
ప్రకృతి వైపరీత్యాలు తట్టుకునే విత్తనాలు వృద్ధి చేయండి
ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే విత్తన రకాలు అభివృద్ధి చేయాలని శాస్త్రవేత్తలకు, అధికారులకు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు.
- వ్యవసాయ శాఖ మంత్రి పోచారం సూచన
సాక్షి, హైదరాబాద్: ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే విత్తన రకాలు అభివృద్ధి చేయాలని శాస్త్రవేత్తలకు, అధికారులకు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. విత్తన పరిశోధనలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దాల్సిన బాధ్యత శాస్త్రవేత్తలపైనే ఉందన్నారు.
‘విత్తన ఉత్పత్తి గొలుసు’ను బలోపేతం చేసే విషయమై రాష్ట్ర ఉద్యానవన శాఖ కార్యాలయంలో సమావేశం జరిగింది. సమావేశానికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ, విత్తన ధ్రువీకరణ సంస్థ, ఆయిల్‌ఫెడ్ శాఖల అధికారులు హాజరయ్యారు.ప్రభుత్వం విత్తన పరిశోధన శాలలపై రూ.3 నుంచి రూ.4 కోట్ల వరకు ఖర్చు చేస్తోందని, శీతల గిడ్డంగులు అభివృద్ధి చేస్తోందని తెలిపారు.