jamail cultivation
-
శరవేగంగా సెంచురీ ప్లైబోర్డ్స్ పరిశ్రమ పనులు
సాక్షి ప్రతినిధి, కడప: జిల్లాలోని గోపవరం వద్ద ఏర్పాటు చేస్తున్న సెంచురీ ప్లైబోర్డ్స్ పరిశ్రమ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 2021 డిసెంబరు 23న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ఈ పరిశ్రమకు శంకుస్థాపన చేయగా, 2023 ఏప్రిల్ నాటికి పరిశ్రమ మొదటిదశ నిర్మాణ పనులు పూర్తి కానున్నాయి. తర్వాత అదే ఏడాది అక్టోబరు నాటికి రెండవ దశ పనులు సైతం పూర్తి చేసి ఉత్పత్తులను ప్రారంభించనున్నారు. 589.23 ఎకరాల్లో బద్వేలు నియోజకవర్గంలోని కృష్ణపట్నం–బళ్లారి ప్రధాన రహదారిలో గోపవరం వద్ద రూ. 956 కోట్లతో సెంచురీ ప్లైబోర్డ్స్ పరిశ్రమను నెలకొల్పుతున్నారు. ఈ పరిశ్రమలో ఎండీఎఫ్ (మీడియం డెన్సిటీ ఫైబర్ బోర్డ్స్), హెచ్పీఎల్ (హై ప్రెజర్ ల్యామినేట్స్) ఉత్పత్తులను తయారు చేయనున్నారు. సుబాబుల్, జామాయిల్, సర్వి తదితర కర్ర ద్వారా ఈ ఉత్పత్తులను ఉత్పత్తి చేయనున్నారు. పరిశ్రమను ఏర్పాటు చేస్తున్న వైఎస్సార్ జిల్లా, నెల్లూరు జిల్లాల సరిహద్దుతోపాటు అటు ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో జామాయిల్, సుబాబుల్, సర్వి కర్రను రైతులు పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో 1.25 లక్షల ఎకరాల్లో జామాయిల్ సాగు ఉండగా, 30 వేల ఎకరాల్లో సుబాబుల్ కర్ర సాగు ఉంది. వైఎస్సార్ జిల్లాలో 30 వేల ఎకరాలకు పైగా సుబాబుల్, జామాయిల్ సాగు ఉంది. నెల్లూరు జిల్లాలో 60 వేల ఎకరాల్లో సుబాబుల్, జామాయిల్‌ను రైతులు సాగు చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలోనూ 20 వేల ఎకరాల్లో సాగు ఉంది. దీంతోపాటు పరిశ్రమ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూముల్లో లక్షా 21 వేల ఎకరాల్లో జామాయిల్‌ను సాగు చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాలతోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఒక్క శ్రీకాళహిస్తిలో గ్రీన్ ప్లైవుడ్‌కు సంబంధించి చిన్న పరిశ్రమ ఉండగా, ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరు వద్ద మరో చిన్న పరిశ్రమ మాత్రమే ఉంది. పై ఆరు జిల్లాల్లో సాగవుతున్న జామాయిల్, సుబాబుల్ కర్ర వినియోగానికి ఈ పరిశ్రమల స్థాయి సరిపోవడం లేదు. దీంతో రాజమండ్రి వద్ద ఉన్న ఏపీ పేపర్ మిల్‌తోపాటు ఇతర రాష్ట్రాల్లోని మిల్లులకు ఈ ప్రాంతాల నుంచి కర్ర తరలించాల్సి వస్తోంది. డిమాండ్ లేకపోవడంతో రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. దీంతో ఏడాదికేడాదికి జామాయిల్, సుబాబుల్ సాగును రైతులు తగ్గిస్తున్నారు. గోపవరం వద్ద భారీ పరిశ్రమ ఏర్పాటు అవుతుండడంతో ఆరు జిల్లాల పరిధిలో సాగవుతున్న కర్రను స్థానికంగానే వినియోగించుకునే అవకాశం కలగనుంది. దీంతో రైతులకు గిట్టుబాటు ధర కూడా లభించనుంది. రోజుకు 4 వేల టన్నుల కర్ర వినియోగం ఈ సెంచురీ ప్లైబోర్డ్స్ పరిశ్రమకు మొదటి ఫేజ్‌లో ప్రతిరోజు 2 వేల టన్నుల కర్ర అవసరం కాగా, రెండవ ఫేజ్ నాటికి 4 వేల టన్నుల కర్ర అవసరమవుతుంది. ఈ ప్రాంతంలో కర్రసాగు అధికంగా ఉండడంతో యాజమాన్యం ఇక్కడ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పరిశ్రమల ఏర్పాటుతో 2266 మంది చదువుకున్న నిరుద్యోగ యువతకు ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పించనున్నారు. దీంతోపాటు కర్రసాగు ద్వారా దాదాపు 10 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. ఇప్పటికే 15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో పరిశ్రమను నిర్మిస్తుండగా, పరిశ్రమ నిర్మాణానికి సంబంధించి 30 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు అత్యంత వేగంగా సాగుతున్నాయి. పరిశ్రమకు విద్యుత్, నీటి సరఫరా పనులకు సంబంధించి టెండర్లు పూర్తి కాగా, ఇప్పటికే పనులు మొదలయ్యాయి. వచ్చే ఏడాది జూన్ నాటికి ఈ పనులన్నీ పూర్తి కానున్నాయి. ఏప్రిల్ నాటికి మొదటి దశ పనులు సెంచురీ ప్లైబోర్డ్స్ పరిశ్రమ పనులు అత్యంత వేగంగా సాగుతున్నాయి. విద్యుత్, నీటి సరఫరాకు సంబంధించిన పనులను ఏపీఐఐసీ మరింత వేగంగా చేపట్టింది. వచ్చే ఏప్రిల్ నాటికి మొదటి ఫేజ్ పనులను పూర్తి చేయబోతున్నాం. పనులు పూర్తయిన వెంటనే ఉత్పత్తులు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత అక్టోబరు నాటికి రెండవ ఫేజ్ పనులు పూర్తవుతాయి. – రమేష్‌కుమార్‌రెడ్డి, జీఎం, సెంచురీ ప్లైబోర్డ్స్ సీఎం చొరవతో పరిశ్రమ ఏర్పాటు వెనుకబడిన బద్వేలు ప్రాంత అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవ చూపించి కృషి చేస్తున్నారు. ఇప్పటికే బ్రహ్మంసాగర్ ద్వారా నియోజకవర్గంలోని మొత్తం ఆయకట్టుకు సాగునీటితోపాటు ప్రజలకు తాగునీటిని అందిస్తున్న ముఖ్యమంత్రి గోపవరం వద్ద పరిశ్రమను నెలకొల్పి వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం చాలా సంతోషదాయకం. – డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్సీ పరిశ్రమ ఏర్పాటుతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు గోపవరం వద్ద పరిశ్రమ ఏర్పాటు చేయడంతో నియోజకవర్గ వ్యాప్తంగా చదువుకున్న యువతకు ఉద్యోగాలు లభించడమే కాకుండా వేలాది మంది రైతులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ పరిశ్రమతో జిల్లాతోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో సుబాబుల్, జామాయిల్ కర్ర సాగు చేస్తున్న రైతులకు స్థానికంగానే గిట్టుబాటు ధర లభించనుంది. – డాక్టర్ దాసరి సుధ, ఎమ్మెల్యే, బద్వేలు -
ధరల చెల్లింపులో దబాయింపు!
సాక్షి, అమరావతి: సుబాబుల్, జామాయిల్, సరుగుడు కర్రకు ధరలేక రైతులు లబోదిబోమంటున్నారు. బడా పేపర్ మిల్లులను కట్టడి చేయడంలో రాష్ట్రంలోని గత ప్రభుత్వం ఘోరంగా విఫలం కావడంతో వాళ్లు ఆడింది ఆట పాడింది పాటగా సాగుతోంది. అందరి సమక్షంలో కుదుర్చుకున్న కనీస ఒప్పంద ధరను సైతం ఇవ్వలేమని ఐటీసీ సహా ఇతర పేపర్ మిల్లులు తెగేసి చెబుతున్నాయి. ఫలితంగా జామాయిల్ రైతులు ఎకరానికి సుమారు 25 వేలు, సుబాబుల్ రైతులు ఎకరానికి రూ.20 వేలు ఏటా నష్టపోతున్నారు. ధరల వ్యవహారంలో కంపెనీలు రైతుల్ని ఏమాత్రం ఖాతరుచేయకుండా అగౌరవపరుస్తున్నాయని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వమైనా తమ గోడు పట్టించుకోవాలని సుబాబుల్, జామాయిల్ రైతుల సంఘం కోరుతోంది. రాష్ట్రంలో 4 లక్షల ఎకరాలలో సాగు.. రాష్ట్రంలో సుమారు 4 లక్షల ఎకరాలలో సుబాబుల్, జామాయిల్ (యూకలిప్టస్), సరుగుడు (చౌకలు) సాగవుతోంది. విశాఖ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వర్షాధారిత పంటగా వీటిని సాగుచేస్తున్నారు. మొత్తం సాగులో 40 శాతం వరకు ఒక్క ప్రకాశం జిల్లాలోనే ఉంది. వ్యవసాయశాఖ అంచనా ప్రకారం 80 వేల నుంచి లక్ష మంది వరకు ఈ తోటల్ని పెంచుతుంటారు. ఒకసారి ఈ మొక్కల్ని నాటితే పది పన్నెండేళ్ల పాటు ఉంచవచ్చు. వానలు ఉండి కాస్తంత సస్యరక్షణ చేస్తే మూడేళ్లలో తొలిసారి కర్ర కొట్టవచ్చు. మూడేళ్లకు కౌలు కలుపుకుని ఎకరానికి రూ.90 వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చవుతుంది. అన్నీ సవ్యంగా ఉంటే 25 నుంచి 30 టన్నుల దిగుబడి వస్తుంది. మిల్లుల ఇష్టారాజ్యం.. ధరలు దారుణం 2014కి ముందు సుబాబుల్, జామాయిల్ ధరలు టన్నుకు రూ. 4,400 నుంచి రూ.4,600 మధ్య ఉండేది. ఆ తర్వాత ధరలు క్రమేణా తగ్గడం మొదలుపెట్టాయి. దీంతో రైతులు ఆందోళనకు దిగడంతో టీడీపీకి చెందిన ఆనాటి వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు రైతులు, పేపర్ మిల్లుల ప్రతినిధులతో సమావేశమై కనీస ధరను రూ.4,600గా నిర్ణయించారు. అయితే, ఇందుకు మిల్లర్లు ప్రత్యేకించి ఐటీసీ వంటి కంపెనీలు ససేమిరా అనడమే కాకుండా రూ.4,000లకు మించి ఇవ్వలేమని భీష్మించాయి. ఈలోగా వ్యవసాయ మంత్రి మారిపోవడంతో రైతులు మళ్లీ మొరపెట్టుకున్నారు. జిల్లాకో రేటు పెట్టుకునేందుకు, తమ ఏజెంట్లతో కొనుగోలు చేయించేందుకు అనుమతివ్వాలని కంపెనీలు పట్టుబట్టి సాధించాయి. కంపెనీ ఏజెంట్లు, ఏఎంసీ అధికారులు కుమ్మక్కై ఏదో నామమాత్రంగా నిబంధనల ప్రకారం కొన్నట్టు చూపి మిగతా కర్రను తమ ఇష్టానుసారం కొంటున్నారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు, చీమకుర్తి ప్రాంతంలో రూ.4,400లకు కొనాల్సిన జామాయిల్ కర్రను టన్ను రూ.1,800, సుబాబుల్‌ను రూ.2 వేల నుంచి రూ.2,400 మధ్య కొంటున్నారు. అదే కృష్ణాజిల్లా నందిగామలో రూ.2 వేలకు మించి ఇవ్వడంలేదు. కర్ర కొట్టుడు, రవాణా ఖర్చులను తామే భరిస్తున్నందున ఇంతకుమించి ఇవ్వలేమని పేపర్ మిల్లులు తెగేసి చెబుతున్నాయి. రవాణా సౌకర్యం బాగుంటే ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది. అదే మారుమూల అయితే ధర తక్కువగా ఉంటోందని సుబాబుల్ రైతుల సంఘం నాయకుడు హనుమారెడ్డి చెప్పారు. ప్రతి రైతుకూ ఏటా రూ.25 వేలు నష్టం ధర లేకపోవడంతో రైతులు ఏటా ఎకరాకు రూ.20వేల నుంచి రూ.25 వేల వరకు నష్టపోతున్నారు. దీనిపై రైతులు వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట పెద్దఎత్తున ధర్నాచేసినా ఫలితం లేకపోయింది. ప్రభుత్వం జామాయిల్ కర్ర టన్నుకు నిర్ణయించిన రూ.4,400ను, సుబాబుల్‌కు నిర్ణయించిన రూ.4,200ల ధరైనా ఇవ్వకపోతే తాము బతికేదెలా? అని ప్రశ్నిస్తున్నా రైతుల వేదన అరణ్యరోదనగానే మిగిలింది. ఆ ధరతో కొనుగోలు చేయలేమని ఐటీసీ, ఏపీ పేపర్ మిల్స్, జేకే పేపర్ మిల్స్ చెబుతున్నాయి. పేపర్ ధర పెరుగుతున్నప్పుడు ముడిసరకు ధర ఎందుకు పెరగదని రైతులు ప్రశ్నిస్తున్నారు. తీసి ఇవ్వాలంటే ఎలా? గత ప్రభుత్వ అనాలోచిత చర్యవల్ల రైతులే తమ తోటల్ని నరికి కర్రను స్టాక్ పాయింట్‌కు తరలించాల్సిన పరిస్థితి. ఇది చాలదన్నట్టు ఆ కర్రకుండే తాటను సైతం రైతులే తీయించి పేపర్ మిల్లులకు సరఫరా చేయాలని ప్రకాశం జిల్లాలో షరతు విధించారు. ఈ నిబంధనను తొలగించాలని రైతులు ఆందోళన చేస్తే దాన్ని తీసివేయడానికి బదులు రాష్ట్రవ్యాప్తంగా అదే విధానాన్ని అమలుచేయడం మొదలు పెట్టారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. -
సు‘బాబు’ల్ ‘మోసం’
సాక్షి, చీమకుర్తి: ‘‘ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను అమలు చేయాలని కలెక్టర్‌ను కలిశాం. మంత్రి దృష్టికి తీసుకుపోయాం. చివరకు జిల్లాకు వచ్చినప్పుడు ఒకసారి, రాజధానికే పోయి మరోసారి సీఎంకు కర్ర కొనుగోళ్లలో జరుగుతున్న అన్యాయంపై మొరపెట్టుకున్నాం. పోరాటంతో ఐదేళ్లు గడిచిపోయాయి గానీ కర్రసాగు చేసే మా బాధలు మాత్రం పరిష్కారం కాలేదని’’ రైతులు వాపోతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్, రైతు సంఘం నాయకులు వివిధ దశల్లో పోరాటాలు చేశారు తప్ప రైతుల కష్టానికి ఫలితం లేదు. జామాయిల్ కర్ర టన్నుకు రూ.4400, సుబాబుల్ కర్రకు రూ.4200 వంతున కొనుగోలు చేయాలని ప్రభుత్వమే జీఓ నంబరు 31 విడుదల చేసింది. ఆ జీవో ప్రకారమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తుంటే పేపర్ మిల్లుల యజమానులు మార్కెట్ కమిటీలను తుంగలో తొక్కి ప్రత్యేకంగా దళారులను అడ్డం పెట్టుకొని జామాయిల్ టన్నును రూ.2500, సుబాబుల్ టన్నును రూ.2 వేలు వంతున కొంటూ రైతుల కష్టాన్ని దళారులు, పేపర్ మిల్లుల యాజమాన్యాలు దోచుకుంటున్నాయని రైతులు ఆరోపించారు. దళారులు అక్రమ మార్గంలో కొనుగోలు చేస్తున్న కర్ర లారీలను ఆపి రైతులందరికీ సమన్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకపోగా దానిపై మంత్రివర్గ ఉపసంఘం కనీసం కన్నెత్తి కూడా చూడలేదనే విమర్శలు రైతుల్లో వ్యక్తమవుతోంది. పేపర్ మిల్లుల యజమానులు కొనుగోలు చేయకపోగా నిలదీశారనే నెపంతో సంతనూతలపాడు, చీమకుర్తి మండలాలకు చెందిన రైతుల కర్రను కక్ష పూరితంగా కొనుగోలు చేయకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. రాష్ట్రంలో 42 శాతం వాటా ప్రకాశం జిల్లాదే: రాష్ట్రంలో సాగయ్యే జామాయిల్, సుబాబుల్లో 42 శాతం వాటా ఒక్క ప్రకాశం జిల్లా నుంచే సాగవుతుందని రైతుసంఘం నాయకుల గణాంకాలు ధ్రువీకరిస్తున్నాయి. జిల్లాలో జామాయిల్ 1.07 లక్షల ఎకరాల్లో సాగవుతుంది. సుబాబుల్ 60 వేల ఎకరాల్లో, సరుగుడు 8 వేల ఎకరాల్లో సాగవుతుందని రైతులు చెబుతున్నారు. గతంలో వర్షాలు పుష్కలంగా ఉన్నప్పుడు మూడు సంవత్సరాలకే పొలంలో కర్ర కోతకు వచ్చేది. నాలుగైదేళ్ల నుంచి సకాలంలో వర్షాలు లేక ఐదేళ్లయినా కర్ర కోతకు రాకపోగా ఒక్కో ఎకరానికి రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు నష్టం వాటిల్లుతుందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే అనేక వేల ఎకరాల్లో సుబాబుల్, జామాయిల్ కర్రను కొనుగోలు చేసేవారు లేక కోతకు వచ్చిన కర్ర కూడా పొలాల్లోనే ఎండిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో మార్కెట్లో పేపర్ ఖరీదు టన్నుకు రూ.15 వేలు పెరిగిందని, గతంతో పోల్చుకుంటే 50 శాతం పేపర్ ధర పెరగగా, దానికి ముడి సరుకుగా ఉన్న సుబాబుల్, జామాయిల్ కర్రకు మాత్రం ఐదేళ్ల క్రితం ప్రకటించిన మద్దతు ధర ఇవ్వకపోగా దానిలో సగానికి సగం కోతపెట్టి సగం ధర మాత్రమే ఇస్తున్నారని వాపోతున్నారు. -
జామాయిల్ వైపు అన్నదాత చూపు..
వాణిజ్య పంటల సాగుతో పెరిగిన పెట్టుబడులు, ప్రకృతి వైపరిత్యాలతో నష్టపోతున్న రైతులు జామాయిల్ సాగుపై దృష్టి సారించారు. జిల్లాలో 50వేల హెక్టార్లకుపైగా జామాయిల్ సాగు చేస్తున్నారు. ఏటేటా ఈ సాగు విస్తీర్ణం రెట్టింపవుతోంది. మామిడి, జీడిమామిడి తోటలను తొలగించి మరీ జామాయిల్ తోటల పెంపకం చేపడుతున్నారు. సాగుకు అనుకూలమైన భూముల్లో కూడా రైతులు జామాయిల్ సాగు చేస్తున్నారు. నష్టమేమీ లేకపోవడమే కారణం... ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా.. జామాయిల్‌కు వచ్చిన నష్టమే మి ఉండదు. భద్రాచలం పేపర్బోర్డుకు ప్రతిరోజు మూడువేల టన్నులు జామాయిల్ అవసరం కావటంతో రైతులు ఆసక్తి చూ పుతున్నారు. అదీగాక కర్నాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో జామాయిల్ చెట్లను సెంట్రింగ్ కర్రలకు వాడుతుండడంతో జామాయిల్ సాగుకు రోజురోజుకు డి మాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తోటలైన మామిడి, జీడిమామిడి, బత్తా యి తోటలను తొలగిస్తుండడంతో భవి ష్యత్‌లో ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం అవుతోంది. మూడేళ్ల నుంచి.. : మూడేళ్ల క్రితం జామాయిల్ టన్ను రూ. 1800 నుంచి రూ. 2వేల వరకు ఉండగా ప్రస్తుతం రూ. 5 వేల నుంచి రూ. 5500 వరకు ఉంది. 2008- 10 సంవత్సరంలో జామాయిల్ నర్సరీలకు ఫంగస్ వైరస్ సోకటంతో పెద్ద ఎత్తున నర్సరీలు మూసివేశారు. దీంతో కొంతకాలం జా మాయిల్ సాగు తగ్గింది. ఈ క్రమంలో మళ్లీ జామాయిల్ సాగు పై రైతులు ఆసక్తి చూపడంతో మూడేళ్ల నుంచి జామాయిల్ నర్సరీలు విపరీతంగా వెలుస్తున్నాయి. సమృద్ధిగా నీటి సౌకర్యం ఉం టే ప్రతీ మూడేళ్లకు ఒకసారి కటింగ్‌కు వస్తుంది. దీంతో పెట్టుబడులతో పాటు లాభాలు కూడా వచ్చేస్తాయి. మొదటిసారే పె ట్టుబడి ఎక్కువగా పెట్టాల్సి వస్తోంది. రెండు, మూడు విడతల్లో పెట్టుబడులు అంతగా పెట్టాల్సిన పనిఉండదు. అటవీశాఖ పి చ్చిచెట్లు, తుప్పలను తొలగించి జామాయిల్ సాగుపై దృష్టిసారించింది. కొద్దిపాటి వర్షంపడినా.. : వర్షాకాలంలో జామాయిల్ మొక్కలు నాటతారు. ఓ మోస్తారు వర్షం కురిస్తే మొక్క బతుకుతుంది. మూడునాలుగు నెలల్లో ఈ మొక్కలు ఐదారు అడుగుల ఎత్తు పెరుగుతాయి. దీంతో ఒక్కసారి జామాయిల్ సాగుచేసి వదిలితే పదేళ్ల వరకు చూసుకోవాల్సిన పనిలేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని రైతులు జామాయిల్ సాగుకు ఆసక్తి చూపుతున్నారు. ఒక్క ఎకరానికి వెయ్యి మొక్కలు నాటుతున్నారు. సకాలంలో తోటలకు నీరు, ఎరువులు వేసి సస్యరక్షణ చర్యలు చేపడితే ఎకరానికి కనీసం 55 నుంచి 60 టన్నుల దిగుబడి వస్తుంది. మొక్కలు వేసి వదిలేసినా.. ఎకరానికి కనీసం 30 నుంచి 35 టన్నుల వరకు దిగుబడి వచ్చేఅవకాశం ఉంది. భూగర్భ జలాలు అడుగంటుతాయని ఆందోళన.. జామాయిల్ సాగు వల్ల భూగర్భ జలాలు అడుగంటడంతో పాటు భూసారం దెబ్బతింటుందని హార్టికల్చరర్ ఆఫీసర్ రమణ తెలిపారు. ఎలిలోపతిక్ ప్రభావంతో జామాయిల్ మొక్కల నుంచి రాలిపడిన ఆకులతో వచ్చే రసాయనాల వలన వేరే మొక్కలు పెరిగే అవకాశం ఉండదన్నారు. భూగర్భజలాలను ఎక్కువగా తీసుకొని ఆకుల్లో, కాండాలలో నిల్వ చేసుకునే లక్షణం జామాయిల్‌కు ఉందన్నారు.