బీజేపీకి శివసేన కటీఫ్ చెబుతుంది | Shiv Sena May Pull Out Of Maharashtra Government Before Civic Polls: Prithviraj Chavan | Sakshi
Sakshi News home page

బీజేపీకి శివసేన కటీఫ్ చెబుతుంది

Published Sun, Jun 26 2016 9:36 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

బీజేపీకి శివసేన కటీఫ్ చెబుతుంది - Sakshi

బీజేపీకి శివసేన కటీఫ్ చెబుతుంది

పుణె: బీజేపీతో మిత్రబంధాన్ని శివసేన తెగదెంపులు చేసుకోవచ్చని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పృథ్వీరాజ్ చవాన్ అన్నారు. వచ్చే ఏడాది జరిగే మున్సిపల్ ఎన్నికల లోపు మహారాష్ట్రలో బీజేపీ కూటమి ప్రభుత్వానికి శివసేన మద్దతు ఉపసంహరించుకుంటుందని చెప్పారు.

మహారాష్ట్రలో బీజేపీ, శివసేన కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ముంబై నగరపాలక సంస్థతో పాటు మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయని, ఈ లోగా బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం నుంచి శివసేన వైదొలుగుతుందని చవాన్ పేర్కొన్నారు. శివసేన మద్దతు ఉపసంహరించుకుంటే బీజేపీ ప్రభుత్వం మైనార్టీలో పడుతుందని, అప్పుడు రాజకీయ పరిణామాలు మారుతాయని అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement