
జైలుకు పంపి.. ఏ మొహం పెట్టుకుని వచ్చారు?
సీరామాపురం(తిరుపతి రూరల్): ‘‘పచ్చని పల్లెల్లో అధికారులే చిచ్చు పెడుతున్నారు..అతి తెలివితో సమస్యను జఠిలం చేశారు.. ఊరినంతా రోడ్డుపైకి తీసుకువచ్చారు.. అర్ధరాత్రి ఇళ్లలోకి దూరి చిన్నా, పెద్ద, మహిళలు అనే తేడా లేకుండా అందరినీ జైలుకు పంపారు.. మా వారిని జైలుకు పంపి ఏ మొహం పెట్టుకుని ఊర్లోకి వచ్చా రు..’’ అంటూ రామాపురం డంపింగ్ యార్డు బాధిత గ్రామాల ప్రజలు కలెక్టర్ ప్రద్యుమ్నను నిలదీశారు. ‘మీరు ఏం చెప్పాలన్నా మాకోసం జైలుకు వెళ్లిన ఎమ్మెల్యే చెవిరెడ్డితో పాటు మావాళ్లు వచ్చాకే ఊర్లోకి వచ్చి చెప్పండి.. అప్పటి వరకు మీరు చెప్పేది మేం వినేది లేదు’ అంటూ అధికారుల ప్రసంగాలను అడ్డుకున్నా రు. డంపింగ్ యార్డును తొలగించాల ని, అక్రమంగా అరెస్ట్ చేసిన ఎమ్మెల్యే చెవిరెడ్డిని, గ్రామస్తులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రామాపు రం గ్రామానికి చెందిన మహిళలు రెండు రోజులుగా రిలే నిరాహారదీక్షలను చేపట్టి చెత్త వాహనాలను అడ్డుకుంటున్నారు.
144 సెక్షన్ పెట్టినా బెదరకుండా ర్యాలీలు, దీక్షలను కొనసాగిస్తున్నారు. మహిళల దీక్షతో కలెక్టర్ ప్రద్యుమ్న, చిత్తూరు ఎంపీ డాక్టర్ శివప్రసాద్, కార్పొరేషన్ కమిషనర్ హరికిరణ్, మాజీ ఎమ్మెల్యే అరుణకుమారి ఆదివారం మధ్యాహ్నం దీక్ష శిబి రం వద్దకు వచ్చారు. గ్రామస్తులతో చర్చలు జరిపేందుకు ప్రయత్నించా రు. వారిని మహిళలు అడ్డుకున్నారు. జైలులో పెట్టినా కనీసం ఎందుకు పరామర్శించలేదని గల్లా అరుణకుమారిని రామాపురం మహిళలు నిలదీశారు. గ్రామంలో కలెక్టర్‌ను నడిపిం చారు. భూగర్భజలాలు కాలుష్యమయ్యాయని, బోరు కొట్టి రంగుమారిన నీళ్లను బాటిళ్లలో పట్టి మరీ చూపించారు. ‘ఈ నీళ్లు మీరు తాగండి’ అంటూ కలెక్టర్‌కు ఇచ్చారు.
కమిషనర్ వల్లే సమస్య..
తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ వల్లే గ్రామం మొత్తం రోడ్డు ఎక్కాల్సి వచ్చిం దని డంపింగ్ యార్డు బాధిత గ్రామాల ప్రజలు మండిపడ్డారు. కమిషనర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దొంగచాటుగా సమావేశాలు నిర్వహించాల్సిన అవస రం ఎందుకువచ్చిందని నిలదీశారు. కొ ద్దిసేపు అక్కడ గందరగోళం నెలకొంది.
మాట తప్పితే మీతోపాటే వచ్చి ఉద్యమిస్తా: ఎంపీ శివప్రసాద్
‘గ్రామంలో ప్లాంటు ఏర్పాటును నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. కాదు కూడదని ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తే మీతో పాటే రోడ్డు ఎక్కుతా. మీ గొంతుకగా నిలుస్తానని’ చిత్తూరు ఎంపీ డాక్టర్ శివప్రసాద్ గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ‘అఖిలపక్షం పేరుతో తిరుపతిలో చేసిన నాటకాలు నాకుతెలియవు, నన్ను నమ్మం డి’ అంటూ గ్రామస్తులను కోరారు.
పవర్ లేదు : అరుణకుమారి
‘నేను మంత్రిగా ఉన్నప్పుడే సమస్య మొ దలైంది. మూడు నెలల్లో పరిష్కరిస్తామన్న అధికారులు పట్టించుకోలేదు. ఇప్పు డు నా దగ్గర పవర్ లేదు. ఇప్పటికిప్పుడు సమస్యను పరిష్కరించాలంటే ఎలా..? హాంఫట్ అంటే సమస్య పరిష్కరం కా దు’.. అంటూ మాజీ ఎమ్మెల్యే అరుణకుమారి గ్రామస్తులపై మండిపడ్డారు. కమిషనర్‌ను గ్రామస్తులు వ్యతిరేస్తుంటే ఆమె మాత్రం బాగా కష్టపడుతున్నాడు అంటూ పొగడ్త్తలతో ముంచెత్తారు. దీంతో గ్రామస్తులు మండిపడ్డారు.