Nepal Government
-
క్షమాపణలు చెప్పిన 'ఆదిపురుష్' టీమ్!
'ఆదిపురుష్'కి బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి. అలానే రోజురోజుకీ వివాదాలు కూడా ఎక్కువవుతున్నాయి. సినిమా స్టోరీ దగ్గర నుంచి పాత్రల గెటప్స్ వరకు చాలా ట్రోల్స్ వస్తున్నాయి. ఇవన్నీ కాదన్నట్లు 'ఆదిపురుష్' లోని ఓ డైలాగ్ వల్ల నేపాల్ ప్రభుత్వం.. భారతీయ సినిమాలపై నిషేధం విధించింది. ప్రస్తుతం ఇదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్. దీంతో 'ఆదిపురుష్' టీమ్.. నేపాల్ ప్రభుత్వానికి క్షమాపణలు చెబుతూ ఓ లెటర్ రిలీజ్ చేసింది. ఏం జరిగింది? 'ఆదిపురుష్' సినిమాని రామాయణం ఆధారంగా తీశారు. రాముడిగా ప్రభాస్, సీతగా కృతిసనన్ నటించారు. రిజల్ట్, వసూళ్ల గురించి పక్కనబెడితే ఇందులో సీత.. భారతదేశంలో పుట్టింది అనే అర్థం వచ్చేలా ఓ డైలాగ్ ఉంది. రిలీజ్ రోజే దీనిపై నేపాల్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. దాన్ని తొలిగిస్తేనే ప్రదర్శిస్తామని పట్టుబట్టింది. అలానే రామాయణాన్ని వక్రీకరించేలా సినిమా తీశారని.. అక్కడ ప్రభుత్వ నేతలు భారతీయ సినిమాలపై నిషేధం విధించారు. (ఇదీ చదవండి: చరణ్-ఉపాసన బిడ్డకు ఆ నంబర్ సెంటిమెంట్!?) సారీ చెప్పిన నిర్మాతలు నేపాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరింత ముదరకముందే 'ఆదిపురుష్' టీమ్ రాజీకి వచ్చింది. క్షమాపణలు చెబుతూ ఓ లెటర్ ని రిలీజ్ చేసింది. భారతీయ సినిమాలపై నిషేధాన్ని ఎత్తివేయాలని ఖాట్మండు మేయర్ ని అభ్యర్థించింది. ఇందుకు సంబంధించిన ఓ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. లేఖలో ఏముంది? 'నేపాల్ ప్రజల మనోభావాలు ఏ విధంగానైనా దెబ్బతీసుంటే మమ్మల్ని క్షమించాలి. మేం కావాలని ఎవరి సామరస్యాన్ని దెబ్బతీయాలనుకోలేదు. ఈ మూవీని క్రియేటివ్ కోణంలోనే చూడాలని కోరుకుంటున్నాం. చరిత్రపై ఆసక్తిని పెంచి, పెద్ద సంఖ్యలో ప్రేక్షకులని అలరించాలనే మా ఉద్దేశానికి మద్దతు ఇవ్వాలని మేం అభ్యర్థిస్తున్నాం' అని టీ-సిరీస్ లేఖలో ఉంది. పడిపోయిన కలెక్షన్స్ ఈ లేఖపై నేపాల్ ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఎన్ని విమర్శలు వస్తున్నాసరే బాక్సాఫీస్ దగ్గర 'ఆదిపురుష్' కలెక్షన్స్ ప్రభంజనం ఆగట్లేదు. నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.375 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తొలి మూడురోజులు బాగానే వసూళ్లు వచ్చినప్పటికీ, నాలుగో రోజు దారుణంగా తగ్గిపోయాయి. ఈ వారం కూడా 'ఆదిపురుష్' నిలబడితేనే లాభాల్లోకి వెళ్తుంది. లేదంటే బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు కష్టాలు తప్పవు!? (ఇదీ చదవండి: 'ఆదిపురుష్' రైటర్‌కు బెదిరింపులు.. చంపేస్తామని!) -
ఎవరెస్ట్ యమ డేంజర్.. పది వేల అడుగులు దాటితే..
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం మౌంట్ ఎవరెస్ట్. ఆకాశానికి నిచ్చెన వేసినట్టుగా వెండి కొండలా ధగధగలాడిపోతూ మంచుతో నిండిపోయిన ఈ పర్వత శిఖరం చేరుకోవడమంటే ప్రపంచాన్ని తమ పాదాక్రాంతం చేసుకోవడమే. అందుకే ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉన్నా, ప్రాణాలతో తిరిగి వస్తామన్న భరోసా లేకపోయినా ప్రతీ ఏడాది ఎందరో సాహసికులు ఈ పర్వత శిఖరాన్ని చేరుకోవాలని తమ దేశ జెండాని పాతాలని ఆరాటపడుతుంటారు. మౌంట్ ఎవరెస్ట్‌ను తొలిసారి ఎక్కడం ప్రారంభించి 70 ఏళ్లయింది. 1953 సంవత్సరం మే 29న న్యూజిలాండ్‌కు చెందిన ఎడ్మండ్ హిల్లరీ భారత్‌కు చెందిన టెన్జింగ్ నార్గేలు ఎవరెస్ట్ శిఖరాగ్రం చేరుకున్నారు. ఈ 70 ఏళ్లలో కనీవినీ ఎరుగని మార్పులు వచ్చాయి. సాంకేతిక పరిజ్ఞానం పెరిగి, ఆధునిక సదుపాయాలు చోటు చేసుకోవడంతో ఎవరెస్ట్ అధిరోహించే వారి సంఖ్య భారీగా పెరిగింది. ఎవరెస్ట్‌పై ట్రాఫిక్ జామ్ పర్వతారోహకులకు ఈ ఏడాది నేపాల్ ప్రభుత్వం విచ్చలవిడిగా అనుమతులు మంజూరు జారీ చేయడంతో ఎవరెస్ట్ అధిరోహణ మరింత ప్రమాదకరంగా మారింది. అసాధారణ రీతిలో 900 మంది పర్వతారోహకులకు అనుమతులు మంజూరు చేసింది. దీంతో కొండపై భారీగా ట్రాఫిక్ జామ్‌లు కనిపించాయి. శిఖరాగ్రం చేరుకోవాలంటే 26 వేల అడుగులు పైకి వెళ్లాలి. పది వేల అడుగులు దాటితే ఇంక మృత్యువు ముఖంలోకి అడుగు పెట్టినట్టే. అంత ఎత్తులో ఆక్సిజన్ సరిగా అందదు. ఊపిరి పీల్చుకోవడమే కష్టంగా మారుతుంది. రక్తం గడ్డ కట్టేలా వాతావరణం మైనస్ 20 డిగ్రీలకు పడిపోతుంది. శారీరకంగా ఎంత ఫిట్నెస్ ఉన్నప్పటికీ అనారోగ్య సమస్యలు చుట్టుముట్టి ప్రాణాలు పోతాయి. సముద్ర మట్టానికి అంత ఎత్తుకు చేరుకుంటే ఒక్కోసారి మెదడు, ఊపిరితిత్తులకు వాపు వచ్చి శరీరంపై స్వాధీనం కోల్పోతారు. ఈ సారి ఏకంగా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు మంచులో గల్లంతయ్యారు. ఇటీవల ఈ స్థాయిలో మరణాలు ఎప్పుడూ సంభవించలేదు. ‘‘ఒకేసారి పర్వతారోహకులు కొండ ఎక్కుతూ ఉంటే వారికి ఆక్సిజన్ అవసరం ఎక్కువగా ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఆక్సిజన్ ఏర్పాటు చేయడం అత్యంత ముఖ్యం. మా ద్వారా ఎవరెస్ట్ అధిరోహించే పర్వతారోహకులెవరూ ఇప్పటివరకు ఏ సమస్య ఎదుర్కోలేదు’’అని ఆస్ట్రియాకు చెందిన లుకాస్ ఫర్టెన్‌బాచ్ అనే కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. ఈ ఏడాది తమ సంస్థ తరఫున 100 మంది దిగ్విజయంగా ఎవరెస్ట్ ఎక్కి వచ్చారని చెప్పారు. వాతావరణ మార్పులతో పెరుగుతున్న ముప్పు ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పులు ఎవరెస్ట్ అధిరోహకులకు అతి పెద్ద ప్రతిబంధకంగా మారుతోంది. 1979 నుంచి చూస్తే గత 40 ఏళ్లలో ఎవరెస్ట్‌పై ఉష్ణోగ్రతలు సగటున 2 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగాయి. దీంతో హిమానీ నదాలు కరిగి మంచు చరియలు విరిగి పడటం వంటిæ ప్రమాదాలు ముంచుకొస్తాయి. కొన్నేళ్లుగా ఎవరెస్ట్ అధిరోహించే వారు ఈ మార్పుల ప్రభావం విపరీతంగా ఉంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. మరో పదేళ్లలో ఎవరెస్ట్ ఎక్కే మార్గం ఎలా మారుతుందో ఊహకి కూడా అందడం లేదని నేపాల్ మౌంటనీరింగ్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఆంగ్ షెరింగ్ పేర్కొన్నారు. ఆదాయానికి ఆశపడి..? నేపాల్‌కు పర్యాటకమే ప్రధాన ఆధారం. ఎవరెస్ట్ అధిరోహణ నుంచే అధికంగా ఆదాయం సమకూరుతుంది. పశ్చిమ దేశాల నుంచి వచ్చే పర్వతారోహకుల నుంచి11 వేల డాలర్లు (రూ.9 లక్షలు) చొప్పున వసూలు చేస్తున్నట్టు చెబుతున్నారు. అదే కాకుండా వెంట తీసుకు వెళ్లే ఆక్సిజన్, ఆహారం, గైడ్ల కోసం మొత్తంగా ఒక్కొక్కరికి 27 వేల డాలర్లు (దాదాపుగా రూ.22 లక్షలు) ఖర్చు అవుతుంది. అయితే నేపాల్ ప్రభుత్వం ఆదాయానికి ఆశపడే అనుమతులు ఎక్కువగా ఇస్తున్నామన్న ఆరోపణల్ని తోసిపుచ్చింది. ప్రతీ పర్వతారోహకుడి ప్రాణ రక్షణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, బేస్ క్యాంప్‌లో వైద్యులు, అధికారుల బృందం ఈ సాహస యాత్రను పర్యవేక్షిస్తుందని స్పష్టం చేసింది. ఏదైనా సాధ్యమే ప్రపంచంలో ఎవరెస్ట్ మ్యాన్‌గా పేరు పొందిన నేపాల్‌కు చెందిన షెర్పా కామి రిటా 28 సార్లు ఎవరెస్ట్ ఎక్కిన వ్యక్తిగా నిలిచి తన రికార్డు తానే బద్దలు కొట్టాడు. ఈ ఏడాది వారం రోజుల తేడాలో రెండు సార్లు శిఖరాగ్రానికి చేరుకున్నాడు. తన రికార్డుని పసాంగ్ దావా అనే షెర్పా సమం చేయడంతో ఆ మరుసటి రోజే మళ్లీ ఎక్కి అత్యధికసార్లు ఎవరెస్ట్‌ని ఎక్కిన వ్యక్తిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఇక బ్రిటన్‌కు చెందిన మాజీ సైనికుడు హరి బుధా మాగర్ కృత్రిమ కాలుతో ఎవరెస్ట్ ఎక్కిన వ్యక్తిగా అరుదైన ఘనత సాధించాడు. మనిషి తలచుకుంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించాడు. ఒక మలేసియన్ పర్వతారోహకుడు అనారోగ్యం బారిన పడితే నేపాలీ గైడ్ గెల్జీ అతనిని మోసుకుంటూ కొండ దిగడం మరో అరుదైన ఫీట్‌గా నమోదైంది. ఎవరెస్ట్ శిఖరాగ్రానికి చేరితే ప్రపంచాన్నే జయించినంత ఆనందం వస్తుంది కాబట్టే ప్రాణాలకు తెగించి మరీ ఎవరెస్ట్ ఎక్కే వారి సంఖ్య ఏడాదికేడాది పెరుగుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
విమాన ప్రమాదంపై నేపాల్ ప్రభుత్వం అధికారిక ప్రకటన
-
నేపాల్ కొత్త మ్యాప్‌కు చట్టబద్ధత
కఠ్మాండు/న్యూఢిల్లీ: భారత్‌లోని వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతాలను తన భూభాగంలోకి కలుపుతూ నేపాల్ ప్రభుత్వం రూపొందించిన కొత్త మ్యాప్‌కు రాజ్యాంగబద్ధత లభించింది. ఇందుకు సంబంధించిన సవరణ బిల్లును గురువారం నేపాల్ పార్లమెంట్ ఆమోదించిన కొన్ని గంటల్లోనే అధ్యక్షురాలు విద్యాదేవి భండారీ సంతకం చేశారు. సవరణ బిల్లు ఇప్పటికే దిగువసభలో ఆమోదం పొందింది. భారత్‌కు చెందిన లిపులేఖ్, కాలాపానీ, లింపియధురా ప్రాంతాలను తమ దేశ భూభాగంలో చూపిస్తూ మేలో నేపాల్ కొత్త మ్యాప్ విడుదల చేయడం తెల్సిందే. భారత్‌తో విభేదాల నేపథ్యంలో నేపాల్ తన సరిహద్దుల్లో కాలాపానీ సమీపాన ఉన్న చంగ్రూ శిబిరాన్ని నేపాల్ ఆధునీకరించింది. దార్చులా జిల్లాలోని ఈ ఔట్ పోస్టులో ఇకపై శీతాకాలంలోనూ ఒక జవాను బందోబస్తు విధులు నిర్వర్తిస్తారు. ఖండించిన భారత్: నేపాల్ ప్రయత్నాలను భారత్ మొదట్నుంచీ వ్యతిరేకిస్తోంది. నేపాల్ కృత్రిమంగా భూభాగాన్ని విస్తరించుకునే ప్రయత్నం చేస్తోందని భారత్ విమర్శించింది. నేపాల్ ప్రయత్నాలను మద్దతు తెలిపేందుకు ఎటువంటి రుజువులు గానీ, చారిత్రక వాస్తవాలు కానీ లేవని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ అన్నారు. సరిహద్దుల విషయంలో చర్చలు జరుపుకోవాలని గతంలో కుదిరిన అవగాహనను నేపాల్ ఉల్లంఘించిందని చెప్పారు. -
ఎవరెస్టుపై మరణాలు రద్దీ వల్ల కాదు
కఠ్మాండ్ : ఎవరెస్టు శిఖరంపై ఇటీవల సంభవించిన మరణాలు కేవలం ట్రాఫిక్ జామ్ వల్ల కాలేదని.. ఎత్తైన ప్రదేశాల్లో వ్యాధులకు గుర య్యే అవకాశం, ఆరోగ్య సమస్యలు, ప్రతికూల వాతావరణం వంటి కారణాల వల్ల జరిగాయ ని నేపాల్ ప్రభుత్వం వెల్లడించింది. ఎవరెస్టుపై అత్యధిక రద్దీ నెలకొనడంతో ఈ ఏడాది 11 మంది చనిపోయారన్న జాతీయ, అంతర్జాతీయ మీడియా కథనాలను నేపాల్ ప్రభుత్వం కొట్టిపారేసింది. ఏదైనా కథనాన్ని ప్రచురించే ముందు వాస్తవాలను తెలుసుకొని రాయాలని.. అసత్య వార్తలు రాయడం తగదని ఘాటు గా వ్యాఖ్యానించింది. ఎవరెస్టును అధిరోహిం చే క్రమంలో ఎనిమిది మంది చనిపోయారని నేపాల్ పర్యాటక మంత్రిత్వ శాఖ డీజీ దండు రాజ్ గిమిరే గురువారం వెల్లడించారు. ఈ మరణాలకు ట్రాఫిక్ జామ్ మాత్రమే కారణం కాదన్నారు. -
పొరుగుదేశంలో రాజకీయ సంక్షోభం
ఖాట్మాండు: పొరుగుదేశం నేపాల్‌లో మరోసారి రాజకీయ సంక్షోభం ఏర్పడింది. నేపాల్ సంకీర్ణ ప్రభుత్వంలోని కీలక భాగస్వామి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్టు సెంటర్) మద్దతు ఉపసంహరించుకుంది. మంత్రి పదవుల నుంచి వైదొలగాల్సిందిగా తమ పార్టీ నేతలను ఆదేశించింది. సీపీఎన్ (ఎంసీ) చైర్మన్ పుష్ప కమల్ దహల్ ప్రచండ మంగళవారం ఈ మేరకు ప్రకటించారు. దీంతో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఒలి ప్రభుత్వం మైనార్టీలో పడింది. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (యునైటెడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్), సీపీఎన్ (ఎంసీ) కూటమి తరపున తొమ్మిది నెలల క్రితం నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ ఒలి బాధ్యతలు చేపట్టారు. సంకీర్ణ కూటమిలో సీపీఎన్ (ఎంసీ) రెండో పెద్ద పార్టీ. కాగా గత మేలో కుదుర్చుకున్న తొమ్మిది అంశాలతో కూడిన ఒప్పందాన్ని అమలు చేయనందుకు నిరసనగా సీపీఎన్ (ఎంసీ) ఒలి సర్కార్‌కు మద్దతు ఉపసంహరించుకుంది. -
సహాయ టీమ్‌లు వెళ్లిపోవాలి
విదేశాలకు నేపాల్ ప్రభుత్వం విజ్ఞప్తి భూకంప మృతులు 7,365 కఠ్మాండు: భూకంప బాధిత నేపాల్‌లో సహాయక(రెస్క్యూ) కార్యక్రమాలు చేపడుతున్న భారత్ సహా 34 దేశాల బృందాలు వెళ్లిపోవాలని ఆ దేశ ప్రభుత్వం సోమవారం కోరింది. బాధితుల కోసం భారీస్థాయిలో పునరావాస కార్యక్రమాలు ప్రారంభించడానికి సిద్ధమై ఈమేరకు విజ్ఞప్తి చేసింది. నేపాల్‌కు భారత్ సాయాన్ని భారత్ మీడియాలో గొప్పగా చూపుతుండడంపై సామాజిక వెబ్సైట్లలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో పైవిధంగా స్పందించింది. అయితే భారత్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ నిర్ణయం తీసుకోలేదని, అన్ని దేశాలను కోరినట్లే ఆ దేశాన్నీ కోరామని భారత్‌లోని నేపాల్ రాయబారి దీప్‌కుమార్ చెప్పారు. పునరావాసంపై దృష్టి పెడుతున్నామని, విదేశాలు సహాయక బృందాలను ఉపసంహరించుకోవాలని నేపాల్ విదేశాంగ శాఖ కోరింది. శిథిలాల కింద చిక్కుకున్నవారు జీవించి ఉండే అవకాశం లేదు కనుక విదేశీ బృందాలను వెళ్లాలని నేపాల్ చెప్పిందని భారత జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) చీఫ్ ఓపీ సింగ్ చెప్పారు. తమ బృందాల ఉపసంహరణ ప్రారంభించామన్నారు. నేపాల్‌లో సోమవారం కూడా ఏడు స్వల్పస్థాయి భూప్రకంపనలు సంభవించాయి. సింధుపాల్‌చౌక్‌లో వచ్చిన ఒకదాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదైంది. గత నెల 25 నాటి భారీ భూకంపంలో చనిపోయిన వారి సంఖ్య 7,365కు చేరింది. మృతుల్లో 41 మంది భారతీయులు ఉన్నారు. బాధితులకు తాత్కాలిక ఆశ్రయం కల్పించడానికి పది లక్షల టెంట్లు అవసరమని నేపాల్ ఉప ప్రధాని ప్రకాశ్ మాన్ సింగ్ తెలిపారు. ఎవరెస్ట్ వద్ద మంచుచరియలు విరిగిపడ్డంతో ప్రస్తుత సీజన్లో పర్వతారోహణను నేపాల్ ప్రభుత్వం ముగించింది. -
నేపాల్‌కు ‘ఎగ్జిమ్’ రూ. 30 కోట్ల సాయం
ఇరవై ఏళ్లలో తిరిగి చెల్లింపు సాక్షి, ముంబై: భూకంపబాధితుల సహాయార్థం నేపాల్ ప్రభుత్వానికి 300 మిలియన్ డాలర్లు (రూ. 30 కోట్లు) అందించామని, ఈ మొత్తాన్ని ప్రభుత్వం 20 ఏళ్ల తరువాత తిరిగి చెల్లిస్తుందని ఎగ్జిమ్ బ్యాంక్ సీఎండీ యదువేంద్ర మాథుర్ తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం నుంచి వడ్డీ వసూలు చేయడం లేదని చెప్పారు. బ్యాంకు వార్షిక ఫలితాలు, అభివృద్ధి గురించి గురువారం ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు ప్రతిఫలం ఆశించకుండా ఆర్థిక సాయం అందించాలని చెప్పారు. నేపాల్ భూకంప ఘటనతో ప్రపంచం మొత్తం దిగ్భ్రాంతి చెందిందని అన్నారు. నేపాల్ భూకంప బాధితులకు ఉద్యోగులు, రాజకీయ నాయకులు తమ వంతు సాయం చేస్తున్నారన్నారు. వివిధ దేశాల్లో దేశీయ ఉత్పత్తుల తయారీకి అవసరమైన నిధులు ఇస్తున్నామని గుర్తు చేశారు. వ్యాపారులను ప్రోత్సహించడానికి నామమాత్ర వడ్డీ విధిస్తున్నామన్నారు. భారత్‌లో కూడా గ్రామీణ, పటణాభివృద్ధి, రైతులకు కేవలం రెండు, మూడు శాతం వడ్డీకి రుణాలు ఇస్తున్నామని తెలిపారు. ముంబైలో ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కలఘోడ ఉత్సవాల్లో బ్యాంకు చేపడుతున్న సహాయ కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజేసేందుకు స్టాళ్లు ఏర్పాటుచేస్తున్నామని వివరించారు. స్టాళ్ల ద్వారా అనేక మంది లబ్ధి పొందుతున్నారని తెలిపారు.