ఇరవై ఏళ్లలో తిరిగి చెల్లింపు
సాక్షి, ముంబై: భూకంపబాధితుల సహాయార్థం నేపాల్ ప్రభుత్వానికి 300 మిలియన్ డాలర్లు (రూ. 30 కోట్లు) అందించామని, ఈ మొత్తాన్ని ప్రభుత్వం 20 ఏళ్ల తరువాత తిరిగి చెల్లిస్తుందని ఎగ్జిమ్ బ్యాంక్ సీఎండీ యదువేంద్ర మాథుర్ తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం నుంచి వడ్డీ వసూలు చేయడం లేదని చెప్పారు. బ్యాంకు వార్షిక ఫలితాలు, అభివృద్ధి గురించి గురువారం ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు ప్రతిఫలం ఆశించకుండా ఆర్థిక సాయం అందించాలని చెప్పారు. నేపాల్ భూకంప ఘటనతో ప్రపంచం మొత్తం దిగ్భ్రాంతి చెందిందని అన్నారు.
నేపాల్ భూకంప బాధితులకు ఉద్యోగులు, రాజకీయ నాయకులు తమ వంతు సాయం చేస్తున్నారన్నారు. వివిధ దేశాల్లో దేశీయ ఉత్పత్తుల తయారీకి అవసరమైన నిధులు ఇస్తున్నామని గుర్తు చేశారు. వ్యాపారులను ప్రోత్సహించడానికి నామమాత్ర వడ్డీ విధిస్తున్నామన్నారు. భారత్‌లో కూడా గ్రామీణ, పటణాభివృద్ధి, రైతులకు కేవలం రెండు, మూడు శాతం వడ్డీకి రుణాలు ఇస్తున్నామని తెలిపారు. ముంబైలో ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కలఘోడ ఉత్సవాల్లో బ్యాంకు చేపడుతున్న సహాయ కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజేసేందుకు స్టాళ్లు ఏర్పాటుచేస్తున్నామని వివరించారు. స్టాళ్ల ద్వారా అనేక మంది లబ్ధి పొందుతున్నారని తెలిపారు.
నేపాల్‌కు ‘ఎగ్జిమ్’ రూ. 30 కోట్ల సాయం
Published Thu, Apr 30 2015 11:00 PM | Last Updated on Sun, Sep 3 2017 1:10 AM
Advertisement
Advertisement