ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు బాధితులను సకాలంలో ఆదుకునేందుకు ఇండో-జపాన్ పరిశోధన బృందం ‘దిశానెట్’ అనే సరికొత్త టెక్నాలజీని ఆవిష్కరించింది.
ఇండో-జపాన్ పరిశోధనల నూతన ఆవిష్కరణ
హైదరాబాద్: ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు బాధితులను సకాలంలో ఆదుకునేందుకు ఇండో-జపాన్ పరిశోధన బృందం ‘దిశానెట్’ అనే సరికొత్త టెక్నాలజీని ఆవిష్కరించింది. సునామీ, భూకంపం, తుపాన్లు, ఘోరప్రమాదాల వంటి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రాణ, ఆస్తినష్టాన్ని తగ్గించేందుకు ఈ ఆధునిక వ్యవస్థ దోహదపడుతుందని కియో యూనివర్సిటీ ఇన్ఫర్మేషన్ స్టడీస్ డీన్ ప్రొఫెసర్ జున్‌మురై తెలిపారు. జపాన్-భారతీయ పరిశోధన, విద్యాసంస్థలు సంయుక్తంగా జరిపిన ఇన్‌ఫర్మేషన్ నెట్‌వర్క్ ఫర్ నేచురల్ డిజాస్టర్ మిటిగేషన్ అండ్ రికవరీ ప్రాజెక్ట్(దిశానెట్) టెక్నాలజీను గురువారం గచ్చిబౌలిలోని ఓ హోటల్‌లో ప్రదర్శించారు.