పట్టాలు ఇచ్చేంత వరకు మంగళంను వదిలిరాను | Chevireddy Bhaskara Reddy Fight For Mangalam Village Chittoor | Sakshi
Sakshi News home page

పట్టాలు ఇచ్చేంత వరకు మంగళంను వదిలిరాను

Published Mon, Sep 3 2018 9:52 AM | Last Updated on Mon, Sep 3 2018 9:52 AM

Chevireddy Bhaskara Reddy Fight For Mangalam Village Chittoor - Sakshi

తిరుపతి రూరల్‌: మంగళం గ్రామంలోని అర్హులైన పేదలకు పట్టాలు ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని, వారికి పట్టాలు ఇచ్చేంతవరకు గ్రామంలోనే ఉండి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టాలు ఇచ్చేం తవరకు మంగళం గ్రామం వదిలిరానని స్పష్టం చేశారు. ఆ మేరకు సోమవారం నుంచి శెట్టిపల్లి పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రకటించారు. ఆది వారం సాయంత్రం ఆయన తుమ్మలగుంటలోవిలేకరులతో మాట్లాడారు. ఇళ్లు నిర్మించుకుని ఏళ్ల తరబడి కాపురాలు ఉంటున్నా ఇంటి పట్టాలు లేక పేదలు అల్లాడుతున్నారని పేర్కొన్నారు. పట్టాలు లేకపోవడం వల్ల ఆ స్థలాలకు లోన్లు రాక, ఏదైనా కష్టకాలంలో, అనారోగ్యం, పిల్లల పెళ్లిళ్లు వంటి కార్యక్రమాల సందర్భంలో వాటిని అమ్ముకోలేక పేదలు అష్టకష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా చేసిన పోరాటాల ఫలితంగా పట్టాలు ఇవ్వడంలో కొంత కదలిక వచ్చిందన్నారు. మంజూరైన పట్టాలు సైతం ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని మండిపడ్డారు. అధికారులు దిగివచ్చి లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చేంతవరకు స్థానిక ప్రజలతో కలిసి పార్టీలకు అతీతంగా పోరాటం చేస్తామని ప్రకటించారు.

నేడు పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళన
మంగళంలోని పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వాలనే డిమాండ్‌తో సోమవారం నుంచి వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే చెవిరెడ్డి ప్రకటించారు. అందులోభాగంగా సోమవారం శెట్టిపల్లి పంచాయతీ కా>ర్యాలయం ఎదుట ధర్నా చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పేదలకు ఇంటిపట్టాలు చేరేంతవరకు పార్టీలకు అతీతంగా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement