సాక్షి, ముంబై: మహారాష్ట్ర కాంగ్రెస్‌లో భారీమార్పులు చేయాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తోంది. ఫలితాలకు ముందు లేదా ఫలితాల తర్వాత రాష్ట్ర కాంగ్రెస్‌లో అనేక మార్పులు జరగనున్నాయని తెలిసింది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌పై వేటు పడే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయి. ఓ వైపు లోకసభ ఎన్నికల్లో ఘోరపరాజయం.. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వెనకబడిపోయామని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
దీంతోపాటు పృథ్వీరాజ్‌చవాన్ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో ఆదర్శ్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులపై చేసిన వ్యాఖ్యలు కూడా ఆయనకు తీవ్ర తలనొప్పులు తీసుకువచ్చాయి. అలాగే రాష్ట్రంలోని పార్టీకి సంబంధించిన ఇతర కార్యవర్గాలను కూడా మార్చి నూతన కార్యవర్గాలను నియమించేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ముహూర్తం ఎప్పుడనేది ఇంకా నిర్ణయం కాలేదు.
కాంగ్రెస్‌లో భారీ ప్రక్షాళన?
Published Fri, Oct 17 2014 10:43 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement