సాక్షి, చిత్తూరు : ముఖ్యమంత్రి చంద్రబాబుకు కోసం పోలీసు వ్యవస్థ దిగజారి వ్యవహరిస్తోందని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. సర్వే చేస్తున్న వారిని వదిలిపెట్టి, వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించిన తమ నేతలపై కేసులు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోలీసలు అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఒక శాసన సభ్యుడు అని చూడకుండా అతన్ని ఇబ్బంది పెట్టారన్నారు. చెవిరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పలేదన్నారు. తమ పార్టీని నేరుగా ఎదుర్కొలేక చంద్రబాబు ఓట్లు తీసే కార్యక్రమం చేపట్టారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును వినియోగించుకునే వీలు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర పోలీసు వ్యవస్థ చంద్రబాబుకు అండగా పనిచేస్తుందని ఆరోపించారు. చంద్రబాబు అండతోనే చింతమనేని రెచ్చిపోతున్నారన్నారు. దళితులను దూషించిన చింతమనేనిపై పోలీసులు ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం దారుణమాన్నారు. (సీఎం సొంత జిల్లాలో పోలీసుల అరాచకం)
చంద్రబాబు, పవన్ కల్యాణ్ ముసుగు రాజకీయాలు
తమ పార్టీకి ఒంటరిగా పోటీ దమ్ముందని, చంద్రబాబులాగా అన్ని పార్టీలతో కలిసి పోటీ చేయమని పెద్దిరెడ్డి అన్నారు. ‘ముసుగు రాజకీయాలంటూ చంద్రబాబు దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. మేము ఎవరితో కలిసి పోటీ చేయం. అనేక పార్టీలతో కలిసి పోటీ చేసిన చరిత్ర చంద్రబాబుది. బీజేపీతో, టీఆర్‌ఎస్, లెఫ్ట్ పార్టీలు, పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ ఇలా అనేక పార్టీలతో కలిసిన చరిత్ర చంద్రబాబుది. ముసుగు రాజకీయాలు చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. బీజేపీతో చంద్రబాబుకు ఇప్పటికీ లోపాయకారి ఒప్పందం ఉంది. టీడీపీ, జనసేన ఇప్పటికి ఒక్కటే. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ముసుగు రాజకీయాలు చేస్తున్నారు. ఒక్క మనిషికి 100 ముసుగులు ఉంటే.. ఆ మనిషి చంద్రబాబే అవుతారు’ అని ఎద్దేవా చేశారు. అవకాశ రాజకీయాలు చేయడంలో చంద్రబాబును మించిన నాయకులు లేరన్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమన్నారు. (ముసుగులో సర్దుబాట్లు!)
Comments
Please login to add a commentAdd a comment