
1888నాటి విలయం అత్యంత ఘోరం
ప్రపంచంలోనే ఇప్పటివరకు సంభవించిన ప్రకృతి వైపరీత్యాల్లో అత్యంత ఘోరమైనదాన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించింది.
ఐక్యరాజ్యసమితి: ప్రపంచంలోనే ఇప్పటివరకు సంభవించిన ప్రకృతి వైపరీత్యాల్లో అత్యంత ఘోరమైనదాన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించింది. ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో 1888 సంవత్సరంలో సంభవిం చిన వడగండ్ల వాన అత్యంత ప్రమాదక రమైనదిగా ఐక్యరాజ్య సమితి పేర్కొంది. ఈ విపత్తులో దాదాపు 246 మంది మృత్యువాత పడినట్లు వెల్లడించింది.
ఈ వివరాలను ఐక్యరాజ్య సమితి వాతావరణ శాఖ అయిన ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎమ్‌ఓ) ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన సమాచారాన్ని పరిశీలించి వెల్లడించింది. ‘ప్రకృతి విపత్తుల కారణంగా భారీగా ప్రాణనష్టం జరుగుతోంది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను నిరోధించేందుకు, ముందస్తు హెచ్చరికలు జారీ చేసేందుకు డబ్ల్యూఎమ్‌ఓ దృష్టి సారించింది’ అని డబ్ల్యూఎమ్‌ఓ సెక్రటరీ జనరల్ పెట్టేరి టాలాస్ చెప్పారు. డబ్ల్యూఎమ్‌ఓ నిపుణుల కమిటీ వాతావరణ సంబంధిత సంఘటనల వల్ల జరిగిన ప్రాణనష్టం వివరాలను నమోదు చేసింది.