పొరుగుదేశంలో రాజకీయ సంక్షోభం
ఖాట్మాండు: పొరుగుదేశం నేపాల్లో మరోసారి రాజకీయ సంక్షోభం ఏర్పడింది. నేపాల్ సంకీర్ణ ప్రభుత్వంలోని కీలక భాగస్వామి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్టు సెంటర్) మద్దతు ఉపసంహరించుకుంది. మంత్రి పదవుల నుంచి వైదొలగాల్సిందిగా తమ పార్టీ నేతలను ఆదేశించింది. సీపీఎన్ (ఎంసీ) చైర్మన్ పుష్ప కమల్ దహల్ ప్రచండ మంగళవారం ఈ మేరకు ప్రకటించారు. దీంతో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఒలి ప్రభుత్వం మైనార్టీలో పడింది.
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (యునైటెడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్), సీపీఎన్ (ఎంసీ) కూటమి తరపున తొమ్మిది నెలల క్రితం నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ ఒలి బాధ్యతలు చేపట్టారు. సంకీర్ణ కూటమిలో సీపీఎన్ (ఎంసీ) రెండో పెద్ద పార్టీ. కాగా గత మేలో కుదుర్చుకున్న తొమ్మిది అంశాలతో కూడిన ఒప్పందాన్ని అమలు చేయనందుకు నిరసనగా సీపీఎన్ (ఎంసీ) ఒలి సర్కార్కు మద్దతు ఉపసంహరించుకుంది.