మోహన్ బాబును పరామర్శించిన చెవిరెడ్డి  | Chevireddy Bhaskar Reddy Condolensed Mohan Babu | Sakshi
Sakshi News home page

Published Sun, Sep 30 2018 1:27 PM | Last Updated on Sun, Sep 30 2018 1:31 PM

Chevireddy Bhaskar Reddy Condolensed Mohan Babu - Sakshi

సాక్షి, చిత్తూరు : సినీ నటుడు మోహన్‌ బాబు తల్లి లక్ష్మమ్మ పెద్దకర్మ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిసిన అనంతరం ఆమె చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మోహన్‌ బాబు తల్లి ప్రేమ గొప్పదనాన్ని చాటి చెబుతూ.. సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ చేశారు. ‘మనిషికి జన్మనిచ్చింది భగవంతుడు అంటారు. కానీ మనకు ఊపిరి పోసింది అమ్మకదా! తొమ్మిది నెలలు నెత్తురు గుడ్డును కడుపులో మోసి, కదలికలోనే బిడ్డబాధను, ఆకలిని తెలుసుకుని, ఆర్తిని తీర్చి, పురిటినొప్పులను భరించి, తాను మళ్ళీ జన్మిస్తూ... మనకు జన్మనిచ్చి, పాలిచ్చి, లాలించి, జోలపాడి, గుండెలను పాన్పుచేసి, నిద్రపుచ్చి, తప్పటడుగులు సరిదిద్ది, నడకనేర్పి, నడతనేర్పి, అక్షరందిద్దించి, అక్షరజ్ఞ్యానం నేర్పించి, చెట్టంత ఎదిగిన బిడ్డను చిరునవ్వుతో దీవించే అమ్మను మించిన దైవంలేదు.’ అంటూ ట్వీట్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement