ఓట్ల తొలగింపు వ్యవహారంపై ఈసీకి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. సీఈఓ గోపాలకృష్ణ ద్వివేదిని కలిసిన చెవిరెడ్డి, చంద్రగిరిలో ఓట్లను తొలగించేందుకు అనుసరిస్తున్న కుట్రలను వివరించారు. ఓటర్ల తొలగింపు ఆదేశాల టెలికాన్ఫరెన్సు ఆడియో ఆధారాలను స్వయంగా చెవిరెడ్డి అందించారు.