర్కియే చేరుకుంది. తుర్కియేలో 10 ప్రావిన్స్‌లలో 46 లక్షల మంది చిన్నారులపై ప్రభావం పడిందని యూనిసెఫ్ అధికార ప్రతినిధి జేమ్స్ ఎల్డర్ చెప్పారు. సిరియాలో బాలల దురవస్థ పన్నెండేళ్లుగా అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న సిరియాలో ఇప్పటికే చిన్నారులు దారుణమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. యుద్ధ వాతావరణంలో గత పదేళ్లలో సిరియాలో 50 లక్షల మంది జన్మిస్తే వారిలో మూడో వంతు మంది మానసిక సమస్యలతో నలిగిపోతున్నారు. బాంబు దాడుల్లో ఇప్పటికే 13 వేల మంది మరణించారు. పులి మీద పుట్రలా ఈ భూకంపం ఎంత విలయాన్ని సృష్టించిందంటే 25 లక్షల మంది పిల్లల జీవితాలను అల్లకల్లోలం చేసినట్టుగా యూనిసెఫ్ అంచనా వేస్తోంది. ఇంతమందికి సరైన దారి చూపడం సవాలుగా మారనుంది. పిల్లల భవిష్యత్తుకి చేయాల్సింది ఇదే.! ప్రపంచవ్యాప్తంగా చిన్నారుల విద్య, సంక్షేమం కోసం కృషి చేసే ఐక్యరాజ్యసమితి సంస్థ యునిసెఫ్ ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు జరిగే ప్రాంతాలు, కరువు, పేదరికం ఎదుర్కొనే దేశాల్లో పిల్లలకి భద్రమైన భవిష్యత్ కోసం కొన్ని మార్గదర్శకాలు నిర్దేశించింది... ► ప్రభుత్వాలు యూనివర్సల్ క్యాష్ బెనిఫిట్ స్కీమ్‌లతో పిల్లలకు ప్రతి నెలా ఆదాయం వచ్చేలా చూడాలి. ► శరణార్థులు సహా అవసరంలో ఉన్న పిల్లలందరికీ సామాజిక సాయం అందేలా చర్యలు చేపట్టాలి. ► ప్రకృతి వైపరీత్యాల ముప్పున్న ప్రాంతాలతో పాటు , ఇతర ఘర్షణాత్మక ప్రాంతాల్లో సంక్షేమ వ్యయాన్ని వీలైనంత వరకు పరిరక్షించాలి. ► పిల్లల చదువులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వారు బడి బాట పట్టేలా చర్యలు తీసుకోవాలి. ► మాత శిశు సంరక్షణ, పోషకాహారం అందించడం. ► బాధిత కుటుంబాలకు మూడు పూటలా కడుపు నిండేలా నిత్యావసరాలపై ధరల నియంత్రణ ప్రవేశపెట్టాలి. చిన్నారులపై పడే ప్రభావాలు ► ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి విపత్తులతో ప్రభావానికి లోనయ్యే పిల్లల సంఖ్య సగటున ఏడాదికి 17.5 కోట్లుగా ఉంటోందని యునెస్కో గణాంకాలు చెబుతున్నాయి. ► ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలతో ఒంటరైన పిల్లలు ఎన్నో శారీరక, మానసిక సమస్యలు ఎదుర్కొంటారు. కుటుంబానికి దూరంగా ఉండడం వల్ల వారిలో పెరుగుదల ఆరోగ్యంగా ఉండదు. ఇలా ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న వారు పుట్టకొకరు చెట్టుకొకరుగా మారిన పిల్లల్లో 18% వరకు ఉంటారు. ► 50% మంది పిల్లలు మానసిక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. భూకంపం వంటి ముప్పులు సంభవించినప్పుడు గంటల తరబడి శిథిలాల మధ్య ఉండిపోవడం వల్ల ఏర్పడ్డ భయాందోళనలు వారిని చాలా కాలం వెంటాడుతాయి. ► సమాజంలో ఛీత్కారాలు దోపిడీ, దూషణలు, హింస ఎదుర్కొంటారు. బాలికలకు ట్రాఫికింగ్ ముప్పు! ► తుఫాన్లు, వరదలు, భూకంపాల వల్ల ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల పిల్లలు బాల కార్మికులుగా మారుతున్నారు. ► 2021లో ప్రకృతి వైపరీత్యాలు, ఉక్రెయిన్ వంటి యుద్ధాల కారణంగా 3.7 కోట్ల మంది పిల్లలు చెట్టుకొకరు పుట్టకొకరుగా మారారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సంక్షోభంలో పాక్
ఇస్లామాబాద్: చుక్కలనంటుతున్న నిత్యావసరాల ధరలు. తీర్చలేని రుణ భారం. నానాటికీ పతనమవుతున్న కరెన్సీ విలువ. తీవ్ర రూపు దాలుస్తున్న కరెంటు కొరత. పులి మీద పుట్రలా పడ్డ ప్రకృతి విలయాలు... ఇలా ఎటు చూసినా సమస్యలతో పొరుగు దేశం పాకిస్తాన్ నానాటికీ పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. మరో శ్రీలంకలా మారకముందే ఏదోలా సమస్య నుంచి బయట పడే మార్గాల వెదుకులాటలో పడింది. ఆపద నుంచి గట్టెక్కించకపోతారా అని అంతర్జాతీయ ద్రవ్య నిధి తదితరాల వైపు ఆశగా చూస్తోంది... పాకిస్తాన్లో నానాటికీ తీవ్ర రూపు దాలుస్తున్న ఆర్థిక సంక్షోభానికి అడ్డుకట్ట వేసేందుకు షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది. దేశ మొత్తం దిగుమతుల్లో ఇంధన బిల్లుదే పెద్ద వాటా. ప్రస్తుతం విదేశీమారక నిల్వలు 11.7 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. దేశ మొత్తం దిగుమతి అవసరాలను తీర్చడానికి ఇవి మరో నెల రోజులు మాత్రమే సరిపోతాయి. ఈ నేపథ్యంలో ఇంధన పొదుపు కోసం ప్రభుత్వం తక్షణం రంగంలోకి దిగి పలు చర్యలు చేపట్టింది. మార్కెట్లన్నీ రాత్రి 8.30కల్లా మూసేయాలంటూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఫంక్షన్ హాళ్లు, రెస్టారెంట్లు కూడా పదింటికల్లా మూతబడాల్సిందేనని తేల్చి చెప్పింది. షాపింగ్ మాల్స్ కూడా ముందుగానే మూతపడుతున్నాయి. ‘ఇంధన పొదుపు’ లక్ష్యంతో మంగళవారం కేంద్ర కేబినెట్ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాలన్నీ తక్షణం అమల్లోకి వస్తాయని పాక్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ అసిఫ్ వెల్లడించారు. రూ.6,200 కోట్ల ఆదాయే లక్ష్యం... పాక్‌లో విద్యుదుత్పాదన చాలావరకు చమురు ఆధారితమే. చమురు దిగుమతులపై ఏటా 300 కోట్ల డాలర్ల దాకా ఖర్చు పెడుతోంది. తాజా చర్యల ఉద్దేశం ఈ వ్యయాన్ని వీలైనంత తగ్గించడమే. అంతేగాక ప్రభుత్వ శాఖల్లో కూడా విద్యుత్ వాడకాన్ని కనీసం 30 శాతం తగ్గించడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని అధికారులు వెల్లడించారు. దీనివల్ల మొత్తమ్మీద 6,200 కోట్ల రూపాయలు ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు. వీటితో పాటు ఉద్యోగులు వీలైనంత వరకూ ఇంటి నుంచి పని చేసేలా చూడాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. నాసిరకపు విద్యుత్ బల్బుల తయారీ తదితరాలపై త్వరలో నిషేధం కూడా విధించనున్నారు. అయితే, ప్రభుత్వ తాజా నిర్ణయంపై దుకాణదారులు, ఫంక్షన్ హాల్స్, మాల్స్ యజమానులు గగ్గోలు పెడుతున్నారు. కరోనాతో రెండేళ్లకు పైగా సతమతమై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తమ పాటిల ఇది పిడుగుపాటు నిర్ణయమేనని, దీన్ని తక్షణం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాత్రి పొద్దుపోయేదాకా షాపింగులు, రెస్టారెంట్లలో డిన్నర్లు పాకిస్తానీలకు రివాజు. ప్రభుత్వ నిర్ణయంపై వారినుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. 600 కోట్ల డాలర్ల రుణం! మరోవైపు ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడేందుకు ఐఎంఎఫ్ నుంచి కనీసం 600 కోట్ల డాలర్ల తక్షణ రుణం సాధించేందుకు పాక్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గత ఆగస్టులో ఐఎంఎఫ్ నుంచి పాక్ 110 కోట్ల డలర్ల రుణం తీసుకుంది. గత వేసవిలో విరుచుకుపడ్డ ఆకస్మిక వరదలు దేశాన్ని అతలాకుతలం చేసి వదిలాయి. వాటివల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు ఏకంగా 4,000 కోట్ల డాలర్ల మేర నష్టం వాటిల్లిందని అంచనా. -
గుజరాత్‌పై కుట్రలు
భుజ్: గుజరాత్ వరుస ప్రాకృతిక విపత్తులతో అల్లాడుతున్న సమయంలో రాష్ట్రాన్ని దేశంలోనే గాక అంతర్జాతీయంగా కూడా అప్రతిష్టపాలు చేసి పెట్టుబడులు రాకుండా చేసేందుకు చాలా కుట్రలు జరిగాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ వాటన్నింటినీ అధిగమించి పారిశ్రామికంగా, ఇతరత్రా కూడా రాష్ట్రం అద్భుతంగా పురోగమించిందని కొనియాడారు. రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా ఆదివారం కచ్ జిల్లాలో రూ.4,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేశారు. అనంతరం ర్యాలీని ఉద్దేశించి మాట్లాడారు. ‘‘2001 కచ్ భూకంపం మాటకందని విషాదం. ఆ విలయాన్ని అవకాశంగా మార్చుకుని కచ్‌ను పునర్నిర్మించుకుంటామని అప్పుడే చెప్పాను. దాన్నిప్పుడు సాధించి చూపించాం. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద టెక్స్టైల్ ప్లాంట్, ఆసియాలో తొలి సెజ్ తదితరాలకు కచ్ వేదికైంది. దేశ రవాణాలో 30 శాతం ఇక్కడి కాండ్లాం, ముంద్రా పోర్టుల గుండానే జరుగుతోంది. దేశానికి కావాల్సిన ఉప్పు 30 శాతం కచ్‌లోనే తయారవుతోంది’’ అని మోదీ చెప్పారు. ‘‘భూకంపం వచ్చినప్పుడు నేను గుజరాత్ సీఎంను కాను. సాధారణ బీజేపీ కార్యకర్తను. రెండో రోజే కచ్ చేరుకుని సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నా’’ అని గుర్తు చేసుకున్నారు. భూకంపానికి బలైన 13 వేల మందికి స్మృత్యర్థం నిర్మించిన రెండు స్మారకాలను ప్రారంభించారు. ఆ సమయంలో అనేక భావాలు తనను ముప్పిరిగొన్నాయని చెప్పారు. స్మృతి వన్ స్మారకాన్ని అమెరికా ట్విన్ టవర్స్ స్మారకం, జపాన్‌లోని హిరోషిమా స్మారకంతో పోల్చారు. ఇలాంటి అనుభవాల నేపథ్యంలో విపత్తు నిర్వహణ చట్టం తెచ్చిన తొలి రాష్ట్రంగా గుజరాత్ నిలిచిందని చెప్పారు. దాని స్ఫూర్తితోనే కేంద్ర స్థాయిలో అలాంటి చట్టం వచ్చిందన్నారు. అవగాహన పెరగాలి పౌష్టికాహార లోపాన్ని రూపుమాపాలని, నీటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన మరింత పెరగాలని మోదీ అన్నారు. ఈ దిశగా పోషన్ అభియాన్, జల్ జీవన్ మిషన్ బాగా పని చేస్తున్నాయని చెప్పారు. సెప్టెంబర్‌ను పౌష్టికాహార నెలగా జరుపుకుంటున్నట్టు గుర్తు చేశారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. 2023ను అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా జరుపుకోవాలన్న భారత ప్రతిపాదనకు ఐరాస అంగీకరించడాన్ని గుర్తు చేశారు. ‘‘ఏళ్లుగా విదేశీ అతిథులకు మన తృణధాన్యపు వంటకాలను రుచి చూపిస్తూ వస్తున్నా. వారంతా వాటి రుచిని ఎంతో ఆస్వాదించారు. ముడి ధాన్యం అనాది కాలం నుంచి మన సాగులో, సంస్కృతితో, నాగరికతలో భాగం’’ అన్నారు. ఈసారి పంద్రాగస్టు ఉత్సవాలను దేశ ప్రజలంతా గొప్ప జోష్‌తో జరుపుకున్నారంటూ హర్షం వెలిబుచ్చారు. లెక్కలేనన్ని వైరుధ్యాలు, వైవిధ్యాలున్న ఇంత పెద్ద దేశం తాలూకు సమష్టి శక్తి ఎంత బలవత్తరమైనదో ప్రపంచానికి చూపారన్నారు. స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ దేశంలో మూలమూలలా అమృత ధార పారుతోందన్నారు. ఈశాన్య భారతం వంటి మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ వ్యాప్తి కొత్త వెలుగులు తెచ్చిందని చెప్పారు. ‘‘డిజిటల్ ఇండియా ద్వారా వాటికి అభివృద్ధి ద్వారాలు తెరుచుకున్నాయి. ఒకప్పుడు పెద్ద నగరాలకే పరిమితమైన సదుపాయాలు ప్రతి గ్రామానికీ చేరాయి. ఫలితంగా డిజిటల్ పారిశ్రామికవేత్తలు పుట్టుకొస్తున్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని అత్యంత మారుమూల జోర్సింగ్ గ్రామానికి పంద్రాగస్టు నుంచే 4జీ సేవలందుతున్నాయి’’ అంటూ పలు ఉదాహరణలను ప్రస్తావించారు. సమర యోధుల త్యాగాలను కళ్లముందుంచే స్వరాజ్ సీరియల్‌ను దూరదర్శన్‌లో ప్రజలంతా చూడాలన్నారు. 2047కల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా రూపొందుతుందని తనకు పూర్తి నమ్మకముందని పునరుద్ఘాటించారు. -
ఈ కన్నీటిని ఆపేదెట్లా?
ఒకపక్కన దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ఎండలు మంటెత్తుతుంటే, మరోపక్కన తూర్పు, ఈశాన్య ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్న విచిత్రమైన పరిస్థితి. వరదలు అలవాటే అయినా, మునుపెన్నడూ కనివిని ఎరుగని జలప్రళయంతో ఈశాన్య ప్రాంతం అతలాకుతలమవుతోంది. అస్సామ్, మేఘాలయల్లోని తాజా దృశ్యాలు ‘టైటానిక్’ చిత్రంలోని జలవిలయాన్ని తలపిస్తు న్నాయి. ఒక్క అస్సామ్‌లోనే ఈ నెల ఇప్పటి దాకా సాధారణం కన్నా 109 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. 35 జిల్లాలకు గాను 33 జిల్లాలు ముంపునకు గురి కాగా, 42 లక్షల మందికి పైగా ముంపు బారిన పడ్డారు. 70 పైచిలుకు మంది ప్రాణాలు కోల్పోయారు. ఈశాన్యంలో ఆరెంజ్ అలర్ట్‌తో, సహాయక చర్యలకు సైన్యం బరిలోకి దిగాల్సివచ్చింది. అస్సామ్ వరదలను జాతీయ సమస్యగా ప్రకటించాలని కొన్నేళ్ళుగా కేంద్రానికి వస్తున్న వినతిపై మళ్ళీ చర్చ మొదలైంది. సహాయక చర్యల్లోని ఇద్దరు పోలీసులు వరదల్లో కొట్టుకుపోయారంటే, అస్సామ్‌లో వరదల తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి, అస్సామ్కు వరదలు కొత్త కావు. వరదలతో ఈశాన్యంలో అల్లకల్లోలం ఏటా ఆనవాయితీ. వందల సంఖ్యలో జననష్టం, పశునష్టం. వేలమంది జీవనోపాధి కోల్పోవడం. పంటలు నాశనం కావడం. ఈసారీ అదే జరిగింది. పంట భూములు తుడిచిపెట్టుకుపోయాయి. కీలక రవాణా మార్గాలు ధ్వంసమయ్యాయి. అస్సామ్ దక్షిణ భాగంలోని బరాక్ లోయలోని తేయాకు తోటల పరిస్థితి మరీ దయనీయం. దిగువ అస్సామ్ బాగా దెబ్బతింది. బర్పేట లాంటి పట్నాలు పూర్తిగా నీట మునిగాయి. అస్సామ్‌లోని మొత్తం 78.52 లక్షల హెక్టార్ల భూభాగంలో 40 శాతం (సుమారు 31.05 లక్షల హెక్టార్లు) ఏటేటా వరద ముంపునకు గురవుతోంది. అస్సామ్ ఇలా ఏటా వరదల బారిన పడడానికి అనేక కారణాలున్నాయి. ఆ రాష్ట్రంలోని నదుల వెంట, మరీ ముఖ్యంగా బ్రహ్మపుత్రలో పల్లపు ప్రాంతాలు చాలా ఎక్కువ. దాంతో, అస్తవ్యస్తంగా మట్టి పేరుకుపోతుంటుంది. నదీ భూతలాలలో ఇలా మట్టి పేరుకుపోయినకొద్దీ, వరదలు వచ్చే అవకాశాలు మరింత పెరుగుతాయి. అలాగే, గౌహతి లాంటి ప్రాంతాల భౌగోళిక స్వరూపం సైతం తరచూ వరదల బారిన పడేలా చేస్తోంది. మన చేతిలో లేని ఈ ప్రకృతి సంబంధమైన కారణాలతో పాటు మానవ తప్పిదాలూ ఈ జల విలయానికి ప్రధాన కారణమవుతున్నాయి. మానవజోక్యంతో నదీతీరాలు క్షయమవుతున్నాయి. అస్సామ్ మొత్తం విస్తీర్ణంలో దాదాపు 8 శాతం మేర భూభాగం గడచిన ఏడు దశాబ్దాల పైచిలుకు కాలంలో నదీక్షయంతో మనిషి చెరబట్టినదేనని ఓ లెక్క. ఫలితంగా నదీప్రవాహ దిశలు మారడం, కొత్త ప్రాంతాలకు వరదలు విస్తరించడం సర్వసాధారణం. వరదలతో పేరుకొనే ఒండ్రుమట్టి భూసారానికి ప్రయోజనకరమే. కానీ, ఈ జల విలయం తెచ్చి పెడుతున్న తీరని నష్టాలు నివారించి తీరాల్సినవి. నదీతీరాల్లో అడవుల నరికివేత, బ్రహ్మపుత్రా నది ప్రవాహ ఉరవడి జత కలసి ఏయేటికాయేడు పరిస్థితిని తీవ్రతరం చేస్తున్నాయి. సాధారణంగా అధిక నీటిప్రవాహాన్ని నేలలోకి పీల్చుకొని, నష్టాన్ని నివారించేందుకు ప్రకృతి ఇచ్చిన వరంగా మాగాణి నేలలు ఉపకరిస్తాయి. కానీ, అత్యాశ ఎక్కువై మాగాణి నేలలను సైతం మానవ ఆవాసాలుగా మార్చేస్తున్నారు. అలా అస్సామ్‌లో మాగాణి తగ్గింది. వెరసి, ఆ రాష్ట్రం ప్రతిసారీ ముంపులో చిక్కుకు పోతోంది. కరకట్టల నిర్మాణంతో పాలకులు చేతులు దులుపుకుంటూ ఉంటే, అధిక వరదలతో అవీ కొట్టుకుపోతున్నాయి. పొంగిపొర్లే నీటిని కొంతైనా పీల్చుకొనేందుకు వీలుగా నదీ భూతలాల్లో అడదాదడపా పూడికలు తీస్తున్నా, బ్రహ్మపుత్ర లాంటి నదుల్లో త్వరితగతిన మట్టిపేరుకుపోతుంది గనక అదీ ఉపయోగం లేకుండా పోతోంది. భారీ ఆనకట్టల నిర్మాణంతో పర్యావరణ నష్టం సరేసరి. ఏమైనా, అస్సామ్ సహా ఈశాన్య రాష్ట్రాలకు వరదల ముప్పు తరచూ తప్పదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు, ప్రభుత్వాలు వ్యవహరించాలి. దీనిపై ఇవాళ్టికీ ఒక దీర్ఘకాలిక ప్రణాళికంటూ లేకపోవడమే విడ్డూరం. ప్రతి ఏటా వరదలు ముంచెత్తుతున్నా, పాలకులు క్షేత్రస్థాయిలో పటిష్ఠమైన ఆచరణాత్మక ప్రణాళికను సిద్ధం చేసుకోకపోవడం వరదను మించిన విషాదం. టిబెట్ నుంచి మన అస్సామ్ మీదుగా బంగ్లాదేశ్‌కు దాదాపు 800 కి.మీ ప్రవహించే బ్రహ్మపుత్రలో అడుసు తీయడానికి అయిదేళ్ళ క్రితం 2017లోనే కేంద్రం రూ. 400 కోట్ల ప్యాకేజ్ ప్రకటించింది. పూడిక తీశాక రూ. 40 వేల కోట్లతో 725 కి.మీ పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణ యోచనా చెప్పారు. కానీ వాటికి అతీగతీ లేదు. అధిక వ్యయమయ్యే కరకట్టలు, పూడికతీతలతో పెద్దగా ప్రయోజనం లేదు గనక ఇప్పటికైనా సమగ్ర ప్రణాళికకు శ్రీకారం చుట్టాలి. అస్సామ్‌తో పాటు వరద బీభత్సానికి గురవుతున్న పొరుగు రాష్ట్రాలు సైతం కలసికట్టుగా అడుగేయాలి. సమష్టిగా వనరుల సమీకరణ, సమాచార వినిమయంతో పరిష్కారం కనుగొనాలి. ఏటా కోట్లలో నష్టం తెస్తున్న వరద వైపరీత్యాన్ని అస్సామ్ ప్రభుత్వం ఎంతో కాలంగా కోరుతున్నట్టు జాతీయ సమస్యగా ప్రకటించే ఆలోచన కేంద్ర సర్కార్ చేయాలి. తక్షణ సాయం అందించడంతో పాటు రాష్ట్రాల మధ్య సమన్వయ బాధ్యతను చేపట్టాలి. సామాన్యులు సైతం మాగాణి నేలల ప్రాధాన్యాన్నీ, యథేచ్ఛగా అడవుల నరికివేతతో నష్టాన్నీ గ్రహించాలి. ప్రజానీకం, పార్టీలు, ప్రభుత్వాలు– అంతా కలసికట్టుగా ఈ వరద ముప్పుకు అడ్డుకట్ట వేయకపోతే ఏటా ఈ నష్టం తప్పదు. ప్రజల వినతులు, పార్టీల హామీలు నిష్ఫలమై, ప్రతిసారీ ఎన్నికల అజెండాలో అంశంగా అస్సామ్ వరదల సమస్య మిగిలిపోవడం ఇకనైనా మారాలి. -
లోకేష్ కుప్పంలో స్ట్రాంగ్ ఏజెంట్లను పెట్టారు కదా.. మరి దొంగ ఓట్లు ఎలా?
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు హయాంలో రైతులకు ఎప్పుడు పరిహారం ఇస్తారో తెలియని పరిస్థితి ఉండేది. కానీ జగన్ రైతుల పక్షాన నిలబడతారు. అందుకే ఎప్పటికప్పుడు పరిహారాన్ని అందిస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. గులాబ్ తుఫాను కారణంగా పంట నష్టపోయిన 34,586 మంది రైతులకు రూ.22 కోట్ల పంట నష్ట పరిహారాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. 'గులాబ్ తుఫాను బాధిత రైతులకు పరిహారం ఇచ్చాం. నివర్ తుపాను బాధితులకు కూడా అప్పుడే పరిహారం ఇచ్చేశాం. చంద్రబాబు హయాంలో రైతులకు ఎప్పుడు పరిహారం ఇస్తారో తెలియని పరిస్థితి ఉండేది. కానీ జగన్ రైతుల పక్షాన నిలబడతారు. అందుకే ఎప్పటికప్పుడు పరిహారాన్ని అందిస్తున్నారు. వారం పదిరోజులుగా జరుగుతున్న నష్టాన్ని కూడా అంచనా వేస్తున్నాం. సీఎం జగన్ రైతు పక్షపాతి చంద్రబాబు హయాంలో తన పదవీకాలం పూర్తయ్యేనాటికి కూడా ఇవ్వలేదు. సకాలంలో చంద్రబాబు ఏనాడూ ఇవ్వలేదు. రైతు పక్షపాతి జగన్ ఇప్పటి వరకు రూ.1,070 కోట్లు ఇచ్చారు. రైతులు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. త్రిముఖ వ్యూహంతో మేము పనిచేస్తున్నాం. సోము వీర్రాజు ఏవేవో మాట్లాడుతున్నారు. ఇస్తామన్నదానికంటే ముందుగానే మేము రైతులకు పరిహారం ఇస్తున్నాం. కేంద్రం న్యాయం చేస్తున్నట్టు, రాష్ట్రం చేయనట్లు చెప్తే జనం నమ్మరు. కేంద్రం రైతుల పక్షాన ఉంటే ఢిల్లీలో రైతుల ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయి?. చదవండి: (రైతుల కోసం మరో అడుగు ముందుకు వేస్తున్నాం: సీఎం జగన్) మరి దొంగ ఓట్లు ఎలా వేయగలరు? కుప్పం ప్రజల్లో మార్పు వచ్చింది. టీడీపీ వారు వైఎస్సార్సీపీ దొంగ ఓట్లు వేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. అసలు ఓటరు ఐడీ లేకుండా ఓటరు పోలింగ్ బూతులోకి ఎలా వెళ్లగలరు?. చంద్రబాబు కట్టుకథలు అల్లుతున్నారు. లోకేష్ రెండు రోజులు పర్యటించి స్ట్రాంగ్ ఏజెంట్లను పెట్టుకున్నారు కదా?. మరి ఎలా దొంగ ఓట్లు వేయగలరు?. మూడు రాజధానుల విషయమై కోర్టులకు వెళ్లి ఆపాలని చూస్తున్నారు. మూడు రాజధానులు చేయటం మీ తరం కాదని ఇప్పుడు మాట్లాడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని మీరు ఎందుకు కట్టలేకపోయారు?. చంద్రబాబు అమరావతి రైతులను మోసం చేశారు. 2019 ఎన్నికల్లో ప్రజలు మాకు మద్దతు ఇచ్చారు. మా నిర్ణయాలను ప్రజలు అంగీకరిస్తున్నారు. మూడు రాజధానులను అడ్డుకుంటే మిగతా ప్రాంతాల ప్రజలు సరైన బుద్ది చెప్తారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి అక్కర్లేదనుకుంటే బీజేపీ కూడా సపోర్ట్ చేసుకోవచ్చు. కర్నూలే రాజధాని అన్న నాయకులు ఇప్పుడు ఏమయ్యారు?' అని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. -
రైతుల కోసం మరో అడుగు ముందుకు వేస్తున్నాం: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులకు అదే సీజన్లో పరిహారం అందించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా మంగళవారం రబీలో నష్టపోయిన మొత్తం 34,586 మంది రైతులకు రూ.22 కోట్లను వారి ఖాతాల్లో సీఎం జగన్ జమ చేశారు.ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రైతుల కోసం మరో అడుగు ముందుకు వేస్తున్నామని అన్నారు. మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని, రైతులు ఇబ్బంది పడితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుందని తెలిపారు. రాష్ట్రంలో 62 శాతం జనాభా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. అలాంటి రైతు ఇబ్బందిపడితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రోడ్డుమీద పడుతుందని సీఎం తెలిపారు. ఇది తెలిసి కూడా గతంలో ఎప్పుడూ కూడా ఇంతగా ఆలోచన చేయలేదని, రైతును చేయిపట్టి నడిపించే విధంగా ఎవరూ చేయలేదన్నారు. ఇవాళ తాము తీసుకుంటున్న చర్యలు చరిత్రలో నిలిచిపోతాయని, రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా తోడుగా ఉండాలని మనసా, వాచా, కర్మేణా ప్రతి అడుగూ ముందుకు వేస్తున్నామని సీఎం తెలిపారు. చదవండి: ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీఫాం అందజేసిన సీఎం జగన్ తుపానులు, వరదలు, కరువు ఏవి వచ్చినా సరే రైతు నష్టపోయే పరిస్థితి రాకూడదని, ఒక వేళ వచ్చినా అదే సీజన్ ముగిసే లోగా పరిహారం అందిస్తున్నామని సీఎం తెలిపారు. రైతుకు మళ్లీ పెట్టుబడి అందేలా చేస్తున్నామని, ఏ సీజన్లో జరిగిన నష్టానికి అదే సీజన్లో పరిహారాన్ని చెల్లించే కొత్త సాంప్రదాయాన్ని రాష్ట్రంలో తీసుకు రావడం జరిగిందని సీఎం జగన్ పేర్కొన్నారు. పూర్తి పారదర్శకతతో వారికి పరిహారం చెల్లిస్తున్నామని, నష్టపోయిన ప్రతి రైతుకూ పూర్తి పారదర్శకతతో చెల్లిస్తున్నామని సీఎం చెప్పారు. రైతు పక్షపాత ప్రభుత్వం 2 నెలల క్రితం గులాబ్ తుపాను కారణంగా పంట నష్టపోయిన 34,586 మంది రైతులకు ఖరీఫ్ సీజన్ ముగిసేలోగా రూ.22 కోట్ల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. రూ.22 కోట్లే కదా అని కొందరు గిట్టవాళ్లు మాట్లాడే పరిస్థితి ఉంటుందని, కాని ఒక కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు. ఏ సీజన్లో పంట నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగా కచ్చితంగా ప్రభుత్వం పరిహారం ఇచ్చి తోడుగా ఉంటుందనే విషయాన్ని గుర్తించాలని సీఎం జగన్ అన్నారు. ఈ అంశానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నామని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండున్నర ఏళ్ల కాలంలో నవంబర్‌లో నివర్ తుపాన్ వచ్చిందని అన్నారు. డిసెంబర్ చివరినాటికి 8.34 లక్షల మందికి 645.99 కోట్ల రూపాయలు నష్టపరిహారం కింద ఇచ్చామని సీఎం జగన్ చెప్పారు. ఎక్కువ, తక్కువ మొత్తం అనేది కాకుండా రైతుకు నష్టం జరిగినా, తుపాను వచ్చినా ఇతరత్రా కష్టం వచ్చినా ప్రభుత్వం రైతుకు తోడుంగా ఉంటుందనే గట్టి సందేశం ఇవ్వాలనే ఈ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. 13.96 లక్షల మంది రైతులకు కేవలం ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.1,071 కోట్ల రూపాయలు ఇచ్చామని తెలిపారు. రెండున్నరేళ్ల కాలంలో రైతులకోసం అనేక చర్యలు తీసుకున్నామని, వైఎస్సార్ రైతు భరోసా కింద అక్షరాల రూ.18,777 కోట్లు నేరుగా రైతుల చేతికి అందించామని చెప్పారు. వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రూ.1674 కోట్లు ఇచ్చామని, ఉచిత పంటల బీమా కింద 3,788 కోట్లు ఇచ్చామని, పగటి పూట నాణ్యమైన విద్యుత్తు కోసం రూ.18వేల కోట్లు ఖర్చు పెట్టామని తెలిపారు. ఆక్వా రైతులకు రూ.1505 కోట్ల రూపాయలు కరెంటు సబ్సిడీ ఇచ్చామని ఫీడర్ల కోసం రూ.1700 కోట్లకుపైగా ఖర్చు చేశామని సీఎం తెలిపారు. పంట కొనుగోలులోనూ ఆర్బీకే కేంద్ర బిందువుగా పనిచేస్తోందని చెప్పారు. ధాన్యం సేకరణ కోసం మాత్రమే 2 సంవత్సరాల కాలంలో అక్షరాల రూ.30వేల కోట్లకుపైగా ఖర్చుచేశామని తెలిపారు. పత్తి కొనుగోలు కోసం రూ.1800 కోట్లు వెచ్చించామని, ఇతర పంటల కొనుగోలు కోసం రైతు నష్టపోకుండా రూ.6430 కోట్ల ఖర్చు చేశామని సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాల నిధి రైతు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రూ.2వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధి పెట్టామని, రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెట్టామని సీఎం అన్నారు. ధాన్యం సేకరణకోసం గత ప్రభుత్వం పెట్టిన రూ.960 కోట్ల బకాయిలను చెల్లించామని, ఉచిత విద్యుత్ కింద రూ.9వేల కోట్ల కరెంటు బకాయిలను గత ప్రభుత్వం పెడితే దాన్ని చెల్లించామని తెలిపారు. విత్తన బకాయిలు కూడా కట్టామని, రైతన్నలకు తోడుగా ఉండాలని వ్యవస్థలోకి మార్పులను తీసుకు వస్తున్నామని సీఎం పేర్కొన్నారు. వ్యవసాయ సలహా కమిటీలు ఆర్బీకేల స్థాయి, మండలస్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిల్లో పెట్టామని చెప్పారు. ఈ మధ్యకాలంలో వర్షాలు బాగా పడ్డాయని, రైతులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకూ కూడా ప్రభుత్వం తోడుగా ఉంటుంది.. రబీ సీజన్ ముగియకముందే వారికి పరిహారాన్ని చెల్లిస్తామని సీఎం జగన్ తెలిపారు. -
హెచ్చరిక!! ఈ శతాబ్దం చివరి నాటికి భూమిపై ఘోర మారణహోమం..
Biggest holocaust will come in the late century: యుగాంతం గురించి ఇప్పటికే పలుపుకార్లు పలుమార్లు చక్కర్లు కొట్టాయి. అవి కేవలం వదంతులని కొట్టిపారేయలేం కూడా. ఎందుకంటే భూమి అంతరించిపోయేంతగాకాకున్న ఎన్నడూ కనీవినీ ఎరుగని కొత్తకొత్త రోగాలు, వాతావరణ మార్పులు ఇప్పటికీ చవిచూస్తూనే ఉన్నాం. ఐతే తాజాగా ప్రపంచ అగ్రశ్రేణి శాస్త్రవేత్తలు మరో సంచలనాత్మక హెచ్చరికలు జారీ చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద సైన్స్ మ్యాగజైన్ ‘నేచర్' నిర్వహించిన సర్వేలో భూమిపై వాతావరణ మార్పులకు సంబంధించి అనేక షాకింగ్ విషయాలను వెల్లడించింది. ఈ శతాబ్ధి చివరి నాటికి భూమిపై తీవ్ర మార్పులు సంభవిస్తాయని, త్వరలో భూమి నాశనమౌతుందని ఈ సర్వే నివేదిక పేర్కొంది. అంటే 2100 నాటికి భూమిపై భయంకరమైన మార్పులు సంభవించి, ఘోర మారణహోమం జరగబోతుందని ఆ నివేదిక సారాంశం. ప్రపంచ నలుమూలల నుండి 233 మంది ప్రకృతి శాస్త్రవేత్తలు రూపొందించిన ఐపీసీసీ వాతావరణ నివేదికలోఇది. చదవండి: North Korea: ఆ ఫొటోలు తీసినందుకు దేశం నుంచి శాశ్వతంగా బహిష్కరించారు.. ఈ శాస్త్రవేత్తల్లో కొలంబియాలోని యాంటికోయా విశ్వవిద్యాలయానికి చెందిన రీసెర్చర్ పావోలా అరియాస్ కూడా ఉన్నారు. ప్రపంచం తీరు మారుతుందని, వనరులు తీవ్రంగా దోపిడీకి గురవుతున్నాయని, కాలుష్యం, హీట్‌వేవ్ రోజురోజుకీ పెరుగుతున్నాయని అన్నారు. వీటన్నింటి మధ్య బతకడమే కష్టంగా మారుతోంది. వర్షాల గతి మారడం వల్ల తీవ్ర నీటి సమస్య తలెత్తి, మున్ముందు భయంకరమైన గడ్డు పరిస్థితులు తలెత్తుతాయని ఆయన అన్నారు. చదవండి: పాదాలను చూసి ఆ సీక్రెట్స్ కనిపెట్టేయ్యొచ్చట!! ఇక గ్లోబల్ వార్మింగ్ గురించి ప్రపంచ నాయకులు నత్తనడకన చర్యలు తీసుకుంటున్నారు. ఇలాగేకొనసాగితే ప్రకృతి వైపరీత్యాలు తలెత్తి పెద్ద సంఖ్యలో ప్రజలు ఏకకాలంలో మృత్యువాత పడే అవకాశం ఉంది. భూమిని రక్షించుకోవడానికి మనకిప్పుడు చాలా తక్కువ సమయం ఉన్నట్లు నివేదిక చూపుతుందని ఆయన అన్నారు. 2100 నాటికి అకాల వర్షాలు, మేఘావృతాలు, సునామీలు, కరువులు, వరదలు వంటి విపత్తులు పెద్ద ఎత్తున ఉత్పన్నమవుతాయి. ఫలితంగా సమస్త మానవజాతి కష్టాలపాలవ్వడం ఖాయమని ఆయన హెచ్చరించారు. చదవండి: టాయిలెట్లో ఎక్కువ సమయం గడుపుతున్నారా? ఆ సమస్య అందుకేనట!! -
శభాష్.. పోలీస్
సాక్షి, అమరావతి: ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజలకు ఆపన్న హస్తం అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటామని రాష్ట్ర పోలీసు యంత్రాంగం మరోసారి నిరూపించింది. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు సహాయ, పునరావాస కార్యక్రమాల్లో పోలీసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నేలకొరిగిన వృక్షాలు తొలగించడం, లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస శిబిరాలకు చేర్చడంలో శక్తివంచన లేకుండా పనిచేశారు. ► శ్రీకాకుళం జిల్లాలో గార, వజ్రపుకొత్తూరు, జి.సిగడాం, కవిటి, సంతబొమ్మాళి తదితర మండలాల్లో ఆదివారం రాత్రి నేలకొరిగిన భారీ వృక్షాలను సోమవారం తెల్లవారుజాముకల్లా పోలీసులు తొలగించారు. ► విజయనగరం జిల్లా భోగాపురం, పూసపాటిరేగ తదితర మండలాల్లో తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి సురక్షితంగా తరలించారు. ► విశాఖ జిల్లాలోని నారాయణపట్న బ్రిడ్జి, తాండవ బ్రిడ్జి, హుకుంపేట బ్రిడ్జి, సోమదేవపల్లి, బంగారంపాలెం, రాజయ్యపేట, దొండవాక తదితర లోతట్టు ప్రాంతాల వాసులను పోలీసులు పునరావాస శిబిరాలకు చేరవేశారు. ► పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెంలోని జల్లేరు వంతెనపై రాకపోకలకు కలిగిన అంతరాయంపై పోలీసులు సత్వరం స్పందించి పరిష్కరించడం ప్రశంసలు అందుకుంది. పోలవరం సీఐ అల్లు నవీన్, బుట్టాయగూడెం ఎస్సై జయబాబు మరమ్మతులు చేయించారు. వాహనాల రాకపోకలకు ఆటంకం తొలగించారు. ► కోల్‌కతా–చెన్నై హైవేపై రాకపోకలకు అంతరాయం లేకుండా పోలీసులు ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. దాంతో పూర్తిస్థాయిలో సహాయ కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టేందుకు అవకాశం ఏర్పడింది. -
కరోనా మృతుల కుటుంబాలకు అంత పరిహారం ఇవ్వలేం: కేంద్రం
న్యూఢిల్లీ: కోవిడ్-19 బాధితులకు రూ.4 లక్షల పరిహారం చెల్లించలేమని, పరిహారం తప్పనిసరి చేసే విపత్తు నిర్వహణ చట్టం భూకంపం, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలకు మాత్రమే వర్తిస్తుందని కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. కరోనా వైరస్ కారణంగా 3.85 లక్షల మందికి పైగా కరోనా బాధితులు మరణించారని, ఇది పెరిగే అవకాశం ఉందని కేంద్రం తెలిపింది.పెరిగిన ఆరోగ్య ఖర్చులు, తక్కువ పన్ను ఆదాయాల కారణంగా లక్షలాది మంది కోవిడ్ బాధితులకు పరిహారం చెల్లించడం రాష్ట్రాల బడ్జెట్‌కు మించినదని కేంద్రం తన అఫిడవిట్లో పేర్కొంది. భూకంపం, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలకు మాత్రమే పరిహారం వర్తిస్తుందని విపత్తు నిర్వహణ చట్టం పేర్కొందని తెలిపింది. కరోనా మహమ్మారి భారీ స్థాయిలో ఉన్నందున దీనిని కోవిడ్‌కు వర్తింపచేయడం సముచితం కాదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. పరిహారం ఇవ్వడానికి అరుదైన వనరులను ఉపయోగించడం, ఆరోగ్యం పై చేసే వ్యయాన్ని ప్రభావితం చేసి, మంచి కంటే ఎక్కువ నష్టం కలిగిస్తుందని కేంద్రం తన అఫిడవిట్లో పేర్కొంది. చాలా వరకు ప్రతి బాధితుడి మరణ ధృవీకరణ పత్రాల్లో "కోవిడ్ డెత్" అని జారీ చేసినట్లు కేంద్రం తన అఫిడవిట్లో పేర్కొంది. ఇక కోవిడ్ బాధితులకు రూ.4 లక్షల పరిహారం కోరుతూ ఇద్దరు పిటిషనర్లు సుప్రీంకోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. చదవండి: 123 రోజులు సంకెళ్లతో.. ప్రపంచంలో ఏ జంట ఈ పని చేసుండదు? -
ఈశాన్య భారతానికి భూకంప ముప్పు
తేజ్‌పూర్ (అసోం): ఈశాన్య భారత దేశం వణికి పోతుంది. వరుసగా వస్తున్న భూకంపాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2:23 గంటలకు అసోంలో భూకంపం వచ్చినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటించింది. అసోంలోని తేజ్‌పూర్ నగరానికి 40 కిలోమీరట్ల దూరంలో భూమి కంపించింది. భూ ఉపరితలానికి 14 కిలోమీటర్ల లోపల భూకంప కేంద్రం ఉందని తెలిపింది. రిక్టరు స్కేలుపై భూకంప తీవ్రత 4.1గా నమోదయ్యింది. అరుణాచల్ ప్రదేశ్‌లో అంతకు ముందు మే 21 అసోం పొరుగు రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్‌లో ఛాంగ్లాంగ్ సమీపంలో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టరు స్కేలుపై 5.8గా నమోదు అయ్యింది. ఆ మరుసటి రోజే అరుచల్‌ప్రదేశ్‌కి సమీపంలో చైనాలోని ఉన్నావ్ ప్రావిన్స్‌లో భూకంపం వచ్చింది. రిక్టరు స్కేలుపై భూకంప తీవ్రత 6.1గా నమోదు అయ్యింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా భారీగా ఆస్థి నష్టం సంభవించింది. ఈశాన్య భారతంలో ఉన్న పర్వత శ్రేణుల్లో ఒకే నెలలో మూడు సార్లు భూకంపం రావడంతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇదే నెలలో ఉత్తరం వైపున లద్ధాఖ్‌లోనూ భూకంపం వచ్చింది. ప్రకృతి విపత్తులు మే నెలలో దేశంలో మూడు ప్రాంతాల్లో భూకంపం వచ్చినా ఎక్కడా ప్రాణనష్టం జరగలేదు. ఈ మూడు భూకంపాల తీవ్రత రిక్టరు స్కేలుపై 6 కు మించకపోవడంతో పెద్దగా ఆస్తినష్టం కూడా జరగలేదు. కానీ ఇదే నెలలో అరేబియా, బంగళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు తీవ్ర తుపానులుగా మారాయి. టౌటే, యాస్ తుపానులు పశ్చిమ, తూర్పు తీర ప్రాంతాలపై విరుచుకుపడ్డాయి. ఈ రెండు తుపానుల ధాటికి ఇటు మహారాష్ట్ర, గోవా, గుజరాత్, కేరళ, కర్నాటకలు అటూ ఒడిషా, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయాయి. -
బీమా ‘పంట’ పండటంలేదు!
న్యూఢిల్లీ: పంటల బీమా (క్రాప్ ఇన్సూరెన్స్) అంటే.. బీమా కంపెనీలు భయపడిపోతున్నాయి! ప్రకృతి విపత్తుల కారణంగా పరిహారం కోరుతూ భారీగా క్లెయిమ్‌లు వస్తుండటం, ఫలితంగా ఈ విభాగంలో వస్తున్న భారీ నష్టాలతో కంపెనీలు పునరాలోచనలో పడుతున్నాయి. దీంతో ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇప్పటికే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) పథకం కింద క్రాప్ ఇన్సూరెన్స్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. చోళమండలం ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ సైతం ఈ విభాగం నుంచి తప్పుకున్నట్టు డేటా తెలియజేస్తోంది. అయినా, కొన్ని కంపెనీలు మాత్రం ఈ విభాగం పట్ల ఆశావహంగానే ఉన్నాయి. పీఎం ఎఫ్బీవై కింద 2018–19 ఆర్థిక సంవత్సరంలో వసూలైన స్థూల ప్రీమియం రూ.20,923 కోట్లు. కాగా, బీమా కంపెనీలకు పరిహారం కోరుతూ వచ్చిన క్లెయిమ్‌ల మొత్తం రూ.27,550 కోట్లుగా ఉంది. ప్రభుత్వరంగంలోని రీఇన్సూరెన్స్ సంస్థ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (జీఐసీఆర్ఈ) సైతం తన క్రాప్ ఇన్సూరెన్స్ పోర్ట్‌ఫోలియోను భారీ నష్టాల కారణంగా తగ్గించుకోవడం గమనార్హం. జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ డేటాను పరిశీలిస్తే.. చోళమండలం ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ స్థూల ప్రీమియం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో 91 శాతం తగ్గిపోయి రూ.5.26 కోట్లుగానే ఉన్నట్టు తెలుస్తోంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో సంస్థకు వచ్చిన స్థూల ఆదాయం రూ.211 కోట్లుగా ఉంది. పెరిగిన స్థూల ప్రీమియం పంటల బీమా విభాగంలో అన్ని సాధారణ బీమా కంపెనీలకు స్థూల ప్రీమియం ఆదాయం ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య కాలంలో పెరగడం గమనార్హం. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ.15,185 కోట్లతో పోలిస్తే 26.5 శాతం వృద్ధి చెంది రూ.19,217 కోట్లకు చేరుకుంది. ‘‘క్రాప్ ఇన్సూరెన్స్ మంచి పనితీరునే ప్రదర్శిస్తోంది. కొన్ని విభాగాల్లో క్లెయిమ్ రేషియో ఎక్కువగా ఉంది. అయినప్పటికీ చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ విభాగంపై బుల్లిష్‌గానే ఉన్నాయి’’అని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ సంస్థల పెద్దపాత్ర క్రాప్ ఇన్సూరెన్స్‌లో నష్టాల పేరుతో ప్రైవేటు కంపెనీలు తప్పుకున్నా కానీ, ప్రభుత్వరంగ బీమా సంస్థలు పెద్ద పాత్రే పోషిస్తున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే నేషనల్ ఇన్సూరెన్స్, న్యూఇండియా ఇన్సూరెన్స్ కొన్ని ప్రైవేటు సంస్థలతోపాటు పంటల బీమాలో వ్యాపారాన్ని పెంచుకుంటున్నాయి. ప్రభుత్వరంగ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ అధిక మొత్తంలో క్రాప్ ఇన్సూరెన్స్ వ్యాపారాన్ని సొంతం చేసుకుంటోంది. కాగా, ఈ ఏడాది ఎలాంటి క్రాప్ బీమా వ్యాపారాన్ని నమో దు చేయబోవడంలేదని రీ ఇన్సూరెన్స్ చార్జీలు దిగిరావాల్సి ఉందని ఐసీఐసీఐ లాంబార్డ్ ఎండీ, సీఈవో భార్గవ్ దాస్ గుప్తా వ్యాఖ్యానించారు. ఈ రంగంలో పరిస్థితులు ఇలా.. ► ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం పరిధిలో ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ క్రాప్ ఇన్సూరెన్స్ వ్యాపారం నుంచి తప్పుకుంది. ► చోళమండలం ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ సైతం ఈ విభాగం నుంచి తప్పుకున్నట్టు డేటా తెలియజేస్తోంది. ► అధిక నష్టాలు, పరిహారం కోరుతూ భారీగా వస్తున్న క్లెయిమ్‌లు. ► ప్రభుత్వరంగ రీఇన్సూరెన్స్ సంస్థ జీఐసీఆర్ఈ సైతం తన క్రాప్ పోర్ట్‌ఫోలియోను తగ్గించుకుంది. ► ప్రభుత్వరంగ నేషనల్ ఇన్సూరెన్స్, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ మాత్రం ఈ వ్యాపారాన్ని పెంచుకుంటున్నాయి. ► ప్రపంచవ్యాప్తంగా చూస్తే... అమెరికా, చైనా తర్వాత అతిపెద్ద పంటల బీమా మార్కెట్ మనదే కావడం గమనార్హం. -
మనం మారితేనే మనుగడ
పాట్నాలో ఉప ముఖ్యమంత్రి కుటుంబాన్ని రబ్బరు పడవలో సురక్షిత ప్రాంతానికి తరలించిన స్థితి! నెల కింద కురిసిన భారీ వర్షం ముంబాయిని ముంచెత్తినపుడు పక్కనే మరాఠ్వాడాలో కరువు విలయతాండవం చేసింది. చైన్నైలో ఓ యేడు వరదలు ముంచెత్తితే మరో ఏడాది నీటి ఎద్దడి. హైదరాబాద్‌లో ఈసారి సగటు వర్షపాతం ఎక్కువ నమోదైనా, భూగర్భ జలమట్టాలు పెరక్కపోగా దాదాపు మరో మీటరు అడుక్కు పోయాయి. ఈ విపరీతాలన్నీ ‘వాతావరణ మార్పు’ కాక మరేంటి? ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే, తట్టుకునే సామర్థ్యాల్ని పెంచుకోవాలి. ప్రమాదస్థాయిని గ్రహించి ప్రభుత్వాలు–పౌరసమాజం వ్యూహాత్మకంగా జరిపే సమిష్టి కృషితోనే నగరజీవికిక మనుగడ! ‘పాట్నాతో సహా ఉత్తర బీహార్‌లో రాగల 48 గంటల్లో భారీ వర్ష సూచన’ అని వాతావరణ విభాగం హెచ్చరించి 24 గంటలయినా ప్రభుత్వ ఉన్న తాదికారులు, స్థానిక పాలకులు కొత్తగా చేపట్టిన సహాయక చర్యలేమీ లేవు. ఇప్పటికే అక్కడ కురుస్తున్న వర్ష బీభత్సమలా ఉంది. పాట్నా నగరంలోనూ వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీధులన్నీ కాలువలయ్యాయి. డజన్‌కు పైగా పెద్ద కాలనీల్లో మోకాళ్ల నుంచి నడుము లోతుకు నీరు ప్రవహిస్తోంది. నగరంలో విద్యుత్తు లేదు. ఉన్న జనరేటర్లన్నీ నీట మునిగి పనిచేయట్లేదు. నీటి అడుగున రోడ్డుపై ఎక్కడ మ్యాన్‌హోల్ నోరు తెరచి ఉందో...? ఎక్కడ లోతైన గుంత నీరు కమ్మి ఉందో....? తెలియదు. ఎలా నడవడం! జాతీయ పత్రికలన్నీ ఇదే రిపోర్టు చేశాయి. ఈ పరిస్థితి ఒక్క పాట్నాది కాదు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల దుస్థితీ ఇదే! మొన్న చెన్నై, నిన్న ముంబాయ్, నేడు పాట్నా, రేపు..... ఏదో నగరం, తప్పదీ విపత్తు ఎదుర్కొవడం! ఎంతకాలమీ దురవస్థ? ఎవరి దగ్గరా సమాధానం లేదు. ఎందుకంటే, ఈ సవాళ్లను ఎదుర్కోగల కార్యాచరణ ప్రణాళిక ఎవరూ రూపొందించలేదు గనుక! భూతాపోన్నతి ఫలితంగా వస్తున్న ‘వాతావరణ మార్పు’ విపరిణామాల్ని తట్టుకొని, ఎదుర్కొనే పథక రచనకు ప్రభుత్వాలు పూనుకోవట్లేదు. ఇక విపత్తుల్ని ధీటుగా ఎదుర్కొనే ఆచరణ అగమ్య గోచరమే! గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కరువై, పౌర సదుపాయాలు కొరవడి పట్టణాలు, నగరాలవైపు ప్రజలు పరుగు తీస్తున్న క్రమంలో నగరీకరణ అతి వేగంగా జరిగిపోతోంది. సరైన పథకం, ప్రణాళికల్లేని పట్టణ–నగరీకరణ కొత్త సవాళ్లను విసురుతోంది. అసాధారణ జనాభా–అరకొర సదుపాయాలకు తోడు ప్రకృతి వైపరీత్యాలు... వెరసి మహానగరాలు మురికి కూపాలవుతున్నాయి. నగరవాసుల జీవితాలు దుర్భరమౌతున్నాయి. వాతావరణ మార్పు దుష్పరిణామాల్లో భాగంగా ముంచుకొచ్చే అతివృష్టి–అనావృష్టి వంటి సవాళ్లు ఇప్పటికే ముంబాయి, చెన్నై నగర వాసులకు నమూనా రుచి చూపించాయి. మున్ముందు ఈ సమస్యలు మరింత జఠిలం కానున్నాయనడానికి పాట్నా సరికొత్త ఉదాహరణ మాత్రమే! ఆలోచనలు మారితేనే.... కాలం చెల్లిన ఆలోచనలు, విధానాలతో పాలకులు నెట్టుకొస్తున్నారు. భారీ వర్షాలు, వరదలు రాగానే హడావుడి చేస్తారు. పట్టణ ప్రణా ళిక–నీటి నిర్వహణ... అంటూ ఏవేవో ప్రకటనలు చేస్తారు. రోజులు గడిచాక అంతా మరచిపోతారు. మన నగర–పట్టణ ప్రణా ళికాధికారులు, ఇంజనీర్లు ఇంకా 70లు 80ల నాటి ఆలోచనా విధానంతోనే సాగుతున్నారు. అసలు సివిల్ ఇంజనీరింగ్ సిలబస్ పుస్తకాల్నే సమూలంగా మార్చాలి. పర్యావరణ సమస్యలు, ప్రకృతి విపత్తుల నుంచి నగరాలను కాపాడే వ్యవస్థలు–విధానాలే ప్రస్తుతం మనకు లేవు. మారే పరిస్థితులకు అనుగుణంగా చేపట్టాల్సిన అత్య వసరాలు, ప్రత్యామ్నాయాల అమలులో చొరవే కాదు చిత్తశుద్దీ కొరవడుతోంది. చట్టాల్లోనూ సమూల మార్పులు రావాలి. పౌరుల బాధ్యతను నిర్దేశించే నిబంధనలిపుడు పెద్దగా లేవు. సంస్థలుగా, సమూహాలుగా పౌరసమాజం నిర్వహించాల్సిన కర్తవ్యాలు ఎక్కడా అమలు కావు. నిఘా, నియంత్రణా వ్యవస్థల్లో అవినీతి తారస్థాయిలో ఉంది. అక్రమ కట్టడాలకు అంతే లేదు! నిబంధనల్ని పాటించడం కన్నా నిఘా–నియంత్రణ వ్యవస్థలకు లంచమిచ్చి పబ్బం గడపడం తేలిక, చౌక కావడంతో పౌరులు అటే మొగ్గుతున్నారు. ఫలితంగా చట్టాలు, నిబంధనల అమలు గాల్లో దీపమే! 4 నుంచి 8 (సగటున 6)సెంటీమీటర్లు మించి వర్షం కురిస్తే తట్టుకోలేని స్థితి మన మహానగరాలది. వలసల ఒత్తిడి తగ్గించడానికి మహానగరాలకు అన్ని వైపులా 30, 40 కిలోమీటర్ల దూరంలో శాటిలైట్ టౌన్‌షిప్‌లను అభివృద్ధి పరచాలన్న ప్రతిపాదన సవ్యంగా అమలు కావడం లేదు. ఇప్పుడు హైదరాబాద్‌కు లభించిన అవుటర్ రింగ్‌రోడ్డు, రేపు రాబోయే రీజనల్ రింగ్రొడ్డు వంటి మౌలిక సదుపాయాల పరిపుష్టి దృష్ట్యా అలాంటి టౌన్షిప్లుంటే ఇవ్వాళ నగరంపై ఒత్తిడి తగ్గేది. అందరి పరిస్థితీ అధ్వాన్నమే! ఇది ఒక హైదరాబాద్ సమస్యే కాదు. ముంబాయి, చెన్నై, బెంగ ళూరు, కలకత్తా, ఢిల్లీ... ఎవరి పరిస్థితీ బాగోలేదు. ఒకరిది వరద మునక, ఇంకొకరిది నీటి ఎద్దడి, మరొకరిది ఉష్ణతాపం, వేరొకరిది మురికి కూపం, మరొకరిది వాయు కాలుష్యం ... ఇలా అందరూ ఏదో రూపంలో సమస్యల్ని ఎదుర్కొంటున్న వారే! ప్రకృతి వైపరీ త్యాల్ని తట్టుకునే పరిస్థితులు ఎవరికీ లేవు. ముఖ్యంగా ‘వాతావరణ మార్పు’ వల్ల కురుస్తున్న అసాధారణ వర్షాలు నగరాలను వరదతో ముంచెత్తుతున్నాయి. పాట్నా చూడండి, ఉప ముఖ్యమంత్రి కుటుంబాన్ని రబ్బరు పడవలో సురక్షిత ప్రాంతానికి తరలించిన స్థితి! ఇలా ఎంతమందికి రక్షణ కల్పించగలరు? మొలలోతు నీటిలోనే ఇంకా కొట్టుమిట్టాడుతున్న సామాన్యుల పరిస్థితి ఏంటి? చెన్నైలో 2015 వరదల తర్వాత అధ్యయనం జరిపిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఒక నివేదిక ఇచ్చింది. నగరంలో చెరువులు, కుంటలు, నదీ తీరాల దురాక్రమణ, అక్రమ కట్టడాల వల్లే ఈ సమస్య ముదిరినట్టు పేర్కొంది. అడ్డదిడ్డమైన టౌన్ ప్లానింగ్ కూడా కారణమంది. 1975 తర్వాత ముంబాయి వరద విపత్తుపై పలు కమిటీలు ఏర్పడి, ఎన్నో అధ్యయనాలు జరిపాయి. ఐఐటీ ముంబాయి వారిచ్చిన దానితో సహా ఎన్నో నివేదికలొచ్చాయి. ప్లానింగ్ లోపాలతో పాటు అక్రమ కట్టడాలు, ప్లాస్టిక్–ఇతర వ్యర్థాల డంప్ ముంపులకు కారణమని పేర్కొన్నాయి. అక్రమ కట్టడాలకు తోడు డ్రయినేజీ వ్యవస్థను ఆధు నీకరించకపోవడం బెంగళూరులో ముంపు ప్రమాదాలకు ముఖ్య కారణమని ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, బెంగళూరు’ తన నివేదికలో చెప్పింది. ప్రణాళికలేని పట్టణాభివృద్దే ‘గౌహతి’ ముంపు కారణమని ‘అస్సాం రాష్ట్ర విపత్తుల ప్రాధికార సంస్థ’ నివేదించింది. ఇలా ఎక్కడికక్కడ పలు నివేదికలు, సిఫారసులున్నాయి. వాటి అమలే శూన్యం! పేద–మధ్యతరగతికే పెనుశాపం నగరాలు, పట్టణాలు... ఇలా విపత్తుతో ఏవి నీట మునిగినా ఎక్కువ నష్టపోయేది పేద–మధ్యతరగతివారే! ఇళ్లు జలమయం. వండిన వంట, ధాన్యంతో సహా సరుకు నిరుపయోగమౌతోంది. ఉన్నపళంగా ఉపాధి పోతుంది. రవాణా దుర్బరం. మనుగడ కష్టమౌతుంది. ప్రస్తుత సీజన్లో బీహార్‌లో 40 మంది చనిపోతే, ఉత్తరప్రదేశ్‌లో సెప్టెంబరు 26–30 మధ్యలో 110 మంది దుర్మరణం పాలయ్యారు. దాదాపు అంతా అల్పాదాయవర్గాల వారే! దేశంలోని నగరాలు, పట్టణాల్లో పాతిక నుంచి యాబై శాతం జనాభా పేద, అల్పాదాయ వర్గాలే! వాతావరణ మార్పుల మూలంగా రానున్న కాలంలో ఎక్కువ నష్టపోయది వీరేనని అధ్యయనాలు చెబుతున్నాయి. భూతాపోన్నతి వల్ల ఆహారోత్పత్తి తగ్గడం, కొత్త జబ్బులు పెరగటం, వరద–కరువు వంటి పరస్పర విరుద్ధ వైపరీత్యాలు... వీటన్నిటి ప్రత్యక్ష ప్రభావం పేదలపైనే అన్నది నివేదికల సారం! మరో 50 ఏళ్లలో భారత జనాభా 160 కోట్లకు చేరనుందనేదొక అంచనా! అప్పుడు దాదాపు 70 కోట్ల మంది నగరాల్లో నివసిస్తారు. ముంచుకొస్తున్న ‘వాతావరణ మార్పు’ల విపరిణామాలను తట్టుకునే, ఎదుర్కోగలిగే సామర్థ్యాన్ని మన నగరాలు సంతరించుకోకుంటే జీవనం దుర్బరమే! వాతావరణ మార్పు దుష్ప్రభావం వల్ల పేద, ఎదుగుతున్న (మూడో ప్రపంచ) దేశాలకు జరిగే నష్టమే ఎక్కువని అమెరికా ‘జాతీయ శాస్త్ర అధ్యయనాల సంస్థ’ (ఎన్ఏఎస్) నివేదిక చెబుతోంది. ఇది వాతావరణ మార్పుల దెబ్బే! పాలకులు ఇంకా సందేహిస్తున్నారు. పట్టణాలు, నగరాల్లో సమస్య మరింత తీవ్రమవడానికి వాతావరణ మార్పే కారణమంటే వారు నమ్మట్లేదు. బీహార్‌లో 25 ఏళ్ల తర్వాత ఇంతటి వర్షపాతం (10 శాతం ఎక్కువ) నమోదైంది. నెల కింద కురిసిన భారీ వర్షం ముంబాయిని ముంచెత్తినపుడు పక్కనే మరాఠ్వాడాలో కరువు విలయతాండవం చేసింది. చైన్నైలో ఓ యేడు వరదలు ముంచెత్తితే మరో ఏడాది నీటి ఎద్దడి. హైదరాబాద్‌లో ఈ సారి సగటు వర్షపాతం ఎక్కువ నమోదైనా, భూగర్భ జలమట్టాలు పెరక్కపోగా దాదాపు మరో మీటరు అడుక్కుపోయాయి. ఈ విపరీతాలన్నీ ‘వాతావరణ మార్పు’ కాక మరేంటి? వాటినెదుర్కొనే, తట్టుకునే సామర్థ్యాల్ని పెం చుకోవాలి. కేంద్ర, రాష్ట్ర, స్థానిక పాలనా సంస్థలు సమన్వయంతో పనిచేయాలి. నగరాల్లో అక్రమ కట్టడాల్ని అడ్డుకోవాలి. పచ్చదనం పెంచాలి. జల, వాయు కాలుష్యాల్ని అరికట్టి పర్యావరణ పరిరక్షణకు పూనుకోవాలి. ప్రమాదస్థాయిని గ్రహించి ప్రభుత్వాలు, పౌర సమా జం వ్యూహాత్మకంగా జరిపే సమిష్ఠి కృషితోనే నగరజీవికిక మనుగడ! దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
ప్రకృతి వికృతి
తాత్కాలికంగానైనా ఇల్లు వాకిలి వదిలిపెట్టి వెళ్లిపోవడానికి ఈ మధ్య కాలంలో మరో కారణం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అదే ప్రకృతి. భారీ వర్షాలు, వరదలు, తుఫాన్లు కొండచరియలు విరిగిపడడం వంటి ఘటనలతో ప్రపంచదేశాల్లో ప్రజలకు నిలువ నీడ లేకుండా పోతోంది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో వివిధ దేశాల్లో తుపాన్లు ఇతర తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా 70 లక్షల మంది నిరాశ్రయులయ్యారని ది ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ మోనటరింగ్ సెంటర్ వెల్లడించింది. వివిధ దేశాల ప్రభుత్వాలు, ఐక్యరాజ్యసమితి మానవీయ వ్యవహారాలు చూసే సంస్థ, మీడియా నివేదికలు ఆధారంగా ఆ సంస్థ గణాంకాలను రూపొందించి ఒక నివేదికను విడుదల చేసింది. 2003 సంవత్సరం నుంచి ప్రకృతి వైపరీత్యాలపై జరిగిన నష్టాన్ని విశ్లేషించిన ఆ నివేదిక 2019 సంవత్సరం మొదటి ఆరు నెలల్లో వాతావరణంలో వచ్చిన అనూహ్యమైన మార్పులు ప్రజలపై తీవ్ర స్థాయిలో పడ్డాయని వెల్లడించింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ముందస్తుగానే తుపాన్లను గుర్తించి ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు తీసుకోవడం, లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత శిబిరాలకు తరలించడంతో మరణాల రేటు గణనీయంగా తగ్గిందని ఆ నివేదిక వెల్లడించింది. మనిషి ప్రకృతి ముందు మరుగుజ్జే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో తుపాన్లు ఎప్పుడొస్తాయో పసిగడుతున్నాం. పిడుగులు ఎక్కడ పడతాయో అంచనా వేస్తున్నాము. వాన రాకడని తెలుసుకుంటున్నాం. ప్రాణం పోకడని నివారిస్తున్నాం. కానీ ప్రజలు నిరాశ్రయులు కాకుండా ఏమీ చెయ్యలేకపోతున్నాం. టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందినా మనిషి ఎప్పుడూ ప్రకృతి ముందు మరుగుజ్జే. అందులోనూ ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ప్రకృతి ప్రకో పం తారస్థాయికి చేరుకుంది. ఈ ఏడాది చివరి నాటికి ప్రకృతి వైపరీత్యాల కారణంగా 2.2 కోట్ల మంది నిరాశ్రయులు కావచ్చునని ది ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ మానిటరింగ్ సెంటర్ అంచనా వేస్తోంది. ‘‘వాతావరణ మార్పులు భవిష్యత్‌లో మరింత ప్రభావాన్ని చూపిస్తుంది. బహమాస్ వంటి దేశాల్లో తరచూ వానలు ముంచెత్తుతాయి. దీనికి ముందు జాగ్రత్తలు మరింత అవసరం’’ అని మానిటరింగ్ సెంటర్ డైరెక్టర్ అలగ్జాండర్ బిలక్ హెచ్చరించారు. ఏయే దేశాల్లో ఎంతమంది నిరాశ్రయులు ? ► ఫణి తుపాన్ పడగ విప్పడంతో భారత్, బంగ్లాదేశ్ దేశాల్లో నిలువనీడ కోల్పోయినవారు 34 లక్షలు. ఈ తుపాను కారణంగా 100 మంది లోపే ప్రాణాలు పోగొట్టుకున్నారు. ► ఇదాయ్ తుపాన్ దక్షిణాఫ్రికాను ముంచెత్తడంతో 6,17,000 మంది నిరాశ్రయులయ్యారు. వెయ్యి మందికిపైగా మరణించారు. మొజాంబిక్, మాలావీ, జింబాబ్వే, మడగాస్కర్‌లో ప్రజలు ప్రాణాలరచేతుల్లో పెట్టుకొని సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ► గత కొన్ని దశాబ్దాల్లో కనీవినీ ఎరుగని వరదలు ఇరాన్లో సంభవించడంతో 5 లక్షల మంది వరకు చెల్లాచెదురయ్యారు. ► బొలీవియాలో వరదలు, కొండచరియలు విరిగిపడడంతో 70 వేల మంది సొంత ఇళ్లను వీడి వెళ్లిపోయారు. -
సమష్టిగా విపత్తు నిర్వహణ
ఒసాకా: విపత్తు నిర్వహణ విషయంలో జి20 బృందం ప్రపంచదేశాలతో కలిసి కూటమిగా ఏర్పడాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సాధారణంగా విపత్తులు సంభవించినప్పుడు సహాయక చర్యలు, పునరావాసం ఎంత త్వరగా చేపడితే నష్టం అంత తక్కువగా ఉంటుందని తెలిపారు. ఇలాంటి వైపరీత్యాల సమయంలో నిరుపేద ప్రజలే ఎక్కువగా నష్టపోతుంటారని వ్యాఖ్యానించారు. జపాన్‌లోని ఒసాకా నగరంలో జరుగుతున్న జి20 సదస్సులో శనివారం ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘విపత్తులను తట్టుకునే మౌలికవసతుల కల్పన కోసం అంతర్జాతీయ కూటమితో చేతులు కలపాలని జి20 దేశాలను నేను కోరుతున్నాను. ఈ రంగంలో తమ అనుభవాన్ని, నైపుణ్యాన్ని పంచుకోవాలని ఆహ్వానిస్తున్నాను. రండి.. సురక్షితమైన ప్రపంచం కోసం మనమందరం చేతులు కలుపుదాం’ అని మోదీ పిలుపునిచ్చారు. విపత్తులను తట్టుకునే మౌలికవసతుల ఏర్పాటు అన్నది కేవలం అభివృద్ధికి సంబంధించిన విషయం మాత్రమే కాదనీ, ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడంలో ఈ మౌలిక వసతులు ఎంతో కీలకమని వ్యాఖ్యానించారు. బిజీబిజీగా మోదీ.. జి20 సదస్సు చివరి రోజైన శనివారం ప్రధాని మోదీ బిజీబిజీగా గడిపారు. ఇండోనేసియా, బ్రెజిల్, టర్కీ, ఆస్ట్రేలియా, సింగపూర్, చిలీ దేశాల అధినేతలతో వేర్వేరుగా సమావేశమైన మోదీ వాణిజ్యం ఉగ్రవాదంపై పోరు, తీరప్రాంత భద్రత, రక్షణ సహా పలు అంశాలపై చర్చించారు. ఇండోనేసియా అధ్యక్షుడు జొకొ విడోడోతో మోదీ తొలిసారి అధికారికంగా సమావేశం అయ్యారు. ఈ భేటీలో వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, తీర భద్రత రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. అనంతరం బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బాల్సోనారోతో వాణిజ్యం, పెట్టుబడులు, వ్యవసాయం, జీవ ఇంధనాలు, వాతావరణ మార్పు వంటి అంశాలపై మోదీ విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. ఆ తర్వాత టర్కీ అధ్యక్షుడు రెసిప్ తయ్యిప్ ఎర్డోగన్‌ను కలుసుకున్నారు. భారత్–టర్కీల మధ్య పటిష్టమైన భాగస్వామ్యం కొనసాగాలని వారు ఆకాంక్షించారు. ఈ పర్యటనలో భాగంగా సింగపూర్ ప్రధాని లీహసియన్ లూంగ్, చిలీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినెరాలతో ప్రధాని మోదీ సుహృద్భావ పూర్వకంగా సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలపై ఆయా దేశాధినేతలతో వీరు చర్చించారు. కితనా అచ్చేహై మోదీ! భారత ప్రధాని మోదీకి ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ ఇచ్చిన కితాబు ఇది. ఒసాకాలో జరిగిన జి–20 సదస్సుకు హాజరయిన మారిసన్,మోదీలు శనివారం సమావేశమయ్యారు. క్రీడలు, గనుల తవ్వకం, రక్షణ, తీర ప్రాంత భద్రత వంటి విషయాల్లో సహకారాన్ని పెంపొందించుకునేందుకు ఇరువురు అంగీకరించారు. ఆ సందర్భంగా మారిసన్ ప్రధాని మోదీతో సెల్ఫీ దిగారు. దాన్ని ట్విట్టర్లో పెట్టారు. ఆ ఫొటోకు ‘కితనా అచ్చే హై మోదీ’అని కాప్షన్ ఇచ్చారు. దాన్ని చూసి మోదీ మురిసిపోయారు. ఆస్ట్రేలియా ప్రధాని ట్వీట్‌కు స్పందిస్తూ మారిసన్ను ‘మేట్’అని సంబోధించారు. ఆస్ట్రేలియా భాషలో మేట్ అంటే స్నేహితుడని అర్థం. భారత్–ఆస్ట్రేలియా సంబంధాల పట్ట సంతోషంగా ఉన్నానని మోదీ ట్వీట్ చేశారు.‘కితనా అచ్చే హై మోదీ అంటూ హిందీలో నన్ను అభినందించడం ద్వారా ఈ ట్వీట్‌ను వైరల్ చేశారు.దానికి నేను కృతజ్ఞుడిని’అని మోదీ తన ట్వీట్లో పేర్కొన్నారు. -
విపత్తులో.. సమర్థంగా..
సాక్షి, హైదరాబాద్: ప్రకృతి వైపరీత్యాల సమర్థ నిర్వహణకు కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) పరిశోధనశాలలు తమవంతు కృషి చేస్తున్నాయని సంస్థ డైరెక్టర్ జనరల్ శేఖర్ సి.మండే తెలిపారు. ఇటీవలి ఫానీ తుపాను సమయంలో చెన్నైలోని సీఎస్ఐఆర్ పరిశోధన సంస్థ ఎస్ఈఆర్సీ డిజైన్ చేసి, రెడ్‌క్రాస్ సంస్థ నిర్మించిన తుపాను బాధితుల కేంద్రాలు ఎంతో ఉపయోగపడ్డాయని, అలాగే గుజరాత్‌లోని మరో పరిశోధన సంస్థ తుపాను బాధితులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు మొబైల్ నీటి శుద్ధీకరణ ప్లాంట్లను సరఫరా చేసిందని చెప్పారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)లో పద్మభూషణ్ ఎ.వి.రామారావు ‘కిలో’ల్యాబ్‌ను ఆవిష్కరించిన సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో శేఖర్ మాట్లాడుతూ, తుపాను బాధితులకు అందించే ఆహారం శుభ్రంగా ఉండేందుకు, ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చేసేందుకు మైసూరులోని సీఎస్ఐఆర్ సంస్థ సీఎఫ్టీఆర్ఐ ప్రత్యేక ప్యాకేజింగ్‌ను అభివృద్ధి చేసిందని, దీని సాయంతో అతితక్కువ కాలంలోనే పెద్ద సంఖ్యలో ఆహారపు పొట్లాలను సిద్ధం చేయగలిగామ ని వివరించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో సముద్రపు నీటితోపాటు ఎలాంటి మురికి నీటినైనా శుద్ధి చేసి గంటకు నాలుగు వేల లీటర్ల తాగునీరు ఇవ్వగల మొబైల్ వ్యాన్ పూర్తిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేశామని తెలిపారు. దేశం మొత్తమ్మీద పదుల సంఖ్యలో సీఎస్ఐఆర్ సంస్థలు ఉన్నాయని.. వేర్వేరు పరిశోధన సంస్థలు కలిసికట్టుగా ప్రాజెక్టులు చేపట్టడం కూడా ఇటీవలి కాలంలో ఎక్కువగా జరుగుతోందని, వ్యవసాయ సంబంధిత ఆగ్రో మిషన్‌లో ఎనిమిది సంస్థలు పాల్గొంటుండగా.. ఫార్మా మిషన్‌లోనూ ఐదు సంస్థలు భాగస్వాములుగా పనిచేస్తున్నాయని వివరించారు. కిలో ల్యాబ్ ప్రత్యేకమైంది: శ్రీవారి చంద్రశేఖర్ ఐఐసీటీ ప్రాంగణంలో ఆవిష్కృతమైన పద్మభూషణ్ ఎ.వి.రామారావు కిలో ల్యాబ్ చాలా ప్రత్యేకమైందని.. అత్యంత పరిశుద్ధమైన వాతావరణంలో మం దుల తయారీకి అవసరమైన రసాయనాలను పెద్ద ఎత్తున తయారు చేసేందుకు వీలు కల్పిస్తుందని ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ తెలిపారు. సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ శేఖర్‌తో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆయన ల్యాబ్ ప్రత్యేకతలను వివరించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇలాంటి పరిశోధనశాల ఏర్పాటు కావడం ఇదే తొలిసారి అని తెలిపారు. మొత్తం రూ.పదికోట్ల వ్యయంతో నిర్మించామని, ఫార్మా రంగపు స్టార్టప్ కంపెనీలు, చిన్న, మధ్య స్థాయి కంపెనీలు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చునని చెప్పారు. యాంటీ వైరల్, కేన్సర్ చికిత్సకు ఉపయోగించే అత్యంత ప్రమాదకరమైన రసాయనాలతోనూ సురక్షితంగా పనిచేసేందుకు ఇందులో ఏర్పాట్లు ఉన్నాయన్నారు. ఈ పరిశోధన శాలలో తయారైన రసాయనం మరే ఇతర శుద్ధీకరణ అవసరం లేకుండా ఫార్మా కంపెనీలు క్లినికల్ ట్రయల్స్ కోసం వాడుకోవచ్చునన్నారు. 2021 నాటికి దేశీయంగానే కీటకనాశినులు, పురుగుల మందులు తయారు చేసేందుకు ఐఐసీటీ ప్రయత్నాలు చేస్తోందని.. డ్యూపాంట్, సిన్జెంటా తదితర అంతర్జాతీయ కంపెనీల 15 కీటకనాశినుల పేటెంట్లకు కాలం చెల్లనున్న నేపథ్యంలో వాటిని మరింత మెరుగుపరిచి సొంతంగా తయారు చేస్తామని చెప్పారు. -
పంటల బీమాకు జగన్ పూచీ!
అది 2018, అక్టోబర్ 11 రాత్రి.. తిత్లీ తుపాను శ్రీకాకుళం జిల్లాపై విరుచుకుపడింది. గంటల వ్యవధిలోనే వేలాది మంది రైతులు సర్వస్వాన్నీ కోల్పోయి కట్టు బట్టలతో మిగిలారు. 120 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో వీచిన పెనుగాలులు, ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా కురిసిన కుండపోత వర్షానికి వేలాది ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. అటువంటి వారిలో శ్రీకాకుళం జిల్లా గార గ్రామానికి చెందిన బడగల నర్సింహమూర్తి ఒకరు. ఆయన తనకున్న రెండెకరాల్లో సాంబమసూరి వరిని సాగు చేస్తున్నాడు. పొట్ట దశలో ఉంది. మంచి దిగుబడి వస్తుందనుకుంటున్న దశలో వచ్చిన ఈ తుపాను ఆయన్ను మరింత నిరుపేదగా మార్చింది. భారీ నష్టాల పాల్జేసింది. ఇలా ఎందరో.. మరెందరో.. రేయనక.. పగలనక.. కష్టమనక.. అప్పులనక.. ఒళ్లు హూనం చేసుకొని ఆరుగాలం శ్రమించి పంట పండిస్తే చేతికొచ్చే సమయానికి ప్రకృతి వైపరీత్యాలు వచ్చి నష్టపోవడంతో రైతన్నకు కన్నీరే మిగులుతోంది. ఈ క్రమంలో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టి సాగు భారమై చాలామంది కాడి కింద పడేస్తున్నారు. కౌలు రైతుల పరిస్థితి అయితే మరింత దయనీయం. ఈ పరిస్థితుల్లో స్వాతంత్య్రం వచ్చిన మూడేళ్ల తర్వాత భారతీయ పార్లమెంటు బీమా పథకాన్ని ప్రారంభించబోతున్నట్టు ప్రకటిస్తే అది గాడిన పడడానికి 22 ఏళ్లు పట్టింది. 1972లో పంటల బీమా పథకం ప్రారంభమైతే ఇప్పటికీ ఆ సంఖ్య 3 కోట్లకు దాటకపోవడం గమనార్హం. రాష్ట్రంలోనైతే ఈ సంఖ్య 16 లక్షలకు మించలేదు. దేశంలో ఈవేళ సుమారు 12 కోట్లకు పైగా రైతు కుటుంబాలు ఉన్నట్టు కేంద్రం ఇటీవల ప్రకటించింది. బీమాకు ఎందుకింత ప్రాధాన్యత..? ప్రకృతి వైపరీత్యాలు, మార్కెట్ గిట్టుబాటు లేక, ఆర్థిక ఇక్కట్లతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న దశలో ఈ పథకానికి ప్రాధాన్యం వచ్చింది. రైతులకు ఆసరాగా నిలవాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రధాన మంత్రి ఫసల్ బీమా, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాలను అమలు చేస్తోంది. సాగు చేసిన పంటలకు అనుగుణంగా స్వల్ప మొత్తంలో ప్రీమియం చెల్లిస్తే విపత్తుల కారణంగా పంట నష్టపోయిన సందర్భాల్లో బీమా వర్తిస్తుంది. తిత్లీ, హుద్‌హుద్, ఫైలిన్ వంటి తుపాన్లు, ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయే అన్నదాతలకు పంటల బీమా పథకం ఉడతాభక్తిగా తోడ్పడుతుంది. బ్యాంకుల నుంచి రుణం తీసుకునే రైతులకు పంటల బీమాను అనివార్యం చేశారు. ఏ పంటకు రుణం తీసుకుంటున్నారో ఆ పంటకు బ్యాంకులే ప్రీమియంను మినహాయించి ప్రభుత్వం గుర్తించిన బీమా కంపెనీలకు చెల్లిస్తాయి. బ్యాంకు నుంచి అప్పు తీసుకోని రైతులు, వాస్తవ సాగుదార్లయిన కౌలు రైతులు సైతం స్వయంగా ఫసల్ బీమా పథకంలో చేరే అవకాశం ఉన్నా, చేరుతున్న వారి సంఖ్య పరిమితమే. కౌలు రైతులు వ్యవసాయ శాఖ, రెవెన్యూశాఖ జారీ చేసిన పంట సాగు ధ్రువపత్రం, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్ ప్రతులను అధికారులకు అందజేసి బీమా చెల్లించవచ్చు. అతివృష్టి, అనావృష్టితో పంటలకు తీవ్ర నష్టం జరిగితే నిబంధనల మేరకు బీమా చెల్లిస్తారు. అగ్ని ప్రమాదం, పిడుగుపాటు, గాలివాన, తుపాను తదితర ప్రతికూల వాతావరణం వల్ల జరిగిన పంటనష్టాన్ని పంటకోత ప్రయోగాల యూనిట్ దిగుబడుల అంచనా ప్రకారం చెల్లిస్తారు. పంట కోత తరవాత పొలంలో ఉంచిన పంటకు 14 రోజుల వరకూ అకాల వర్షాలకు, తుపానువల్ల నష్టం వాటిల్లితే వ్యవసాయ క్షేత్రం నుంచి బీమా రక్షణ లభిస్తుంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ప్రధాన మంత్రి పంటల బీమా కింద రైతులు ఖరీఫ్‌లో 2 శాతం, రబీలో 1.5 శాతం ప్రీమియం చెల్లించాలి. అదే ఉద్యానపంటల రైతులతే 5 శాతం చెల్లించాలి. మిగతా మొత్తాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం చెల్లిస్తాయి. అయితే, ఈ పథకంపై రైతుల్లో సరిగ్గా అవగాహన లేకపోవడం, బీమా కంపెనీల నిర్లక్ష్యం, పాలకుల అలసత్వం కారణంగా ఎక్కువమంది ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. 2016 ఖరీఫ్‌లో రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా, ఆర్.డబ్లు్య.బి.సి.ఐ.ఎస్. కింద 15.09 లక్షల మంది రైతులు మాత్రమే బీమా చేయించుకున్నారు. అంటే, రాష్ట్రంలో సుమారు 85 లక్షల మంది వరకు రైతులు ఉన్నారనుకుంటే కనీసం నాలుగోవంతు కూడా పంటల బీమాను చెల్లించలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా కింద చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాలను చెల్లించకపోవడం వల్లే రైతులకు సకాలంలో బీమా పరిహారాన్ని చెల్లించలేకపోతున్నామని కంపెనీలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నవరత్నాలలో భాగంగా వైఎస్సార్ రైతుభరోసా పథకాన్ని ప్రకటించారు. ఇందులో ఒక ముఖ్యమైన అంశం రైతులకు ఉచిత పంటల బీమా. పంటల బీమా గురించి రైతులు ఆలోచించాల్సిన పని లేదని వైఎస్ జగన్ రైతులకు భరోసా ఇచ్చారు. అంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక రైతులు తమ వాటా కింద ప్రస్తుతం ఖరీఫ్‌లో చెల్లిస్తున్న 2 శాతం, రబీలో చెల్లించే 1.5 శాతం మొత్తాన్నీ రాష్ట్రప్రభుత్వమే చెల్లిస్తుంది. బీమా బాధ్యతను తానే తీసుకొని రైతులకు మేలు చేస్తుంది. ఏదయినా విపత్తు సంభవించినప్పుడు రైతులకు బీమా కంపెనీల నుంచి క్లెయిమ్ వచ్చేలా చేస్తుంది. రైతులను ఆదుకుంటుంది. అలా చేయడం వల్ల అన్నదాతలందరికీ ఆలంబన దొరుకుతుంది. గట్టి మేలు జరుగుతుంది. ఇటీవల ప్రకటించిన ప్రధాన మంత్రి ఫసల్ బీమా పథకాన్ని దేశ వ్యాప్తంగా ఎంతగా కీర్తిస్తున్నారో వైఎస్ జగన్ ప్రకటించిన ఈ ఉచిత బీమా పథకాన్ని రైతు ప్రముఖులు అంతగా కొనియాడుతున్నారు. – ఎ. అమరయ్య, చీఫ్ రిపోర్టర్, సాక్షి -
వణుకుతోన్న మలెనాడు
పచ్చని అడవులు, మేఘాలను తాకేఎత్తైన పర్వతాలు, లోతు ఎంతో తెలియని లోయలు, కాఫీ తోటలు.. ఇలా ఎన్నెన్నో అందాలతో మైమరిపించే మలెనాడు ఇప్పుడ ప్రకృతి విపత్తుల గుప్పిట్లోచిక్కుకుంది. మనిషి స్వార్థం ఈ సుందర ప్రాంతం భవితను అగమ్య గోచరంచేసింది. ప్రతి ఏటా వేలాది ఎకరాల్లోఅడవులను కొట్టి తోటలు, ఇళ్లునిర్మించడం, భూ పరిరక్షణనుగాలికొదిలేయడం తదితర చర్యలతో ప్రకృతి మాత క్షోభిస్తోందా అన్నట్లు తరచూ విపత్తులు పలకరిస్తున్నాయి. సాక్షి, బెంగళూరు: గతేడాది అకాల వర్షాలు, అతివృష్టితో మలెనాడు (హాసన్, శివమొగ్గ, చిక్కమగళూరు, ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, కొడగు, ఉడుపి జిల్లాలు) ప్రాంతం ఉక్కిరిబిక్కిరి అయింది. ఇటీవల కాలంలో మంకీ ఫీవర్ రూపంలో మరోసారి ముప్పు వాటిల్లింది. ఇక ఇదే క్రమంలో గత రెండు, మూడు రోజుల నుంచి మలేనాడు ప్రాంతంలోని శివమొగ్గ జిల్లా వాసులను భూకంపం భయభ్రాంతులకు గురిచేస్తోంది. గత రెండు రోజుల క్రితం శివమొగ్గ జిల్లాలోని తీర్థహళ్లి–హోసనగర తాలూకా సరిహద్దు భాగాల్లో భూమి కంపిస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. సోమవారం మళ్లీ ప్రకంపనలు ఈ నెల 2న అర్ధరాత్రి 1.33 గంటలకు హోసనగర, తీర్థహళ్లి తాలూకా సరిహద్దులో స్వల్పంగా భూమి కంపించిన విషయం తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం మరోసారి భూమి కంపించింది. పశ్చిమ ఘాట్ ప్రాంతంలో ఎదురవుతున్న ప్రమాదాలకు ఇవి ముందస్తు హెచ్చరికలగా భావించవచ్చనని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తీర్థహల్లి తాలూకాలో మాణి జలశయం సమీపంలో విఠల నగర వద్ద భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. భారీ భూకంపమే వస్తే? విఠల నగర ప్రాంతంలోనే వారాహి, మాణి, సావేహళ్లు, శరావతి జలాశయాలు ఉన్నాయి. ఈ క్రమంలో భూకంపం తీవ్రత పెరిగితే నష్టం అంచనాలకు అందకపోవచ్చు. విఠల నగరలో మూడో సారి భూకంపం రావడం గమనార్హం. గతంలో 1843లో ఏప్రిల్ 1న రిక్టర్ స్కేల్‌పై 5 స్థాయిలో, 1975లో మే 12న 4.7 స్థాయిలో భూకంపాలు సంభవించాయి. 2010లోనే నిపుణుల హెచ్చరిక పశ్చిమ ఘాట్ పరిధిలో శరావతి లోయ సున్నిత ప్రాంతం. ఇక్కడ నేల పొరలు పొరలుగా నిర్మితమైంది. దీంతో భూకంపం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అధిక సంఖ్యలో జలాశయాలు ఉండడం, మనిషి పట్టణీకరణ కోసం అడవులను నాశనం చేయడం వల్ల ప్రకృతి కోపానికి కారణమవుతోందని 2010లో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందింది. భారతీయ విజ్ఞాన సంస్థ శాస్త్రవేత్తలు శరావతి లోయలో అధ్యయనం చేసి భూకంపం సంభవించే అవకాశం ఎక్కువగా ఉందని నివేదిక సమర్పించారు. ఈ ప్రాంతంలోని అడవులను నాశనం చేయడంతో పాటు, చాలా ఆనకట్టలు అపాయకర స్థితిలో ఉన్నాయని హెచ్చరించారు. భూమి లోపల ఫలకాలు స్థానభ్రంశం చెందే అవకాశం ఉందని, వాటి వల్ల భూకంపాలు సంభవిస్తాయని 2010లో హెచ్చరికలు పంపారు. అలాగే అగ్నిప్రమాదాలు కూడా జరుగుతాయని సూచించారు. ఏ క్షణంలో ఏమైనా జరగొచ్చనే హెచ్చరికలను నివేదిక ద్వారా ప్రభుత్వానికి పంపారు. -
ప్రకృతి ప్రళయం...మనుషుల హననం
సైన్స్ సాయంతో ప్రకృతిని నాశనం చేయగల్గుతున్న మానవుడు.. ఆ సైన్సే ఆయుధంగా ప్రకృతి విధ్వంసాలను ఎదుర్కోగల్గుతున్నాడా? అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో తుపానులు, వరదలు వంటి ప్రకృతి విపత్తులను ముందుగానే గుర్తించి ప్రజలను అప్రమత్తుల్ని చేయడం ద్వారా ఇటీవలి కాలంలో ప్రాణ, ఆస్తి నష్టాలను గణనీయంగా తగ్గించగలుగుతున్నాం. అయితే, ప్రపంచ దేశాలతో పోలిస్తే గతేడాది ప్రకృతి విపత్తు మరణాల్లో మన దేశం రెండో స్థానంలో ఉంది. గతేడాది మన దేశంలో ప్రకృతి విపత్తుల వల్ల 2,736 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,978 మరణాలతో ప్యూర్టోరికా మొదటి స్థానంలో ఉంది. అయితే, ప్రకృతి వైపరీత్యాలకు ఎక్కువగా ప్రభావితమయ్యే దేశాల్లో (ఆస్తినష్టం) భారత్ 14వ స్థానంలో ఉంది. 181 దేశాలకు ర్యాంకులు: ప్రపంచవ్యాప్తంగా వరదలు, తుపాన్లు,టోర్నడోలు, శీతలపవనాలు, వేడి గాలుల వంటి ప్రకృతి వైపరీత్యాలకు దెబ్బతినే దేశాల జాబితాను జర్మనీకి చెందిన జర్మన్వాచ్ అనే స్వతంత్ర సంస్థ ఏటా విడుదల చేస్తుంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల లక్ష మంది జనాభాకు ఎంతమంది చనిపోయారు, జీడీపీలో ఒక యూనిట్‌కు ఎంత నష్టం వచ్చింది అన్న అంశాల ఆధారంగా ‘క్లైమేట్ రిస్క్ ఇండెక్స్(సీఆర్ఐ)’పేరుతో జాబితా విడుదల చేస్తుంది. పోలెండ్‌లోని కటోవైస్‌లో ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు జరుగుతున్న నేపథ్యంలో జర్మన్వాచ్ 2017 జాబితాను విడుదల చేసింది. దీనిలో 181 దేశాలకు ర్యాంకులు ఇచ్చింది. ప్రాణ నష్టానికి సంబంధించి ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న భారత్, ఆస్తి నష్టంలో14వ స్థానంలో ఉంది. 2016లో 6వ స్థానంలో, 2015లో నాలుగో స్థానంలో ఉన్న భారత్ ప్రకృతి విపత్తులను సమర్థంగా ఎదుర్కోవడంతో పరిస్థితిని మెరుగుపరుచుకొని తాజా జాబితాలో14వ స్థానానికి చేరింది. ప్యూర్టోరికా అమెరికాలో భాగమే అయినప్పటికీ, అక్కడి విభిన్న వాతావరణ పరిస్థితుల ఆధారంగా దాన్ని ప్రత్యేక దేశంగా చూపించినట్టు జర్మన్ వాచ్ పేర్కొంది. రెండు దశాబ్దాల్లో 73 వేల ప్రాణాలు.. కాగా, గత 20 సంవత్సరాల్లో (1998–2017) ప్రకృతి విపత్తుల వల్ల భారత దేశం 73 వేల మంది ప్రాణాలను, రూ.1.82 లక్షల కోట్ల ఆస్తిని కోల్పోయిందని తాజా నివేదిక తెలిపింది. 2017లో ఈ విపత్తుల వల్ల భారతదేశం రూ. 9.84 వేల కోట్ల డాలర్ల విలువైన ఆస్తి నష్టపోయింది. 2017లో ప్రపంచవ్యాప్తంగా 11,500 మంది ప్రాణాలు కోల్పోయారని, రూ.2267 లక్షల కోట్ల ఆస్తినష్టం వాటిల్లిందని పేర్కొంది. బడుగు దేశాలే వణికిపోతున్నాయి.. ప్రమాదాలను గుర్తించే ఆధునిక సాంకేతికత కొరతతో ప్రకృతి వైపరీత్యాలకు ధనిక దేశాల కంటే బడుగు దేశాలే ఎక్కువ ప్రభావితమవుతున్నాయి. అయితే, 2017 హరికేన్ సీజన్లో ధనిక దేశాలు కూడా దెబ్బతిన్నాయని తాజా నివేదిక వెల్లడించింది. -
‘విపత్తు పన్ను’ అధ్యయనానికి జీవోఎం
న్యూఢిల్లీ: ప్రకృతి విపత్తుల సమయంలో నిధుల సమీకరణకు విపత్తు పన్ను విధింపుపై అధ్యయనానికి ప్రభుత్వం మంత్రుల బృందాన్ని(జీవోఎం) ఏర్పాటుచేసింది. బిహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్‌కుమార్ మోదీ దీనికి నేతృత్వం వహించనున్నారు. అక్టోబర్ 31 నాటికి ఈ కమిటీ జీఎస్టీ మండలికి నివేదికను సమర్పిస్తుందని అధికారిక ప్రకటన వెలువడింది. ప్రకృతి విపత్తుల బారినపడిన రాష్ట్రాలను ఆదుకునేందుకు కొన్ని వస్తువులపై అదనపు పన్ను విధించేందుకు చట్టబద్ధంగా ఉన్న అవకాశాలను పరిశీలించడానికి కమిటీ ఏర్పాటుచేయాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో సమావేశమైన జీఎస్టీ మండలి నిర్ణయించింది. జీఎస్టీ మండలి లేవనెత్తిన పలు కీలక అంశాలను మంత్రుల బృందం పరిశీలించనుంది. ప్రభావిత రాష్ట్రంపైనే కొత్త పన్నును విధించాలా? లేక మొత్తం దేశానికి వర్తింపచేయాలా? ఏయే వస్తువులపై అదనపు పన్ను విధించాలి? విపత్తులను ఎదుర్కోవడానికి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాల సామర్థ్యం సరిపోతుందా? విపత్తు పన్నును ఏయే పరిస్థితుల్లో విధించాలి? తదితరాలపై అధ్యయనం చేస్తుంది. అసోం ఆర్థిక మంత్రి హిమంత బిశ్వ శర్మ, కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్, పంజాబ్ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్‌సింగ్ బాదల్, ఒడిశా ఆర్థిక మంత్రి శశిభూషణ్ బెహరా, మహారాష్ట్ర ఆర్థిక మంత్రి సుధీర్ ముర్గానిత్వార్, ఉత్తరాఖండ్ ఆర్థిక మంత్రి ప్రకాశ్ పంత్‌లకు కమిటీలో చోటు కల్పించారు. -
సాయానికి ఆర్నెల్లు ఆగాల్సిందే!
న్యూఢిల్లీ/కొచ్చి: ప్రకృతి ప్రకోపానికి తీవ్రంగా దెబ్బతిన్న కేరళకు పూర్తిస్థాయిలో ఆర్థిక సాయం లేదా ప్యాకేజీ అందించేందుకు కనీసం 3 నుంచి 6 నెలల సమయం పట్టే అవకాశముందని హోంశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నష్టాన్ని పూర్తిగా అంచనా వేయడం దగ్గరి నుంచి నిధుల విడుదల వరకూ ఇదో సుదీర్ఘ ప్రక్రియ అని వెల్లడించారు. విపత్తుల సందర్భంగా నిధుల విడుదలపై ప్రస్తుతం అమల్లో ఉన్న మార్గదర్శకాల ప్రకారం.. సాధారణ రాష్ట్రాల విపత్తు సహాయ నిధి(ఎస్డీఆర్ఎఫ్)కి 75 శాతం, ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు 90 శాతం నిధులను కేంద్రం అందజేస్తుందన్నారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఆయా రాష్ట్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని కేంద్రం భావిస్తే సదరు రాష్ట్రాలకు ఇవ్వాల్సిన సాయంలో గరిష్టంగా 25 శాతం నిధుల్ని ముందస్తుగా విడుదల చేయొచ్చు. ఈ మొత్తాన్ని ఆ తర్వాతి వాయిదాలో సర్దుబాటు చేస్తారు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన కేరళ పునర్నిర్మాణానికి నెల రోజుల వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని దేశ, విదేశాల్లో ఉన్న మలయాళీలకు ఆ రాష్ట్ర సీఎం విజయన్ పిలుపునిచ్చారు. ఓ నెల వేతనం మొత్తాన్ని వదులుకోవడం కష్టమైన విషయమనీ, నెలకు 3 రోజుల వేతనం చొప్పున పది నెలల పాటు అందించి ప్రజలను ఆదుకోవాలన్నారు. కేరళ కోసం గాంధీజీ విరాళాలు సేకరించిన వేళ.. తిరువనంతపురం: దాదాపు వందేళ్ల క్రితం కూడా కేరళలో ఇప్పటి స్థాయిలో వరదలు విధ్వంసం సృష్టించాయి. దీంతో మహాత్మా గాంధీ కేరళ ప్రజలను ఆదుకోవాలని దేశ ప్రజలకు పిలుపునివ్వగా చాలామంది ఉదారంగా స్పందించారు. 1924, జూలైలో మలబార్ (కేరళ)లో వరదలు విలయతాండవం సృష్టించాయి. ఈ నేపథ్యంలో ఊహకందని నష్టం సంభవించిందని యంగ్ ఇండియా, నవజీవన్ పత్రికల్లో గాంధీజీ వ్యాసాలు రాశారు. మలయాళీలను ఆదుకోవడానికి ముందుకు రావాలని కోరారు. దీంతో చాలామంది స్త్రీలు తమ బంగారు ఆభరణాలు, దాచుకున్న నగదును దానం చేయగా, మరికొందరు రోజుకు ఒకపూట భోజనం మానేసి మిగిల్చిన సొమ్మును సహాయ నిధికి అందించారు. ఈ విషయాన్ని గాంధీజీ స్వయంగా తాను రాసిన కథనాల్లో ప్రస్తావించారు. ఓ చిన్నారి అయితే మూడు పైసలను దొంగలిం చి వరద బాధితుల కోసం ఇచ్చిందని గాంధీ వెల్లడించారు. 6,994 రూపాయల 13 అణాల 3 పైసలు వసూలైనట్లు చెప్పారు. -
కేరళను మినహాయించండి
న్యూఢిల్లీ: ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో విదేశీ సాయం తీసుకోరాదన్న పాలసీ నుంచి కేరళకు ఒక్కసారి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర మంత్రి అల్ఫోన్స్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) కేరళకు అందించాలనుకున్న రూ.700 కోట్ల సాయానికి కేంద్రం మోకాలడ్డటంపై ఆయన ఈ మేరకు స్పందించారు. ‘గత 50 ఏళ్లలో కేరళ కారణంగా దేశానికి భారీ విదేశీ మారకద్రవ్యం లభించింది. 2017లో మలయాళీలు స్వదేశానికి రూ.75,000 కోట్ల విదేశీ మారకాన్ని పంపారు. దేశంలో అతిపెద్ద పర్యాటక కేంద్రాల్లో కేరళ ఒకటి. ఈ కారణాలరీత్యా కేరళ వరదలను ప్రత్యేక పరిస్థితిగా పరిగణించి, విదేశీ సాయంపై ఒక్కసారి మినహాయింపు ఇవ్వాలని జూనియర్ మంత్రిగా నా సీనియర్లకు విజ్ఞప్తి చేస్తున్నా’ అని అల్ఫోన్స్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దాదాపు 2 లక్షల కుటుంబాలు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నాయనీ, వాళ్లకు కనీసం దుస్తులు, ఆహారం, స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో లేదని పేర్కొన్నారు. ఇలాంటివారిని ఆదుకోవడానికి పెద్దమొత్తంలో నగదు అవసరమని వ్యాఖ్యానించారు. కాగా, అంతకుముందు కేరళ ఆర్థికమంత్రి థామస్ ఐజాక్ మాట్లాడుతూ.. తాము రూ.2,200 కోట్లు సాయం కోరితే కేంద్రం మాత్రం రూ.600 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం వ్యవహారశైలి ‘అమ్మ తాను అన్నం పెట్టదు. అడుక్కుని అయినా తిననివ్వదు’ రీతిలో ఉందని ఘాటుగా విమర్శిచారు. మరోవైపు, యూపీఏ హయాంలో జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న శివశంకర్ మీనన్ మాట్లాడుతూ.. దీర్ఘకాలిక పునరావాస కార్యక్రమాలకు విదేశీ సాయం స్వీకరించడంపై ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. కేవలం సహాయ కార్యక్రమాలకు విదేశీ సాయం తీసుకోకూడదని మాత్రమే 2004లో మన్మోహన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. విదేశీ సాయం స్వీకరించొచ్చు: ఎన్డీఎంఏ అత్యవసర పరిస్థితుల్లో విదేశాలు మానవతా దృక్పథంతో అందించే ఆర్థిక సాయాన్ని కేంద్రం ఆమోదించొచ్చని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) 2016లో రూపొందించిన ఓ పత్రం వెల్లడించింది. కేరళ వరద బాధితులకు యూఏఈ సాయం ప్రకటించడంపై వివాదం నెలకొన్న నేపథ్యంలో ఈ విషయం వెలుగుచూసింది. జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక(ఎన్డీఎంపీ) పేరిట తెచ్చిన ఆ పత్రంలో ‘ఏదైనా విపత్తు తలెత్తినప్పుడు విదేశీ సాయానికి అర్థించకూడదనేది జాతీయ విధానంలో భాగం. కానీ విదేశాలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి విపత్తు బాధితులకు అండగా ఉంటామంటే, ఆ సాయాన్ని కేంద్రం ఆమోదించొచ్చు’ అని ఉంది. దానిలో ప్రధాని మోదీ, హోం మంత్రి రాజ్‌నాథ్‌ల సందేశాలు ఉన్నాయి. విదేశీ సాయాన్ని ఎలా వినియోగించుకోవాలో విదేశాంగ శాఖతో కలసి హోం శాఖ నిర్ణయిస్తుందని పత్రం తెలిపింది. ఎన్‌డీఎంపీపై వ్యాఖ్యానించేందుకు హోంశాఖ అధికారులు నిరాకరించారు. -
ప్రకృతి సమతుల్యత లేకే విపత్తులు
సాక్షి, అమరావతి : ప్రకృతి, సంస్కృతులను పరిరక్షించుకోవడం ద్వారానే మంచి భవిష్యత్తు ఉంటుందని, సమతుల్యత దెబ్బతింటున్నందునే అనేక ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. పర్యావరణ హితంగా భవనాల రూపకల్పన బాధ్యత యువ ఆర్కిటెక్ట్‌లపై ఉందని, స్మార్ట్ ఇండియాలో కీలకపాత్ర పోషించాలని సూచించారు. విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (ఎస్పీఏవీ) 3వ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి సమతుల్యత దెబ్బతినడంవల్ల ఇటీవల కేరళ, అంతకు ముందు చెన్నై, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో ఏర్పడిన విపత్తులను ఉదాహరించారు. యువ ఆర్కిటెక్టులకు రానున్న కాలంలో అనేక అవకాశాలున్నాయన్నారు. నేటి భవనాల నిర్మాణాల్లో తగిన భద్రతా చర్యలు చేపట్టడంలేదని, భవన ప్లాను రూపకల్పన సమయంలోనే వీటన్నిటినీ తప్పనిసరిచేయాలని ఆయన సూచించారు. పచ్చదనం, పరిశుభ్రత కలిగిన నగర నిర్మాణాలను చేపట్టాల్సిన, అందుకు అనుగుణమైన ప్రణాళికలు రూపొందించాల్సిన బాధ్యత యువ ఆర్కిటెక్టులపై ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలసలు పెరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో యువ ఆర్కిటెక్టులపై మరింత బాధ్యత పెరుగుతుందన్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో విజన్ ఉన్న నేతలని కొనియాడారు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన అభివృద్ధితో దేశం ముందుకు వెళ్తోందని, ఈ తరుణంలో యువతకు రానున్న కాలంలో అనేక అవకాశాలు అందుబాటులో ఉంటాయన్నారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీలో ఐఐటీ, ఎయిమ్స్, ఎన్ఐటీ వంటి అనేక ఉన్నత విద్యా సంస్థలు నెలకొంటున్నాయని, ఎస్‌పీఏవీకి అత్యద్భుతమైన భవనం సమకూరడం ఎంతో ఆనందదాయకమన్నారు. గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో.. వేదాల కాలం నుంచే భవన నిర్మాణాలపై అనేక అంశాలు పొందుపరిచి ఉన్నాయని వివరించారు. నేటి భవనాలలో అనేక లోపాలుంటున్నాయని, రానున్న కాలంలో అన్ని మౌలిక వసతులతో పర్యావరణానికి హాని కలగని రీతిలో భవనాలుండేలా ఆర్కిటెక్టు విద్యార్థులు ముందుకు వెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబు, కేంద్ర మానవ వనరుల శాఖ కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎస్పీఏవీ చైర్మన్ బృందా సోమయా, డైరక్టర్ మీనాక్షి జైన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయస్థాయిలో బంగారు పతకాలు సాధించిన 10 మందికి ఉత్తమ పరిశోధనలు చేసిన 12 మందికి అవార్డులు అందించారు. 2017, 2018లలో విద్యాభ్యాసం పూర్తిచేసిన 280 మంది విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేశారు. అంతకుముందు.. విజయవాడలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ సంస్థ నూతన భవనాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు ప్రారంభించారు. -
యూఏఈ ఆఫర్ తిరస్కరణ: రూ.2600 కోట్లు ఇవ్వండి
హైదరాబాద్ : భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన కేరళను ఆదుకునేందుకు రూ.700 కోట్ల ఆర్థిక సహాయంతో ముందుకొచ్చిన యూఏఈ ఆఫర్‌ను కేంద్రం తిరస్కరించడంపై పలువురు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు కేంద్రం రూ.700 కోట్ల యూఏఈ ఆఫర్‌ను తిరస్కరించడంతో, తాత్కాలిక సహాయం కింద వెనువెంటనే కేరళకు రూ.2600 కోట్లను ప్రకటించాలని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ) డిమాండ్ చేసింది. ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో విదేశీ సాయం విషయంలో కేంద్రం తప్పుడు ప్రతిష్టపై నిలబడి ఈ ఆఫర్‌ను తిరస్కరిస్తుందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఆరోపించారు. నిజంగా దేశ ప్రతిష్టను నిలబెట్టుకోవాలని మోదీ ప్రభుత్వం కోరుకుంటే ఎమిరేట్స్ కన్నా ఎక్కువగా, కేరళ కోరినంత రూ.2600 కోట్ల ఆర్థిక సహాయాన్ని స్వయంగా ప్రకటించాలని కోరారు. ఒక దేశం ప్రకృతి విపత్తు భారీన పడినప్పుడు, ఇతర దేశాలు సహాయం చేయడం సర్వసాధారణమని.. భారత్ కూడా గతంలో ఇలాంటి సమయాల్లో నేపాల్, బంగ్లాదేశ్‌లకు సహకరించిందని పేర్కొన్నారు. భూకంపం వచ్చినప్పుడు దాయాది దేశం పాకిస్తాన్‌కు కూడా భారత్ సాయం చేసిందని చెప్పారు. అలాంటి సమయాల్లో యూఎన్ఓ, యూఏఈల ఆఫర్లను మనం అంగీకరించవచ్చని.. ఎలాంటి షరతులు లేకుండా యూఏఈ రూ.700 కోట్లను ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని.. దీన్ని మనం అంగీకరించవచ్చని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో విదేశాల నుంచే వచ్చే సహాయం విషయంలో.. ముందటి యూపీఏ ప్రభుత్వ పాలసీనే కేంద్రం అనుసరిస్తుందని అనధికారికంగా ఎన్డీఏ ప్రభుత్వం చెప్పేసిందని చెప్పారు. యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా లాంటి చాలా మంచి నిర్ణయాలను కూడా తీసుకుంది.. మరిదాన్ని కేంద్రం ఎందుకు ఇవ్వడం లేదని సురవరం సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు. కనీసం కేరళ ప్రభుత్వం అడిగిన మేర సాయం చేసేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని విమర్శించారు. వరదల్లో నష్టపోయిన రూ.20 వేల కోట్ల మొత్తాన్ని కేరళ అడగడం లేదని.. కేవలం రూ.2600 కోట్ల సాయాన్ని మాత్రమే ఆర్థిస్తుందని చెప్పారు. యూఏఈ ఆఫర్‌ను తిరస్కరిస్తే.. కేరళకు కచ్చితంగా రూ.2600 కోట్లు ఇవ్వాల్సిందేనని.. భారత్ మాత్రమే ఈ సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని చెప్పాలని డిమాండ్ చేశారు. -
ప్రకృతి ప్రకోపం
-
తాపం తగ్గించకుంటే శాపమే!
సమకాలీనం కావాలని కళ్లు మూసుకొని, ‘వాతావరణ మార్పు’ను అంగీకరించేందుకు అమెరికా వంటి అగ్రరాజ్యాలు నిరాకరిస్తున్నాయి. ఈ అనర్థానికి వారే తొలి దోషులవడం అందుకు కారణం. అజ్ఞానం, బాధ్యతా రాహిత్యంతో ‘మార్పు’ అంగీకరించడానికి మనమూ నిరాకరిస్తే.... ప్రథమ బాధితులం మనమే! ఈ ముప్పు అనివార్యమవడంతో, అభివృద్ధి చెందిన దేశాలన్నీ విరుగుడు చర్యలతో దూసుకుపోతున్నాయి. మన ప్రభుత్వాలే బాధ్యత వహించాలంటే చాలదు. నిజమే! వారి వైఖరి మారాలి. కార్పొరేట్లు దీన్నొక సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. తమ స్థాయిలో ప్రతి చిన్న చర్యతో భూతాపోన్నతి తగ్గిస్తామని పౌరులు పూనికవహించాలి. పిడుగుపాటుకు మను షులు చనిపోతారని విన్నాం కానీ, ఇంత మందా? ఒకేరోజు 13 మంది! ఆంధ్రప్రదేశ్‌లో గత రెండు నెలల్లో 62 మంది పిడుగుపాటుకు గురై చనిపోగా, ఉత్తర కోస్తాలోనే 37 మంది మరణిం చారు. పొరుగున ఉన్న ఒడిశాలో కిందటేడు 36 గంటల వ్యవధిలో 34 మంది చనిపోయారు. ఈ సంవత్సరం ఏపీలో పదమూడు గంటల వ్యవధిలో 36,749 పిడుగుపాట్లు చోటుచేసుకున్నాయి. (కొన్ని భూమివైపొచ్చి పిడుగులయ్యాయి, మరికొన్ని మేఘాల మధ్యే మెరుపులుగా ముగిసాయి). ఇదంతా ఏమిటి? అంటే, నిపుణులు కూడా ‘ఏమో...! ఇదైతే అసాధారణమే!!’ అంటున్నారు. కొందరు శాస్త్రవేత్తలు భూతాపం పెరగటం వల్ల వచ్చిన ‘వాతావరణ మార్పుల (క్లైమెట్ చేంజ్) కారణంగానే’ అంటే... చాలా మంది నమ్మట్లేదు. ‘ఆ.. మీరు అన్నిటికీ వాతావరణ మార్పు కారణం అంటారులే’ అన్నట్టు ఓ అపనమ్మకపు చూపు చూస్తున్నారు. గత రెండేళ్లుగా పెచ్చు మీరిన వడదెబ్బ చావులయినా, అకాలవర్షాలు–వరదలతో ముప్పైనా, ఇప్పుడీ పిడుగుపాటు మరణాలయినా, ఉత్తరాదిని హడలెత్తిస్తున్న ఇసుక తుపాన్లు–వేడిగాలి దుమార మైనా..... అంత తీవ్రత చూపడానికి వాతావరణ మార్పే కారణం అని పర్యావరణ వేత్తలు వెల్లడిస్తు న్నారు. పారిస్ సదస్సులో ప్రపంచ దేశాలు ఆందో ళన చెందినట్టు, భూతాపోన్నతి వల్ల ప్రమాదం ముంచుకొస్తుందనే విషయాన్ని అందరూ అంగీ కరించినా, ఇంత త్వరగా ఈ ప్రతికూల ప్రభావం ఉంటుందని ఎవరూ అనుకోలేదు. అందుకే, చాలామంది దాన్నంత తీవ్రంగా పరిగణించలేదు. భవిష్యత్ పరిణామాలు మరింత దారుణంగా ఉంటాయనే ధ్యాస కూడా లేదు. రాబోయే పెనుప్రమాదాలకి ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ స్పష్టమైన సంకేతాలే! ‘వాతావరణ మార్పు’ అన్నది కేవలం పర్యావరణానికే పరిమిత మైన అంశం కాదు. అనేకాంశాల సంకలనం! మార్పు లకు వేర్వేరు కారకాలున్నట్టే, ప్రభావం వల్ల పుట్టే విపరిణామాలకూ వైవిధ్యపు పార్శా్వలున్నాయి. ప్రభుత్వ విధానాలు, మనుషుల సంస్కృతి, ఆహా రపు అలవాట్లు, జీవనశైలి, ప్రకృతి పట్ల నిర్లక్ష్యం, ఎల్లలెరుగని స్వార్థం–సౌఖ్యం... ఇవన్నీ కారకాలు– ప్రభావితాలు అవుతున్నాయి. ప్రకృతి వైపరీత్యం కొంతయితే, మానవ తప్పిదాలు పెచ్చుమీరి ప్రమా దస్థాయిని ఎన్నోరెట్లు పెంచుతున్నాయి. వాటిని నియంత్రించే చిత్తశుద్ధి ప్రభుత్వాలకు లేదు. స్వచ్ఛంద సంస్థలకు తగు చొరవ–ప్రాతినిధ్యం కరువైంది. పౌరులు పూనికవహించడం లేదు. వెరసి సమస్య జటిలమౌతోంది. తీవ్రత గుర్తించి అప్రమత్త మయ్యేలోపే పరిస్థితులు చేయి దాటుతున్నాయి. తెలివితో ఉంటే మంచిది వాతావరణ మార్పు, మెళ్లో పెద్ద బోర్డు తగిలించు కొని వచ్చే భౌతికాకారం కాదు. ఈ రోజు (గురు వారం) హైదరాబాద్‌లో కురిసిన వర్షాన్నే తీసు కోండి. మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్మలాకాశం, నగరమంతా చిట్టుమని కాసిన ఎండ. అరగంటలోనే ఏమైందో అన్నట్టు ఉరుకులు పరుగులతో కమ్ము కొచ్చిన మబ్బులు. ఆకాశమంతా నల్ల టార్పాలిన్ కప్పేసినట్టు, నిమిషాల్లో కుండపోతగా వర్షం. రోడ్లన్నీ జలమయం! ఇదీ క్యుములోనింబస్ మేఘాల దెబ్బ. ‘సాధారణాన్ని మించిన ఉష్ణోగ్ర తలు నమోదయినపుడు ఇది జరుగుతూ ఉంటుం ద’ని నిపుణులు చెబుతున్నారు. వాటి రాకను, ఆ మేఘాల ద్వారా వచ్చే వర్షపాతాన్ని, సగటును అంచనా వేయడం కూడా కష్టం. ఇవే మెరుపులు, ఉరుములు తద్వారా పిడుగుల్ని కురిపిస్తాయి. భూతా పోన్నతి ప్రత్యక్ష ప్రభావమే ఈ పిడుగుపాట్లు! మన దేశంలో పిడుగుపాటు మరణాల పరిస్థితి దారుణం. జాతీయ నేర నమోదు బృందం (ఎన్సీఆర్బీ) లెక్కల ప్రకారం గత దశాబ్ది, ఏటా సగటున 2000 మంది పిడుగుపాటుతో మరణించారు. తుపాన్లు, వరదలు, వడదెబ్బ, భూకంపాలు... ఇలా ఏ ఇతర ప్రకృతి వైపరీత్యపు మరణాలతో పోల్చినా పిడుగుపాటు మరణాలే ఎక్కువ. గత మూడేళ్లతో పోల్చి చూసినా ఈ సంవత్సరం పరిస్థితి అసాధారణంగా ఉందని వాతావరణ అధికారులే చెబుతున్నారు. ఏ అభివృద్ధి చెందిన సమాజంలో నైనా ఈ మరణాల రేటు తగ్గుతుందే కాని పెరగదు. అమెరికాలో, పిడుగుపాటు మరణాల్ని కచ్చితంగా లెక్కించడం మొదలైన ఈ 75 ఏళ్లలో అతి తక్కువ మరణాలు, కేవలం 16 గత సంవత్సరం నమోద య్యాయి. 2013లో నమోదయిన 23 మరణాల సంఖ్య మీద ఇది రికార్డు! ప్రతి పది లక్షల మంది జనాభాకు పిడుగుపాటు మృతుల నిష్పత్తి అమె రికాలో సగటున 0.3 అయితే, ఐరో పాలో 0.2 గా నమోదవుతోంది. భారత్‌లో ఇది 2గాను, జింబా బ్వేలో 20 గాను, మాలవిలో 84 గాను ఉంది. పిడుగుపాటు మరణాలు అమెరికాలో తగ్గటానికి కారణాలేమిటి? అని ఓ అధ్యయనం జరిగింది. ప్రజల్లో అవగాహన పెరగటం, పిడుగు నిరోధక నిర్మాణాలు, సకాలంలో వాతావరణ హెచ్చరికలు, వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసే మనుషుల సంఖ్య తగ్గడం ప్రధాన కారణాలుగా తేలింది. ఆ తెలివిడి మనకూ ఉండాలి. వేడి తగ్గించుకుంటే, చెట్లు సమృ ద్ధిగా ఉంటే పిడుగులు మనుషుల జోలికీ, ఏ ఇతర జీవుల జోలికీ రావు. ఒత్తిడి పెంచుతున్నాం! భూపర్యావరణంలో ఉష్ణోగ్రత అసాధారణమైనపుడు మేఘాలపై ఒత్తిడి పెరిగి పైకి, పైపైకి అతి శీతలంవైపు వడివడిగా సాగుతాయి. ఫలితంగా మేఘాల్లో అంతర్గతంగా ఆ తాడనంలో పుట్టే మెరుపు నిజానికొక విద్యుత్ విడుదల! అత్యధిక సందర్భాల్లో ఇది మేఘాల మధ్యే జరిగి మనకొక మెరుపులా కన బడుతుందంతే! కానీ, తీవ్రంగా ఉన్నపుడు అట్టడు గున ఉండే మేఘ వరుసవైపునకు వస్తూ రుణావేశం (నెగెటివ్ చార్జ్)గా పనిచేస్తుంది. వర్షపు మేఘం– భూమి మధ్య అసమతౌల్యతను సవరించే క్రమంలో ఈ రుణావేశం, కిందికి పయనించి... భూమిపైని ధనావేశం (పాజిటివ్ చార్జ్)తో కరెంట్‌గా కలిసి పిడు గవుతుంది. ఇది సాధారణంగా మనిషిని యాంటెన్నా చేసుకోదు. భూమ్మీద టవర్లనో, ఎల్తైన నిర్మాణాలనో, చెట్లనో, కడకు భూమినో వాహకంగా ఎంచుకుం టుంది. అందుకే చెట్ల కింద, రక్షణ లేని టవర్ల వద్ద, ఇంటి బాల్కనీల్లో, ఆరు బయట నిలబడొద్దంటారు. పరంపరగా మెరుపులొస్తున్నపుడు సెల్‌ఫోన్, ల్యాండ్ ఫోన్ మాట్లాడొద్దంటారు. భూమితో ‘ఎర్తింగ్’ అయ్యేలా ఉండొద్దంటారు. మేఘాల్లో పుట్టే ఈ నెగెటివ్ చార్ఎ్జ సగటున గంటకు మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో భూమివైపు వస్తుంటుంది. గాలి బలహీన వాహకం అవడం వల్ల మెరుపు పుట్టినపుడు ఉద్భవించే ఉష్ణం ఆ గాలిని అత్యంత వేగంగా వ్యాపింప/కంపింప చేయడం వల్లే ఆకాశంలో పెద్ద శబ్దాలతో ఉరుములు పుడతాయి. ఈ మెరుపు ఓ బలహీన వాహకం (గాలి)లో పుట్టించే ఉష్ణం (53,540 డిగ్రీల ఫారెన్హైట్) సూర్యుని ఉపరితల ఉష్ణం(10,340 డిగ్రీల ఫారెన్హైట్) కన్నా అయిదు రెట్లు అధికం! అందుకే, ఈ కరెంటు ఒక చెట్టులోకి వ్యాపించినపుడు పుట్టే ఉష్ణం ఆ చెట్టులో ఉండే మొత్తం తేమను లాగి మోడు చేస్తుంది. పిడుగు స్థాయిని బట్టి కొన్నిసార్లు బతికి, మనుషులు ఏదో రకమైన వైకల్యానికి గురవుతారు. ఇక మన తెలుగు భూభాగంపై ఈసారి పిడుగుల తాకిడి పెరగటానికి ఓ కారణాన్ని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అరేబియా సముద్రం నుంచి వచ్చే శీతల మేఘాలు, ఉత్తర భారతం నుంచి వేడిగాలులు కలవడంతో కరెంట్ వల్ల 124 మైళ్ల మేర మేఘాచ్ఛాదనం ఏర్పడిందని, అదే ఇందుకు కారణమై ఉండవచ్చని ఓ అభి ప్రాయం. నియంత్రిస్తేనే మనుగడ తెలిసి తెలిసీ... మనం మన దైనందిన చర్యల ద్వారా భూతాపోన్నతికి కారణమౌతున్నాం. పారిస్ ఒప్పం దంలో భాగంగా పెద్ద హామీలిచ్చి వచ్చాక కూడా మన ప్రభుత్వ విధానాలు మారలేదు. వివిధ సంస్థల నిర్వాకాలు, కార్పొరేట్ల కార్యకలాపాలు, వ్యక్తుల ప్రవర్తన, జీవనశైలి... దేనిలోనూ మార్పు రాలేదు. శిలాజ ఇంధన వినియోగం తగ్గలేదు. జలరవాణా ఊసే లేదు! ఆశించిన స్థాయిలో థర్మల్ విద్యుదు త్పత్తి తగ్గలేదు. పైగా భూగర్భ గనుల కన్నా ఉప రితల గని తవ్వకాల్నే ప్రోత్సహిస్తూ కాలుష్యాన్ని పెంచి పోషిస్తున్నాం. బొగ్గుతో విద్యుదుత్పత్తిలో ‘సూపర్ క్రిటికల్’ వంటి ఆధునిక సాంకేతికతకు మారకుండా, పాత ‘సబ్–క్రిటికల్’ పద్ధతిలోనే సాగి స్తున్నాం. కార్బన్‌డయాక్సైడ్‌ను విరివిగా విడుదల చేయడమే కాక జలాన్ని విస్తారంగా దుర్వినియో గపరుస్తున్నాం. సౌర–పవన విద్యుత్తు వాటా పెద్దగా పెరగలే! ఇకపై ప్రతి కొత్త వాహనం విద్యుత్ బ్యాటరీతో నడిచేదే రావాలన్న మాట గాలికి పోయింది. అడవుల విస్తీర్ణ శాతం పెంచాలన్నది ఉట్టి మాటయింది. పైగా, 1988 జాతీయ అటవీ విధా నానికి తూట్లు పొడుస్తూ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం రూపొందించిన తాజా ముసాయిదా ఇప్పుడు ప్రజాభిప్రాయం కోసం వారి ముందుంది. దీన్ని నిశి తంగా ఖండిస్తూ ప్రజలు, పౌరసంఘాలు చేతన పొంది కేంద్ర ప్రభుత్వంపై ఏ మేరకు ఒత్తిడి తెస్తాయో చూడాలి! చేయీ చేయీ కలిపితేనే.... కావాలని కళ్లు మూసుకొని, ‘వాతావరణ మార్పు’ను అంగీకరించేందుకు అమెరికా వంటి అగ్రరాజ్యాలు నిరాకరిస్తున్నాయి. ఈ అనర్థానికి వారే తొలి దోషు లవడం అందుకు కారణం. అజ్ఞానం, బాధ్యతా రాహి త్యంతో ‘మార్పు’ అంగీకరించడానికి మనమూ నిరా కరిస్తే.... ప్రథమ బాధితులం మనమే! ఈ ముప్పు అనివార్యమవడంతో, అభివృద్ధి చెందిన దేశాలన్నీ విరుగుడు చర్యలతో దూసుకుపోతున్నాయి. మన ప్రభుత్వాలే బాధ్యత వహించాలంటే చాలదు. నిజమే! వారి వైఖరి మారాలి. కార్పొరేట్లు దీన్నొక సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. తమ స్థాయిలో ప్రతి చిన్న చర్యతో భూతాపోన్నతి తగ్గిస్తామని పౌరులు పూనికవహించాలి. ఉన్నొక్క సజీవ గ్రహాన్ని కాపాడుకుందాం! దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
ప్రకృతి విపత్తు.. ప్రళయ సహాయం
♦ వరద సహాయక చర్యలపై అవగాహన కల్పించనున్న ఆర్మీ ♦ ‘ప్రళయ సహాయం’ పేరుతో కార్యక్రమం ♦ సాగర్ వేదికగా ఈనెల 22, 23 తేదీల్లో మాక్‌డ్రిల్ ♦ పాల్గొంటున్న 500 మంది సైనికులు ప్రకృతి విపత్తులు వస్తే పరిస్థితేంటి? వరద ఉప్పొంగితే, నగరం జలమయమైతే ఏం చేయాలి? బాధితులను ఎలా రక్షించాలి? నష్ట నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే అంశాలపై ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ సంయుక్తాధ్వర్యంలో హుస్సేన్‌సాగర్ వేదికగా ఈనెల 22, 23 తేదీల్లో మాక్‌డ్రిల్ నిర్వహించనున్నారు. ఇందులో దాదాపు 500 మంది సైనికులు పాల్గొంటున్నారు. – సాక్షి, సిటీబ్యూరో ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ సంయుక్తాధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి జీహెచ్ఎంసీ సహకారం అందిస్తోంది. ఈ మాక్‌డ్రిల్‌లో భాగంగా పీపుల్స్ ప్లాజాలో స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. వరద బాధితులను ఎలా రక్షించాలనే అంశంపై ఇక్కడ ప్రదర్శన ఉంటుంది. ఇప్పటికే సైనికులు సాగర తీరాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. సాగర్ చుట్టూ సైనికులు పహారా కాస్తున్నారు. సాగర్‌లో మూడు విభాగాలుగా గృహసముదాయాలు ఏర్పాటు చేశారు. నీటిలో ప్రమాద శాతం తక్కువగా ఉండే ప్రాంతాన్ని ఒకటో సముదాయంగా ఒడ్డుకు కొద్ది దూరంలో నిర్మించారు. ప్రమాదం మధ్యస్తంగా రెండో విభాగాన్ని ఒడ్డుకు ఇంకొద్ది దూరంలో నిర్మించారు. ఇక ప్రమాద తీవ్రత ఎక్కువున్న ప్రాంతంగా మూడో విభాగాన్ని సాగర్ మధ్యలో ఏర్పాటు చేశారు. ఈ మూడు ప్రాంతాల్లో మాక్‌డ్రిల్ నిర్వహించనున్నారు. నిఘా నీడలో.. ఈ కార్యక్రమానికి ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఇందుకు అత్యాధునికి కెమెరాలు వినియోగిస్తున్నారు. విద్యుత్ సహాయంతో ఎడారి ప్రాంతాల్లో, మంచుకొండల్లో సైన్యం వినియోగించే ప్రత్యేక వైర్లెస్ పరికరాలను కెమెరా రికార్డింగ్‌ల కోసం ఇక్కడ అందుబాటులో ఉంచారు. ట్యాంక్‌బండ్ చుట్టూ దాదాపు 12 ప్రత్యేక కెమెరాలతో ఈ మాక్‌డ్రిల్‌ను డిజిటల్ స్క్రీన్‌పై ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ప్రవేశం ఉచితం.. ఈ ప్రదర్శనను తిలకించేందుకు అందరూ ఆహ్వానితులే. ప్రవేశం ఉచితం. ఈనెల 22, 23 తేదీల్లో సంజీవయ్య పార్క్, హుస్సేన్‌సాగర్ వేదికగా సైనికుల విన్యాస ప్రదర్శనలు ఉంటాయి. అవగాహన వేదిక.. ప్రకృతి విపత్తులపై అవగాహన కల్పించేందుకు ఆర్మీ ప్రతి ఏటా ఏదో ఒక మహానగరంలో మాక్‌డ్రిల్ చేపడుతుంది. హైదరాబాద్‌లోని చాలా కాలనీలు తరచూ ముంపునకు గురవుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో నగరంలో ఈ మాక్‌డ్రిల్ నిర్వహించనున్నారు. సిటీ జలమయమైతే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? వరద బాధితులను ఎలా రక్షించాలి? ఏ శాఖ ఏ పని చేయాలి? తదితర విషయాలపై ఇందులో అవగాహన కల్పిస్తారు. ఆర్మీ ఆఫీసర్లు, అంతర్జాతీయ వక్తలు ఇందులో పాల్గొంటారు.– బి.జనార్దన్‌రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ -
మీ ఇంటి విలువ ఎంత?
ఫ్లాట్ కొనుగోలులో యూడీఎస్ ప్రధానమైందే సాక్షి, హైదరాబాద్: ఫ్లాట్ కొనేముందు ధర, విస్తీర్ణం, వసతులు, లొకేషన్, వాస్తు వంటి వాటిపై శ్రద్ధ చూపినంతగా.. అన్‌డివైడెడ్ షేర్ (యూడీఎస్) మీద శ్రద్ధ చూపించరు కొనుగోలుదారులు. వాస్తవానికి స్థిరాస్తి కొనుగోళ్లలో యూడీఎస్ అనేది చాలా ముఖ్యమైందంటున్నారు నిపుణులు. భూకంపాలు, తుఫాన్ వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు (లేదా) ఏదైనా ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ప్రభుత్వం మీ ప్రాపర్టీని తీసుకున్నప్పుడు మీకిచ్చే పరిహారం యూడీఎస్ మీద ఆధారపడి ఉంటుంది మరి. అందుకే అగ్రిమెంట్లో మీ ఇంటి యూడీఎస్ ఎంతనేది స్పష్టంగా ఉండాలని సూచిస్తున్నారు. ఫ్లాట్‌కు కేటాయించే స్థలమే యూడీఎస్.. అపార్ట్మెంట్లోని ఒక్కో ఫ్లాట్‌కు కేటాయించిన స్థలమే యూడీఎస్. అంటే అపార్ట్మెంట్ నిర్మించిన స్థలంలోని అవిభాజ్య వాటానే యూడీఎస్ అన్నమాట. ఫ్లాట్ విస్తీర్ణాన్ని బట్టి యూడీఎస్ కూడా మారుతుంది. యూడీఎస్ అనేది ఫ్లాట్ యజమాని పేరు మీద రిజిస్టరై ఉంటుంది. అయితే కొన్ని నిర్మాణాల్లో భవనం ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ)ని బట్టి కూడా యూడీఎస్ మారుతుందండోయ్. ఎవరైనా.. ఎక్కడైనా సరే ఫ్లాట్ కొనుగోలు చేసేముందు రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. 1. ప్రాజెక్ట్ మొత్తం స్థలం ఎంత? ఎంత భాగంలో భవనాన్ని నిర్మించారు? 2.ప్రాపర్టీ ధర పెరిగిందంటే అది ల్యాండ్ విలువ పెరిగిందని అర్థం. అంతే తప్ప బిల్డింగ్ విలువ పెరిగిందని కాదు. అంటే ప్రాపర్టీ పెరుగుదల అనేది యూడీఎస్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. యూడీఎస్‌ను ఎలా లెక్కిస్తారు? యూడీఎస్ లెక్కింపు అనేది అపార్ట్మెంట్ సూపర్ బిల్టప్ ఏరియా మీద ఆధారపడి ఉంటుంది. అంటే అపార్ట్మెంట్లోని అన్ని ఫ్లాట్ల సూపర్ బిల్టప్ ఏరియాలూ లెక్కలోకొస్తాయన్నమాట. ఉదాహరణకు 2,400 చ.అ. స్థలంలో 4 ఫ్లాట్ల అపార్ట్‌మెంట్‌ను నిర్మించారనుకుందాం. ఒక్కో ఫ్లాట్ విస్తీర్ణం 1,000 చ.అ.లనుకుందాం. ఇప్పుడీ నాలుగు ఫ్లాట్ల యూడీఎస్ ఎంతంటే? యూడీఎస్=ఒక్కో ఫ్లాట్ సూపర్ బిల్టప్ ఏరియా/ అన్ని ఫ్లాట్ల సూపర్ బిల్టప్ ఏరియా ఇంటు మొత్తం ల్యాండ్ ఏరియా 1,000 ్ఠ 2,400/4,000.. అంటే ఒక్కో ఫ్లాట్ యూడీఎస్ 800 చ.అ. -
1888నాటి విలయం అత్యంత ఘోరం
ఐక్యరాజ్యసమితి: ప్రపంచంలోనే ఇప్పటివరకు సంభవించిన ప్రకృతి వైపరీత్యాల్లో అత్యంత ఘోరమైనదాన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించింది. ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో 1888 సంవత్సరంలో సంభవిం చిన వడగండ్ల వాన అత్యంత ప్రమాదక రమైనదిగా ఐక్యరాజ్య సమితి పేర్కొంది. ఈ విపత్తులో దాదాపు 246 మంది మృత్యువాత పడినట్లు వెల్లడించింది. ఈ వివరాలను ఐక్యరాజ్య సమితి వాతావరణ శాఖ అయిన ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎమ్ఓ) ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన సమాచారాన్ని పరిశీలించి వెల్లడించింది. ‘ప్రకృతి విపత్తుల కారణంగా భారీగా ప్రాణనష్టం జరుగుతోంది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను నిరోధించేందుకు, ముందస్తు హెచ్చరికలు జారీ చేసేందుకు డబ్ల్యూఎమ్ఓ దృష్టి సారించింది’ అని డబ్ల్యూఎమ్ఓ సెక్రటరీ జనరల్ పెట్టేరి టాలాస్ చెప్పారు. డబ్ల్యూఎమ్ఓ నిపుణుల కమిటీ వాతావరణ సంబంధిత సంఘటనల వల్ల జరిగిన ప్రాణనష్టం వివరాలను నమోదు చేసింది. -
ప్రకృతి ప్రకోపం: 58 మంది జవాన్లు మృతి
న్యూఢిల్లీ: ప్రకృతి ప్రకోపం వల్ల 2014-2016ల మధ్య 58 మంది సైనికులు మృతి చెందినట్లు మంగళవారం రాజ్యసభ వెల్లడించింది. రక్షణశాఖ సహాయమంత్రి సుభాష్ భామ్రే రాతపూర్వకంగా మంగళవారం సమాధానమిచ్చారు. 2014లో 12 మంది, 2015లో 24 మంది, 2016లో 22 మంది సైనికులు ప్రకృతి విపత్తుల్లో ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణరేఖ వద్ద సైనికస్ధావరంపై మంచు తుపాను విరుచుకుపడిన కారణంగా 15 మంది జవానులు మరణించినట్లు వెల్లడించారు. -
తుపాను అంచనా కోసం...
భువనేశ్వర్: తీరప్రాంతాల్లో వాతావరణాన్ని ముందుగా అంచనా వేసేందుకు ఓ నూతన పద్ధతిని అభివృద్ధి చేసేందుకు ఐఐటీ భువనేశ్వర్‌లోని పరిశోధకులు కృషి చేస్తున్నా రు. భూ, సముద్రపు వాతావరణ పరిస్థితులను అంచనా వేసేందుకు ఐఐటీ శాస్త్రవేత్తలు అమెరికా పరిశోధకుల బృందంతో కలసి రూపొందిస్తున్నట్లు ప్రొఫెసర్ మహంతి చెప్పారు. వాతావరణ తీవ్ర పరిస్థితులతోపాటు తుపాను వంటి ప్రకృతి వైపరీత్యాలను ముందస్తుగా కచ్చితత్వంతో అంచనా వేసే సాంకేతికతను మెరుగుపరిచేందుకు ఈ నూతన వ్యవస్థ తోడ్పడుతుందన్నారు. -
ఆ సత్తా మన కంపెనీలకు లేదు
• ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడటంలో తీసికట్టే • రియల్టీ సంస్థ సీబీఆర్ఈ నివేదికలో వెల్లడి ముంబై: భారత కంపెనీల్లో 75 శాతానికి పైగా ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకునేందుకు సిద్ధంగా లేవని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ తన నివేదికలో పేర్కొంది. ప్రకృతి వైపరీత్యాల రిస్క్‌ను తగ్గించడానికి ప్రభుత్వ సంస్థలతో కలసి పనిచేసే ప్రైవేట్ సంస్థల సంఖ్య మరింతగా పెరగాల్సి ఉందంటున్న ఈ నివేదికలోని ముఖ్యాంశాలివీ... ⇔ ముందు చూపు, తగిన ప్రణాళిక లేనందునే భూకంపాలు, తుఫాన్ల వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల భారీ స్థాయిలో నష్టాలు వస్తున్నాయని 96% కంపెనీలు అంగీకరించాయి. ⇔ తమ ప్రాజెక్టుల్లో ఆపదలను తగ్గించే చర్యలు తీసుకున్నామని చెప్పిన కంపెనీల సంఖ్య 21 శాతంగానే ఉంది. అన్ని భవనాలను వివిధ కాలవ్యవధుల్లో తనిఖీ చేయడం తప్పనిసరని 97 శాతం కంపెనీలు అంగీకరించాయి. -
డిజిటల్ బీమా.. వైపరీత్యాల్లో ధీమా
వర్షాలు.. వరదలు ఇతరత్రా రూపాల్లో ఇటీవలి కాలంలో ప్రకృతి వైపరీత్యాల ఉదంతాలు అనేకం కనిపిస్తున్నాయి. వీటి వల్ల కొన్ని సందర్భాల్లో ప్రాణనష్టం, ఆస్తినష్టం గణనీయంగానే జరుగుతోంది. వాస్తవానికి ప్రకృతి వైపరీత్యాల మీద మనకెలాంటి నియంత్రణ లేకపోయినప్పటికీ.. వాటి బారి నుంచి మనకి కొంతైనా ఉపశమనం కల్పించే బీమా పాలసీల విషయంలో కాస్త ముందుచూపుతో ఉంటే తగు ప్రయోజనాలు పొందే వీలుంటుంది. సులభంగా క్లెయిమ్ చేసుకునేందుకు సాధ్యపడుతుంది. పాలసీ క్లెయిమ్‌లకు సంబంధించి సమస్యలేమీ ఎదురవకుండా ఉండాలంటే.. ముందుగా ఆయా బీమా పాలసీల్లో వివిధ నిబంధనల గురించి తగినంత అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే పాలసీకి సంబంధించి మన హక్కులను పరిరక్షించుకునే వీలవుతుంది. ఈ దిశగా ఉపయోగకరమైన కొన్ని అంశాలివీ... * ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో భద్రపరచటం మేలు * వీలైతే బీమా కంపెనీల సైట్లలోనే రిజిస్ట్రేషన్ ఆరోగ్య బీమా జీవిత బీమా తరహాలోనే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ పత్రాలను కూడా ప్రత్యేకంగా బీరువాల్లో దాచిపెట్టకుండా.. డిజిటల్ ఫార్మాట్లోనూ భ ద్రపర్చుకోవచ్చు. వర్తించే ప్రయోజనాలన్నీ పొందవచ్చు. అయితే, ఎంత ప్రకృతి వైపరీత్యాల్లాంటి సమయంలోనైనా హెల్త్ పాలసీ ప్రయోజనాలు పొందాలంటే కొన్ని నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. లేకపోతే క్లెయిములను బీమా కంపెనీ తోసిపుచ్చే అవకాశం ఉంది. ఏదైనా చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన పక్షంలో దాన్ని ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయాలి. ఒకోసారి క్యాష్‌లెస్ హాస్పిటలైజేషన్ కుదరకపోయినప్పటికీ.. నిర్దేశిత నిబంధనలు పాటిస్తే, తర్వాత దశలో రీయింబర్స్మెంట్ అయినా పొందడానికి వీలవుతుంది. జీవిత బీమా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించిన మొత్తం డాక్యుమెంట్‌ని సాధ్యమైతే ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో భద్రపర్చడం మంచిది. అలా కుదరకపోతే కనీసం పాలసీ నంబరునైనా ఎలక్ట్రానిక్ విధానంలో ఎక్కడో ఒక దగ్గర భద్రంగా ఉంచుకోవాలి. నిజానికిది చాలా సులువైన ప్రక్రియే. డాక్యుమెంట్ ను స్కాన్ చేసిన త ర్వాత మీ ఈమెయిల్ అకౌంట్లోనో లేదా ఆన్లైన్ డ్రైవ్‌లోనో స్టోర్ చేసుకోవచ్చు. సెర్చి ఇంజిన్ గూగుల్ ఇందుకోసం డాక్యుమెంట్స్, డ్రైవ్ వంటి సర్వీసులు అందిస్తోంది. జీమెయిల్ ఉంటే వీటిని ఉచితంగా కూడా వినియోగించుకోవచ్చు. దీంతో పాటు పలు బీమా కంపెనీలు కస్టమర్లకు ఆన్లైన్ సౌకర్యాలు అందిస్తున్నాయి. అంటే పాలసీల్ని వీటిలో రిజిస్టరు చేసుకోవచ్చన్న మాట. ఒకసారి రిజిస్టరు చేసుకుంటే... ప్రీమియం చెల్లింపులు కూడా దీనిద్వారానే చేయొచ్చు. పాలసీ వివరాలతో పాటు చెల్లించిన రసీదులు కూడా దీన్లో భద్రంగా ఉంటాయి. దీంతో పాటు జీవిత బీమా పాలసీ తీసుకున్న సంగతిని పాలసీదారు తనపై ఆధారపడి ఉన్న కుటుంబసభ్యులకు/ నామినీలకు కచ్చితంగా తెలియజేయాలి. చాలా మంది ఈ విషయాన్ని గురించి వెల్లడించకుండా... పెద్ద తప్పు చేస్తుంటారు. ఒకవేళ పాలసీదారుకు ఏదైనా అనుకోనిది జరిగితే.. లైఫ్ ఇన్సూరెన్స్ ఉందన్న సంగతి నామినీకి తెలియకపోతే కట్టిన ప్రీమియంలు, ప్రయాస అంతా వృధానే అవుతుంది. కాబట్టి, జీవిత బీమా కంపెనీ పేరు, పత్రం లేదా నంబరు, సమ్ ఇన్సూర్డ్, ప్రీమియం, వేలిడిటీ మొదలైన వివరాలన్నీ నామినికీ తెలియపర్చి ఉంచాలి. ప్రస్తుతం అన్ని జీవిత బీమా కంపెనీలు.. పాలసీలను డిజిటల్ ఫార్మాట్లో ఇవ్వడంపై దృష్టి పెడుతున్నాయి. దీని వల్ల పేపర్లను పోగొట్టుకునే రిస్కులు తగ్గుతాయి. సాధారణ బీమా ఇతర పాలసీల మాదిరిగానే, జనరల్ ఇన్సూరెన్స్ విషయంలోనూ నిర్దిష్ట జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాల వల్ల మీ మోటార్‌సైకిలు, కారు, ఇల్లు లేదా వ్యాపారాలకు నష్టం వాటిల్లి క్లెయిమ్ పొందాలనుకుంటే.. సదరు ఘటన జరిగిన రెండు, మూడు రోజుల్లోగానే బీమా కంపెనీకి తెలియజేయాలి. ప్రకృతి వైపరీత్య పరిస్థితుల్లో పాలసీ కింద ఎంత మేరకు, ఏయే సమస్యలకు కవరేజి ఉంటుందో ముందుగానే నిబంధనలు తెలుసుకుని ఉండాలి. చివరిగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు మరికొన్ని ఉన్నాయి. రిస్కు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసించే వారు అధిక ప్రీమియంలు కట్టాల్సి రావొచ్చు. ఇక ప్రైవేట్దైనా, ప్రభుత్వ రంగంలోనిదైనా.. బీమా కంపెనీని ఎంచుకునే ముందు క్లెయిమ్ సెటిల్మెంట్లో సదరు సంస్థ ట్రాక్ రికార్డును కూడా పరిశీలించుకుని నిర్ణయం తీసుకోవడం శ్రేయస్కరం. -
బంగాళాఖాతంలో రోబోట్
* ప్రకృతి వైపరీత్యాల సమాచారం కోసం ఏర్పాటు * భారత్-ఇంగ్లండ్ శాస్త్రవేత్తల సంయుక్త ప్రణాళిక * 24న చెన్నై నుంచి సముద్రంలో శాస్త్రవేత్తల పర్యటన సాక్షి ప్రతినిధి, చెన్నై: సముద్రంలో చోటుచేసుకునే ప్రకృతి వైపరీత్యాలను మరింత ముందుగా పసిగట్టేందుకు బంగాళాఖాతం గర్భంలో రోబోట్లను అమర్చేందుకు ప్రణాళిక సిద్ధం అవుతోంది. ఈ ప్రణాళిక అమలులో భాగంగా భారత్, ఇంగ్లాండ్ శాస్త్రవేత్తల బృందం సముద్రంలో పర్యటించనుంది. ఈనెల 24వ తేదీన చెన్నైలో వారి ప్రయాణం ప్రారంభం కానుంది. సముద్రంలో ఏర్పడే అల్పపీడనం, వాయుగుండం, భూకంపాల ప్రభావాలతో భారీ వర్షాలు, ఉప్పెనలు చోటుచేసుకుంటాయి. మోతాదుకు మించి కురిసే వర్షాల వల్ల భారీ నష్టం సంభవిస్తోంది. సముద్రంలోని వాయుగుండం, అల్పపీడనాల తీవ్రతను సరిగ్గా లెక్కకట్టి ముందుగానే హెచ్చరించేందుకు వీలైన విధానానికి శాస్త్రవేత్తలు రూపకల్పన చేస్తున్నారు. ఇందుకోసం సముద్ర గర్భంలో సశాస్త్రీయమైన రోబోట్‌ను అమరుస్తారు. సముద్రపు అడుగుభాగంలో తుపాను, వాయుగుండం, అల్పపీడనద్రోణిలకు దారితీసే తీవ్రతలను ఈ రోబోట్ ముందుగానే పసిగట్టి సంబంధిత కార్యాలయానికి చేరవేస్తుంది. రోబోట్ నుంచి అందే సమాచార తీవ్రతను బట్టి ఆయా ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలను చేపట్టేందుకు వీలు కలుగుతుంది. భారత్‌లోని బే ఆఫ్ బెంగాల్ లార్జ్ మెరైన్ ఎకోసిస్టమ్స్ ప్రాజెక్ట్‌కు చెందిన శాస్త్రవేత్తలు రోబోట్ అమర్చే ప్రక్రియను చేపడుతున్నారు. వీరితోపాటు ఇంగ్లాండ్‌కు చెందిన తూర్పు ఆంగ్లియా యూనివర్సిటీ, సౌత్ ఆమ్డన్‌లోని జాతీయ సముద్ర పరిశోధనా సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు ఈ పథకంలో భాగస్వామ్యులు అవుతున్నారు. సింధూ సాధన అనే భారత పరిశోధన నౌకలో భారత్‌తోపాటు ఆయా దేశాల శాస్త్రవేత్తల బృందం బయలుదేరుతుంది. శాస్త్రవేత్తల బృందం ఈనెల 24వ తేదీన చెన్నై నుంచి తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తారని భౌగోళిక విజ్ఞాన మంత్రిత్వశాఖ కార్యదర్శి రాజీవన్ తెలిపారు. -
ప్రకృతి శాపం, ప్రభువుల పాపం
నెల్లూరు, చిత్తూరు, కడప, ఉభయగోదావరి జిల్లాల్లో పడిన అకాల వర్షాల వల్ల రూ.3,819 కోట్లు నష్టం జరిగినట్లు అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం తక్షణం రూ.1,000 కోట్లు విడుదల చేయాలని కేంద్రాన్ని అర్థించింది. తమిళనాడు రాష్ట్రానికి రూ.939 కోట్ల వరద సాయం ఆగమేఘాల మీద ప్రకటించిన కేంద్రం.. మన రాష్ట్రం పంపిన నివేదికపై ఇప్పటికీ స్పందించ లేదు. ‘హుద్‌హుద్’ తుపాను నష్టానికి కేవలం 3% నిధులు మాత్రమే ఇచ్చిన కేంద్రాన్ని నిలదీయలేకపోయిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈసారి ఏ మేరకు నిధులు సాధించగలదో మరి! రాష్ట్రానికి ప్రకృతి వైపరీత్యాల బాధ ఉధృతమవుతోంది. ప్రభుత్వ చర్యలు, సాయం మాత్రం క్షీణిస్తున్నాయి. కరువు నివేదిక సిద్ధం చేసి సాయం కోసం కేంద్ర ప్రభుత్వానికి నివేదించే తరుణంలోనే, వరద బీభత్సం సృష్టించిన నష్టం పైన మరో నివేదికను కూడా పంపవలసిన అసాధారణ పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురైంది. యాదృచ్ఛికమే అయినా, మరో చిత్రం కూడా జరిగింది. నవంబర్ 19న విశాఖపట్నంలో ‘విపత్తుల యాజమాన్యం’ (కెలామిటీ మేనేజ్మెంట్) అనే అంశం మీద వేయి మంది అంతర్జాతీయ ప్రతినిధులతో రెండో ప్రపంచ సదస్సు జరుగుతున్న సమయంలోనే దక్షిణకోస్తా, రాయలసీమ వర్షాలతో అతలాకుతలమైనాయి (1977లో దివిసీమ ఉప్పెన వచ్చి, 17,000 మంది మృత్యువాత పడినది కూడా నవంబర్ 19వ తేదీయే). విపత్తుల బాధితులను ప్రభుత్వం ఎలా ఆదుకోవాలి? వాటిని తట్టుకునేందుకు ముందస్తు చర్యలు ఏవి? వంటి అంశాల మీద ప్రపంచ సదస్సు తీర్మానాలు చేస్తున్నవేళ- నెల్లూరులో సాయం కోసం వరద బాధితుల ఆక్రందనలు మిన్నంటాయి. దేశానికీ, రాష్ట్రానికీ ప్రకృతి వైపరీత్యాలూ, విపత్తులూ కొత్తేమీ కావు. దేశంలోని 593 జిల్లాలలో 199 జిల్లాలు తరచూ ప్రకృతి వైపరీత్యాలతో ప్రభావితమవుతున్నాయని కేంద్రం గుర్తించింది. విపత్తులతో జరిగే ఆస్తి, ప్రాణ నష్టాలు పెరుగుతున్నాయి. పూర్తిగా వాతావరణ పరిస్థితులపైననే ఆధారపడి ఉండడం వల్ల వ్యవసాయం మరింత సంక్షోభంలో కూరుకుపోతున్నది. గణాంకాల ప్రకారం, దేశంలో ఏటా 70 లక్షల హెక్టార్ల భూభాగం వరద తాకిడికి గురవుతోంది. సమన్వయ లోపంతో నష్టం ప్రకృతి వైపరీత్యాలను నివారించడం కష్టమే. కానీ, అందుబాటులోకి వచ్చిన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ, అభివృద్ధి చెందిన దేశాలు ఏ విధంగా ప్రజలను ముందస్తు హెచ్చరికలతో అప్రమత్తం చేసి నష్టాన్ని తగ్గించుకుంటున్నాయో, అదే బాటలో మనమూ వెతలను తగ్గించుకోవచ్చు. అయితే ఈ పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో ప్రభుత్వాల మధ్య సమన్వయం లోపిస్తున్నది. డిసెంబర్ 26, 2004 నాటి సునామీతో దేశం వణికిపోయింది. ఆ తరహా విపత్తును ఎదుర్కొనడం మనకు అదే మొదటిసారి. ఆ అనుభవంతోనే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ (జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ)ను, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(జాతీయ విపత్తుల ప్రతిస్పందన దళాలు) ఏర్పాటు చేశారు. ప్రధాని అధ్యక్షతన పనిచేసే ఈ సంస్థతో చాలా వరకు నష్టాలు తగ్గుతాయని ఆశించారు. కానీ అది సమర్థంగా పనిచేయడం లేదని తేలింది. ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్, విశాఖ హుద్‌హుద్ ఘటనలు ఇందుకు తార్కాణాలు. ఈ విపత్తుల సమయంలో నివారణ చర్యలు తీసుకోవడంలో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ సమర్థంగా పని చేయలేదన్న విమర్శలు ఉన్నాయి. ఏ విపత్తుకైనా సంసిద్ధత, ఉపశమనం, సహాయం, పునరావాసం అనే నాలుగు అంశాలు కీలకం. ఇందులో మొదటి మూడు జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ పరిధిలోనివి. అయితే ఈ సంస్థ 2005లోనే ఏర్పాటైనప్పటికీ 2008 నుంచి 2012 వరకు ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. ఈ వాస్తవాన్ని గమనిస్తే ఇలాంటి సంస్థను మెరుగుపర్చాలన్న శ్రద్ధ కేంద్రానికి ఉన్నదా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. నిజానికి, ఈ సమస్యపై మన ప్రభుత్వాలకు స్పష్టమైన విధానం లేదు. రాష్ట్రానికి దాదాపు 972 కి.మీ. తీరప్రాంతం ఉంది. 9 జిల్లాలలో విస్తరించిన ఈ తీరానికి 15 కి.మీ. పరిధిలోని ప్రజలకు బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు ప్రాణాంతకాలవుతున్నాయి. మరోపక్క రాయలసీమ తరచూ కరువు బారిన పడుతుంటుంది. దివిసీమ ఘటన మొదలు, రాష్ట్రం విడిపోయేవరకు రాష్ర్టంలో 14 అతిపెద్ద తుపానులు వచ్చాయి. దాదాపుగా ప్రతి ఏటా కరువు, వరదలు, తుపానుల వంటి వాటితో పంట నష్టం జరగటం, రైతులు ఆత్మహత్యలకు పాల్పడటం జరుగుతూనే వచ్చాయి. ఇక ‘ఎల్‌నినో’ కారణంగా ఈశాన్య రుతుపవనాల ప్రభావం క్రమేపీ తగ్గుతున్నది. ఆంధ్రప్రదేశ్‌లో సాధారణంగా నమోదుకావాల్సిన వర్షపాతంలో 22 నుంచి 35 శాతం తగ్గుదల నమోదు కావటం వల్ల.. రైతులు సకాలంలో పంటలు వేసుకోలేని దుస్థితి నెలకొన్నది. నవంబర్‌లో తుపానుల రాక సర్వసాధారణమైపోయింది. వాతావరణంలో ఏర్పడిన మార్పులతో నెల్లూరు జిల్లాలో నవంబర్ 9-19 మధ్య ఏకధాటిగా కురిసిన వర్షాలతో గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా 740.40 మి.మీ. వర్షపాతం నమోదైంది. 54 మంది మృత్యువాతపడగా, వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. నష్టం 3,819 కోట్లు ఉంటుందని, తక్షణం వెయ్యి కోట్లు సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. నష్టం కొండంత, సాయం గోరంత ‘ప్రపంచ విపత్తుల సదస్సు’లకు వేదికగా నిలుస్తున్న భారత్‌లోనే విపత్తు సహాయ నిధులు అరకొరగా ఉంటున్నాయి. 9వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ప్రకృతి వైపరీత్యాల సహాయానికి అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వాలకు అందించడానికి కేంద్ర ప్రభుత్వం విపత్తు సహాయ నిధి (సీఆర్ఎఫ్)ని 1990లో ఏర్పాటు చేసింది. ఈ నిధిలో 75 శాతం కేంద్రం, మిగతా 25 శాతం నిధులను రాష్ట్రాలు అందించాలి. అయితే, కేంద్ర నిధుల విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. పైగా జరిగిన నష్టంలో 10 శాతమైనా సాయంగా రావడంలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004 నుండి 2013 మధ్య విపత్తులతో జరిగిన నష్టం మొత్తం రూ. 52,305 కోట్లు. కానీ, కేంద్రం ఇచ్చింది రూ.3,507 కోట్లు. అంటే జరిగిన నష్టంలో వచ్చింది 6 శాతానికి మించలేదు. ‘హుద్‌హుద్’ నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరిన మొత్తం రూ.21,640 కోట్లు. మొదటి రోజునే బీభత్సాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ ఇది జాతీయ విపత్తు లాంటిదని పేర్కొన్నారు. తక్షణ సాయంగా రూ.1,000 కోట్లు ప్రకటించారు. ఇచ్చింది- రూ.737 కోట్లు. అంటే జరిగిన నష్టంలో కేంద్ర సాయం 3 శాతమే. ఇక, నవంబర్ 3వ వారంలో నెల్లూరు, చిత్తూరు, కడప, ఉభయగోదావరి జిల్లాల్లో పడిన అకాల వర్షాల వల్ల రూ.3,819 కోట్లు నష్టం జరిగినట్లు అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం తక్షణం రూ.1,000 కోట్లు విడుదల చేయాలని కేంద్రాన్ని అర్థించింది. పొరుగున ఉన్న తమిళనాడు రాష్ట్రానికి రూ.939 కోట్ల వరద సాయం ఆగమేఘాల మీద ప్రకటించిన కేంద్రం.. మన రాష్ట్రం పంపిన నివేదికపై ఇప్పటికీ స్పందించలేదు. ‘హుద్‌హుద్’ తుపాను నష్టానికి కేవలం 3% నిధులు మాత్రమే ఇచ్చిన కేంద్రాన్ని గట్టిగా నిలదీయలేకపోయిన తెలుగుదేశం ప్రభుత్వం.. ఈసారి ఏమేరకు నిధులు సాధించగలదో మరి! విపత్తులు, వైపరీత్యాలతో జరిగిన నష్టం అంచనా వేయటంలో శాస్త్రీయత లోపిస్తున్నది. ఇలాంటి నష్టాలను శాస్త్రీయంగా అంచనా వేసి, సాయం అందించటానికి 2012లో ‘భూపేంద్రహుడా కమిటీ’ స్పష్టమైన సూచనలు చేసింది. పంట నష్టపరిహారాన్ని మూడు రెట్లు ఎక్కువగా సూచించిన హుడా నివేదిక పట్ల రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, డాక్టర్ స్వామినాథన్ నివేదిక బుట్టదాఖలైనట్టే, హుడా కమిటీ నివేదిక అటకెక్కింది. ఇక, ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక జవసత్వాలు కల్పించటంలో భాగంగా పట్టణీకరణతో 65 శాతం ఆదాయం పట్టణాల నుంచి వస్తుందన్న అంచనాలతో శివారు ప్రాంతాల్లో ఎడాపెడా కట్టడాలకు అనుమతులు ఇస్తున్నారే తప్ప, భారీవర్షాలు, వరదలు వస్తే జరిగే అనర్థాలపై దృష్టి పెట్టడంలేదు. ఈ అనర్థం అమరావతి సహా అంతటికీ పొంచి ఉంది. ఇక రాష్ట్రానికి దక్కాల్సిన నిధులపై కేంద్రాన్ని గట్టిగా నిలదీయలేని అశక్తత రాష్ట్ర ప్రభుత్వానిది. హేతుబద్ధతతో సమస్యల్ని సకాలంలో పరిష్కరించకుంటే అంతిమంగా నష్టపోయేది ప్రజలే. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త ఎమ్మెల్సీ, కేంద్ర మాజీ మంత్రివర్యులు -
విపత్తులకు భారత్, చైనా విలవిల
న్యూయార్క్: వాతావరణ సంబంధిత విపత్తుల కారణంగా భారత్, చైనా దేశాలు అత్యధికంగా ప్రభావితమయ్యాయని ఐక్యరాజ్యసమితి నివేదిక ఒకటి మంగళవారం వెల్లడించింది. 1995-2015 మధ్య కాలంలో సంభవించిన విపత్తుల వల్ల ఈ రెండు దేశాల్లో 3 బిలియన్ల మందికి పైగా ప్రభావితం చెందారని తెలిపింది. త్వరలో ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో కీలక వాతావరణ సదస్సు జరగనున్న నేపథ్యంలో ప్రకృతి విపత్తులకు మానవ మూల్యం పేరిట యునెటైడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్(యూఎన్‌ఐఎస్‌డీఆర్) ఓ నివేదిక విడుదల చేసింది. నివేదికలోని మరిన్ని వివరాలు ► 1995-2015 మధ్య కాలంలో సంభవించిన విపత్తుల కారణంగా చైనాలో 2,274 మిలియన్ల మంది విపత్తుల ప్రభావానికి గురవగా, భారత్‌లో సుమారు 805 మిలియన్ల మంది ప్రభావితమయ్యారు. ► గత రెండు దశాబ్దాల్లో భారత్‌లో 288 విపత్తులు సంభవించగా, అమెరికా(472), చైనా(441), ఫిలిప్పీన్స్(274), ఇండొనేసియా(163) చొప్పున సంభవించాయి. ► 6457 వరద ఘటనల వల్ల 90 శాతం అతి పెద్ద విపత్తులు సంభవించాయి. -
తీరంలో తొలిసారి!
ఆధునిక పరిజ్ఞానంతో తుపాను షెల్టర్లు బాపట్ల నియోజకవర్గంలో మూడు భవనాల నిర్మాణం డిజైన్ సిద్ధం చేసిన అధికారులు ప్రపంచ బ్యాంకు నిధులు రూ.6.6 కోట్లు విడుదల ఒక్కో షెల్టర్‌లో 600 మంది వరకు ఆశ్రయం ఉప్పు, తుప్పు ప్రభావాన్ని తట్టుకునేలా నిర్మాణాలు టెండర్ల ప్రక్రియ పూర్తి.. పనులు ప్రారంభమే తరువాయి.. బాపట్ల ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తీర ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయించడం, అక్కడి ప్రజలను ఆగమేఘాల మీద సురక్షిత ప్రాంతాలకు తరలించడం అధికార యంత్రాంగానికి పెద్ద ప్రహసనం. తీరానికి దూరంగా ఉండే రక్షిత భవనాల్లోకి ప్రజలను చేర్చడంలో కొన్నిసారు వైఫల్యాలు ఎదురవుతుంటాయి. ఇలాంటి ఇబ్బందులను అధిగమించడానికి తీరంలోనే తుపాను షెల్టర్ల నిర్మాణానికి రంగం సిద్ధం చేస్తున్నారు. తీరంలో రక్షిత భవనాలు నిర్మించాలంటే వ్యయ ప్రయాసలు అధికం కావడం, నిర్మాణానికి ఉపయోగించే ఇనుము ఉప్పుగాలుల కారణంగా త్వరగా తుప్పు పట్టే ప్రమాదం ఉండటంతో ఇప్పటి వరకు తీరానికి ఐదారు కిలోమీటర్ల దూరంలో మాత్రమే తుపాను షెల్లర్లు నిర్మిస్తూ వస్తున్నారు. ఇప్పుడు తొలిసారిగా అత్యాధునిక పరిజ్ఞానంతో తీరం వెంబడే నిర్మించనున్నారు. రూ.6.6 కోట్ల ప్రపంచబ్యాంకు నిధులతో కేంద్ర ప్రభుత్వం మూడు భవనాలను బాపట్ల నియోజకవర్గ పరిధిలో చేపట్టనుంది. సూర్యలంక తీరంలోని పంచాయతీరాజ్ అతిథి గృహం స్థలంలో ఒకటి, కర్లపాలెం మండలం చిన్నపులుగువారిపాలెం, బసివిరెడ్డిపాలెం గ్రామాల్లో మరో రెండు భవనాల కోసం నిర్మాణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఒక్కో భవనానికి రూ.2.2 కోట్ల చొప్పున కేటాయించారు. ఈమేరకు టెండర్లు పిలిచి వర్క్ఆర్డర్ ఇచ్చే దశలో ఫైల్ నడుస్తోంది. ఉప్పు...తుప్పును ఎదుర్కొనే విధంగా .... బాపట్ల నియోజకవర్గంలో నిర్మించే షెల్టర్లు ఉప్పు, తుప్పును ఎదుర్కొనే విధంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించనున్నారు. నిర్మాణంలో మంచినీటి వాడకం, సిమెంటులోనే రసాయనాలు కలపడం వంటి జాగ్రత్తలు తీసుకుంటారు. బహుళ అంతస్తుల నిర్మాణాల్లో గ్రౌండ్ఫోర్లను ఖాళీగా ఉంచుతారు. ఏదైనా విపత్తు వస్తే మొదటి అంతస్తులోనే ప్రజలు ఉండేవిధంగా డిజైన్ చేశారు. ఒక్కొక్క షెల్టర్‌లో 500 నుంచి 600 మందిని సురక్షితంగా ఉంచే వీలుంది. లోపలే ఆహార పదార్థాలు తయారు చేసుకునేందుకు వీలుగా కూడా గదులు ఏర్పాటు చేస్తారు. సముద్ర, భూ మట్టాన్ని ఆధారం చేసుకుని ఎత్తు నిర్ణయించటంతో రానున్న 50 ఏళ్ల వరకు విపత్తులను ఎదుర్కొనే అవకాశం ఉండే విధంగా అధికారులు డిజైన్‌ను సిద్ధం చేశారు. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభిస్తాం.. తుపానుషెల్టర్ల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేశాం. ఒక్కొక్క షెల్టర్‌కు రూ. 2.2 కోట్లు నిధులు విడుదలయ్యాయి. తీరంలో షెల్టర్లు నిర్మించటం ఇదే మొదటి సారి. ప్రపంచబ్యాంకు నిధులతో నిర్మాణ పనులు చేపట్టనున్నాం. నాణ్యత ప్రమాణాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. - సుబ్రహ్మణ్యం, డీఈ ,పంచాయతీరాజ్ శాఖ. -
కరువు మేఘాలు..!
జిల్లాపై కరువు మేఘాలు కమ్ముకుంటున్నాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల చెరువులు, జలాశయాల్లోకి నీరు చేరక వెలవెలబోతున్నాయి. ఖరీఫ్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే 26 శాతం లోటుగా వర్షపాతం నమోదైంది. ఫలితంగా జిల్లాలో మూడు లక్షల ఎకరాలు సాగుకు నోచుకోలేదు. అడపాదడపా కురిసిన వర్షాలకు సోయా, పత్తి, కంది, పెసర, మొక్కజొన్న పంటలు సాగు చేయగా.. పూత, కాత దశకు చేరాయి. ప్రస్తుతం వరుణుడు ముఖం చాటేయడంతో భూమిలో తేమ శాతం తగ్గి పంటలు రంగు మారుతున్నాయి. - సాగుకు దూరంగా మూడు లక్షల ఎకరాలు - పంట పూత, కాత దశలో కనిపించని వర్షాలు - వరి సాగుకు రైతులు దూరం.. - జిల్లాలో 26 శాతం లోటు వర్షపాతం ఆదిలాబాద్ అగ్రికల్చర్ : ప్రకృతి వైపరీత్యాలతో ఏటా రైతులకు నష్టాలే దిగుబడి అవుతున్నాయి. ఆరుగాలం శ్రమించి పంట పండిస్తున్నా.. దిగుబడి చేతికొచ్చే సమయంలో వర్షాల్లేక వాడిపోతున్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో బ్యాంకు రుణాలు ఇవ్వకపోవడంతో వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు చేసి విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేశారు. ఆరంభంలో కురిసిన వర్షాలకు సోయా, మొక్కజొన్న, పత్తి, కంది తదితర పంటలు విత్తుకున్నారు. పంట ఎదిగే సమయం జూలైలో వర్షాలు మొహం చాటేశాయి. దీంతో పంట ఎండిపోతున్న సమయంలో ఆగస్టు నెల ఆరంభంలో కురిసిన మోస్తారు వర్షాలు పంటపై ఆశలు నిలిపింది. సోయా, పత్తి, కంది, పెసర, మొక్కజొన్న పంటలు పూత, కాత దశకు చేరాయి. ఈ సమయంలో వర్షాల్లేకపోవడం, రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా భూమిలో తేమ శాతం తగ్గి పంటలు రంగు మారుతున్నాయి. మండుతున్న ఎండలతో పూత, పిందె రాలడం రైతులను మనోవేదనకు గురి చేస్తోంది. వర్షాభావ పరిస్థితులతో జిల్లాలో ఇప్పటికే సాధారణ సాగు కంటే మూడు లక్షల ఎకరాలు సాగుకు దూరంగా ఉన్నాయి. వరి 1.30 లక్షల ఎకరాల్లో నాట్లు వేయకపోవడంతో బీళ్లుగా మిగిలిపోయాయి. జిల్లాలో వరి నాట్లు వేసుకునే సమయం ఆగస్టుతో ముగిసింది. సాధారణ వర్షపాతం ఖరీఫ్ ఆరంభం నుంచి ఆగస్టు నెలాఖరు వరకు 801.6 మిల్లీమీటర్లు కాగా.. ఇప్పటి వరకు 599.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సాధారణం కంటే ఇంకా 26 శాతం లోటుగా ఉంది. జిల్లాలో ఎక్కువగా వర్షాధార పంటలే సాగు చేస్తుంటారు. వర్షాభావ పరిస్థితుల వల్ల జలాశయాల్లోకి పూర్తి స్థాయిలో నీరు చేరలేదు. వరితోపాటు ఇతర పంటలు 3 లక్షల ఎకరాల వరకు సాగుకు నోచుకోలేదు. తేమ తగ్గుతున్న నేలలు.. జిల్లాలో 6.50 లక్షల హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగువుతాయని అందుకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులకు వ్యవసాయ అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇప్పటి వరకు 4.98 లక్షల హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు చేశారు. పత్తి, సోయా పంటలు విత్తుకునేందుకు గత నెలతో గడువు ముగియగా వరి, కంది, పెసర ఇతర పంటలు వేసుకునేందుకు ఆగస్టుతో ముగిసింది. సోయా పంట కాత కాసి దిగుబడి వచ్చే సమయంలో రంగు మారడం జరుగుతుంది. కానీ ప్రస్తుతం పూత దశలో రంగు మారుతోంది. పత్తి పూత, పిందె దశలో ఉంది ఈ సమయంలో నీటితడులు ఉంటే కాత బాగా కాసి వృద్ధి చెంది దిగుబడులు బాగా వస్తాయి. కానీ పదును లేక పూత రాలడం, పింద వృద్ధి చెందకుండా రాలిపోతోంది. ఇతర పంటలదీ అదే పరిస్థితి. ఈ సమయంలో ఒక్క భారీ వర్షం కురిసినా కాత నిలబడి దిగుబడులు వస్తాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరో నాలుగు రోజులు వర్షాల్లేకపోతే పెట్టుబడీ రాని పరిస్థితి నెలకొంటుందని వాపోతున్నారు. వరి సాగు హరి.. జిల్లాలో ఆశించిన వర్షాలు లేక వరి నారు పోసుకుని పొలంలో నాట్లు వేసుకునే గడువు దాటిపోయింది. గడువు దాటిన తర్వాత నాట్లు వేసుకున్నా ప్రయోజనం ఉండదు. ఇప్పటికే ఎండిపోయి, ముదిరిపోతున్న వరినారుమళ్లను చాలా మంది రైతులు వృథాగా వదిలేశారు. 70 వేల హెక్టార్లలో నాట్లు వేసుకోవాల్సి ఉండగా.. 15 వేల హెక్టార్లకే పరిమితమైంది. జిల్లాలో ప్రధానంగా జలాశయాల కిందనే ఎక్కువగా సాగువుతుంది. జలాశయాల్లో నీరు లేకపోవడంతో ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటితడులు అందవేమోనని నాట్లు వేసేందుకు రైతులు వెనుకంజ వేస్తున్నారు. కొంతమంది రైతులు ఇప్పటికే నారుమళ్లలో పశువులను వదులుతున్నారు. 32 మండలాల్లో లోటు వర్షపాతం జిల్లాలో సాధారణ వర్షపాతం 802.6 మిల్లీమీటర్లకు గాను ఇప్పటి వరకు 599.2 మిల్లీమీటర్లు కురిసింది. 52 మండలాలకు గాను 32 మండలాల్లో సాధారణం కంటే 50 శాతం నుంచి 25 శాతం లోటు వర్షపాతం నమోదైంది. మిగితా 15 మండలాల్లో 80 శాతం నుంచి 96 శాతం వర్షపాతం నమోదు అయింది. జిల్లాలో నాలుగు వ్యవసాయ డివిజన్లు ఉండగా.. ఆదిలాబాద్ డివిజన్లో సాధారణ వర్షపాతం 7807.9 మిల్లీమీటర్లు కాగా 6150.2, ఆసిఫాబాద్ డివిజన్లో 7398.3 మిల్లీమీటర్లుకు గాను 5600.2, మంచిర్యాలడివిజన్లో 9608.5 మిల్లీమీటర్లకు గాను 7895.6, నిర్మల్ డివిజన్లో 9695.0 మిల్లీమీటర్లకు గాను 6686.6, ఉట్నూర్ డివిజన్లో 6778.1 మిల్లీమీటర్లకు గాను 4837.4 మిల్లీమీటర్లు నమోదైంది. పూత దశలో వర్షాల్లేవు పడుతలేవు.. పత్తి పంట పూతకు వచ్చింది. ఈ సమయంలో వర్షాలు కురవడం లేదు. పదిహేను రోజులు దాటింది. ఈ సమయంలో ఒక భారీ వర్షం కురుస్తే దిగుబడి మంచిగా వస్తాది. లేకపోతే పంట పెట్టుబడి ఎళ్లడం కష్టమే. - అన్నం లింగన్న, బట్టిసావర్గాం పత్తికి డీఏపీ వేయండి.. పత్తి పంటలో తేమ తగ్గడం, ఉష్ణోగ్రత పెరగడం వల్ల తామర పురుగు, తెల్లదోమ ఉధృతి ఎక్కువగా కనిపిస్తోంది. దీని నివారణకు డీఏపీ 4 కిలోలు, అగ్రోమిన్ మాక్స్ 1 కిలో ఎకరానికి లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. సోయా పంట తెల్లదోమతో పసుపు ఆకులు రంగులోకి మారుతున్నాయి. దీని నివారణకు ఎసీటోఫిన్, నువాన్, లేదా ఫ్రోఫినో ఫాస్ 3 మిల్లీమీటర్లు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. - రాజశేఖర్, ఏరువాక శాస్త్రవేత్త, సమన్వయకర్త -
ఆరుగురు అన్నదాతల ఆత్మహత్య
బెంగళూరు(బనశంకరి) : రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. అప్పులు తీర్చే మార్గం కానరాక రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ఆరుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే... మండ్య : మండ్య జిల్లా మద్దూరు తాలూకా మారసింగనహళ్లికి చెందిన రైతు పుట్టస్వామి(45), పంట పెట్టుబడుల కోసం బ్యాంకులో రూ.6 లక్షల మేర అప్పులు చేశాడు. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయాడు. ఈ దశలోనే అప్పు తీర్చాలంటూ బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేయడంతో దిక్కుతోచక బుధవారం రాత్రి తన పొలంలో ఉరి వేసుకున్నాడు. కాగా, మండ్య జిల్లాలో ఇప్పటి వరకు ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల సంఖ్య 39కి చేరుకుంది. బెళగావి : బెళగావి జిల్లా చిక్కోడి తాలూకా జోడుకురుళి గ్రామానికి చెందిన రైతు లగమాకద్ద(46), తనకున్న నాలుగు ఎకరాల పొలంలో చెరుకు ఇతర పంటలు వేశాడు. వ్యవసాయ పెట్టుబడుల నిమిత్తం లక్షాంతర రూపాయలు అప్పు చేశాడు. సకాలంలో వర్షాలు లేకపోవడంతో పంట ఎండిపోయింది. దీంతో అప్పులు ఎలా తీర్చాలంటూ మదన పడుతున్న అతను గురువారం గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరివేసుకున్నాడు. ఈ ఘటనపై చిక్కోడి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యాదగిరి : యాదగిరి జిల్లా కందకూరు గ్రామానికి చెందిన రైతు తిమ్మణ్ణ కురబర(46), తనకున్న మూడుఎకరాలతో పాటు మరో 20 ఎకరాల భూమిని గుత్తకు తీసుకుని కందిపంట వేశాడు. పంట పెట్టుబడుల నిమిత్తం ప్రైవేటు వ్యక్తుల నుంచి రూ.10 లక్షలు, బ్యాంకులో రూ.70 వేలు దాకా అప్పులు చేశాడు. సకాలంలో వర్షం కురవకపోగా పంట ఎండిపోవడంతో అప్పులు తీర్చే దారిలేక బుధవారం రాత్రి ఇంటిలో ఉరివేసుకున్నాడు. విజయపుర : విజయపుర జిల్లా ఇండి తాలూకా హలసంగి గ్రామానికి చెందిన రైతు పైగంబర్ముజావర్(40) తనకున్న మూడెకరాల పొలంలో పప్పుదినుసుల పంట వేశాడు. పంట సాగు కోసం యూనియన్ బ్యాంక్ నుంచి ట్రాక్టర్ కొనుగోలుకు అప్పుచేశాడు. వర్షం రాకపోవడంతో పంటనాశనమైంది. అప్పులు తీర్చేదారిలేక గురువారం ఉదయం రైతు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రామనగర : రామనగర జిల్లా కటుకనపాల్యకు చెందిన రైతు జయణ్ణ(55) తనకున్న వ్యవసాయపొలంలో రేషం పంట వేయడానికి లక్షలాదిరూపాయలు అప్పు చేశాడు. పట్టుగూళ్ల ధర పడిపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు. దీంతో అప్పు తీర్చేదారిలేక రైతు ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇప్పటివరకు రామనగర జిల్లాలో 10 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాయచూరు : రాయచూరు జిల్లా దేవదుర్గ తాలూకా శవంతనగరకు చెందిన రైతు హనుమంత నరసన్న(40) తనకున్న ఎకరా పొలంలో పత్తిపంటవేశాడు. పంటపెట్టుబడుల నిమిత్తం రూ.1.20 లక్షలు అప్పుచేశాడు. వర్షం సకాలంలో పడకపోవడంతో పంట ఎండిపోయి నష్టపోయాడు. అప్పుతీర్చే దారిలేక గురువారం తెల్లవారుజామున రైతు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై గబ్బూరు పోలీసులు కేసు నమోదు చేశారు. -
బీమా లేదు..ధీమా లేదు
ఎకరాకూ దక్కని వైనం ముగిసిన పంట బీమా గడువు అధికారుల వైఫల్యం ఆందోళనలో అన్నదాతలు విశాఖపట్నం: అన్నదాతలకు ధీమా లేకుండా పోతుంది. ఏటా విరుచుకుపడే ప్రకృతి వైపరీత్యాలు..కరువు కాటకాల బారినపడే పంటలకు బీమా లేకుండా పోతుంది. ప్రభుత్వ ఉదాశీనత, శాఖల మధ్య సమన్వయ లోపం..ముఖం చాటేస్తున్న బ్యాంకర్ల పుణ్యమాని ఏ ఒక్క రైతు బీమా పొందలేని పరిస్థితి ఉంది. ప్రకృతి వైపరీత్యాల బారిన పడి నష్టపోయిన రైతుకు వెన్నదన్నుగా నిలిచేందుకు బీమా పథకం నేడు అక్కరకు రాకుండా పోతోంది. గతేడాది హుద్‌హుద్ వల్ల సర్వం తుడుచుకుపెట్టుకుపోయినా ఇన్‌పుట్‌సబ్సిడీ వచ్చిందే కానీ బీమా రాలేదు. ఈ పథకం పట్ల రైతుల్లో ఆశించిన స్థాయిలో ఆసక్తి లేకపోవడమే ఇందుకు కారణం. ప్రస్తుత ఖరీఫ్‌లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఒక్క ఎకరానికీ బీమా వర్తించలేదు. ఏరైతూ బీమా ప్రీమియం చెల్లించలేని దుస్థితి ఏర్పడడం ఇదే తొలిసారి అని అధికారులే అంగీకరిస్తున్నారు. జిల్లాలో ఖరీఫ్ సాగు విస్తీర్ణం 5,12,285 ఎకరాలు. ఇందులో 2,57,670 ఎకరాల్లో వరి, 94,570 ఎకరాల్లో చెరుకు, 56,535 ఎకరాల్లో రాగి పంటలు సాగు చేస్తుండగా, ఇతర పంటలన్నీ మరో 1,3,510 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. చెరకుతో పాటు వరిపంటలకు మాత్రమే పంట బీమా వర్తిస్తుంది. ఈ రెండింటి విస్తీర్ణమే మూడొంతులుంటుంది. 80 శాతం మంది ఈ పంటలే పండిస్తుంటారు. అయినా సర్కార్ పంట బీమా పథకం అమలు పట్లపై నిర్లక్ష్యాన్ని ప్రదర్శి స్తోంది. నాలుగేళ్లుగా కవరైన సాగు విస్తీర్ణమే ఇందుకు నిదర్శనం. 2014-15లో అతి కష్టమ్మీద 3 వేల ఎకరాల విస్తీర్ణానికి మాత్రమే బీమా కల్పించారు. ఈ ఏడాది ఒక్క ఎకరాకు కూడా బీమా కల్పించ లేదు. ఒక్క రైతు కూడా ఒక్కరూపాయి ప్రీమియం చెల్లించలేదు. వరికైతే ఎకరాకు పెద్దరైతు రూ.522లు, సన్నకారు రైతు 470లు, చెరకుకైతే రూ.2806, రూ.2229, మొక్క జొన్న కైతే రూ.277లు, రూ.249 చొప్పున ప్రీమియం చెల్లించాలి. జూలై-31తో గడువు ముగిసినా ఎవరూ ప్రీమియం చెల్లించిన వైనం లేదు. హుద్‌హుద్ విరుచుకుపడిన గతేడాదితో సహా గడిచిన నాలుగేళ్లలో బీమా చేయించుకున్న ఏ ఒక్క రైతుకు ఒక్క ఎకరాకు కూడా బీమా సొమ్ము విడుదల కాలేదు. 2012-2014 మధ్య పంటల బీమా చేయించుకున్న రైతులకు సుమారు రూ.8కోట్ల మేర బీమా మొత్తం రావాల్సి ఉంది. ఒక్క పైసా విడుదల కాకపోవడం కూడా రైతుల్లో ఈపథకం పట్ల నిరాశ కలిగించింది. రైతులను చైతన్య పర్చడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. ఎకరాకు ఎంత కట్టాలి..ఎప్పటిలోగా చెల్లించాలి అనేది ఏ వ్యవసాయాధికారి మా వద్దకు వచ్చి చెప్పిన పాపానపోలేదని రైతులు వాపోతున్నారు. కరువుఛాయలు తరుముకొస్తున్నాయి. మరొక పక్క రోజుకో వాయుగుండం రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఇటువంటి తరుణంలో ఏ దశలో పంట ను కోల్పోవల్సి వస్తుందో తెలియని పరిస్థితి. -
‘ఖరీఫ్’పై విరక్తి
రైతుల్ని నష్టపరుస్తున్న 17 శాతం తేమ నిబంధన అనేక కారణాల వల్ల 22 శాతం మించుతున్న తేమ పీపీసీల్లో ధాన్యం కొనుగోలు అంతంత మాత్రమే తేమపై మినహాయింపునివ్వాలంటున్న అన్నదాతలు రాజమండ్రి :బ్యాంకు రుణాలందక ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పులు చేయాల్సి రావడం, ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతినడం, డ్రైన్లు ముంచివేయడం.. రైతును కష్టనష్టాల పాలు చేస్తున్న ఈ జాబితాలో ప్రభుత్వం విధిస్తున్న తేమ నిబంధన కూడా ఒకటవుతోంది. ఈ నిబంధనతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అభ్యంతరాలు చెప్పడం, షావుకార్లు, మిల్లర్లు మద్దతు ధరకన్నా తగ్గించి కొనుగోలు చేయడం వల్ల నష్టపోవడం రైతులకు పరిపాటైంది. దీంతో ఖరీఫ్ సాగంటేనే రైతులు జంకుతున్నారు. వరుస పంట నష్టాలతో కోనసీమ రైతులు ఖరీఫ్ సాగును స్వచ్ఛందంగా వదులుకునేందుకు సిద్ధమవుతున్నారు. అన్ని విపత్తులను దాటుకుని పంట పండించినా మద్దతు ధరకు కొనుగోలు చేస్తారనే నమ్మకం కలగడం లేదు. ప్రభుత్వం భారీ ఎత్తున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నా ధాన్యం కొంటున్నది అంతంత మాత్రమే. 17 శాతం మించి తేమ ఉండకూడదనే నిబంధన వల్ల ఈ కేంద్రాలు అలంకార ప్రాయంగా మారాయి. ఖరీఫ్‌లో వచ్చే ధాన్యంలో తేమ శాతం 22 మించి ఉంటుంది. భారీ వర్షాలు, తుపానుల సమయంలో కోతలు జరగడం, ఎండబోతకు అవకాశం లేకపోవడం వంటి కారణాల వల్ల తేమ17 శాతానికి లోపు ఉండడం లేదు. ఖరీఫ్‌లోనే కాదు రబీలో కూడా ఈ కేంద్రాల్లో తేమ నిబంధన వల్ల పెద్దగా కొనుగోలు ఉండడం లేదు. ఇదే అదనుగా మిల్లర్లు, ధాన్యం షావుకార్లు మద్దతు ధరను తగ్గించి ధాన్యాన్ని కొంటున్నారు. గత ఖరీఫ్, రబీలలో బస్తా (75 కేజీలు) రూ.800కు కొనడంతో రైతులు నష్టపోయిన విషయం తెలిసిందే. రబీలో కొన్నది 18 శాతమే.. రబీ ధాన్యం కొనుగోలుకు జిల్లావ్యాప్తంగా 222 కేంద్రాలు (పీపీసీ) ఏర్పాటు చేసి, కొన్న ధాన్యం కేవలం 2.65 లక్షల మెట్రిక్ టన్నులే కావడం గమనార్హం. జిల్లాలో 15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండగా పీపీసీల ద్వారా కొన్నది కేవలం 18 శాతం మాత్రమే. దీనిలో రైతుల నుంచి నేరుగా కొన్నది 20 శాతం మించి ఉండదు. మిగిలిందంతా షావుకార్లు, మిల్లర్ల నుంచి కొనుగోలు చేసినట్టు చూపించి పీపీసీలు ప్రభుత్వం నుంచి సొమ్ములు చేసుకుంటున్నాయి. ఇందుకు మిల్లర్లు సైతం సైదోడవుతున్నారు. నిబంధనను సవరించాలి.. 17 శాతం లోపు తేమ ఉన్న ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలన్న నిబంధనను మార్చాలని రైతులు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సాగు సమ్మె సమయంలో తేమ నిబంధనకు ప్రభుత్వం కొంత మినహాయింపు ఇచ్చింది. 17 శాతం దాటిన తరువాత ఒక్క శాతానికి రూ.10 చొప్పున మద్దతు ధర తగ్గిస్తూ 25 శాతం వరకు తేమ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇప్పుడు కూడా అలా చేయాలని, అది ఖరీఫ్ సాగుకు ముందే ప్రకటించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేస్తే ఖరీఫ్ సాగు ఊపందుకునే అవకాశముంది. -
విపత్తు నిర్వహణపై విద్యార్థులకు శిక్షణ
- వెల్లడించిన విద్యా శాఖ మంత్రి వినోద్ తావ్డే - వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని స్పష్టం సాక్షి, ముంబై: ప్రకృతి వైపరీత్యాలు, విపత్తులు, ప్రమాదాల సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పాఠశాల విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని విద్యా శాఖ మంత్రి వినోద్ తావ్డే మంత్రాలయ భవనంలో చెప్పారు. ఇందుకోసం వచ్చే నెలలో పాఠశాలలు ప్రారంభమైన తర్వాత ప్రత్యేకంగా కొంత సమయాన్ని కేటాయించి శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇటీవల నేపాల్‌లో సంభవించిన భూకంపం వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. మరోవైపు నేపాల్, పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఆర్మీ పాఠశాలలోకి ఉగ్రవాదులు చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అభం శుభం తెలియని విద్యార్థులను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. కొద్ది సంవత్సరాల కిందట తమిళనాడులో ఓ పాఠశాల భవనానికి అగ్ని ప్రమాదం సంభవించింది. పాఠశాల భవనానికి ఒకే వైపు మెట్లు ఉండటంతో ఎటు వెళ్లాలో విద్యార్థులకు అర్థంకాక పాఠశాలలో తొక్కిసలాట జరిగింది. దీంతో అనేక మంది విద్యార్థులు మృతి చెందారు. దీంతో ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాల సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. -
నేపాల్‌కు ‘ఎగ్జిమ్’ రూ. 30 కోట్ల సాయం
ఇరవై ఏళ్లలో తిరిగి చెల్లింపు సాక్షి, ముంబై: భూకంపబాధితుల సహాయార్థం నేపాల్ ప్రభుత్వానికి 300 మిలియన్ డాలర్లు (రూ. 30 కోట్లు) అందించామని, ఈ మొత్తాన్ని ప్రభుత్వం 20 ఏళ్ల తరువాత తిరిగి చెల్లిస్తుందని ఎగ్జిమ్ బ్యాంక్ సీఎండీ యదువేంద్ర మాథుర్ తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం నుంచి వడ్డీ వసూలు చేయడం లేదని చెప్పారు. బ్యాంకు వార్షిక ఫలితాలు, అభివృద్ధి గురించి గురువారం ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు ప్రతిఫలం ఆశించకుండా ఆర్థిక సాయం అందించాలని చెప్పారు. నేపాల్ భూకంప ఘటనతో ప్రపంచం మొత్తం దిగ్భ్రాంతి చెందిందని అన్నారు. నేపాల్ భూకంప బాధితులకు ఉద్యోగులు, రాజకీయ నాయకులు తమ వంతు సాయం చేస్తున్నారన్నారు. వివిధ దేశాల్లో దేశీయ ఉత్పత్తుల తయారీకి అవసరమైన నిధులు ఇస్తున్నామని గుర్తు చేశారు. వ్యాపారులను ప్రోత్సహించడానికి నామమాత్ర వడ్డీ విధిస్తున్నామన్నారు. భారత్‌లో కూడా గ్రామీణ, పటణాభివృద్ధి, రైతులకు కేవలం రెండు, మూడు శాతం వడ్డీకి రుణాలు ఇస్తున్నామని తెలిపారు. ముంబైలో ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కలఘోడ ఉత్సవాల్లో బ్యాంకు చేపడుతున్న సహాయ కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజేసేందుకు స్టాళ్లు ఏర్పాటుచేస్తున్నామని వివరించారు. స్టాళ్ల ద్వారా అనేక మంది లబ్ధి పొందుతున్నారని తెలిపారు. -
దుర్మార్గం
కడప అగ్రికల్చర్ : కష్టకాలంలో ఉన్న రైతుల్ని ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం పలాయన మంత్రం పఠిస్తోంది. కొన్ని సంవత్సరాలుగా వర్షాభావం, ఇతర ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట చేతికందక రైతులు అల్లాడుతున్నారు. ఈ తరుణంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసేందుకు సిద్ధమైంది. శనివారం అసెంబ్లీలో అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అడిగిన ప్రశ్నకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు చెప్పిన సమాధానం చూస్తుంటే ఈ ప్రభుత్వం రైతుల కష్టాలను ఇసుమంతైనా పట్టించుకోలేదని స్పష్టమైంది. గత సంవత్సరాలకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేమంటూ మంత్రి తెగేసి చెప్పడంతో రైతాంగం కన్నీటి పర్యంతమైంది. కొన్ని సంవత్సరాలుగా జిల్లాలో వ్యవసాయం జూదంలా మారింది. ఇందులో రైతులు గెలుస్తారో... ఓడుతారో తెలియని పరిస్థితి నెలకొంది. ఒక ఏడాది అనావృష్టి, మరో ఏడాది అతివృష్టి.. ఇలా వరుస కడుతుండడంతో రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 2011 నుంచి ఇప్పటి వరకు జిల్లాకు ఇన్‌ఫుట్ సబ్సిడీ, బీమా కింద రూ.93.90 కోట్లు రావాల్సి ఉంది. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు చేష్టలుడిగి చూస్తున్నాయి. ఏటా పంటల పరిస్థితులు ఏలా ఉంటాయో తెలియని రైతన్న బీమా కంపెనీ కలిపించిన వెసులుబాటును ఉపయోగించుకుంటూ సాగు చేసిన పంటలకు బీమా ప్రీమియం చెల్లిస్తున్నారు. కానీ ఏ సంవత్సరం కూడా రైతుకు సక్రమంగా బీమా వచ్చి చచ్చిన దాఖలాలు లేవని రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రైతు సంక్షేమం గాలికి.. బీమా ప్రీమియం చెల్లించేందుకు గడువు తక్కువగా ఇచ్చినప్పటికీ రైతులు అష్టకష్టాలు పడి వివిధ బ్యాంకులు, మీ-సేవ, ఈ- సేవ కేంద్రాలకు వెళ్లి తగిన మొత్తం చెల్లించారు. అయితే నష్టపోయిన పంటకు సకాలంలో బీమా అందక ఇక్కట్లు పడుతున్నారు. నష్టపోయిన పంటల స్థానంలో మళ్లీ పంటల సాగు చేసుకోలేక పోతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. 2011 నుంచి ఇప్పటి వరకు అకాల వర్షాలు, వర్షాభావ పరిస్థితులు, ఈదురు గాలులకు పంటలు దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి జిల్లాకు రూ. 93.90 కోట్ల బీమా రావాల్సి ఉన్నా ప్రభుత్వం ఏ మాత్రం పట్టిచుకోలేదు. జిల్లాకు చెందిన అధికార పార్టీకి చెందిన శాసనమండలి వైస్ చైర్మన్ ఎస్వీ సతీష్రెడ్డిగానీ, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డిగానీ పట్టించుకున్న దాఖలాలు లేవని రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై శాసనసభలో విపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పలుసార్లు ప్రశ్నించినా ముఖ్యమంత్రి గానీ, సంబంధిత మంత్రిగానీ నోరు మెదపలేదని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. దీనిపై ఉద్యమాలు చేపడతామని సంఘాలు హెచ్చరిస్తున్నాయి. బీమా మంజూరులోనూ అన్యాయం ఖరీఫ్ 2012లో బీమా రూ.52 కోట్లకు గాను రూ. 24 కోట్లు మాత్రమే మంజూరైంది. అది కూడా రైతుల ఖాతాలకు చేరలేదు. 2012-13 రబీకి గాను రూ. 8.72 కోట్లు బీమా సొమ్ము రైతులకు చేరాల్సి ఉంది. 2013 ఖరీఫ్‌కు రూ. 52.33 కోట్లు మంజూరైంది. ఇప్పటి వరకు ఒక్క దమ్మిడి కూడా రైతులకు అందించిన పాపాన పోలేదు. ఉద్యాన పంటలకు సంబంధించి 2011 నుంచి ఇప్పటి వరకు రూ.3.22 కోట్లు పంట నష్టం సంభవించింది. దానికి సంబంధించి ఉద్యాన శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నష్ట నివేదిక పంపినా సొమ్ములు వచ్చిన దాఖలాలు లేవు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఉండి కూడా జిల్లాకు ఒరిగింది ఏమిలేదని రైతు సంఘాల నాయకులు బాహాటంగా విమర్శిస్తున్నారు. బాధాకరం.. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు పోయాయి. అందులో మా తప్పిదం ఉంటే ప్రభుత్వానికి మొర పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. వర్షాభావంతో తోటలు దెబ్బ తింటున్నప్పుడే పరిహారం కోరతాం. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడే కదా.. ఆదుకోవాలని కోరుతున్నాం. ఇన్పుట్ ఇవ్వలేమని చెప్పడం చాలా బాధగా ఉంది. - బాలరాజు, టి వెలంవారిపల్లె, వేంపల్లె మండలం బాధ్యతారాహిత్యం ప్రజా పరిపాలన చేయాలని ఈ ప్రభుత్వం అధికారంలోకి రాలేదు. ఏవో మాటలు చెప్పి స్వలాభం చూసుకోడానికి అధికారంలోకి వచ్చారు. రైతులు కరువు పరిస్థితులు నెలకొని ఒక పక్క అల్లాడుతుంటే వ్యవసాయ శాఖా మంత్రి పుల్లారావు పంటలకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేమని చెప్పడం దారుణం. ఇలా ఏ ప్రభుత్వంలో కూడా మంత్రులు ప్రకటనలు చేసిన సందర్భాలు లేవు. - లింగమూర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీ రైతు సంఘం(సీపీఎం) రైతులంటే ప్రభుత్వానికి లెక్కలేదు మాది రైతు ప్రభుత్వం.. రైతులకు మేము చేసినట్లుగా ఎవరు చేయలేరు.. అని చెబుతూ రైతుల నడ్డి విరిచే చర్యలకు పూనుకుంటున్నారు. నిన్న వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వమని తెగేసి చెప్పారు. ఇదెక్కడి నాయ్యం? ఇదేమి తీరు. రైతులు బాధల్లో ఉన్నప్పుడు ఆదుకోలేనప్పుడు మరెప్పుడు ఆదుకుంటారు? -నాగసుబ్బయ్య యువరైతు, కత్తులూరు, వేంపల్లె మండలం కాలం గడిపే ప్రభుత్వమిది రైతులు ఈ ప్రభుత్వానికి అక్కరలేనట్టుంది. రైతుంటే ముఖ్యమంత్రికి, వ్యవసాయ శాఖా మంత్రికి లెక్కలేని తనం అయిపోయింది. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేది లేదని చెప్పడం ఎంత వరకు సమంజసం.. అయ్యా పంటలు పోయాయి.. నష్టపరిహారం ఇచ్చి ఆదుకోండని అడుగుతున్నా ప్రభుత్వానికి కనికరం లేదా? -సంబటూరు ప్రసాదరెడ్డి, జిల్లా కన్వీనరు, వైఎస్సార్ సీపీ రైతు విభాగం ప్రభుత్వం ఉండి ఏం లాభం? ఒక పక్క కరువు పరిస్థితులు ఉండాయి. మరో పక్క గత ఏడాది మే నెలలో ఈదురు గాలులతోను, అధిక వర్షాలతోను అరటి, మామిడి. బొప్పాయి, కూరగాయలు, పూల తోటలకు నష్టం సంభవించింది. ఇలాంటి సమయంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేస్తే ఎలా గట్టెక్కాలి? - బాలిరెడ్డి, గోర్లపల్లె, చింతకొమ్మదిన్నె మండలం ఆందోళనలు చేపడతాం రైతులు పంటలు కోల్పోయి అల్లాడుతుంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తూ, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేదిలేదని తెగేసి నిస్సిగ్గుగా ఎలా చెబుతోంది? పంటలు పోతే ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేయడం దుర్మార్గం. ఇంత అధ్వాన్న ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. రైతులను అన్ని విధాల ఆదుకుంటాం.. ఏ కష్టం రానివ్వమని అధికారంలోకి వచ్చాక రైతులను విస్మరించే మాటలు మాట్లాడతారా? దీనిపై రైతులను కలుపుకుని ఆందోళనలు, ధర్నాలు చేపడతాం. - రామసుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్షుడు, ఏపీ రైతు సంఘం(సీపీఐ) -
ప్రకృతి వైపరీత్యాలు తట్టుకునే విత్తనాలు వృద్ధి చేయండి
వ్యవసాయ శాఖ మంత్రి పోచారం సూచన సాక్షి, హైదరాబాద్: ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే విత్తన రకాలు అభివృద్ధి చేయాలని శాస్త్రవేత్తలకు, అధికారులకు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. విత్తన పరిశోధనలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దాల్సిన బాధ్యత శాస్త్రవేత్తలపైనే ఉందన్నారు. ‘విత్తన ఉత్పత్తి గొలుసు’ను బలోపేతం చేసే విషయమై రాష్ట్ర ఉద్యానవన శాఖ కార్యాలయంలో సమావేశం జరిగింది. సమావేశానికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ, విత్తన ధ్రువీకరణ సంస్థ, ఆయిల్‌ఫెడ్ శాఖల అధికారులు హాజరయ్యారు.ప్రభుత్వం విత్తన పరిశోధన శాలలపై రూ.3 నుంచి రూ.4 కోట్ల వరకు ఖర్చు చేస్తోందని, శీతల గిడ్డంగులు అభివృద్ధి చేస్తోందని తెలిపారు. -
మొగసాల
టూకీగా ప్రపంచ చరిత్ర - 7 వెల్లువెత్తిన నదులు ఒండ్రుమట్టినీ, చెట్టూ చేమనూ, జంతు కళేబరాలనూ సముద్రానికి మోసుకెళ్ళడం ఇప్పటికీ మనం చూస్తున్నాం. అలాంటి సరుకంతా నింపాదిగా సముద్రం అడుగున కల్మషంగా పేరుకుని పూడుగా ఏర్పడుతుంది. పైనుండే నీటి ఒత్తిడికి అది అణిగి అణిగి, గట్టి పొరగా కుదించుకుని, చివరకు రాతిపొరగా మారిపోతుంది. అందులో ఇరుక్కున్న చెట్టూచేమా జంతుకళేబరాల వంటి సేంద్రియ పదార్థాలు కూడా ఆ శిలలో ఒదిగిపోయి, తమ ఆనవాళ్ళను శాశ్వతంగా నిలుపుకుంటాయి. తడవతడవకూ అలా కొట్టుకొచ్చిన పదార్థాలతో సముద్రం అడుగు పొరలు పొరలుగా నిర్మాణమౌతుంది. వాటిల్లో అన్నిటికంటే ప్రాచీనమైనది అట్టడుగుపొర కాగా, ఎగువకు జరిగేకొద్దీ వాటి వయస్సు తగ్గుతుంది. అదే విధంగా గాలికి కొట్టుకొచ్చే దుమ్మూ ధూళీ, అగ్నిపర్వతాల బూడిదా, నదులు ముంచెత్తినప్పుడు పేరుకుపోయే మేటలూ తదితర పదార్థాలతో భూమిమీద కూడా నేలలో పొరలు ఏర్పడుతుంటాయి. పొరలంటే ఇవి చీరమడతలంత తేలిగ్గా విడదీసేందుకు వీలయ్యేవిగావు. అట్టగట్టుకుపోయి అనేక సందర్భాల్లో వేరువేరుగా గుర్తించేందుకే అనుమతించనంతగా అతుక్కుపోయిన శిలాఖండాలు. భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యాలవల్ల కొన్ని చోట్ల అవి తునాతునకలై, తలకిందులై, వాటిల్లో కొన్ని శిలాఖండాలు ఉపరితలానికి చేరుకోనుంటాయి. అందువల్ల, వాటి కాలాన్ని గుర్తించేందుకు రసాయనిక పరీక్షలు మనకున్న ఏకైకమార్గం. నేల పొరల కాలాన్ని లేదా వయస్సును తెలుసుకునేందుకు ఇప్పుడు అవలంబిస్తున్న పద్ధతిని ‘కార్బన్ డేటింగ్’ అంటారు. అదేమిటో తెలుసుకోవాలంటే ముందుగా మనకు ‘రేడియో యాక్టివ్’ మూలకాల గురించి కొద్దిగా తెలిసుండాలి. అవి చీకట్లో సైతం కనిపిస్తాయన్నంత మేరకు ఇదివరకే మనకు తెలుసు. చీకట్లో సమయాన్ని తెలుసుకునేందుకు అంకెల మీద రేడియం పూసిన గడియారాలు యాభై సంవత్సరాలకు పూర్వం మనదేశంలో పెద్ద సంచలనం. కొంతకాలానికి ఆ పూత నల్లగా మారి చూసేందుకు చీదరగా ఉండడంతో క్రమేణా వాటికి ఆదరణ తగ్గింది. అలా నల్లబడేందుకు కారణం అందులోని రేడియో యాక్టివ్ అణువులకుండే చంచల స్వభావం. అంకెల మీద పూసిన రేడియం కాలం గడిచేకొద్దీ సీసంగా పరివర్తన చెందడంతో అక్కడా ఇక్కడా నల్లమచ్చలు మొదలవుతాయి. ఇదివరకు అణువును గురించి మాట్లాడుకునే సందర్భంలో, దాని గర్భంలో ప్రొటాన్లూ, ఎలెక్ట్రాన్లూ ఉంటాయనుకున్నాం. అంతేగాకుండా, అణుకేంద్రంలో ప్రొటాన్లతోపాటు ‘న్యూట్రాన్లు’ కూడా ఉంటాయని తెలుసుకునే అగత్యం ఇప్పుడు ఏర్పడింది. ఈ రేణువులకు విద్యుత్ స్వభావం లేకపోవడంతో వీటిని ‘న్యూట్రాన్లు’ - అంటే ‘తటస్థమైనవి’ - అన్నారు. వీటి ఉనికివల్లా, సంఖ్యవల్లా అణువుకు భారం పెరుగుతుందే తప్ప గుణం మారదు. రేడియో యాక్టివ్ మూలకాలు ఈ మూడురకాల రేణువులనూ - అంటే, ప్రొటాన్లలనూ ఎలెక్ట్రాన్లనూ న్యూట్రన్లనూ - నిరంతరం విడుదల చేసుకుంటూ అణుభారాన్నీ, సంఖ్యనూ తగ్గించుకుంటూ, తన్మూలంగా లక్షణాలను మార్చుకుంటూ, కొంతకాలానికి మరో పదార్థంగా ఏర్పడుతుంటాయి. ఆవిధంగా విడుదలయ్యే రేణువులే మనకు కాంతి కిరణాలుగా కనిపిస్తాయి. అణుభారాన్నీ స్వభావాన్నీ కోల్పోతూ, మరో నిలకడ కలిగిన పదార్థంగా సంపూర్ణ పరివర్తన చెందేందుకు రేడియో యాక్టివ్ మూలకం తీసుకునే సమయం దాని ఆయుర్ధాయం. ఆ ఆయుర్ధాయం అన్ని రేడియో యాక్టివ్ పదార్థాలకూ ఒకేలా ఉండదు. ‘ప్రొయాక్టినమ్’ అనే పదార్థం బతికుండేది నాలుగే నాలుగు నిమిషాలు కాగా, ‘యురేనియం 238’ ఆయుర్ధాయం తొమ్మిది వందల కోట్ల సంవత్సరాలు. ఏదైనా రేడియో యాక్టివ్ పదార్థం వయసును అంచనావేసేందుకు దాని ‘సగ ఆయుర్ధాయం’ ప్రామాణికంగా తీసుకుంటారు. పూర్తి ఆయుర్ధాయాన్ని తీసుకుంటే ఒక ఇబ్బంది ఎదురవుతున్న కారణంగా అంచనాల కోసం శాస్త్రజ్ఞులు సగం ఆయుర్ధాయాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అంతా సీసంగా మారిన ఒక మూలకం దశను ఉదాహరణగా తీసుకుంటే, ఆ సీసం రేడియో యాక్టివ్ పరివర్తన మూలంగా ఏర్పడిందో, కాక స్వతఃసిద్ధమైందో తెలుసుకునే ఉపాయం మనకు లేదు. ఆయుస్సు పూర్తిగా ముగియకముందైతేనే అది పరివర్తన జనితమని తెలిసొచ్చేది. సగం ఆయుర్దాయాన్నే ప్రామాణికంగా స్వీకరించడంలో దాగుండే రహస్యం ఇదే. ఇలా నేలపొరల్లో దొరికే ఈ పదార్థాల ఆయుర్ధాయం ఆధారంగా ఆయా పొరల వయసును తెలుసుకునే అవకాశం మనకు కలిగింది. ప్రొటాన్లనూ ఎలెక్ట్రాన్లనూ అట్టిపెట్టుకుని, న్యూట్రాన్లను మాత్రమే విడుదల చేసే పదార్థాలు కూడా ప్రకృతిలో ఉన్నాయి కొన్ని. వాటిని ‘ఐసోటోప్స్’గా గుర్తిస్తారు. ఈ తరహా అణువుల్లో న్యూట్రాన్ల సంఖ్య ప్రొటాన్ల నిష్పత్తిని మించడంతో పదార్థ లక్షణం మారకపోయినా, సహజమైన పదార్థం కంటే అణుభారం అధికంగా ఉంటుంది. ఆ భారమైన న్యూట్రాన్లను ఒక్కటొక్కటిగా వదిలేస్తూ ఆ అణువు క్రమంగా సాధారణ మూలకంగా మారేందుకు ప్రయత్నిస్తుంది. ఇలాంటి పదార్థాల వయసును కూడా ‘ఆర్ధాయుస్సు’ పద్ధతిలోనే లెక్కిస్తారు. ఆ సంబంధమైన మూలకాల్లో, విస్తారంగా నేల పొరల్లో లభ్యమయ్యే పదార్ధం ‘రేడియో యాక్టివ్ కార్బన్ (14)’. పొరల వయసును తెలుసుకునేందుకు ఇప్పుడు ప్రధానంగా ఉపయోగపడుతున్నది ఈ రేడియో యాక్టివ్ కార్బనే. దీని అర్దాయువు 5720 సంవత్సరాలే కావడం వల్ల, పొరల వయసును లక్షల సంవత్సరాల బారు (రేంజి)లో కాకుండా చిన్న చిన్న కాలమానాలుగా విభజించుకునే వీలు కలిగింది. రచన: ఎం.వి.రమణారెడ్డి ఆయుర్ధాయం అన్ని రేడియో యాక్టివ్ పదార్థాలకూ ఒకేలా ఉండదు. ‘ప్రొయాక్టినమ్’అనే పదార్థం బతికుండేది నాలుగే నాలుగు నిమిషాలు కాగా, ‘యురేనియం 238’ ఆయుర్ధాయం తొమ్మిది వందల కోట్ల సంవత్సరాలు. -
టీఆర్ఎస్ ప్లీనరీ ఇప్పట్లో లేనట్టేనా?
అక్టోబర్ నుంచి వాయిదాల మీద వాయిదా ఆవిర్భావ వేడుకలతో కలిపి ఒకేసారి నిర్వహణ సాక్షి, హైదరాబాద్ : అధికారపగ్గాలు చేపట్టాక ప్రభుత్వ కార్యకలాపాల్లో బిజీగా ఉండడం, ప్రకృతి వైపరీత్యాలు వంటి అననుకూల పరిస్థితుల నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చిన తెలంగాణ రాష్ర్ట సమితి(టీఆర్ఎస్) ప్లీనరీ ఇక ఇప్పట్లో జరిగేలా కన్పించడం లేదు. పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రభుత్వ కార్యక్రమాలలో తీరిక లేకుండా ఉన్నారని, అందుకే సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించలేకపోతున్నారని పార్టీ నాయకులు సమాధానపడుతున్నా, అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కమిటీలు ఎప్పుడు వేస్తారో? అని లోలోన ఆందోళన చెందుతున్నారు. రెండేళ్ల కాలం గడిచినా పాత కమిటీలే కొనసాగుతున్న నేపథ్యంలో తమకు ఎప్పుడు అవకాశం వస్తుందోనంటూ ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. గతేడాది ఎన్నికల సంవత్సరం పేర అసలు ప్లీనరీ నిర్వహణ జోలికే వె ళ్లలేదు. కనీసం ప్రభుత్వం ఏర్పాటయ్యాకనైనా ముహూర్తం కుదరడం లేదన్న ఆందోళనలో పార్టీ నాయకులు ఉన్నారు. రెండేళ్లుగా పాత కాపులే... జిల్లా స్థాయిలో 2013 నుంచి పాత కమిటీలే కొనసాగుతున్నాయి. ఇక, ఆయా నియోజకవర్గాల్లో మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారే ఇన్చార్జిలుగా ఉంటారని చెబుతున్నా చాలాచోట్ల దీనిపై స్పష్టత లేదు. మొత్తానికి క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణంలో కొంత గందగోళం నెలకొంది. పొలిట్‌బ్యూరోలో మార్పులు చేర్పులతో పాటు అనుబంధ సంఘాల బలోపేతంపైనా దృష్టి పెట్టాల్సి ఉందని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. పార్టీపరంగా వివిధ పదవుల్లో కొనసాగుతున్న వారిలో కొద్దిమంది ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలుపొందడంతోపాటు, మంత్రులుగానూ నియమితులయ్యారు. దీంతో ఆయా పదవులకు కొత్తవారిని ఎంపిక చేయాల్సిన అవసరాన్ని నాయకులు గుర్తు చేస్తున్నారు. వాయిదాల పర్వం... వాస్తవానికి టీఆర్ఎస్ ప్లీనరీ గతేడాది అక్టోబర్‌లోనే నిర్వహించాల్సి ఉంది. అయితే హుద్‌హుద్ తుపాను కారణంగా వాయిదా వేసుకున్నారు. ఆ తరువాత నిర్వహించాలనుకున్నా రాష్ర్టంలో వర్షాలు పడవచ్చనే సూచనతో వెనుకడుగు వేశారు. ఈలోగా నవంబర్‌లో బడ్జెట్ సమావేశాలు రావడంతో పార్టీ నిర్మాణం గురించి ఆలోచించే తీరిక లేకుండాపోయింది. అలాగే ఏడాది చివరి నెలా గడిచిపోయింది. జనవరి నెలాఖరుకు నిర్వహిస్తారని ప్రచారం జరిగినా ఆ ఊసే ఎత్తలేదు. ఫిబ్రవరి చివరి వారం నుంచే బడ్జెట్ సమావేశాల హడావుడికి అవకాశం ఉండడం, మార్చినెల మొత్తం సమావేశాలు కొనసాగనుండడంతో ఆ రెండు నెలలూ ‘ప్లీనరీ’ మరుగునపడ్డట్టే. ఇక అధికారంలోకి వచ్చాక మొదటిసారిగా ఏప్రిల్ 27న జరిగే ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలన్న ఆలోచనలో అధినాయకత్వం ఉన్నందున, ప్రత్యేకంగా ప్లీనరీ ఎందుకన్న అంశంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. విపక్షాల జోరు చూసి... అధికార టీఆర్ఎస్ ప్రభుత్వ కార్యకలాపాలపై దృష్టి సారించగా, ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు సంస్థాగతంగా బలోపేతం కావడంపై దృష్టి సారించాయి. అన్ని పార్టీలూ సభ్యత్వ నమోదులో తలమునకలై ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ర్టంలో టీఆర్ఎస్కు దీటుగా సభ్యత్వాలు చేయించాలనే కృతనిశ్చయంతో ఉంది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని ఆవిర్భావ వేడుకలకు ముందే పూర్తిస్థాయిలో సభ్యత్వాలను నమోదు చేయించాలని అధినేత కేసీఆర్ నిర్ణయించినట్టుగా చెబుతున్నారు. -
రాజధానిగా విజయవాడ సురక్షితమేనా!
* ప్రకృతి విపత్తులైన వరదల్ని, తుపానుల్ని తట్టుకోగలదా? * కృష్ణా నదిపై ఇప్పటికే ఆరు ఆనకట్టలున్నాయి * మరో ఆరు నిర్మిస్తామంటున్నారు * విజయవాడ భూకంపాల కేంద్రమని భూగర్భ శాఖ చెబుతోంది సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఎంపిక చేసిన విజయవాడ ప్రాంతం శాస్త్రీయ ప్రమాణాల దృష్ట్యా ఎంత సురక్షితం? ప్రకృతి విపత్తులైన వరదలు, తుపానులు, భూకంపాల్లాంటివి వస్తే తట్టుకోగలిగిన ప్రాంతమేనా? ప్రస్తుతం భూగర్భ, భూకంపాల విభాగం శాస్త్రవేత్తల్ని, పర్యావరణ వేత్తల్ని తొలిచివేస్తున్న ప్రశ్నలివి. పాత అనుభవాలు గానీ, భూగర్భ పరిశోధక శాఖ 2009-10, 2010-11 సంవత్సరపు నివేదికలు గానీ ఇందుకు సానుకూలంగా లేవు. భారతీయ జియోలాజికల్ సర్వే ప్రకారం విజయవాడ, పరిసర ప్రాంతాలు భూకంపాల ప్రాంతం. ప్రభుత్వం దీన్ని పరిగణలోకి తీసుకున్నట్టు కనిపించడం లేదు. నీటి లభ్యత, రవాణా అనుసంధానం కారణంగా విజయవాడ ప్రాంతాన్ని రాజధానికి ఎంపిక చేశామని ప్రభుత్వం చెబుతోంది. కృష్ణా నదిపై ఇప్పటికే ఆరు వంతెనలున్నాయి. మరో ఆరు నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అదే జరిగితే 1978లో ఢిల్లీ వరదల అనుభవం పునరావృతమైనా ఆశ్చర్యం లేదు. ఏదైనా ఓ కొత్త రాజధానిని నిర్మించేటప్పడు కనీసం వందేళ్ల దూరదృష్టితో మాస్టర్ ప్లాన్ తయారు చేస్తారు. 1951లో విజయవాడ జనాభా 1,61,198 కాగా 2014కి 17 లక్షలు దాటింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పూర్తి భద్రతతో రాజధానిని నిర్మించాలి. ఏటా వరదలు, సముద్రంలో ఏర్పడే వాయుగుండాలు, అల్పపీడనాలు, రుతుపవనాల కాలంలో వచ్చే తుపానులు, పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా రాజధాని నిర్మా ణం జరగాలే తప్ప వాస్తు కోసమనో, రియల్టర్ల కోసమో నిర్మిస్తే భావితరాల అగచాట్లు చెప్పనలవి కావు. 103 అక్కడ, 63 గ్రామాలు ఇక్కడ.. కృష్ణా నదిపై ఉన్న చివరి డ్యాం నాగార్జున సాగర్ అయితే చివరి ఆనకట్ట ప్రకాశం బ్యారేజీ. 1990నాటి విపత్తుల నివారణ సంస్థ నివేదిక ప్రకారం కృష్ణా బేసిన్లో వరద ప్రమాదం ఎక్కువుండే ప్రాంతం కూడా ఇదే. సాగర్ డ్యాం నుంచి భారీ వరద వచ్చి కృష్ణాబ్యారేజీకి జరగరానిదేదైనా జరిగితే గుంటూరు జిల్లాలో 13, కృష్ణా జిల్లాలో 16 మండలాలు ముంపునకు గురవుతాయి. గుంటూరు జిల్లాలో 103, కృష్ణా జిల్లాలో 63 గ్రామాలు తీవ్రంగా దెబ్బతింటాయి. 2009లో కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాలను ముంచెత్తిన వరదలే ఇందుకు రుజువు. ఆ ఏడాది సాగర్‌లో నీళ్లు లేకపోబట్టి సరిపోయింది గానీ అందులో నీరుండి, సాగర్ నుంచి 12 లక్షల క్యూసెక్కుల నీరు వదిలితే గుంటూరు, కృష్ణా జిల్లాలు దెబ్బతిని ఉండేవి. వరద ప్రభావిత మండలాలు... కృష్ణా జిల్లా: చందర్లపాడు, ఘంటశాల, ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, కోడూరు, పమిడిముక్కల, నాగాయలంక, మోపిదేవి, చల్లపల్లి, అవనిగడ్డ, జగ్గయ్యపేట,బెజవాడ రూరల్, తోట్లవల్లూరు, పెనమలూరు. గుంటూరు జిల్లా దాచేపల్లి, మాచవరం, అచ్చంపేట, మంగళగిరి, తాడేపల్లి, భట్టిప్రోలు, కొల్లూరు, కొల్లిపర, మాచర్ల, గురజాల, రేపల్లె, బెల్లంకొండ, దుగ్గిరాల, తుళ్లూరు, అమరావతి. -
విధానాలు మారితేనే భూమి పదిలం!
కోల్పోతున్న వనరులను తనంతట తానే సమకూర్చుకునే సహజ శక్తి భూమికి ఉంది. ఈ శక్తిని రసాయనిక వ్యవసాయం కుంగదీస్తున్నది. ఫలితంగా నాగరికతకు మూలమైన భూమాత నిస్సారమవుతోంది. ప్రకృతి వైపరీత్యాలు పెచ్చరిల్లుతున్నాయి. ప్రకృతికి హాని చేయని సాగు పద్ధతులెన్నో అందుబాటులో ఉన్నా.. ప్రభుత్వం పనిగట్టుకొని విస్మరిస్తోంది. ఏ కోణం నుంచి చూసినా మనం భూముల్ని ఎంతో గౌరవిస్తాం. అందువల్ల భూగోళాన్ని భూమాతగా భావిస్తుంటాం. మానవులతో సహా అన్ని జీవరాశులు రూపుదిద్దుకోవడానికి భూమాత ఒక వేదికగా కొనసాగడమే దీనికి కారణం. మన నాగరికత, సంస్కృతి భూమి చుట్టూ తిరుగుతుంటాయి. మన నాగరికత, సంస్కృతి ప్రారంభ కాలం నుంచి మనకు అవసరమైన మేర మాత్రమే భూముల(ప్రకృతి) నుంచి ఆహారాన్ని, ఇతర అవసరాలను తీర్చుకునేవాళ్లం. ఆ మేరకే ఉత్పత్తి చేసే వాళ్లం. కోల్పోయిన వనరులను ప్రకృతి తిరిగి తనంతట తానే పునరుజ్జీవింప చేసుకునేది. పశుపోషణ సేద్యంలో ముఖ్య భాగంగా కొనసాగింది. అలా శతాబ్దాలు గడచినా భూమి ఉత్పాదకత, ఆరోగ్యం ఏమీ క్షీణించలేదు. కానీ, సొంత వినిమయానికి కాక కేవలం లాభాపేక్షతో ‘సంపాదించి ఆస్తులను కూడబెట్టుకోవడానికి’ ప్రకృతి వనరులను వేగంగా కొల్లగొట్టడం దశాబ్దాల క్రితం ప్రారంభమైంది. కోల్పోతున్న వనరులను ప్రకృతి తనంతట తాను పునరుజ్జీవింప చేయలేని స్థితికి చేరింది. పారిశ్రామిక రసాయనిక వ్యవసాయ పద్ధతుల వల్ల భూమాత తిరిగి కోలుకోలేని విధంగా క్షీణిస్తోంది. ఒకప్పుడు భూమాతపై ఎంతో విశ్వాసంతో ఆధారపడిన మనం ఇప్పుడు ఆస్థాయిలో ఆధారపడలేకపోతున్నాం. పర్యావరణాన్ని రక్షించే సేద్యం మేలు ఈ నేపథ్యంలో పంటలు పండించే ప్రక్రియను తిరిగి ప్రకృతిలో భాగంగా మార్చుకొని సుస్థిరాభివృద్ధిని సాధించాలి. అదెలాగన్నదే నేడు మన ముందున్న ప్రధాన ప్రశ్న. దీనికి సమాధానంగా పర్యావరణాన్ని పరిరక్షిస్తూ, ప్రకృతిలో భాగంగా సేద్యం కొనసాగాలి. సేద్య భూముల్లో పెద్ద ఎత్తున సేంద్రియ పదార్థాలను కలపడం మినహా మరో పద్ధతి లేదు. అయితే, ఇప్పుడు మన సేద్యం ప్రధానంగా 5 ఎకరాల లోపు విస్తీర్ణం గల చిన్న కమతాలలో కొనసాగుతోంది. పైగా, సేద్య భూమిపై ఏ హక్కూలేని కౌలు సేద్యం వేగంగా విస్తరిస్తోంది. కౌలు రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి తక్షణం లాభాన్ని చేకూర్చే సేద్య పద్ధతులను, సాంకేతికాలను వినియోగిస్తున్నారే తప్ప.. దీర్ఘకాలంలో భూమి ఉత్పాదకతకు అవసరమైన సేంద్రియ ఎరువుల వాడకంపై శ్రద్ధ చూపడం లేదు. ఫలితంగా, భూముల ఉత్పాదకత రోజురోజుకూ క్షీణిస్తున్నది. భూసారం పెంపుపై రైతులకు దీర్ఘకాల ఆసక్తి కలిగించేలా సర్కారూ చట్టపరమైన చర్యలు తీసుకోవటం లేదు. కార్పొరేట్ సేద్యం నష్టదాయకం ప్రపంచీకరణ దృష్ట్యా ప్రభుత్వం కార్పొరేట్ సేద్యానికే మొదటి ప్రాధాన్యతనిస్తున్నది. కార్పొరేట్ యాజమాన్యాలు కూడా తక్షణ అధిక లాభాల్నిచ్చే భారీ యాంత్రీకరణకు, రసాయనిక ఎరువులు, ఇతర రసాయనాల వాడకానికే ప్రాధాన్యతనిస్తున్నారు తప్ప సేంద్రియ ఎరువులను వాడుతూ దీర్ఘకాలంలో భూమి ఆరోగ్యాన్ని, ఉత్పాదకతను పెంచడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వడంలేదు. అందువల్ల కార్పొరేట్ అనుకూల విధానాలను పునరంచనా వేసి.. సుస్థిర వ్యవసాయోత్పత్తికి దోహదపడే విధంగా వాటిని మార్చాలి. రసాయనిక వ్యవసాయం వల్ల వాతావరణంలో వస్తున్న మార్పుల దుష్పలితాలను తుపాన్లు, అకాల వర్షాలు, వరదలు, అనావృష్టి, కరవు కాటకాల రూపంలో ప్రతి సంవత్సరమూ అనుభవిస్తూనే ఉన్నాం. వాతావరణం వేడెక్కడానికి ప్రధాన కారకులు అభివృద్ధి చెందిన దేశాలే. వాతావరణ మార్పులను నిలువరించడానికి తీసుకోవాల్సిన చర్యలపై సిద్ధాంత రీత్యా అంగీకారం తెలుపుతూనే.. తమ వంతు బాధ్యతలు తీసుకోవడానికి అభివృద్ధి చెందిన దేశాలు పూర్తిగా అంగీకరించడం లేదు. అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా ఈ భారాన్ని భరించాలని ఒత్తిడి చేస్తున్నాయి. కానీ, తుపాన్లు వరదలు, కరవు కాటకాల వల్ల జరుగుతున్న నష్టాలు స్థానిక స్వభావం కలవి. వీటి దుష్ఫలితాలను ఎదుర్కోవడానికి స్థానికంగానే గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అందువల్ల మన దేశం గట్టి చర్యలు తీసుకోక తప్పనిసరి పరిస్థితులు ఏర్పడ్డాయి. కార్పొరేట్ అనుకూల విధానాలు మారాలి మన దేశంతో సహా 30 దేశాల నుంచి దాదాపు 600 మంది ఉన్నతస్థాయి శాస్త్రజ్ఞులు, విధాన నిర్ణేతలు 2008లో సమావేశమై ఈ చర్యలపై చర్చించారు. సుస్థిర వ్యవసాయోత్పత్తికి వ్యవసాయ రసాయనాలు దోహదపడవనీ, సేంద్రియ ఎరువులను వాడాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. వచ్చే 50 ఏళ్లలో చింతలేని వ్యవసాయానికి తగిన సాంకేతికాలు.. చిన్న కమతాల రైతులకు అనుకూలంగా ఉన్నాయి. వీటిని అమలు చేయడానికి సంసిద్ధత తెలుపుతూ భారతదేశం సంతకం చేసింది. కానీ, కార్పొరేట్ సేద్యాన్ని ప్రోత్సహించే విధానాలనే ప్రభుత్వం కొనసాగిస్తోంది. చిన్న కమతాల స్థాయిలో సేంద్రియ ఎరువుల వాడకంపై రైతుల్లో ఆసక్తిని కలిగించడానికి ప్రభుత్వం విధానాలను మార్చాలి. వాతావరణ మార్పుల్ని, వాటి దుష్ర్పభావాలను గమనంలో ఉంచుకొని భారత ప్రభుత్వం 2011లో వాతావరణ ఒడుదొడుకులను తట్టుకునే వ్యవసాయ జాతీయ పరిశోధనా సంస్థను స్థాపించింది. దీనికి అనుగుణమైన విజ్ఞానం, ఎన్నో సాంకేతికాలు, సాగు పద్ధతులు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. అయితే, వీటిని అమల్లోకి తేవడంపై భారత ప్రభుత్వం ఆసక్తి చూపటం లేదు. సుస్థిర వ్యవసాయాభివృద్ధికి, భూమి ఉత్పాదకత పెంచటానికి అందుబాటులో ఉన్న సాంకేతికాల అమలుపై దృష్టి కేంద్రీకరించాలి. సేంద్రియ ఎరువుల లభ్యత పెంచి భూముల సారాన్ని పెంచేందుకు దోహదపడాలి. భూముల్ని ప్రైవేటు ఆస్తులుగా చూడకుండా.. జాతీయ సంపదగా పరిగణించాలన్న స్పృహను కలిగించాలి. ‘అంతర్జాతీయ భూముల పరిరక్షణ సంవత్సరం-2015’ ఈ దిశలో ఆలోచింపచేయటానికి దోహదపడాలి. (వ్యాసకర్త: విశ్రాంతాచార్యులు, భూవిజ్ఞాన శాస్త్ర విభాగం, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం) -
బీమా సరే..ధీమా ఏది?
ప్రీమియం ఇలా.. చెట్టు వయసు రైతు వాటా పరిహారం 515 ఏళ్లు రూ.26 రూ.450 1650 ఏళ్లు రూ.46 రూ.800 జగిత్యాల అగ్రికల్చర్ : జిల్లాలో ఏటా ప్రకృతి వైపరీత్యాలతో మామిడికి నష్టం వాటిల్లుతున్నా రైతులకు పరిహారం అందడం లేదు. ధీమాగా ఉంటుందని బీమా ప్రీమియం చెల్లించిన రైతులకు పంట నష్టపోయినా కూడా పరిహారం దిక్కులేకుండా పోయింది. మరోవైపు ఈ ఏడాది మామిడి వాతావరణ బీమాకు డిసెంబర్ 15 ఆఖరు తేదీగా ప్రకటిస్తూ ప్రభుత్వం మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. వాతావరణంలో వచ్చే మార్పులతో నష్టం జరిగినప్పుడు పరిహారం పొందేందుకు మూడేళ్లుగా జిల్లాలోని మామిడి రైతులకు ప్రభుత్వం వాతావరణ బీమా అవకాశం కల్పించింది. అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా సంస్థ వారు ఈ బీమా చెల్లిస్తున్నారు. ఒక్కో చిన్న చెట్టు(5-15 ఏళ్లు)కు రూ.26, పెద్ద చెట్టు(16-50 ఏళ్లు)కు రూ.46ను రైతు ప్రీమియం రూపంలో చెల్లిస్తున్నారు. రైతులు ఎన్ని చెట్లకు ఎంత ప్రీమియం చెల్లిస్తే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అన్ని చెట్లకు, అంత ప్రీమియం చెల్లిస్తాయి. ఒకవేళ పంట నష్టం జరిగితే, నష్టాన్ని బట్టి 5-15 ఏళ్ల చెట్టుకు రూ.450లు, 16 నుంచి 50 ఏళ్ల చెట్టుకు రూ.800 ఇన్సూరెన్సును సంస్థ చెల్లిస్తుంది. ఉద్యానవనశాఖ అధికారుల సహకారంతో బీమా సంస్థకు ప్రీమియం చెల్లించవచ్చు. మండలం యూనిట్ బీమా ప్రవేశపెట్టినప్పటినుంచి తరచూ నిబంధనల మార్పుతో కొత్త చిక్కులు వస్తున్నాయి. గతేడాది నిబంధనలు పరిశీలిస్తే అధిక లేదా అల్ప వర్షం (15 డిసెంబర్ 2013 నుంచి 28 ఫిబ్రవరి 2014 వరకు), చీడపీడల బెడద వల్ల నష్టం (15 డిసెంబర్ 2013 నుంచి 28 ఫిబ్రవరి 2014 వరకు), రోజువారీ ఉష్ణోగ్రతల్లో తేడాలు (జనవరి 1, 2014 నుంచి మార్చి 15, 2014 వరకు), గాలి దుమారాలు (మార్చి 1, 2014 నుంచి మే 31, 2014 వరకు) వచ్చి పంటను నష్టం చేస్తేనే వాతావరణ బీమా వర్తించే అవకాశం ఉంటుంది అగ్రికల్చర్ ఇన్సూరెన్సు కంపెనీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈ పథకంలో మండలాన్ని యూనిట్‌గా పరిగణిస్తారు. గత సీజన్లో కంపెనీ నిర్దేశించిన సమయాల్లో వాతవరణ మార్పులతో మామిడి పంటలకు తీవ్ర నష్టం జరిగింది. అయినా పరిహారం మాట ఇప్పటివరకు లేదు. జాడలేని పరిహారం మామిడి చెట్లకు వాతావరణ బీమా కింద 2012-13లో 1,031 మంది రైతులు, రూ 52,55,499 ప్రీమియం చెల్లించారు. ఆ ఏడాది ప్రకృతి వైపరీత్యాలతో చాలా ఎకరాల్లో పంట నష్టపోయారు. ఇందులో 592 మంది రైతులకు రూ.67,55,085 పరిహారం మంజూరైంది. గత సీజన్ 2013-14లో 494 మంది రైతులు రూ.33,55,384 ఇన్సూరెన్సు ప్రీమియం చెల్లించారు. అంతే మొత్తానికి ప్రభుత్వం సైతం బీమా సంస్థకు ప్రీమియం చెల్లించింది. గాలిదుమారాలు, ప్రకృతి వైపరీత్యంతో మామిడి పంటకు గతేడాది కూడా నష్టం వాటిల్లింది. పరిహారం విషయం మాత్రం ఇప్పటికీ తేలలేదు. తాజాగా ఈ ఏడాది మామిడి పంటకు వాతావరణ బీమా కల్పిస్తూ ప్రభుత్వం మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. వాతావరణ కేంద్ర నివేదికే ఆధారం ప్రతీ మండలకేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ లో ఓ వాతావరణ కేంద్రం ఉంటుంది. ఇది ఆ టోమెటిక్గా పనిచేస్తుంది. ఇక్కడి నుంచి వాతావరణ సమాచారం ఎప్పటికప్పుడు హైదరాబాద్‌లోని సెక్రటేరియేట్‌లో ఉండే వాతావరణ కేంద్రానికి వెళ్తుంది. వర్షపాతం వివరాలు, ఎం డ తీవ్రత, గాలులు ఇతరత్రా వివరాలన్నీ నమోదవుతాయి. అక్కడినుంచి అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీకి సమాచారం వెళ్తుంది. ఈ వాతావరణ కేంద్రాల్లో నమోదయ్యే వివరాల ఆధారంగానే ఇన్సూరెన్స్ వచ్చేది, రానిది ఆధారపడి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కాగా, నిర్వహణ ఎలా ఉంటుందో తెలియని ఈ కేం ద్రాలు ఎంతవరకు పనిచేస్తాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
అన్నదాతకు ఏదీ ఆసరా?
భీమవరం : ప్రకృతి వైపరీత్యాలు రైతులను నిండా ముంచుతుంటే వారికి భరోసా కల్పించవలసిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గతేడాది హెలెన్, పైలీన్ తుపానుల దెబ్బకు జిల్లాలో నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా అందించి ఆదుకోవలసి ఉన్నా ఆ పని చేయడం లేదు. గ త కాంగ్రెస్ ప్రభుత్వం రెండు నెలల్లో ఇన్పుట్ సబ్సిడీ అందిస్తామని భరోసా ఇచ్చినా అమలు కాలేదు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం తీరు కూడా అదేవిధంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు రుణమాఫీ చేయకపోవడంతో రైతులకు బ్యాంకుల్లో వడ్డీ భారం పెరుగుతోంది. 2013 సంవత్సరంలో వచ్చిన హెలెన్, పైలీన్ తుపానుల ధాటికి జిల్లాలోని సార్వా పంట అతలాకుతలమైంది. అప్పట్లోనే లక్షా 50 వేల హెక్టార్లలో నష్టం వాటిల్లినట్టు అధికార యంత్రాంగం అంచనా వేసింది. దీని నిమిత్తం ఇన్పుట్ సబ్సిడీ కింద సుమారు రూ. 103 కోట్లు అందించవలసి ఉందని అధికారులు గుర్తించారు. గ్రామం యూనిట్‌గా అంచనా వేసి సుమారు రూ.150 కోట్లు పంటల బీమా సొమ్ము రావాల్సి ఉందని ప్రభుత్వం గుర్తించింది. ఇన్సూరెన్స్ కంపెనీల నియమ నిబంధనల ప్రకారం పంటల బీమా ప్రీమియం ఈ ఏడాది ఆగస్టు నెలాఖరులోపు బ్యాంకుల ద్వారా అందించవలసి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీతో కలిపి ఈ బీమా సొమ్మును ఇచ్చేందుకు ఇన్సూరెన్స్ కంపెనీలపై ఒత్తిడి తీసుకురావడంతో అవి కూడా ఇప్పటి వరకు రైతులకు చేరువ కాలేదు. నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ఇన్సూరెన్స్ కంపెనీలు చెబుతున్నప్పటికీ ప్రభుత్వ ఒత్తికి కారణంగా బీమా సొమ్ము వెనక్కెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. ఇన్పుట్ సబ్సిడీ అయితే అసలు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. రుణ మాఫీ ఎప్పుడో? రుణమాఫీ చేయడం తథ్యం అని చెబుతూ వస్తున్న ప్రభుత్వం మాత్రం దీనిపై రోజు రోజుకూ అనేక షరతులు పెడుతూ రైతులను మభ్యపెట్టే ప్రయత్నంలో నిమగ్నమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 2013 మార్చి నెలాఖరులోపు సుమారు ఎనిమిది లక్షల మంది రైతులు రూ. 7 వేల 475 కోట్లు పంట రుణాలు పొందారు. వీటిలో సుమారు నాలుగు శాతం మంది మాత్రమే ఆయా బ్యాంకులకు రుణాలు చెల్లించినప్పటికీ మిగిలిన రైతులు రుణమాఫీ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం రుణమాఫీ చేయకపోతే బ్యాంకుల్లో వడ్డీ మరింత భారంగా మారి కష్టాల ఊబిలో కూరుకుపోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
కొందరికే లబ్ధి
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వాలు చేసే రుణాల రీషెడ్యూల్ ప్రకటన అన్నదాతలకు ఊరటనిస్తుంది. కానీ హుద్‌హుద్ తుఫాన్ నేపథ్యంలో ప్రకటించిన రీషెడ్యూల్ వల్ల లబ్ది పొందే అవకాశం లేకపోవడంతో జిల్లాలోని మెజార్టీ రైతన్నలు తీవ్ర నిరాశ చెందుతున్నారు. సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో నాలుగులక్షలఎనిమిదివేలమంది రైతులున్నారు. ఖరీఫ్ సీజన్లో 3.79 లక్షల హెక్టార్లలో వరితో పాటు వివిధ రకాల పంటలు సాగు చేస్తుంటారు. 2.70లక్షల ఎకరాల్లో వరి, 75వేల ఎకరాల్లో చెరకు, అపరాలు పండిస్తుంటారు. ఈ ఏడాది ఖరీఫ్-రబీ సీజన్లకు కలిపి రైతులకు రూ.950కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయిస్తే ఇప్పటి వరకు అందించింది రూ.320 కోట్లు మాత్రమే. అది కూడా అతికష్టమ్మీద 50వేల లోపు రైతులకు మాత్రమే ఇవ్వగలిగారు. రుణమాఫీ వల్ల రూ.1040కోట్ల మేర రుణాలు మాఫీ అవుతాయని సుమారు 2.50లక్షల మంది రైతులు ఆశించారు. కానీ రు ణమాఫీ వల్ల మిగిలిన రైతులకు ఖరీఫ్ సీజన్లో రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు ముఖం చాటేశారు. దీంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, దళారీల వద్ద అం దినకాడికి రూ.10లు.. రూ.15లవడ్డీలకు అప్పులు చేసి మరీ సాగు చేసారు. తీరా పంట చేతికొచ్చే సమయంలో హుదూద్ విరుచుకుపడింది. జిల్లాలో 882 గ్రామాల పరిధిలో 1,35,184 మంది రైతులు సాగు చేసిన 82,385.681 ఎకరాల్లో పంటలు 50 శాతానికి పైగా దెబ్బతిన్నాయి. గతంలో ఎన్నడూలేని రీతిలో జిల్లాలోని 43 మండలాలను తుఫాన్ ప్రభావిత మండలాలుగా ప్రకటించి ఆయా మండలాల్లో రైతులు తీసుకున్న రుణాలన్నింటిని రీషెడ్యూల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లెక్కన హుదూద్ తుఫాన్ వల్ల పంటలు దెబ్బతిన్న లక్షా35వేల మంది రైతులకు రుణాల రీషెడ్యూల్ వర్తించాలి. కానీ ఆ పరిస్థితి లేదు. సాధారణంగా ఏప్రిల్ నుంచి జూలై వరకు ఖరీఫ్సీజన్లో రుణాలు ఇస్తుంటారు. ఈ ఏడాది సాగు ఆలశ్యమవడం..రుణ లక్ష్యాలు చేరుకోకపోవడంతో గడువును తొలుత ఆగస్టు, తర్వాత సెప్టెంబర్ వరకు పొడిగించారు. అయినా 40 శాతం రైతులకు మించి బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయలేకపోయారు. ఈ లెక్కన 50వేలలోపు రైతులు మాత్రమే ఖరీఫ్ రుణాలు పొందగలిగారు. సగం మందికి పైగా బ్యాంకులు రుణాలు మంజూరు చేయలేదు. దీంతో పంట పూర్తిగా నష్టపోయిన రైతుల్లో ఎంతతక్కువ లెక్కేసుకున్నా 80వేల మందికి రీషెడ్యూల్ ద్వారా లబ్ది పొందే అవకాశం లేకుండా పోవడంతో వారంతా గగ్గోలు పెడుతున్నారు. ఒక పక్క పంటల బీమా సౌకర్యాన్ని కోల్పోయి..మరొక పక్క రీషెడ్యూల్ వల్ల కలిగే లబ్దిని కోల్పోవడంతో వీరి పరిస్థితి దయనీయంగా తయారైంది. ఇంకొక పక్క పరిహారం ఇప్పుడు ఎంత వస్తుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. రీషెడ్యూల్ వల్ల లబ్దిపొందే అవకాశం లేకపోవడంతో మరింత అప్పుల ఊబిలో కూరకుపోవాల్సి వస్తుందంటూ రైతులు కలవరపడుతున్నారు. రుణమాఫీ విషయంలో సర్కార్ కాలయాపన చేయడం వలనే తమకీ దుస్థితి పట్టిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్కార్ గద్దెనెక్కిన వెంటనే ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ చేసి ఉంటే ఖరీఫ్‌లో తామంతా రుణాలు పొందేవారమని,,ఆమేరకు పంటల బీమా వర్తించడంతో పాటు ఇప్పుడు రీషెడ్యూల్ పరిధిలోకి వచ్చేవారమని అంటు న్నారు. రీషెడ్యూల్ పొందిన రైతులకు గత ఖరీఫ్ సీజన్లో వారు పొందిన రుణాలన్నీ 3 నుంచి ఐదేళ్ల కాలపరిమితిలో రీషెడ్యూల్ అవుతాయి. అంతేకాకుండా రబీ సాగు చేసే రైతులకు జనవరి నుంచి కొత్త రుణాలు మంజూరవుతాయి. రుణాల రీషెడ్యూల్కు సంబంధించి స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ రూపొందించిన మార్గదర్శకాలపై చర్చించి.. జిల్లా పరిధిలో ఎన్ని కోట్ల మేర ఎంతమంది రైతులు రీషెడ్యూల్ వల్ల లబ్ది పొందుతారో గుర్తించేందుకు వచ్చే వారంలో డిస్ట్రిక్ట్ కో-ఆర్డినేషన్ కమిటీ (బ్యాంకర్స్) సమావేశం నిర్వహించి తుది జాబితా ప్రకటించే అవకాశాలు న్నాయని బ్యాంకింగ్ వర్గాలు చెప్పాయి. -
సిరుల ‘ఫ్లవర్’
ఆత్మకూరు : ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడలు, గిట్టుబాటు కాని ధరలు.. వాణిజ్య పంటలు సాగు చేసి నష్టాలపాలవుతున్న రైతులు కూరగాయల సాగువైపు దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా అధిక పోషకాలు కలిగిన, మార్కెట్లో డిమాండ్ ఉన్న కాలీఫ్లవర్ సాగుపై మక్కువచూపుతున్నారు. తక్కువ పెట్టుబడి.. తక్కువ సమ యం.. అధిక లాభాలు ఉండడంతో పంట విస్తీర్ణం రోజురోజుకూ పెరుగుతోంది. ఈ పంటను మండలంలో వందలాది ఎకరాల్లో సాగు చేస్తున్న రైతులు మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. కాలీఫ్లవర్ సాగు-పంటకు వచ్చే చీడపీడలు-నివారణ చర్యలను హార్టికల్చర్ ఆఫీసర్ సంజీవరావు వివరించారు. చలికాలం చివరి వరకునాటుకోవచ్చు.. మెలకువలు పాటిస్తే కాలీఫ్లవర్‌లో అధికదిగుబడి సాధించవచ్చు. ఈ పంటను చలికాలం చివరివరకు నాటుకోవచ్చు. వేసవి తీవ్రత మొదలుకాకముందే పంట చేతికి వస్తుం ది. కాలీఫ్లవర్‌లో ముఖ్యంగా నల్లి, మచ్చతెగులు, ఆవాలరంపపు పురుగు, తొలుచు పురుగు, డైమండ్ బ్యాక్‌మాస్(మచ్చలు)తో పాటు కొరడా తెగులు, బ్రౌనింగ్, రైజీనెస్, పేనుబంక, బట్టరింగ్ లాంటి సమస్యలు వస్తాయి. సకాలంలో వీటిని గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలి. చీడపీడలు-నివారణ డైమండ్ బ్యాక్‌మాస్ : దీని లార్వాలు ఆకుల కణజాలాన్ని గీకి జల్లలాగా మారుస్తాయి. పెద్ద లార్వాలు ఆకుపై రంధ్రాలు చేస్తాయి. చెట్టు రంధ్రాలతో కనిపిస్తుంది. దీని నివారణకు ముందు గుడ్లను నాశనం చేయాలి. 100 మిల్లీలీటర్ల నీటిలో 5శాతం వేపగింజల కశాయాన్ని పిచికారీ చేస్తే గుడ్లు కుళ్లిపోతాయి. మలాథియాన్ లేదా క్లోరో ఫైరిఫాస్ లీటరు నీటికి 2మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేయాలి. పేనుబంక : పేను బంక వారణకు లీటరునీటిలో ఒక మిల్లీలీటరు రోగోర్‌ను కలిపి పిచికారీ చేయాలి. రైజీనెస్ : దీని లక్షణం పువ్వు వదులుగా ఉండడం. గడ్డమీద నూగు ఉంటుంది. దీంతో విలువ తగ్గుతుంది. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు పువ్వులు వదులవుతాయి. దీని నివారణకు పూలను సమయానికి కోయాలి. కొరడా తెగులు : ఆకులు పసుపు రంగుగా మారుతాయి. అంచులు తెల్లబడుతాయి. మధ్యభాగం ఈనె కొరడా లాగా బయటకు కనబడుతుంది. మాలిబ్డినమ్ లోపం వల్ల, నత్రజని ఎక్కువ కావడం వల్ల ఈతెగులు వస్తుంది. దీని నివారణకు సిఫారసు మేరకే ఎరువులు వాడాలి. ఎకరానికి 400 గ్రాముల అమ్మోనియం మాలిబిడేట్‌ను 200లీటర్ల నీటితో కలిపి పిచికారీ చేయాలి. బ్రౌనింగ్ : బోరాన్ లోపం వల్ల పువ్వుపైన గోధుమరంగు మచ్చలు ఏర్పడతాయి. కాండం గుల్లగా మారి నీరుకారుతుంది. పువ్వుపెరిగే దశలో లీటరు నీటిలో 3గ్రాముల బోరాక్స్ కలిపి పిచికారీ చేయాలి. ఆఖరి దుక్కిలో ఎకరానికి 8కిలోల బోరాక్స్ వేయాలి. బట్టరింగ్ : కాలీఫ్లవర్లు చిన్న పరిమాణంలో ఉండడాన్ని బట్టరింగ్ అంటారు. ముదిరిన నారు నాటడం వల్ల బట్టరింగ్ వస్తుంది. స్వల్పకాలిక రకాలను ఆలస్యంగా వేయొద్దు. తగిన మోతదులో ఎరువులు వేయాలి. సిపారసు చేసిన ఎరువులనే వాడాలి. - సంజీవరావు(83744 49385),హార్టికల్చర్ ఆఫీసర్ నారు నర్సరీలో పోసుకోవాలి నేను ఎకరం భూమిలో కాలీఫ్లవర్ సాగుచేశాను. నారు నర్సరీలో పోసుకోవాలి. 30రోజుల సమయం పడుతుంది. సాగు చేసిన తర్వాత సుమారు మూడునెలల్లో పంట చేతికి వస్తుంది. రెండున్నర నెలల్లో ఫ్లవర్ కోయడానికి 15రోజులు అనువుగా ఉంటుంది. ఈపదిహేను రోజుల్లోనే మార్కెటింగ్ చేసుకోవాలి. అయితే హోల్‌సేల్‌గా అమ్మేదానికంటే రిటైల్‌గా అమ్ముకుంటేనే ఎక్కువ లాభాలు పొందవచ్చు. ఈ పంట సాగుకు తేమలేకుండా ఉండే నేల అనుకూలం. మొక్కలు పెట్టేముందు భూమిని చదునుచేసుకోవాలి. తర్వాత సాళ్లు తీసి భూమిని తడిపి గడ్డిమందు పిచికారీ చేయా లి. తర్వాత మొక్కలు పెట్టాలి. ఎకరానికి 14వేల మొక్కలు పెట్టాలి. ఎకరానికి రూ.25వేల పెట్టుబడి అవుతుంది. రూ.80వేల వరకు లాభం పొందవచ్చు. - బిల్లా విష్ణువర్ధన్‌రెడ్డి(98667 06483), గుడెప్పాడ్ చీడపీడలు ఆశించకుండా చూసుకోవాలి నేను ఎకరం భూమిలో కాలీఫ్లవర్ సాగుచేశాను. ఈ పంటకు ఎక్కువగా లద్దె పురుగు, పచ్చ పురుగులు ఆశిస్తాయి. ఇవి రాకుండా చూసుకుంటే మంచి దిగుబడి సాధించవచ్చు. నిరంతరం పంటను జాగ్రత్తగా చూసుకోవాలి. వాణిజ్య పంటలకటే కాలీఫ్లవర్ సాగు చాలా లాభదాయకం. ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాలు అందిస్తే బాగుంటుంది. - తీనేటి ఇంద్రారెడ్డి(97046 31975), గుడెప్పాడ్ -
ఈ ఏడాది 10% అధికంగా ఉత్పత్తి: వైజాగ్ స్టీల్
న్యూఢిల్లీ: హుద్‌హుద్ తుపాన్ 10 రోజులపాటు ఉత్పత్తికి అంతరాయాన్ని కల్పించినప్పటికీ ఈ ఏడాది 10% వృద్ధిని సాధించగలమన్న ఆశాభావాన్ని ఆర్ఐఎన్ఎల్(వైజాగ్ స్టీల్) వ్యక్తం చేసింది. వెరసి గత ఆర్థిక సంవత్సరం(2013-14)తో పోలిస్తే 10% అధికంగా 3.5 మిలియన్ టన్నుల స్టీల్‌ను ఉత్పత్తి చేయగలమని అంచనా వేసింది. హుద్‌హుద్ కారణంగా అక్టోబర్ 12 నుంచి పది రోజులపాటు ప్లాంట్ కార్యకలాపాలు నిలిచిపోయినప్పటికీ, ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరుగుతున్నదని కంపెనీ చైర్మన్ పి.మధుసూదన్ చెప్పారు. గతేడాది కంపెనీ చరిత్రలో కొత్త రికార్డును సృష్టిస్తూ 3.2 మిలియన్ టన్నుల సేలబుల్ స్టీల్‌ను ఉత్పత్తి చేసిన విషయం విదితమే. తుపాన్ ప్రభావం తరువాత కంపెనీ దశలవారీగా ఉత్పత్తి కార్యక్రమాలను మొదలుపెట్టింది. కాగా, ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో(ఏప్రిల్-అక్టోబర్) 1.86 మిలియన్ టన్నుల స్టీల్‌ను ఉత్పత్తి చేసింది. గతేడాది ఇదే కాలంలో 1.77 మిలియన్ టన్నులను ఉత్పత్తి చేసింది. -
ఆస్తికీ బీమా ధీమా కావాలి..!
తుపానుల వంటి ప్రకృతి వైపరీత్యాలు ఎంత తీవ్రమైనవి అయినప్పటికీ భారీ ప్రాణ హాని లేకుండా నేడు రక్షణ పొందగలుగుతున్నాం. సాంకేతిక రంగంలో అభివృద్ధి ఇందుకు ఎంతగానో దోహదపడుతోంది. ఇటీవలి హుద్‌హుద్ ఇందుకు ఉదాహరణ. అయితే భారీ ఆస్తి నష్టాన్ని మాత్రం నివారించలేకపోయాం. చాలా తక్కువ మంది మాత్రమే తమ ఆస్తులకూ బీమా ద్వారా రక్షణ పొందారు. విపత్తు సమయాల్లో ఆస్తి నష్టం పరిహారాలకు సంబంధించి బీమా రంగం విస్తృత స్థాయిలో పథకాలను అందిస్తోంది. ఈ అంశంపై అవగాహన పెంపొందించుకోవడం అవసరం. మోటార్ ఇన్సూరెన్స్... మోటార్ ఇన్సూరెన్స్‌కు సంబంధించి రెండు అంశాలను ప్రధానంగా చెప్పుకోవచ్చు. అందులో ఒకటి హైడ్రోస్టాటిక్ కవర్. మరొకటి రోడ్ సైడ్ అసిస్టెన్స్. హైడ్రోస్టాటిక్ కవర్‌ను తీసుకుంటే- వర్షపు నీటి గుంతల్లో కారు చిక్కుకుపోయి... దానిని అక్కడ నుంచి గేర్లు మారుస్తూ, బలవంతంగా బయటకు తీసే క్రమంలో ‘ఇంజిన్ ఫోర్స్’ వ్యవస్థ మొత్తం నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇదే ‘హైడ్రోస్టాటిక్ నష్టం’. ఈ తరహా నష్టాన్ని మోటార్ ఇన్సూరెన్స్ రెగ్యులేటర్స్ భాషలో ‘కాన్సిక్వెంటల్’ నష్టంగా పేర్కొంటారు. మామూలుగా తీసుకునే రెగ్యులర్ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీలో ఈ తరహా నష్టం కవరవ్వదు. ఒక నిర్దిష్ట చర్య వల్ల సంభవించిన నష్టం కావడమే దీనికి కారణం. అనుకోని సంఘటన వల్ల ఈ నష్టం జరగదు. ఈ నష్ట నివారణకు భారీ వ్యయం తప్పదు. మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ కొనేటప్పుడు, ఈ మొత్తానికి అదనంగా ‘ముందు జాగ్రత్తగా’ కొంత చెల్లిస్తే కాన్సిక్వెంటల్ నష్టానికి కొండంత అండనిస్తుంది. ఇదే విధంగా పలు కంపెనీలు రోడ్ సైడ్ అసిస్టెన్స్ కవరేజ్ పాలసీలనూ అందిస్తున్నాయి. గృహాలకు బీమా... పలు కంపెనీలు ప్రస్తుతం గృహాల నష్ట పరిహారాలకు సంబంధించి బీమా పథకాలను ఆఫర్ చేస్తున్నాయి. గృహాలకే కాకుండా ఆయా భవనాల్లోని వస్తువులకు సైతం బీమా పథకాలు ఉన్నాయి. అగ్నిప్రమాదాలుసహా ఎటువంటి ప్రకృతి వైపరీత్యానికైనా బీమా సదుపాయం లభిస్తోంది. ప్రయాణాల సమయంలో ఆభరణాలు పోవడం, విపత్తు సమయాల్లో టీవీ, ఏసీ,రిఫ్రిజిరేటర్ వంటి గృహోపకరణాల నష్ట పరిహారాలు, కుటుంబం మొత్తానికి వర్తించే ప్రమాద బీమా, నివాస గృహానికి నష్టం వాటిల్లినట్లయితే, ప్రత్యామ్నాయంగా అద్దెకు ఉండే నివాసానికి సంబంధించి చేసే వ్యయాలు, ముఖ్య డాక్యుమెంట్లు ఏవైనా పోతే తిరిగి వాటికి సంబంధించి ‘డూప్లికేట్’ పత్రాలు పొందేందుకు చేసే వ్యయాలు, ట్రాన్స్‌పోర్టింగ్ సమయాల్లో జరిగే ప్రమాద నష్టాలు... ఇలా ప్రతి అంశానికీ నేడు బీమా పథకాల సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఇళ్లకే కాదు షాపులు, కార్యాలయాలు, హోటెల్స్, పరిశ్రమలన్నింటికీ బీమా ధీమా పొందవచ్చు. వీటన్నింటిపై అవగాహనను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. -
హుకుం జారీచేసిన హుదూద్
ఆంధ్రప్రదేశ్ రాజధానికి విజయవాడ-గుంటూరు ప్రాంతాలు, ముఖ్యంగాఆ రెండు పట్టణాలూ ఎంత మాత్రం అనుకూలం కానివని ఇప్పటికైనా రాష్ట్ర పాలకులు గుర్తించడం అవసరం. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం మంచిది.వందిమాగదుల మాటలకు విలువ ఇవ్వకుండా, ప్రభుత్వం మొండిపట్టు పట్టకుండా నిపుణులు సూచించినట్లు అన్నివిధాలా అనుకూలంగా, సముద్ర మట్టానికి 300-400 మీటర్ల ఎత్తులో ఉన్న దొనకొండ- వినుకొండ- బోళ్లపల్లి- మార్టూరు ప్రాంతాలలో కొత్త రాజధానికి హంగులు సమకూర్చుకోవడం అత్యంత అభిలషణీయంగా ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు రాజకీయ పాలకశక్తుల పతనానికి దారితీస్తాయి. ఆ పరిస్థితులలో విపత్తును తమకు అనుకూ లంగా మలుచుకోవాలని రాజకీయ నాయకులు తరచూ ప్రయత్నిస్తారు. ఈ తొక్కిసలాటలో పాలకులు తమ ప్రయోజనం కోసం అధికారగణంతో ఘర్షణకు దిగుతారు. - ప్రొఫెసర్ సి. రాఘవులు (డీన్ ఆఫ్ సోషల్ సెన్సైస్, రిటైర్డ్ డెరైక్టర్, విపత్తుల నివారణ అధ్యయన కేంద్రం, నాగార్జున విశ్వవిద్యాలయం) చెన్నైలో ఇచ్చిన ప్రసంగం (1994) నుంచి. విపత్తుల తరువాత అలాంటి పరిస్థితులు తలెత్తకుం డా జాగ్రత్త పడడానికి నిపుణులు పాత, కొత్త నివేదికలలో పొందుపరిచిన సలహాలను పాటించడం పాలకులకే శ్రేయస్కరం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదుర్కొంటు న్న సమస్యలు రెండురకాలు: ఒకటి- రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ఎంపిక నిర్ణయం ఒక సంక్షోభ స్థాయికి చేరుకోవడం. రెండు- విభజన జరిగిన వెనువెంటనే కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్రం ‘హుదూద్’ పెను తుపాను బారినపడటం. ఈ తుపాను నాలుగు జిల్లాలను, విశాఖ నగరం సహా పలు పట్టణాలను ఇప్పట్లో తేరుకోలేని విధంగా నష్టపరిచింది. ఈ రెండింటిలో ఒకటి మానవ కల్పితమైన వికారపు చేష్ట. ముఖ్యమంత్రి పదవుల వేటలో తెలుగుజాతిని యూపీఏ ప్రభుత్వం రెండుగా చీల్చింది. రెండవది, ప్రకృతి చేసిన విలయ తాండవం. నిజానికి పర్యావరణానికి మనిషి తలపెడుతున్న హాని కారణంగా ప్రకృతి వికటించిన ఫలితమిది. తక్షణం గుర్తించవలసిన వాస్తవం ప్రస్తుతం ఆ రెండు సమస్యల మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రజానీ కం నలిగిపోతున్నది. ప్రజలనూ, రాష్ట్రాన్నీ ఈ విపత్కర పరిస్థితుల నుంచి గట్టెక్కించడానికి ప్రతి ఒక్కరూ ఆలోచిం చాలి. విభజన తరువాత అధికారం చేపట్టిన పాలకులు దేనికోసమో ఉవ్విళ్లూరుతూ, తొందరపాటుతో విజయవా డ-గుంటూరులను కొత్త రాజధానిగా ప్రకటించారు. ఇవి జనంతో కిక్కిరిసి ఉండే నగరాలు. తీరా ప్రకటించిన తరు వాత గాని అసలు సమస్యలు తెలిసిరాలేదు. ఇలాంటి చోట రాజధాని నిర్మాణంలో ఎదురయ్యే సమస్యలు ఎలా ఉంటాయో ఒక్కొక్కటిగా అనుభవానికి రావడం వెంటనే మొదలైంది. ఏదో రకంగా అధికారం చేపట్టగలిగామన్న ‘సంబడం’లో ఈ పాలకులు సమస్య ఆనుపానులను పట్టించుకోకుండా పక్కకు పెట్టేశారు. ప్రజాభిప్రాయాన్ని గాని, కొందరు చేసిన హెచ్చరికలను గాని పట్టించుకునే తీరిక వారికి లేకపోయింది. రాజధాని ఎంపిక మీద కేం ద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ తన సాధికారికి నివేదికలో ఏం చెప్పిందో తెలుసుకునే ఓపిక కూడా పాలకు లకు లోపించింది. ముందుగా తీసుకున్న నిర్ణయాన్నే అమ లుచేయడానికి ఒడిగట్టారు. నిగ్గుతేలిన హెచ్చరికల స్వరూపం ఈ సమస్యను అసలు శాసనసభలో చర్చకు కూడా రానీ యకుండా, శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన విలువైన సల హాలను ఏకపక్షంగా తోసిపుచ్చారు. కేంద్రంలో బీజేపీతో పొత్తు కలిపిన తెలుగుదేశం నిరంకుశ నిర్ణయాలకు అల వాటు పడి, ఇక్కడ శాసనసభలో విపక్షం గొంతు నొక్కే సింది. కానీ, ఆచరణ, అనుభవం ప్రకారం శివరామకృష్ణన్ చేసిన హెచ్చరికలు వాస్తవికమైనవేనని ఇప్పుడు రుజు వైంది. ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా దేశం మొత్తం మీద విపత్తులకు గురికావడానికి అత్యధిక అవకాశాలు ఉన్న రాష్ట్రాలలో ఒకటి ఆంధ్ర ప్రదేశ్. రాష్ట్రంలో ఎక్కువ భాగం తరచూ దుర్భిక్షానికి గుర వుతోంది. ఈ పరిస్థితిలో పట్టణ ప్రాంతాలకు నీటి భద్రత సమస్యగా మారిపోతోంది. ఇక గ్రామీణ ప్రాంత ప్రజానీ కం మీద దీని ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కోస్తా ప్రాంతం తరచూ పెనుతుపానులకు గురవుతూ, ఆక స్మిక వరదల బారిన పడుతోంది. ప్రధాన నదులు ప్రవ హించే మార్గంలోనే జనావాసాలు ఉండడంతో ఈ సమస్య తప్పడం లేదు. భూకంపాలు తరచుగా రాకపోయినా, వచ్చినప్పుడు కోస్తాలోని ప్రధాన పట్టణ కేంద్రాలలో భవ నాలు కుదుపునకు గురవుతున్నాయి. ఈ తీవ్ర పరిణామా లకూ త్వరితగతిన జరుగుతున్న పట్టణ ప్రాంతాల విస్తర ణకూ సంబంధం ఉంది. వాతావరణ మార్పులు మున్ముం దు పెను తుపానులకు, వాటి విస్తరణకూ, ఫలితంగా సముద్రంలో ఉద్రిక్తతలకు దారితీస్తుందని శివరామకృష్ణన్ కమిటీ నిపుణులు పేర్కొన్నారు. అందువల్లనే ‘విజయ వాడ-గుంటూరు- మంగళగిరి- తెనాలి’, పరిసర ప్రాంతా లూ (వీజీఎంటీ) నూతన రాజధాని నిర్మాణానికి అనువై నవి కావని విస్పష్టంగా సలహా ఇచ్చింది. అందరి మాటా అదే శివరామకృష్ణన్ నివేదికలోని ఈ అంశాలను జాతీయ స్థాయిలో ప్రణాళికా, భవన నిర్మాణ కేంద్రం (ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్) డెరైక్టర్ ఎన్.శ్రీధరన్ కూడా బలపరి చారు. ఏటా అక్టోబర్-నవంబర్ మాసాల్లో కోస్తాను పెను తుపానులు చుట్టుముట్టి భారీ ఎత్తున ధన, ప్రాణనష్టాన్ని కలిగిస్తున్నాయి. ఇది కూడా ప్రభుత్వానికి తీవ్ర సమస్యగా పరిణమించిందని (14-10-2014) పేర్కొనడం విశేషం! మొత్తం ఆంధ్ర కోస్తా అంతా పెనుతుపానులకు సంబం ధించినంత వరకు తీవ్రనష్టాలకు గురిచేసే మండలాల్లోనే విస్తరించి ఉందని నిపుణులు తాజాగా కూడా హెచ్చరిం చారు. ఈ దృష్ట్యానే శ్రీధరన్ ప్రస్తుత పట్టణాభివృద్ధి కేం ద్రాలు, తూర్పు కోస్తా ఆర్థిక లావాదేవీల నడవ (కారిడార్) సహా, ఇటు చెన్నై నుంచి అటు కోల్‌కతా వరకూ భారీ తుపానుల దెబ్బకు గురయ్యేంత సమీపంలో ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. 50 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న తటస్థ మండలంలో 15 ప్రథమశ్రేణి పట్టణాలు, 15 ద్వితీయ శ్రేణి పట్టణాలు, 13 తృతీయ శ్రేణి, నాల్గవ స్థాయి పట్ట ణాలు ఉన్నాయి. హుదూద్ విలయం ముగిసిన వారం తరువాత కూడా కోస్తా ప్రాంతాలకు వాటిల్లిన కష్టనష్టాలు ఎంతటివో ఇప్పటికి స్పష్టం కాని పరిస్థితి. ప్రాణనష్టం నలుగురితో ఆగిందని మొదట్లో ఆ బాధ మధ్యనే తృప్తి పడ్డాం. రెండు రోజులకే ఆ సంఖ్య 43కి చేరుకోవడం, విశా ఖపట్టణానికి, యావత్తు ఉత్తర కోస్తా మూడు జిల్లాలకు, తూర్పు గోదావరి జిల్లాకు జరిగిన భారీ నష్టం రూ.70 వేల కోట్లని ముఖ్యమంత్రే ప్రకటించటమూ గమనార్హం! ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాలి ఈ పూర్వరంగంలో ఏపీ రాజధానికి విజయవాడ-గుంటూ రు ప్రాంతాలు, ముఖ్యంగా ఆ రెండు పట్టణాలూ ఎంత మాత్రం అనుకూలం కానివని ఇప్పటికైనా రాష్ట్ర పాలకులు గుర్తించడం మంచిది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం మంచిది. వందిమాగదుల మాటలకే విలువ ఇవ్వకుండా, మొండిపట్టు పట్టకుండా నిపుణులు సూచించినట్లు అన్ని విధాలా అనుకూలంగానూ, సముద్ర మట్టానికి 300-400 మీటర్ల ఎత్తులో ఉన్న దొనకొండ-వినుకొండ-బోళ్లపల్లి- మార్టూరు ప్రాంతాలలో కొత్త రాజధానికి హంగులు సమకూర్చుకోవడం అత్యంత అభిలషణీయంగా ఉంటుం ది. అందుకే రాజధానికి మూడు జోన్లతో పాటు, నాలుగు, ప్రాంతాలను శివరామకృష్ణన్ కమిటీ తుది నివేదికలో అనువైన, పరిశీలనార్హమైనవిగా ప్రతిపాదించింది. వాటిలో భాగంగా దొనకొండ ప్రాంతాలను కూడా చేర్చింది. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలు సారవంతమైన వ్యవసాయ భూములకు ప్రసిద్ధి. అవి భారతదేశ ధాన్యాగా రాలలో విశిష్టమైనవి. కాబట్టి భూములను వ్యవసాయేతర పనులకు వినియోగించబోవటం ప్రజల ఆహార భద్రతకు చేటని కమిటీ అభిప్రా యపడింది. విజ్ఞత ప్రదర్శించాలి ఇంత వివరమైన హెచ్చరికల తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ పాలకుల పునరాలోచించకుండా ఇంకా ‘గుళ్లో ప్రదక్షిణలు’ మాదిరిగానే విజయవాడ-గుంటూరు ప్రాంతంలోనే రాజ ధాని నిర్మాణమంటూ మంకు పట్టు పడుతున్నారు. ఇందు కోసం భూములు ఇవ్వకపోతే ఆర్డినెన్స్ ద్వారానైనా రైతుల నుంచి గుంజుకుంటామని బెదిరింపులకు దిగడం సంస్కా రమూ కాదు, క్షంతవ్యమూ కాదు. రాజధాని ఎంపికపై కమిటీ నిపుణులు చేసిన ప్రతిపాదనలు సలహాలు మాత్ర మే, వాటిని రాష్ర్ట ప్రభుత్వం తలదాల్చవలసిన అవసరం లేదని రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల ఇప్పటికీ మోరాయి స్తున్నారు. శివరామకృష్ణన్ నివేదిక బయటకు వచ్చిన తరు వాత కూడా తనకు ఏ నివేదికా అందలేదని సీఎం కోత కోస్తూవచ్చారు. నిజానికి పాలకులు వినమ్రతతో మెలగి రాష్ట్ర రాజధాని ఎంపిక నిర్ణయాన్ని పునరాలోచించక తప్ప ని పరిస్థితులను ‘హుదూద్’ సృష్టించింది. ఇలాంటి నిరం తర సంక్షోభం, సంకటాలకు రాష్ట్ర ప్రజలను వదిలిపెట్ట కుండా ప్రకటించిన నిర్ణయం గురించి పాలకులు పునరా లోచించడం మంచిది. నిపుణులు చేసిన హెచ్చరికలే నేడు వాస్తవంగా కళ్ల ముందు నిలిచాయని పాలకులు గుర్తించి విజ్ఞతతో మెలగాలనీ, తెలివి తెచ్చుకోవాలనీ ఆశిద్దాం. అంతేగాని ‘కరువునొక్క దాసరి’ అన్నట్టుగా ఈ పాలకుల పాలనా కాలం కరువుతో ప్రారంభమై, కరువు భారంతో సాగి, కరువు బాధతోనే ముగిసిపోకూడదు. ఏబీకే ప్రసాద్ -
నేడు రూ.5వేల కోట్లు విడుదల
20 శాతం రుణాల మాఫీకిగాను వ్యవసాయ శాఖకు మంజూరు నలుగురు డెరైక్టర్లతో రైతు సాధికారిత కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ హైదరాబాద్: రైతుల రుణాల్లో 20 శాతం మాఫీ చేయడంలో భాగంగా ఆర్థిక శాఖ శనివారం రూ.5000 కోట్లను వ్యవసాయ శాఖకు విడుదల చేయనుంది. మరోపక్క నలుగురు డెరైక్టర్లతో రైతు సాధికారిత కార్పొరేషన్‌ను ప్రభుత్వం శుక్రవారం రిజిస్టర్ చేసింది. విజయవాడ కేంద్రంగా పనిచేసే ఈ కార్పొరేషన్‌ను ఈ నెల 21న సీఎం ప్రారంభించనున్నట్లు ఆర్థిక శాఖ ఉన్నతాధికారి తెలిపారు. డెరైక్టర్లుగా ఆర్థిక, వ్యవసాయ, పుశుసంవర్ధక శాఖల ముఖ్యకార్యదర్శులు, వ్యవసాయ కమిషనర్ వ్యవహరించనున్నారు. ఈ కార్పొరేషన్‌ను రూ.కోటి మూలధనంతో ఏర్పాటు చేశారు. ప్రాధాన్యతా క్రమంలో మాఫీ.. ఆర్థిక శాఖ నుంచి వచ్చే 5000 కోట్ల రూపాయలను వ్యవసాయ శాఖ రైతు సాధికారిత కార్పొరేషన్‌కు విడుదల చేయనుంది. అక్కడ నుంచి రుణ మాఫీకి అర్హులైన రైతుల రుణాల్లో 20 శాతం నిధులను బ్యాంకులకు విడుదల చేయనున్నారు. ఈ 20 శాతం నిధుల చెల్లింపును కూడా ప్రాధాన్యత క్రమంలో చేయనున్నారు. తొలుత పంట రుణాలకు, ఆ తరువాత ప్రకృతి వైపరీత్యం సమయంలో దీర్ఘకాలిక రుణాలుగా మారిన పంట రుణాలకు ఇస్తారు. చివరి ప్రాధాన్యతగా బంగారంపై తీసుకున్న రుణాలను పరిగణనలోకి తీసుకున్నారు. బంగారం రుణాలకు 20 శాతం ప్రభుత్వం చెల్లించినప్పటికీ అవి కొత్త రుణాలగా మారబోవని అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం 20 శాతం నిధులను చెల్లిస్తే మిగతా 80 శాతం రుణాన్ని రైతులు చెల్లించి బంగారం విడిపించుకోవాల్సి ఉంటుంది.అలా కాకుండా మిగతా 80 శాతం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని, అప్పుడు బంగారం విడిపించుకోవచ్చునని రైతులు అనుకుంటే 14 శాతం మేర వడ్డీ భారం పడుతుంది. బంగారం రుణాలతో పాటు, పంట రుణాలన్నింటికీ గత ఏడాది డిసెంబర్ వరకుగల వడ్డీనే ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని, జనవరి నుంచి 7 శాతం మేర వడ్డీని, జూలై నుంచి 14 శాతం వడ్డీని రైతులే భరించాలని ఓ అధికారి తెలిపారు. -
పరిహారం పరిహాసమేనా..?
కరీంనగర్ అగ్రికల్చర్: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని మాదిరిగా తయారైంది రైతుల దుస్థితి. పంటలు నష్టపోయి పరిహారం కోసం ఎదురు చూస్తున్న రైతులకు 45 రోజుల కిందట నిధులు విడుదలైనా అవి ఇంకా వారికి చేరలేదు. అనర్హులను ఏరివేసేందుకు అధికారులు విచారణ దశలోనే ఉండడంతో పండుగకు పరిహారం దక్కకుండా పోతుంది. ఇప్పటికే విచారణ పూర్తి చేసి రైతుల ఖాతాల్లోకి పరిహారం జమ చేయాలన్న కలెక్టర్ ఆదేశాలను సైతంఅధికారులు బేఖాతరు చేస్తున్నారు. 2009 మార్చి నుంచి 2014 వరకు ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు రూ.105.95 కోట్లు విడుదల చేస్తూ ఆగస్టు 12న రెండు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులు జిల్లా ట్రెజరీకి చేరాయి. జాబితాలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపణలతో విచారణ ప్రారంభించారు. 1బీ రిజిస్టర్, పహాణీలో ఉన్న రైతుల పేర్లు , జాబితాలోని రైతుల పేర్లను సరిచూసి అర్హుల జాబితాలు తయారు చేయాలని విచారణ మొదలుపెట్టారు. సెప్టెంబర్ 23 వరకు 1 బీ రిజిస్టర్ ఆధారంగా అర్హులను తేల్చి 30లోగా ఇన్పుట్ సబ్సిడీని పంపిణీ చేయాలని ఆదేశించారు. విచారణ జరుగుతున్న మండలాల్లో సొంత భూములుండి 1బీ రిజిస్టర్లో పేరు లేని రైతులు నుంచి ఆందోళన వ్యక్తమైంది. అంతా పూర్తయ్యాకే పరిహారం.. 2013 అక్టోబరులో కురిసిన అధిక వర్షాలు, 2014లో ఏప్రిల్, మేలో అకాల వర్షాలతో 50 శాతానికి పైగా పంట ఊడ్చుకుపోయింది. రూ.87.09 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేసింది ప్రభుత్వం. అదేవిధంగా 2009 నుంచి 2013 వరకు ప్రకృతి విపత్తులు, వడగళ్లతో నష్టపోయిన 76,365 రైతులకు రూ.18.86 కోట్ల పరిహారాన్ని సైతం విడుదల చేసింది. అయితే వడగళ్లతో నష్టపోయిన రైతులకు మాత్రం పరిహారం వారి ఖాతాల్లో చేరింది. కాగా అధిక వర్షాలతో 86 వేల హెక్టార్లలో నష్టపోయిన 1.80 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.87.09 కోట్ల పరిహారం రైతులకు చేరలేదు. ఇప్పటివరకు కేవలం 28 మండలాల్లోనే విచారణ పూర్తైట్లు తెలిసింది. క్షేత్రస్థాయిలో విచారణ పేరిట జరుగుతున్న జాప్యంతోనే పరిహారం అందడం లేదని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. విచారణ పూర్తయిన మండలాలకు సంబంధించి రైతుల ఖాతాలకు పరిహారాన్ని జమచేయడం లేదు. అన్ని మండలాల్లో విచారణ పూర్తయి పూర్తిస్థాయిలో నివేదిక అందిన తర్వాతే రైతుల ఖాతాల వివరాలు, ఇన్పుట్ సబ్సిడీ నిధులు బ్యాంకులకు చేర్చనున్నట్లు తెలిసింది. పంట రుణం మాదిరిగా ఇన్పుట్ సబ్సిడీపై స్పెషల్ డ్రైవ్ చేపట్టి పంట నష్టపరిహారం అందించాలని రైతులు ఉన్నతాధికారులను కోరుతున్నారు. -
రైతులకు అండగా నిలుద్దాం
- ఆత్మహత్యలను నివారిద్దాం - పరిహారానికి నిబంధనలు సరికాదు - బోరు వ్యక్తిగతం.. చెరువు సామూహికం - నాణ్యమైన కరెంటు సరఫరా అనివార్యం - రైతు సదస్సులో తెరసం అధ్యక్షుడు నందిని సిధారెడ్డి సిద్దిపేట టౌన్/అర్బన్: ప్రకృతి వైపరీత్యాలతో పంటలు కోల్పోయి నిండు జీవితాన్ని బలితీసుకున్న రైతు కుటుంబానికి సర్కార్ అండగా నిలిచి ఆదుకోవాలని తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు డా. నందిని సిధారెడ్డి కోరారు. బాధిత కుటుంబాలకు పరిహారమిచ్చేందుకు 13 నిబంధనలు విధించడం సరికాదన్నారు. మూడు నిబంధనలతో ఆత్మహత్యను నిర్ధారించి పరిహారం చెల్లించే విధానాన్ని ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టడం ద్వారా వారికి ఓదార్పు కలుగుతుందని అభిప్రాయపడ్డారు. సిద్దిపేట ఎన్జీఓ భవన్లో ‘వ్యవసాయ సంక్షోభం- రైతు ఆత్మహత్యలు - సవాళ్లు- పరిష్కారాలు’ అంశంపై పౌర సమాజ ప్రతినిధుల ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. కుటుంబ యజమానిని పోగొట్టుకుని దుఃఖంలో ఉన్న రైతు కుటుంబం 13 నిబంధనలను పాటించడం కష్టమవుతుందన్నారు. బాధిత కుటుంబానికి తక్షణ ఖర్చుల కోసం రూ. 10 వేలు విడుదల చేయాలన్నారు. ఆత్మహత్య నిర్ధారణకు కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. దీర్ఘకాలిక ప్రణాళిక ద్వారా రైతు ఆత్మహత్యలు చేసుకోకుండా చూడాలన్నారు. పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వాలని, పంటల బీమా పథకాన్ని పక్కాగా అమలు చేయాలని కోరారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, లేకపోతే ఉపాధి కల్పించాలని కోరారు. చెరువు సామూహికమని, బోరు వ్యక్తిగతమన్నారు. సామూహిక సేద్యాన్ని అమలు చేయాలన్నారు. చెరువులు, కుంటలను పటిష్టపర్చాలన్నారు. బతకాలె.. బతికించాలె అనే నినాదాన్ని ప్రచారం చేయాలన్నారు. సభకు అధ్యక్షత వహించిన ప్రొ. రమా మేల్కోటె మాట్లాడుతూ, తెలంగాణ వాతావరణానికి అనుకూలంగా వ్యవసాయ విధానం రూపొందించాలన్నారు. సోలార్ విద్యుత్ వినియోగాన్ని పెంచాలన్నారు. వ్యవసాయానికి పదిశాతం బడ్జెట్‌ను కేటాయించాలన్నారు. మహిళా చైతన్యంతోనే వ్యవసాయం పండుగ ఎక్కడ మహిళలు చైతన్యమవుతారో అక్కడ వ్యవసాయం పండుగలా మారుతుందని కేరింగ్ సిటిజన్ కలెక్టివ్ సంస్థ డెరైక్టర్ సజయ అన్నారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాల మహిళలు నేలమ్మ సహకార గ్రూపుగా మారడంతో పాటు తమ ఆకాంక్షలను ప్రభుత్వానికి ఐకమత్యంగా వినిపించాలన్నారు. ఆధునిక వ్యవసాయానికి అవసరమైన శిక్షణ తీసుకోవాలన్నారు. తెలంగాణ రైతు రక్షణ వేదిక అధ్యక్షులు పాకాల శ్రీహరిరావు మాట్లాడుతూ, అప్పుల వల్లే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. జిల్లాలో 80 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం మౌనం వహించడం సరికాదన్నారు. టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కొండల్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, తెలంగాణ ఉన్నత విద్య మండలి సభ్యుడు డా. పాపయ్య, తెలంగాణ రైతు సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు హన్మంతరెడ్డి, డీబీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ తదితరులు రైతుల ఆత్మహత్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సమగ్ర పథకాన్ని రూపొందించి అమలు చేయడం ద్వారా ఆత్మహత్యలు జరగకుండా చూడాలన్నారు. సమావేశంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబీకులు పాల్గొన్నారు. -
జామాయిల్ వైపు అన్నదాత చూపు..
వాణిజ్య పంటల సాగుతో పెరిగిన పెట్టుబడులు, ప్రకృతి వైపరిత్యాలతో నష్టపోతున్న రైతులు జామాయిల్ సాగుపై దృష్టి సారించారు. జిల్లాలో 50వేల హెక్టార్లకుపైగా జామాయిల్ సాగు చేస్తున్నారు. ఏటేటా ఈ సాగు విస్తీర్ణం రెట్టింపవుతోంది. మామిడి, జీడిమామిడి తోటలను తొలగించి మరీ జామాయిల్ తోటల పెంపకం చేపడుతున్నారు. సాగుకు అనుకూలమైన భూముల్లో కూడా రైతులు జామాయిల్ సాగు చేస్తున్నారు. నష్టమేమీ లేకపోవడమే కారణం... ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా.. జామాయిల్‌కు వచ్చిన నష్టమే మి ఉండదు. భద్రాచలం పేపర్బోర్డుకు ప్రతిరోజు మూడువేల టన్నులు జామాయిల్ అవసరం కావటంతో రైతులు ఆసక్తి చూ పుతున్నారు. అదీగాక కర్నాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో జామాయిల్ చెట్లను సెంట్రింగ్ కర్రలకు వాడుతుండడంతో జామాయిల్ సాగుకు రోజురోజుకు డి మాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తోటలైన మామిడి, జీడిమామిడి, బత్తా యి తోటలను తొలగిస్తుండడంతో భవి ష్యత్‌లో ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం అవుతోంది. మూడేళ్ల నుంచి.. : మూడేళ్ల క్రితం జామాయిల్ టన్ను రూ. 1800 నుంచి రూ. 2వేల వరకు ఉండగా ప్రస్తుతం రూ. 5 వేల నుంచి రూ. 5500 వరకు ఉంది. 2008- 10 సంవత్సరంలో జామాయిల్ నర్సరీలకు ఫంగస్ వైరస్ సోకటంతో పెద్ద ఎత్తున నర్సరీలు మూసివేశారు. దీంతో కొంతకాలం జా మాయిల్ సాగు తగ్గింది. ఈ క్రమంలో మళ్లీ జామాయిల్ సాగు పై రైతులు ఆసక్తి చూపడంతో మూడేళ్ల నుంచి జామాయిల్ నర్సరీలు విపరీతంగా వెలుస్తున్నాయి. సమృద్ధిగా నీటి సౌకర్యం ఉం టే ప్రతీ మూడేళ్లకు ఒకసారి కటింగ్‌కు వస్తుంది. దీంతో పెట్టుబడులతో పాటు లాభాలు కూడా వచ్చేస్తాయి. మొదటిసారే పె ట్టుబడి ఎక్కువగా పెట్టాల్సి వస్తోంది. రెండు, మూడు విడతల్లో పెట్టుబడులు అంతగా పెట్టాల్సిన పనిఉండదు. అటవీశాఖ పి చ్చిచెట్లు, తుప్పలను తొలగించి జామాయిల్ సాగుపై దృష్టిసారించింది. కొద్దిపాటి వర్షంపడినా.. : వర్షాకాలంలో జామాయిల్ మొక్కలు నాటతారు. ఓ మోస్తారు వర్షం కురిస్తే మొక్క బతుకుతుంది. మూడునాలుగు నెలల్లో ఈ మొక్కలు ఐదారు అడుగుల ఎత్తు పెరుగుతాయి. దీంతో ఒక్కసారి జామాయిల్ సాగుచేసి వదిలితే పదేళ్ల వరకు చూసుకోవాల్సిన పనిలేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని రైతులు జామాయిల్ సాగుకు ఆసక్తి చూపుతున్నారు. ఒక్క ఎకరానికి వెయ్యి మొక్కలు నాటుతున్నారు. సకాలంలో తోటలకు నీరు, ఎరువులు వేసి సస్యరక్షణ చర్యలు చేపడితే ఎకరానికి కనీసం 55 నుంచి 60 టన్నుల దిగుబడి వస్తుంది. మొక్కలు వేసి వదిలేసినా.. ఎకరానికి కనీసం 30 నుంచి 35 టన్నుల వరకు దిగుబడి వచ్చేఅవకాశం ఉంది. భూగర్భ జలాలు అడుగంటుతాయని ఆందోళన.. జామాయిల్ సాగు వల్ల భూగర్భ జలాలు అడుగంటడంతో పాటు భూసారం దెబ్బతింటుందని హార్టికల్చరర్ ఆఫీసర్ రమణ తెలిపారు. ఎలిలోపతిక్ ప్రభావంతో జామాయిల్ మొక్కల నుంచి రాలిపడిన ఆకులతో వచ్చే రసాయనాల వలన వేరే మొక్కలు పెరిగే అవకాశం ఉండదన్నారు. భూగర్భజలాలను ఎక్కువగా తీసుకొని ఆకుల్లో, కాండాలలో నిల్వ చేసుకునే లక్షణం జామాయిల్‌కు ఉందన్నారు. -
అన్నదాతకు ఎన్ని కష్టాలో..
సాక్షి, ఏలూరు : జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఏటా ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోతున్న అన్నదాతలు ఈ ఖరీఫ్‌లో మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాగునీరు ఆలస్యం కావడంతో సకాలంలో పంటలు వేయలేకపోయారు. సమయం మించిపోవడంతో జిల్లాలోని 66,265 ఎకరాల్లో వరి పంటకు బదులు ఆరుతడి పంటలు వేసుకోవాల్సిందిగా అధికారులు తాజాగా ప్రకటించారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా జిల్లాల్లో వరికి ప్రత్యామ్నాయంగా వేరే పంటలు సాగుచేయక తప్పదని వ్యవసాయాధికారులు స్పష్టం చేశారు. జిల్లాలోని మెట్ట ప్రాంతంలో 87వేల వ్యవసాయ విద్యుత్ సర్వీసుల ద్వారా బోరు నీటిని సాగుకు వినియోగిస్తున్నారు. బోర్లు లేనిచోట సాగునీటి కోసం చెరువులు, వర్షాధార కాలువలపై ఆధారపడుతున్నారు. ఆగస్టు నెలాఖరు వరకూ వర్షాలు తగినంతంగా కురవకపోతే జిల్లావ్యాప్తంగా 80వేల ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటలు వేసుకోకతప్పదని గతంలో తేల్చారు. ఆగస్టు చివరి వారం, సెప్టెంబర్ ప్రారంభంలో కొద్దిపాటి జల్లులు కురవడంతో కొన్నిచోట్ల నాట్లు పడ్డాయి. చివరి వరకు మెట్ట ప్రాంతంలో వరినాట్లు వేయని 66,265 ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాల్సి వస్తోంది. అదును దాటిపోతుండటంతో డెల్టాలోని శివారు ప్రాంత చేలల్లో ఏ పంటనూ వేయకుండా ఖాళీగా వదిలేస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది 2,38,506 హెక్టార్లలో వరి సాగు లక్ష్యాన్ని నిర్ధేశించగా, 2 లక్షల 12 వేల హెక్టార్లలో వరినాట్లు పూర్తి చేశారు. ఖరీఫ్ పంటకు సంబంధించి సాధారణ వర్షపాతం ఆగస్టు నెలాఖరు నాటికి 604.06 మిల్లీమీటర్లు నమోదు కావాల్సి ఉండగా, ఇంతవరకూ 396.2 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. దీంతో జిల్లాలోని 15 మెట్ట మండలాలైన జంగారెడ్డిగూడెం, పోలవరం, బుట్టాయగూడెం, కొయ్యలగూడెం, జీలుగుమిల్లి, చింతలపూడి, కామవరపుకోట, లింగపాలెం, టి.నర్సాపురం, భీమడోలు, ఉంగుటూరు, నల్లజర్ల, ద్వారకాతిరుమల, దేవరపల్లి, గోపాలపురం మండలాల్లో ఇప్పటికీ నాట్లు వేయలేదు. ఇక్కడ ప్రత్యామ్నాయ పంటలు వేయాల్సి వస్తోంది. డెల్టాలోనూ శివారు చేలను ఖాళీగా వదిలేశారు. సాగునీరు విడుదల అలస్యం కావడంతో రైతులు నారుమళ్లు వేసుకోలేకపోయారు. ఇప్పుడు సాగునీరు ఉన్నా అపరాల సాగు చేసుకునే అవకాశం లేదు. దీంతో అటు వరికి, ఇటు ప్రత్యామ్నాయ పంటలకు కాకుండా అక్కడి పంటచేలు ఖాళీగా ఉంచేయాల్సి వచ్చింది. వ్యవసాయ అధికారులు ఆయా మండలాల్లో పర్యటించి, రైతులను కలిసి ప్రత్యామ్నాయ పంటల గురించి అవగాహన కల్పించడానికి సన్నద్ధమవుతున్నారు. వరిని వదులుకున్న వేలాది ఎకరాల్లో పెసలు, మినుములు, మొక్కజొన్న, జొన్న, వేరుశనగ, కందులు, నువ్వులు వంటి పంటలు వేయడానికి 8వేల క్వింటాళ్ల విత్తనాలను అధికారులు ఆంధ్రప్రదేశ్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి రప్పించి రైతులకు రాయితీపై అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. -
రైతులకు ‘ఇన్పుట్ సబ్సిడీ’
మోర్తాడ్ : ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతన్నలకు ఆసరాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇన్పుట్ సబ్సిడీని ప్రకటించారు. ఐదేళ్ల కిందట నష్టపోయిన పంటకు ఇప్పుడు పరిహారం అందడం గమనార్హం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే నష్టపోయిన పంటలకు సంబంధించి రైతులకు ఎప్పటికప్పుడు ఇన్పుట్ సబ్సిడీ రూపంలో పరిహారం అందించారు. ఆయన అకాల మరణం తర్వాత ఐదేళ్లు ఆలస్యంగా ఇన్పుట్ సబ్సిడీ రైతన్నలకు అందుతోంది. అది కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం, ముఖ్యమంత్రి చొరవ తీసుకోవడంతో సాధ్యమైంది. ఇన్పుట్ సబ్సిడీతో జిల్లావ్యాప్తంగా దాదాపు నాలుగు లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగనుంది. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు జిల్లాకు చేరనున్నాయి. 90రోజుల కాల వ్యవధిలో పంటలను నష్టపోయిన రైతుల ఖాతాల్లో ఇన్పుట్ సబ్సిడీ జమ కానుంది. 2009-10 ఆర్థిక సంవత్సరం నుంచి 2014-15 ఆర్థిక సంవత్సరం వరకు ప్రకృతి వైపరీత్యాలు, భారీ వర్షాలు, ఈదరగాలులతో నష్టపోయిన పంటలకు పరిహారం లభించనుంది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు తయారు చేసిన అంచనాల ప్రకారం *1.27 కోట్లు మంజూరు అయ్యాయి. భారీ వర్షాలు, ఈదరగాలుల కారణంగా పంటలను నష్టపోయిన రైతులకు *18.79 కోట్లు మంజూరు అయ్యాయి. పంటలు నష్టపోయిన సందర్బంలో రెవెన్యూ అధికారులు గ్రామాల్లో పర్యటించి నష్ట పరిహారం అంచనా వేశారు. వ్యవసాయ శాఖ అధికారులు దీనిని పరిశీలించి ప్రతిపాదనలు తయారు చేశారు. వైఎస్ మరణం తర్వాత అధికారంలో ఉన్న రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలు నష్టపోయిన పంటలకు ఇన్పుట్ సబ్సిడీని మంజూరు చేయలేదు. ప్రతి సీజనులో ఏదో ఒక కారణంగా భారీగానే పంటల నష్టం జరిగింది. నష్టం అంచనా వేయడం మినహా ప్రభుత్వం ఎలాంటి పరిహారాన్ని మంజూరు చేయలేదు. వైఎస్ హయాం తర్వాత ఐదేళ్ల నుంచి రైతులు పరిహారం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు తెలంగాణ సర్కారు ఇన్పుట్ సబ్సిడీ కోసం నిధులను కేటాయించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ముప్పుగ్రామాలను గుర్తిస్తామని హామీ
ముంబై: అసమర్థ ముఖ్యమంత్రి.. అంటూ ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలను పృథ్వీరాజ్ చవాన్ తనదైన శైలిలో తిప్పికొట్టారు. ఆగడాలు కొనసాగకుండా అడ్డుపడుతున్నందునే తనపై ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చవాన్ అనేక విషయాలపై మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే... ‘ప్రభుత్వం చేపడుతున్న అనేక పథకాల్లో పారదర్శకతను తీసుకురావాలనుకున్నాను. ఆ దిశగా కొన్ని చర్యలు తీసుకున్నాను. భూమి ధరల పెరుగుదల ఏ కొందరికో లాభం చేకూర్చదని భావించాను. రియల్ ఎస్టేట్ సెక్టార్‌ను ప్రక్షాళను చేశాను. ఈ నిర్ణయాలు కొందరికి ఇబ్బం దిని కలిగించాయి. దీంతో వారు నాపై లేనిపోని ఆరోపణలు చేయడం, వాటిని పనిగట్టుకొని ప్రచారం చేయడం ప్రారంభిం చారు. అవి నన్ను ఎంతగానో బాధపెట్టాయి. ఆ బిల్డరు ఎవరనే విషయం చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రజా ప్రయోజనాల కోసం నా వైఖరిని మార్చుకోకూడాదని నిర్ణయించుకున్నా. ప్రత్యర్థులు చేస్తున్నట్లు నేను అసమర్థుడినే అయితే కీలక నిర్ణయాలు ఎలా తీసుకునేవాడిని..? ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న మరాఠా రిజర్వేషన్ బిల్లును సభముం దుకు తెచ్చే ధైర్యం ఇంతకు ముందు ఎవరూ చేయలేదు. 2000 మురికివాడలను క్రమబద్ధీకరిస్తామని 2004, 2009 ఎన్నికల్లో హామీ కాంగ్రెస్ హామీ ఇచ్చింది. వాటిని నా ప్రభుత్వ హయాం లో పూర్తి చేశాం. కరువును సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. ఇప్పటికీ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అగ్రస్థానంలోనే నిలబెట్టాం. గుజరాత్‌తో రాష్ట్రాన్ని పోల్చేందుకు నేను ఇప్పటికీ సిద్ధ మే. మరాఠా ఎలా ముందుందో నేను వివరిస్తాను. పోషకాహార లోపాన్ని కూడా తగ్గించాం. నేను అసమర్థుడినైతే ఇవన్నీ ఎలా జరుగుతాయి. రాష్ట్ర ప్రజలకు ఈ సందర్భంగా ఒకటి చెప్పాలనుకుంటున్నా... పనిచేసినవారెవరో.. చేయనివారెవరో స్వయంగా మీరే నిర్ణయించుకోండి. నాకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంలో నిజమెంతో గమనించండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది. ఏ కొంతమందికో ప్రయోజనం కలిగించడానికి కాద’న్నారు. రాణే విమర్శలను ఎప్పుడో మర్చిపోయా... తనపై విమర్శలు చేస్తూ.. తన పనితీరుపై అంసతృప్తి వ్యక్తం చేస్తూ మంత్రిపదవికి రాజీనామా చేసిన రాణేపై చవాన్ సానుభూతి ధోరణి కనబర్చారు. రాణే చేసిన విమర్శలన్నింటిని తానెప్పుడో మర్చిపోయానని చెప్పారు. జరిగిందేదో జరిగిపోయిందని, ఉధ్వేగంతో ఆయన ఏవేవో మాట్లాడారని, వాటన్నిం టిని నేను మర్చిపోయానని,కాంగ్రెస్ కార్యకర్తలు కూడా వాటిని మర్చిపోయారని తాను ఆశిస్తున్నానన్నారు. -
విపత్తుల వేళ ఆశాబంధు ‘దిశానెట్’
ఇండో-జపాన్ పరిశోధనల నూతన ఆవిష్కరణ హైదరాబాద్: ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు బాధితులను సకాలంలో ఆదుకునేందుకు ఇండో-జపాన్ పరిశోధన బృందం ‘దిశానెట్’ అనే సరికొత్త టెక్నాలజీని ఆవిష్కరించింది. సునామీ, భూకంపం, తుపాన్లు, ఘోరప్రమాదాల వంటి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రాణ, ఆస్తినష్టాన్ని తగ్గించేందుకు ఈ ఆధునిక వ్యవస్థ దోహదపడుతుందని కియో యూనివర్సిటీ ఇన్ఫర్మేషన్ స్టడీస్ డీన్ ప్రొఫెసర్ జున్మురై తెలిపారు. జపాన్-భారతీయ పరిశోధన, విద్యాసంస్థలు సంయుక్తంగా జరిపిన ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఫర్ నేచురల్ డిజాస్టర్ మిటిగేషన్ అండ్ రికవరీ ప్రాజెక్ట్(దిశానెట్) టెక్నాలజీను గురువారం గచ్చిబౌలిలోని ఓ హోటల్లో ప్రదర్శించారు. -
కష్టాల ఖరీఫ్
చినుకు జాడ లేదు...విత్తనాల ఊసు లేదు రుణం తీరదు...కొత్త అప్పు పుట్టదు కష్టాల ఖరీఫ్‌లో అన్నదాత ఎదురీత ఈ ఏడాదీ ఖరీఫ్‌కు కష్టాలు తప్పేట్టు లేదు...సకాలంలో రాని రుతుపవనాలు, విత్తనాలకు రాయితీ ఎత్తివేత వీటితో పాటు రుణమాఫీ ప్రకటనతో అప్పులివ్వని బ్యాంకర్లు వెరసి ఖరీఫ్ సాగు చేసేందుకు రైతులు నానా కష్టాలు పడుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే సకాలంలో ఖరీఫ్ సాగు కాకపోతే ప్రకృతి వైపరీత్యాల బారిన పడే ప్రమాదం ఉంది. నర్సీపట్నం : ఈ ఏడాది ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 2.27 లక్షల హెక్టార్లలో అన్ని రకాల పంటలు సాగుచేయాలని అధికారులు లక్ష్యంగా చేసుకున్నారు. జిల్లా సాధారణ విస్తీర్ణం 2.03 లక్షల హెక్టార్లు కాగా, వాతావరణం అనుకూలిస్తే మరింత ఎక్కువ సాగుచేయాలనే లక్ష్యంతో ప్రణాళిక తయారు చేశారు. దీనిలో అధికంగా లక్ష హెక్టార్లకు మించి విస్తీర్ణంలో వరి పంటను సాగుచేస్తారని భావిస్తున్నారు. మిగిలిన విస్తీర్ణంలో ప్రధానంగా చెరకు 40 వేలు, రాగులు 25 వేలు, చిరు ధాన్యాలు 16,500, గంటి 6 వేలు, మొక్కజొన్న 6,500 హెక్టార్లలో సాగుచేయాలని లక్ష్యంగా చేసుకున్నారు. వినిపించని ‘రుతు’రాగం కేరళను తాకిన రుతుపవనాలు ఈ నెల ప్రారంభానికే రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ విభాగం అంచనా వేసినా, జిల్లాలో పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. ప్రస్తుత విషయానికొస్తే జూన్ సాధారణ వర్షపాతం 128.8 మిల్లీమీటర్లు కాగా ఇప్పటివరకు 36.9 మి.మీ నమోదయ్యింది. గత ఏడాది ఇదే సమయానికి 90.3 మి.మీ వర్షపాతం నమోదయ్యిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక రుణాల విషయానికొస్తే 2013-14 ఖరీఫ్, రబీ సీజన్లకు గాను జిల్లాలోని 2,10,881 మంది రైతులు వ్యవసాయ పెట్టుబడులకు జాతీయ, సహకార బ్యాంకుల్లో సుమారుగా రూ. 894 కోట్లు రుణాలుగా తీసుకున్నారు. ఖరీఫ్ మార్చి చివరిలోగా, రబీ బకాయిలు జూన్ చివరిలోగా చెల్లించాల్సి ఉంది. కాలం కలిసి రాకపోవడంతో పాటు రుణ మాఫీ ప్రకటించడంతో చెల్లింపులన్నీ నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది ఖరీఫ్ రుణ లక్ష్యం రూ. 700కోట్లు ఇచ్చేందుకు అధికారులు లక్ష్యంగా చేసుకున్నా ఇంతవరకు ఒక్కరికి రుణం ఇచ్చిన దాఖలాలు లేవు. దీంతో వడ్డీ ఎక్కువైనా ప్రైవేటు అప్పుల కోసం రైతులు వెతుకులాట ప్రారంభించారు. విత్తనాల్లో రాయితీకి కోత ఇక విత్తనాల విషయానికొస్తే జిల్లాలో వరి సాగుచేసేందుకు వివిధ రకాలైన 19.5 వేల క్వింటాళ్లు విత్తనాలను ఏపీ సీడ్స్ సిద్ధం చేసింది. వీటిలో అధికశాతం రైతులు వినియోగించే శ్రీకాకుళం సన్నాలు (ఆర్జీఎల్) విత్తనాల్లో రాయితీకి కోత విధించడంతో రైతులకు మరికొంత భారంగా మారింది. ప్రస్తుతం ఆర్జీఎల్ 510 క్వింటాళ్లు సిద్ధం చేయగా, మరో 340 క్వింటాళ్లు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఎరువుల విషయానికొస్తే జిల్లాలో ఖరీఫ్ సాగుకు అవసరమైన 4,917 మెట్రిక్ టన్నుల యూరియా, 6,600 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులను సిద్ధం చేశారు. ఈ విధంగా ఈ ఏడాది ఖరీఫ్ కష్టాల మయంగా మొదలు కాబోతుంది. -
పరిహారం..బహుదూరం
ఒంగోలు టూటౌన్: కష్టించి సాగు చేసిన పంట ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయి అల్లాడుతున్న రైతులకు ఆసరా కరువైంది. రైతులకు అండగా ఉండి ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేసే అరకొర సాయానికీ కాలయాపన చేస్తోంది. అధికార పగ్గాలు మారినా పరిహారం అన్నదాత దరిచేరలేదు. ఫలితంగా జిల్లాలో 1,88,945 మంది రైతులు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 2010 నుంచి ఇప్పటి వరకు సంభవించిన వరుస ప్రకృతి వైపరీత్యాలకు అన్నదాత కుదేలయ్యాడు. పలు విపత్తులు రైతన్నను కోలుకోలేని దెబ్బతీశాయి. నోటికాడికొచ్చిన పంటలు నీటమునిగాయి. వరదలు ముంచెత్తాయి. తుఫాన్లు చావుదెబ్బతీశాయి. వేలాది హెక్టార్లు కొట్టుకుపోయాయి. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక విలవిల్లాడిన రైతులకు నేటి కీ నష్టపరిహారం ఇవ్వడంలో ప్రభుత్వం అలవిమాలిన నిర్లక్ష్యం చూపుతోంది. = 2010లో జల్ తుఫాన్ ముంచెత్తింది. వందల హెక్టార్లు నీటి మునిగాయి. ఈ తుఫాన్‌కు సంబంధించి ఇంకా 72 మంది రైతులకు రూ.2.53 లక్షల పరిహారం నేటికీ విడుదలకు నోచుకోలేదు. = 2011 ఫిబ్రవరిలో వచ్చిన గాలివానతో నష్టపోయిన 28 మంది రైతులకు అందాల్సిన పరిహారం రూ.2.13 లక్షలు నేటికీ రాలేదు. అదే ఏడాది ఏప్రిల్‌లో కురిసిన భారీ వర్షాలకు పంటలు మునిగిపోయాయి. 345 మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. రూ.11.07 లక్షలు నష్టపోయినట్లు అధికారులు లెక్కలు తేల్చారు. ఇప్పటికీ దిక్కుమొక్కులేదు. ఇదే ఏడాది ఏప్రిల్‌లో థానే తుఫాన్విరుచుకుపడింది. ఉన్నదంతా ఊడ్చుకుపోయింది. 6,925 మంది రైతుల పంటలు కొట్టుకుపోయాయి. రూ.214.55 లక్షల పంట నష్టం జరిగింది. = 2012 జనవరిలో భారీ వర్షాలకు 41,053 మంది రైతులు నష్టపోయారు. రూ.1663.73 లక్షలు పరిహారం నేటికీ రైతులకు అందలేదు. = 2013 ఫిబ్రవరిలో కురిసిన భారీ వర్షాలకు 1953 రైతులు తీవ్రంగా నష్టపోయారు. రూ.114.61 లక్షల పరిహారం రావాల్సి ఉంది. ఇదే ఏడాది అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలకు 32,364 మంది రైతుల పొలాలు తుడిచిపెట్టుకుపోయాయి. రూ.19.48 లక్షలు నష్టపరిహారం రైతులకు అందాల్సి ఉంది. అదేనెల 28న అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జిల్లాకు వచ్చిన సందర్భంగా నష్టపరిహారంపై తీవ్ర చర్చ జరిగింది. సమావేశంలో జిల్లా అధికారులను ఆయన నిలదీశా రు. అయినా పరిహారం రైతన్న దరిచేరలేదు. = ఇటీవల నీలం తుఫాన్లో నష్టపోయిన రైతులకు రూ.16 లక్షల వరకు నిధులు విడుదలైనట్లు వచ్చిన జీవో రద్ధైయింది. = జిల్లాలో వ్యవసాయ శాఖ పరిధిలో గత నాలుగేళ్లలో 1,62,678 మంది రైతులకు రూ.57.74 కోట్లు విడుదల కావాల్సి ఉంది. = ఉద్యానశాఖ పంటలకు సంబంధించి 26,267 మంది రైతులకు రూ.10.63 కోట్ల పరిహారం అందాలి. = మొత్తం మీద జిల్లాలో గత నాలుగేళ్లుగా 1,88,945 మంది రైతులకు రూ.68.37 కోట్ల పంటనష్ట పరిహారం ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. బ్యాంకు అకౌంట్లతో తిప్పలు: గతంలో ప్రకృతి వైపరీత్యాలకు పంటలు నష్టపోతే నేరుగా రైతులకు పరిహారం అందించేవారు. ఆ తరువాత కాలంలో చెక్కులివ్వడం ప్రారంభించారు. ప్రస్తుతం ఆన్లైన్ పద్ధతి వచ్చింది. ప్రతి రైతు ఆయా మండలాల్లో ఉన్న బ్యాంకుల్లో అకౌంట్ తీసుకోవాలి. బ్యాంకు ఖాతాకు సంబంధించిన అకౌంట్ నంబర్‌ను వ్యవసాయ శాఖ అధికారులకు ఇవ్వాలి. దీనిపై ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగిసింది. వచ్చిన వరకు ఖాతా నంబర్లను ఆ శాఖాధికారులు ఉన్నతాధికారులకు పంపించారు. మొత్తం మీద ఇంకా 60 వేల మంది రైతుల ఖాతా నంబర్లను వ్యవసాయాధికారులు సేకరించలేకపోయారు. ఇటీవల పంట నష్టపరిహారానికి సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షించారు. రైతుల నుంచి బ్యాంకు అకౌంట్ నంబర్లు సేకరించిన మండల వ్యవసాయాధికారులకు నోటీసులివ్వాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అది అంతటితో ఆగిపోయింది. కొత్త ప్రభుత్వం నిధులివ్వాలి: వ్యవసాయ శాఖ జేడీ రూ.500 లోపు పరిహారం రావాల్సి ఉన్న రైతులు బ్యాంకు అకౌంట్ తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. వీరితో పాటు మరికొంత మంది స్వగ్రామంలో లేకపోవడం వల్ల వారి ఖాతా నంబర్లు రాలేదు. అకౌంట్ నంబర్లు ఇచ్చిన వారికైనా పరిహారం ఇచ్చేందుకు నిధులు విడుదల కాలేదు. కొత్త ప్రభుత్వం నిధులు విడుదల చేయాల్సి ఉంది. -
రబీ వర్రీ
ప్రతికూల వాతావరణంతో కలిసిరాని సాగు తెగుళ్లు, వర్షాభావంతో 30శాతం తగ్గిన దిగుబడి గిట్టుబాటు ధర లేక రూ.40 లక్షలు నష్టపోయిన రైతులు రైతుల బతుకులు బండలైపోతున్నాయి. ఏ పంట పండించేవారికైనా అడుగడుగునా ఒడిదుడుకులే..పెరిగిన మదుపులు, ప్రకృతి వైపరీత్యాలు, ప్రభుత్వ తోడ్పాటు,గిట్టుబాటు ధర అడుగంటి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. ఈ ఏడాది రబీలోనూ అన్నదాతకు ప్రతికూల పరిస్థితులే ఎదురయ్యాయి. వర్షాభావ పరిస్థితులు,తెగుళ్ల బెడదతో పంటదిగుబడి బాగా తగ్గిపోయింది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడిప్పుడే నూర్పుడి చేపట్టి ధాన్యం అమ్మకాలతో అసలు విషయం బయటపడుతోంది. నర్సీపట్నం, న్యూస్‌లైన్: రబీ వరిసాగు జిల్లా రైతులకు కలిసిరాలేదు. పంటకు దిగుబడి బాగా తగ్గడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. పెట్టుబడులు సైతం రాని పరిస్థితులతో ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 5,502 హెక్టార్లలో రబీవరి చేపట్టారు. వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం 3,43,875 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి రావాలి. సీజను ప్రారంభంలో వర్షాభావం, తెగుళ్లు, కోత దశలో ఈదురుగాలులు, వర్షాల కారణంగా పంట పూర్తిగా చేతికి రాలేదు. 30 శాతం వరకు పంట నష్టపోవాల్సి వచ్చింది. ప్రతి కూల వాతావరణంలో రైతులు ఆలస్యంగా ఈ వరి సేద్యం చేపట్టారు. తెగుళ్లదాడితో పెట్టుబడులు పెరిగాయి. వచ్చిన ఆదాయం కేవలం మదుపులకే సరిపోతోంది. వచ్చిన ధాన్యాన్నైనా అమ్మకం చేద్దామంటే వ్యాపారులు ఇష్టమొచ్చిన రీతిలో కొనుగోలు చేస్తున్నారు. ప్రతికూల వాతావరణం గతంతో పోలిస్తే ఈ రబీలో ప్రతికూల పరిస్థితులెదురయ్యాయి. అక్కడక్కడా సాగునీటి వసతులున్న ప్రాంతాల్లో పంట వేసినా నిర్ణీత సమయాల్లో వర్షాలు అనుకూలించలేదు. పంటకు సాగునీరు అందని దుస్థితి ఎదురయింది. దీంతో పాటు కూలీ, ఎరువుల ధరలు అధికం కావడంతో ఎకరా సేద్యానికి పెట్టుబడి రూ. 18వేల వరకు పెరిగింది. పంట కోత సమయంలో ఈదురు గాలులతో కూడిన వర్షానికి పనలు తడిసి ముద్దయ్యాయి. కొన్ని చోట్ల గింజలు రాలిపోయి మొలకెత్తాయి. ఇలా ప్రతికూల పరిస్థితుల కారణంగా ఎకరాకు 25 క్వింటాళ్ల వరకు రావాల్సిన దిగుబడి 18 క్వింటాళ్లకే పరిమితమైంది. ఈ విధంగా వచ్చిన దిగుబడులు కేవలం పెట్టుబడులకే సరిపోయాయి. రాని మద్దతు ధర కేంద్రం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం క్వింటాకు రూ. 1,280 వరకు చెల్లించాలి. అయితే రైతుల నుంచి రూ. వెయ్యికి మించి వ్యాపారులు కొనుగోలు చేయడం లేదు. ఈ విధంగా జిల్లా మొత్తంగా రైతులు రూ. 40 లక్షలు నష్టపోయారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఈ విధంగా గత ఏడాదితో పోలిస్తే జిల్లా రైతులకు రబీ నిరాశనే మిగిల్చింది. మదుపులు రాలేదు నాది నాతవరం మండలం మన్యపురట్ల. రెండెకరాల్లో రబీవరి సాగు చేశాను. పరిస్థితులు అనుకూలిస్తే 50 క్వింటాళ్ల వరకు ధాన్యం దిగుబడి రావాలి. పంట కోత సమయంలో ఈదురు గాలులతో కూడిన వర్షం వల్ల పనలు తడసి ము ద్దయ్యాయి. తడిసిపోయిన, ఎగిరిపోయిన పనలు ఒక దగ్గరకు చేర్చేందుకు, రోడ్లపైనే నూర్పిడికి పెట్టుబడి మరింత పెరిగింది. తీరా చూస్తే 15 క్వింటాళ్లు మా త్రమే దిగుబడి వచ్చింది. మదుపులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. - ఈశ్వర్రావు, రైతు -
ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం
కొత్తగూడెం, న్యూస్‌లైన్ : ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాలు, ఇతర కారణాలతో కంపెనీ నిర్ధేశించుకున్న వార్షిక ఉత్పత్తి లక్ష్యం అందనంత దూరంలో ఉంది. ఆర్థిక సంవత్సరం ముగియడానికి కేవలం 45 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఉన్న కాస్త కాలంలోనైనా సర్వశక్తులు ఒడ్డి పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేపడదామని అనుకుంటే.. ఈనెలలో మేడారం జాతర, టీబీజీకేఎస్ ఎన్నికల కారణం గా తీవ్ర ప్రభావం పడనుంది. ఇప్పటికే జాతర వల్ల కార్మికుల హాజరు శాతం తగ్గింది. ఈ పరిస్థితి మరో రెండు, మూడు రోజులు ఇలానే ఉండేలా కనిపిస్తున్నాయి. దాని తర్వాత ఈనెల 23న గోదావరిఖనిలో జరిగే టీబీజీకేఎస్ అంతర్గత ఎన్నికల్లో ఓటు వేయడానికి ఆ యూనియన్‌కు సంబంధించిన కార్మికులు వెళ్లాల్సి ఉం టుంది. దీంతో మరో మూడు రోజల పాటు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. టీబీజీకేఎస్‌లో సభ్యత్వం కలిగిన వారు 41 వేల మంది ఉండగా ఇందులో కనీసం 50 శాతమైనా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు గోదావరిఖనికి తరలించాల ని పోటీలో ఉన్న రెండు వర్గాలు వ్యూహాలు పన్నుతున్నాయి. దూరంలో ఉన్న కొత్తగూడెం రీజియన్ నుంచి గోదావరిఖని వెళ్లి రావాలంటే కనీసం ఒక రోజు సమయం పడుతుంది. ఒకరోజు ముందగానే కార్మికులను తరలించాలని ఆయా నాయకులు ప్రణాళికలు రూపొందిం చా రు. కనీసం 20వేల మందైనా వెళ్లే అవకాశముం దని సింగరేణి ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్ర త్యామ్నాయ ఏర్పాట్లపై కసరత్తు చేస్తున్నారు. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఎన్నికలు జరుగుతుండటంతో బహిరంగంగా కార్మికులను ఎన్నికలకు వెళ్లవద్దని చెబితే కంటెమ్ట్ ఆఫ్ కోర్టు కింద వచ్చే అవకాశం ఉండటంతో యాజమాన్యం ఆ ఆలోచనను విరమించుకున్నట్లు సమాచారం. భూగర్భ గనుల్లో పనిచేసే కార్మికులు ఎక్కువ సంఖ్యలో వెళ్లినా ఉత్పత్తిపై పెద్దగా ప్రభావం చూపదని, ఓపెన్‌కాస్టులో పనిచేసే వారు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని భా విస్తోంది. వారిని నేరుగా కలిసి పరిస్థితులు వివరించనున్నట్లు తెలిసింది. ఎన్నికల నేపథ్యంలో రెండు వర్గాల నాయకులు కార్మికులను ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉండటంతో అవసరమైతే పోలీస్, రెవెన్యూ అధికారుల సహాయం తీసుకోవాలని యాజమాన్యం ఆలోచిస్తోంది.