బీడ్: ఇసుక మాఫియా, అక్రమ నిర్మాణాలపై కొరడా ఝళిపించిన జిల్లా కలెక్టర్ సునీల్ కేంద్రేకర్‌ను బదిలీ చేయడంపై ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని స్థానిక కార్యకర్తలు, రాజకీయ పార్టీలు శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చాయి. ఐఏఎస్ అధికారి సునీల్ బదిలీ అయ్యారన్న వార్త ఉదయం దావానంలా వ్యాపించడంతో అనేక మంది కలెక్టర్ కార్యాలయం ముందు చేరుకున్నారు.
ఈ వార్త నిజమేనని తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈ బదిలీని నిరసిస్తూ శివసేన యువజన విభాగ కార్యకర్తలు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. సునీల్‌ను పునర్నియమించాలనే డిమాండ్‌తో శివసేన, ఎమ్మెన్నెస్, బ్రాస్‌తచార్ విరోధి జనాందోళన్, ఇతర సంస్థలు శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చాయి. రాజకీయ ఒత్తిళ్లతోనే సునీల్‌ను బదిలీ చేశారని ఆర్‌టీఐ కార్యకర్త, అడ్వొకేట్ అజిత్ దేశ్‌ముఖ్ ఆరోపించారు. బీడ్ జిల్లా కలెక్టర్‌గా 17 నెలల కాలంలో అనధికారిక నిర్మాణాలు, నీటి ట్యాంకర్ మాఫియా, ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేశారని తెలిపారు. అయితే తన బదిలీపై వ్యాఖ్యలు చేసేందుకు అందుబాటులో లేని సునీల్‌ను ఔరంగాబాద్‌లోని సిడ్కో ప్రధాన పరిపాలన సంబంధ అధికారిగా బదిలీ చేశారు. అయితే బీడ్ జిల్లా కలెక్టర్‌గా యావత్మల్ డిస్ట్రిక్ జిల్లా పరిషత్ సీఈవో నవల్ కిశోర్ రామ్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
బీడ్ కలెక్టర్ బదిలీపై నిరసనలు
Published Fri, Nov 29 2013 2:22 AM | Last Updated on Sat, Sep 2 2017 1:04 AM
Advertisement