వాణిజ్య పంటల సాగుతో పెరిగిన పెట్టుబడులు, ప్రకృతి వైపరిత్యాలతో నష్టపోతున్న రైతులు జామాయిల్ సాగుపై దృష్టి సారించారు. జిల్లాలో 50వేల హెక్టార్లకుపైగా జామాయిల్ సాగు చేస్తున్నారు. ఏటేటా ఈ సాగు విస్తీర్ణం రెట్టింపవుతోంది. మామిడి, జీడిమామిడి తోటలను తొలగించి మరీ జామాయిల్ తోటల పెంపకం చేపడుతున్నారు. సాగుకు అనుకూలమైన భూముల్లో కూడా రైతులు జామాయిల్ సాగు చేస్తున్నారు.
నష్టమేమీ లేకపోవడమే కారణం...
ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా.. జామాయిల్‌కు వచ్చిన నష్టమే మి ఉండదు. భద్రాచలం పేపర్‌బోర్డుకు ప్రతిరోజు మూడువేల టన్నులు జామాయిల్ అవసరం కావటంతో రైతులు ఆసక్తి చూ పుతున్నారు. అదీగాక కర్నాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో జామాయిల్ చెట్లను సెంట్రింగ్ కర్రలకు వాడుతుండడంతో జామాయిల్ సాగుకు రోజురోజుకు డి మాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తోటలైన మామిడి, జీడిమామిడి, బత్తా యి తోటలను తొలగిస్తుండడంతో భవి ష్యత్‌లో ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం అవుతోంది.
మూడేళ్ల నుంచి.. : మూడేళ్ల క్రితం జామాయిల్ టన్ను రూ. 1800 నుంచి రూ. 2వేల వరకు ఉండగా ప్రస్తుతం రూ. 5 వేల నుంచి రూ. 5500 వరకు ఉంది. 2008- 10 సంవత్సరంలో జామాయిల్ నర్సరీలకు ఫంగస్ వైరస్ సోకటంతో పెద్ద ఎత్తున నర్సరీలు మూసివేశారు. దీంతో కొంతకాలం జా మాయిల్ సాగు తగ్గింది. ఈ క్రమంలో మళ్లీ జామాయిల్ సాగు పై రైతులు ఆసక్తి చూపడంతో మూడేళ్ల నుంచి జామాయిల్ నర్సరీలు విపరీతంగా వెలుస్తున్నాయి.
సమృద్ధిగా నీటి సౌకర్యం ఉం టే ప్రతీ మూడేళ్లకు ఒకసారి కటింగ్‌కు వస్తుంది. దీంతో పెట్టుబడులతో పాటు లాభాలు కూడా వచ్చేస్తాయి. మొదటిసారే పె ట్టుబడి ఎక్కువగా పెట్టాల్సి వస్తోంది. రెండు, మూడు విడతల్లో పెట్టుబడులు అంతగా పెట్టాల్సిన పనిఉండదు. అటవీశాఖ పి చ్చిచెట్లు, తుప్పలను తొలగించి జామాయిల్ సాగుపై దృష్టిసారించింది.
కొద్దిపాటి వర్షంపడినా.. : వర్షాకాలంలో జామాయిల్ మొక్కలు నాటతారు. ఓ మోస్తారు వర్షం కురిస్తే మొక్క బతుకుతుంది. మూడునాలుగు నెలల్లో ఈ మొక్కలు ఐదారు అడుగుల ఎత్తు పెరుగుతాయి. దీంతో ఒక్కసారి జామాయిల్ సాగుచేసి వదిలితే పదేళ్ల వరకు చూసుకోవాల్సిన పనిలేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని రైతులు జామాయిల్ సాగుకు ఆసక్తి చూపుతున్నారు.
ఒక్క ఎకరానికి వెయ్యి మొక్కలు నాటుతున్నారు. సకాలంలో తోటలకు నీరు, ఎరువులు వేసి సస్యరక్షణ చర్యలు చేపడితే ఎకరానికి కనీసం 55 నుంచి 60 టన్నుల దిగుబడి వస్తుంది. మొక్కలు వేసి వదిలేసినా.. ఎకరానికి కనీసం 30 నుంచి 35 టన్నుల వరకు దిగుబడి వచ్చేఅవకాశం ఉంది.
భూగర్భ జలాలు అడుగంటుతాయని ఆందోళన..
జామాయిల్ సాగు వల్ల భూగర్భ జలాలు అడుగంటడంతో పాటు భూసారం దెబ్బతింటుందని హార్టికల్చరర్ ఆఫీసర్ రమణ తెలిపారు. ఎలిలోపతిక్ ప్రభావంతో జామాయిల్ మొక్కల నుంచి రాలిపడిన ఆకులతో వచ్చే రసాయనాల వలన వేరే మొక్కలు పెరిగే అవకాశం ఉండదన్నారు. భూగర్భజలాలను ఎక్కువగా తీసుకొని ఆకుల్లో, కాండాలలో నిల్వ చేసుకునే లక్షణం జామాయిల్‌కు ఉందన్నారు.
జామాయిల్ వైపు అన్నదాత చూపు..
Published Sat, Sep 13 2014 2:05 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement