మోడల్పై అత్యాచారం :డీఐజీపై సస్పెన్షన్ వేటు! | Maharashtra Home Dept proposes rape accused Paraskar's suspension | Sakshi
Sakshi News home page

మోడల్పై అత్యాచారం :డీఐజీపై సస్పెన్షన్ వేటు!

Published Tue, Aug 26 2014 1:19 PM | Last Updated on Sat, Sep 2 2017 12:29 PM

మోడల్పై అత్యాచారం :డీఐజీపై సస్పెన్షన్ వేటు!

మోడల్పై అత్యాచారం :డీఐజీపై సస్పెన్షన్ వేటు!

ముంబయి: మోడల్పై అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఐజీ సునీల్ పరాస్కర్కు ఊచ్చు బిగుసుకుంటుంది. సునీల్ను విధులు నుంచి తొలగించేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. అందుకు సంబంధించిన ఫైల్ ఇప్పటికే మహారాష్ట్ర సీఎం పృధ్వీరాజ్ చవన్ వద్దకు చేరింది. ఈ మేరకు ఆ రాష్ట్ర హోంశాఖ ఉన్నతాధికారి మంగళవారం ముంబైలో వెల్లడించారు. ఆయనకు ఇప్పటికే ఆయనకు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. గత నెల 25న ఆయన ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.

ముంబై మాజీ అదనపు నగర కమిషనర్, సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ పరాస్కర్(57) ... 2012లో ఓ కేసు విచారణకు సంబంధించి తాను పరాస్కర్‌ను కలిసినప్పుడు తనకు సన్నిహితంగా ఉన్న పరాస్కర్ లైంగిక వేధింపులకు, అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు  మలవానీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బాధితురాలు ముంబై పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియాను కలసి పరాస్కర్‌పై ఫిర్యాదు చేసింది.  మరోవైపు పరాస్కర్‌పై ఆరోపణలకు సంబంధించి నివేదిక సమర్పించాలని కేంద్ర హోంశాఖ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సునీల్ను విధుల నుంచి తప్పించాలని మహిళ సంఘాలు డిమాండ్ చేయడంతో  మహారాష్ట్ర సర్కార్ సునీల్పై చర్యలకు ఉపక్రమించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement