
'సోషల్ మీడియాలో ప్రచారం చేయండి'
నాగపూర్: రాజకీయ నాయకులు సోషల్ మీడియా మంత్రం జపిస్తున్నారు. తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చవాన్ కూడా సోషల్ మీడియా ప్రాముఖ్యతను గుర్తించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సామాజిక సంబంధాల వెబ్సైట్లను వాడాలని పార్టీ కార్యకర్తలకు ఆయన సూచించారు.
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సామాజిక మీడియాను సమర్థవంతంగా వాడాలని పిలుపునిచ్చారు. మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ టెక్నాలజీని మనదేశంలోకి తెచ్చిన ఘనత రాజీవ్ గాంధీకి చెందినప్పటికీ వాటిని వినియోగించడంలో కాంగ్రెస్ పార్టీ వెనుకబడిందని చవాన్ అన్నారు.