ముంబై నగరంలో మాజ్గావ్ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున నాలుగంతస్థుల భవనం కుప్పకూలిన ఘటనను మహారాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఆ ఘటనకు బాధ్యులుగా భావిస్తూ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) చెందిన ముగ్గురు ఉన్నతాధికారులను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 33 ఏళ్ల క్రితం కట్టిన ఆ భవనం శిథిలావస్థలో ఉందని, నివాసిస్తున్న కుటుంబాలను ఖాళీ చేయించి ఆ భవనానికి మరమ్మతులు నిర్వహించాలని ఇటీవల తనిఖీలకు వెళ్లిన బీఎంసీ అధికారులు ఆ భవన యజమానిని ఆదేశించించారు.
అయితే యజమాని బీఎంసీ అధికారుల ఆదేశాలను భేఖాతరు చేశాడు. అదికాక భవన కింద సెల్లార్లో ఓ సంస్థకు యజమాని అద్దెకు ఇచ్చాడు. దాంతో సెల్లారులో మరమత్తులు నిర్వహించాడు. ప్రమాదం జరిగేందుకు అవి కూడా కారణమని మున్సిఫల్ అధికారులు భావిస్తున్నారు. అయితే భవనం కూలడానికి బీఎంసీ అధికారుల ఉదాసీనతే కారణమని ప్రభుత్వం భావించింది.
దాంతో ముగ్గురు ఉన్నతాధికారులను అరెస్ట్ చేశారు. అయితే భవనం కుప్పకూలిన ఘటనలో మరణించిన ఒక్కో కుటుంబానికి రూ. లక్ష పరిహారాన్ని మహారాష్ట్ర సీఎం పృద్దీరాజ్ చవాన్ ఇప్పటికే ప్రకటించారు. అలాగే ఒకొక్క మృతుని కుటుంబానికి రూ.2 ఇస్తున్నట్లు ముంబై నగర మేయర్ సునీల్ ప్రభు వెల్లడించిన సంగతి తెలిసిందే.