ముంబై: నేడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్. సమయం దొరికితే చాలు సెల్ఫీ దిగాల్సిందే. ఇదీ ప్రస్తుత సమాజంలోని యువత పరిస్థితి. తాజాగా ఓ యువతి తల్లితో కలిసి ఓ సెల్ఫీ తీసుకుంది. కానీ ఆ ఫొటో పులి పై తాను సాధించిన విజయానికి గుర్తు. వివరాలివి.. మహారాష్ట్రకు చెందిన రూపాలి మేష్రామ్(23) తన ఇంటి ఆవరణంలో మేకలు గట్టిగా అరవటాన్ని గమనించింది. వెంటనే బయటకు వచ్చి చూస్తే.. తన మేకల గుంపుపై ఓ పులి దాడి చేయటాని చూసింది.
ఆ యువతి వెంటనే ఓ కర్ర తీసుకుని పులిపై దాడికి దిగింది. ఆ సమయంలో పులి యువతిపై దాడి చేయడంతో ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన రూపాలి తల్లి బిడ్డను ఇంట్లోకి లాక్కెల్లింది. దీంతో స్థానిక ప్రజలు కేకలు వేయడంతో పులి పారిపోయింది. పులిదాడిలో గాయపడిన రూపాలి అవేమి లెక్క చేయకుండా.. విజయానందంతో తల్లితో కలిసి సెల్ఫీ దిగింది. అనంతరం రూపాలి ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంది.
అయితే తన తల్లితో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ ఫొటో వైరల్‌గా మారింది. ఆమె దైర్యానికి నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment