రామచంద్రాపురం మండలం సి.రామాపురం గ్రామంలో డంపింగ్ యార్డ్ వద్దంటూ గ్రామస్థులు రాస్తారాకో నిర్వహించారు.
రామచంద్రాపురం: రామచంద్రాపురం మండలం సి.రామాపురం గ్రామంలో డంపింగ్ యార్డ్ వద్దంటూ గ్రామస్థులు రాస్తారాకో నిర్వహించారు. వీరికి చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మద్దతు పలికారు. రోడ్డుపై వేసిన చెత్తను గ్రామస్థులు, ఎమ్మెల్యే చెవిరెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. డంపింగ్ యార్డ్ ఇక్కడి నుంచి తరలించే వరకు ఆందోళన విరమించేది లేదన్నారు. అనంతరం పలువురు గ్రామస్థులు మాట్లాడుతూ తిరుపతి చెత్త మాకొద్దని, మా గ్రామానికి చెత్త తీసుకొస్తె సహించేది లేదని స్పష్టం చేశారు.