mangalam
-
చిత్తూరులో రూ.250 కోట్లతో.. అమరరాజా కొత్త ప్లాంట్
సాక్షి, అమరావతి : చిత్తూరు జిల్లా తేనిపల్లి వద్ద రూ.250 కోట్లతో కొత్త తయారీ యూనిట్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు అమరరాజా గ్రూపు ప్రకటించింది. అమరరాజా గ్రూపునకు చెందిన మంగళం ఇండస్ట్రీస్ 2.15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆటో బ్యాటరీ విడిభాగాల తయారీ యూనిట్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ యూనిట్ ద్వారా దేశంలోని ప్రముఖ కంపెనీలకు సరఫరా చేసేలా ఆటో విడిభాగాలు, మెటల్ ఫాబ్రికేషన్, బ్యాటరీ విడిభాగాలను డిజైన్ చేసి సరఫరా చేయనున్నట్లు పేర్కొంది. ఇక ఈ ప్రాంతంలో తమ వ్యాపార విస్తరణకు కట్టుబడి ఉన్నట్లు కూడా అమరరాజా గ్రూపు సహ వ్యవస్థాపకుడు జయదేవ్ గల్లా ఆ ప్రకటనలో స్పష్టంచేశారు. స్థానికులకు ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని, రానున్న కాలంలో ఈ కొత్త యూనిట్ ఏర్పాటు ద్వారా మరో 1,000 మంది స్థానికులకు ఉపాధి కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. అమరరాజా గ్రూపు 15,000 మందికి ఉపాధి కల్పిస్తుండగా అందులో మంగళం గ్రూపు 3,000 మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు. ఇంధన పరికరాల ఉత్పత్తిపై దృష్టి మరోవైపు.. సుస్థిర ఇంధన అవకాశాలపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నామని, ఇందులో భాగంగా సౌర విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన పరికరాల ఉత్పత్తిపై దృష్టిసారిస్తున్నట్లు మంగళం ఇండస్ట్రీస్ డైరెక్టర్ హర్షవర్థన్ గోగినేని కూడా ఆ ప్రకటనలో తెలిపారు. ఈ కొత్త ప్లాంట్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే నిర్మాణ పనులను ప్రారంభిస్తామన్నారు. (చదవండి: రాష్ట్రంలో తొలి టెన్నిస్ అకాడమీ) -
ఫలించిన చెవిరెడ్డి పోరాటం
తిరుపతి రూరల్/మంగళం: చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పోరాటంతో మంగళం వాసుల ఏళ్ల తరబడి ఎదురుచూపులకు ఫలితం దక్కింది. లబ్ధిదారులకు ఇవ్వకుండా రెవెన్యూ కా ర్యాలయాలకే పరిమితం అయిన ఇంటి పట్టాలు... ఎమ్మెల్యే దీక్షతో ఇంటికే వచ్చి లబ్ధిదారుల చేతుల్లో వాలాయి. పార్టీలకు అతీతంగా పోరాడి సాధించుకున్న ఇంటి పట్టాలను చేతపట్టుకుని తమ కోసం మెతుకు కూడా ముట్టకుండా రోజుల తరబడి పోరాడిన ఎమ్మెల్యే చెవిరెడ్డికి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన చేతుల మీదుగా పట్టాలు అందుకుని త మ అభిమానాన్ని చాటుకున్నారు. లబ్ధిదా రులు, మహిళలు ఎమ్మెల్యే చేత నిమ్మరసం తాగించి దీక్షను విరమింప చేశారు. రాజకీయాలకు అతీతంగా చేసిన పోరా టం విజయవంతం అయిందని, వందలా ది మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలు ఇవ్వడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే చెవిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 743 పట్టాలు పంపిణీ... మంగళం వాసులకు మంజూరైన 786 ఇంటి పట్టాలు ఇవ్వడంలో రెవెన్యూఅధికారులు చూపుతున్న నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సోమవారం నిరాహారదీక్షకు దిగారు. లబ్ధిదా రుల ఇంటికి వచ్చి పట్టాలు ఇచ్చేంత వరకు తాను దీక్ష విరమించేది లేదని భీష్మించుకున్నారు. మంగళం పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో ఆయన దీక్షకు దిగడంతో రెవెన్యూ అధికారుల్లో అలజడి మొదలైంది. అర్బన్ తహసీల్దార్ చంద్రమోహన్, ఆర్ఐలు ప్రేమ్‌కుమార్, రామచంద్ర 14 మంది గ్రామ రెవెన్యూ అధికారులతో పట్టాల పంపిణీని ప్రారంభించారు. మూడు బృందాలుగా వారు మంగళవారం సాయంత్రానికి 743 పట్టాలను పంపిణీ చేశారు. మరో 43 మంది లబ్ధిదారులు వివిధ కారణాల వల్ల అందుబాటులో లేరని, వారికి బుధవారం అందిస్తామని తహసీల్దార్ చంద్రమోహన్ తెలిపారు. ఇంటి ఇంటికి వెళ్లి పంపిణీ.... అందరినీ ఒకచోటకు పిలిపించి పట్టాలు ఇవ్వాలని రెవెన్యూ అధికారులు ప్రయత్నించారు. కానీ లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించడంతో రెవెన్యూ అధికారులు 743 ఇళ్లకు వెళ్లి ఇంటి వద్దే లబ్ధిదారులకు పట్టాలను అందించారు. జీవితాంతం రుణపడి ఉంటాం... తమ ఇంటి పట్టాల కోసం నిరాహార దీక్ష చేసిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామని మంగళం వాసులు పేర్కొన్నారు. తమ ఇంటి పట్టాలను చేతపట్టుకుని వచ్చి ఆయనకు చూపి తమ ఆనందాన్ని ఎమ్మెల్యేతో పంచుకున్నారు. ఏళ్ల తరబడి వేధిస్తున్న సమస్యను పోరాడి పరిష్కరించిన ఘనత చెవిరెడ్డికే దక్కిందని వారు కొనియాడారు. నిమ్మరసంతో దీక్ష విరమణ.. పట్టాలు తీసుకున్న అనంతరం మంగళం వాసులు పంచాయతీ కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అక్కడ తమకోసం దీక్ష కొనసాగిస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డికి పలువురు మహిళలు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. చెవిరెడ్డి సహకారంతోనే ఒక్క రూపాయి కూడా ఏ అధికారికీ, ఏ నాయకుడికీ చెల్లించకుండానే తమ జీవిత కల నెరవేరిందని పేర్కొన్నారు. తమకు అన్ని విధాలుగా అండగా నిలబడి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నిరాహార దీక్ష కొనసాగించిన ఎమ్మెల్యే మేలు ఈ జన్మలో మరిచిపోలేమని తెలిపారు. ఆయన పోరాట స్ఫూర్తికి బ్రహ్మరథం పట్టారు. ఈ సం దర్భంగా పట్టాలు అందుకున్న లబ్ధిదారులు, గ్రామస్తులు చెవిరెడ్డిని గజమాలలతో సత్కరించి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. శెట్టిపల్లి కోసం ఎంత త్యాగానికైనా సిద్ధం ఎమ్మెల్యే చెవిరెడ్డి పేద, మధ్య తరగతి ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంలో అధికారులు తీవ్ర జాప్యం చేయడంతో తాను నిరాహార దీక్ష చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఈ దీక్షలో అన్ని వర్గాల వారు పాల్గొనడంతో ఏళ్ల తరబడి ఉన్న సమస్యకు పరిష్కరం లభించిందన్నారు. ఎల్లప్పుడూ పేదలకు అండగా ఉంటామన్నారు. మంగళంలో నీటి ఎద్దడిని అరికట్టేం దుకు తాత్కాలికంగా మూడు ట్యాంకరు ట్రాక్ట ర్లు ఇస్తానని హామీ ఇచ్చారు. -
పట్టాలు ఇచ్చేంత వరకు మంగళంను వదిలిరాను
తిరుపతి రూరల్: మంగళం గ్రామంలోని అర్హులైన పేదలకు పట్టాలు ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని, వారికి పట్టాలు ఇచ్చేంతవరకు గ్రామంలోనే ఉండి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టాలు ఇచ్చేం తవరకు మంగళం గ్రామం వదిలిరానని స్పష్టం చేశారు. ఆ మేరకు సోమవారం నుంచి శెట్టిపల్లి పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రకటించారు. ఆది వారం సాయంత్రం ఆయన తుమ్మలగుంటలోవిలేకరులతో మాట్లాడారు. ఇళ్లు నిర్మించుకుని ఏళ్ల తరబడి కాపురాలు ఉంటున్నా ఇంటి పట్టాలు లేక పేదలు అల్లాడుతున్నారని పేర్కొన్నారు. పట్టాలు లేకపోవడం వల్ల ఆ స్థలాలకు లోన్లు రాక, ఏదైనా కష్టకాలంలో, అనారోగ్యం, పిల్లల పెళ్లిళ్లు వంటి కార్యక్రమాల సందర్భంలో వాటిని అమ్ముకోలేక పేదలు అష్టకష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా చేసిన పోరాటాల ఫలితంగా పట్టాలు ఇవ్వడంలో కొంత కదలిక వచ్చిందన్నారు. మంజూరైన పట్టాలు సైతం ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని మండిపడ్డారు. అధికారులు దిగివచ్చి లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చేంతవరకు స్థానిక ప్రజలతో కలిసి పార్టీలకు అతీతంగా పోరాటం చేస్తామని ప్రకటించారు. నేడు పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళన మంగళంలోని పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వాలనే డిమాండ్‌తో సోమవారం నుంచి వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే చెవిరెడ్డి ప్రకటించారు. అందులోభాగంగా సోమవారం శెట్టిపల్లి పంచాయతీ కా>ర్యాలయం ఎదుట ధర్నా చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పేదలకు ఇంటిపట్టాలు చేరేంతవరకు పార్టీలకు అతీతంగా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. -
సొరంగానికి మంగళం
–ప్రత్యామ్నాయంగా ఎత్తిపోతల పథకం –నిర్మాణ వ్యయం రూ.200కోట్ల అంచనా –నాలుగు నెలల్లో పూర్తిచేసేలా ప్రణాళిక –అవుకు అనుభవంతో తాజా నిర్ణయం హంద్రీ–నీవా రెండోదశ ప్రాజెక్టు ద్వారా రెండుజిల్లాలకు నీటిని అందించేందుకు అడ్డంకిగా మారుతున్న సొరంగం పనులను వదిలేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రెండుసార్లు టెండర్లు నిర్వహించినా∙కాంట్రాక్టర్ల నుంచి స్పందన లేకపోవడంతో కొత్తగా ఎత్తిపోతల పథకాన్ని తెరమీదకు తెచ్చింది. దీనిని నిర్మించే దిశగా ప్రభుత్వం ప్రణాళిక చేపట్టింది. సొరంగం పనులు చేపట్టినా మరిన్ని ఇబ్బందులు ఎదురైతే ఎదుర్కొవడం అటుంచితే కాలయాపన తప్పదన్న భావంతో ఎత్తిపోతల ప«థకానికి పథక రచన చేసింది. బి.కొత్తకోట: సొరంగం అడ్డంకిగా మారిని నేపథ్యంలో హంద్రీనీవా ప్రాజెక్టు ఉన్నతస్థాయి అధికారులు ప్రత్యామ్నాయ పథకం రూపొందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా ఇచ్చిన ఆదేశాలతో ఇందుకు ప్రత్యామ్నాయంగా ఎత్తిపోతల పథకానికి ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నారు. అంచనా అమాంతం పెరిగిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పెద్దమండ్యం మండలంలోని గొళ్లపల్లె నుంచి వైఎస్సార్‌కడపజిల్లా చిన్నమండ్యం మండలం కొటగడ్డకాలనీ వరకు ప్రధానకాలువలో భాగంగా 5.1కిలోమీటర్ల సొరంగ మార్గంలో కష్టతరమైన 2.1కిలోమీటర్ల పనికి మొదటిసారి నిర్వహించిన టెండర్లకు మ్యాక్స్ ఇన్ఫ్రా ఒక్కటే టెండర్ వేయడం దాన్ని ప్రభుత్వం రద్దు చేయడం జరగ్గా, రెండోసారి టెండర్లకు ఒక్కరూ పాల్గొనలేదు. కర్నూలుజిల్లాలో అవుకు సొరంగం పనుల అనుభవంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం. అవుకులో ఇప్పటికీ 140మీటర్ల సొరంగం పనులు చేయలేని స్థితిలో ఉన్నారు. అక్కడి పరిస్థితే ఇక్కడి టన్నల్‌లో కనిపిస్తున్న కారణంగానే ఎత్తిపోతల ప£ý కంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. రూ.200కోట్ల అంచనాతో ఎత్తిపోతలు ప్రధానకాలువపై 506 కిలో మీటరు నుంచి 511 కిలోమీటరు మధ్యలో 5.1సొరంగం పనులు చేయాలి. ఇందులో సమస్యాత్మకంగా మారిన సొరంగం పని 506కిమీ వద్ద ప్రారంభౖమవుతుంది. ఇక్కడినుంచి 2.1కిలోమీటర్ల పనులు చేయాలి. దీనికి ప్రత్యామ్నాయంగా 506కిమీ వద్ద ఒక ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తారు. ఇక్కడ భూమి సముద్రమట్టానికి 30మీటర్ల ఎత్తుంది. ఎత్తిపోతల పథకం నుంచి 508.5కిలోమీటరు వరకు 2.5 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మాణం ప్రారంభమై 511కిలోమీటరు వద్ద ఇప్పటికే పూర్తయిన కాలువలో పైప్‌లైన్ కలుస్తుంది. ఈ కాలువనుంచి నీరు వైఎస్సార్‌జిల్లాలోని శ్రీనివాసపురం, జిల్లాలోని అడవిపల్లె రిజర్వాయర్లకు వెళ్తుంది. ఈ పనిచేపట్టేందుకు తాత్కాలిక అంచనా ప్రకారంరూ.200కోట్లు అవుతుందని నిర్ణయించారు. మోటార్లు, పంపులు, ౖపైప్‌లైన్ పనులు, మట్టి, కాంక్రీట్ పనులు కలుపుకొని అంచనాలు తయారుచేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. జనవరిలోగా పూర్తిచేసేలా .. వచ్చే జనవరి నాటికి ఎత్తిపోతల పథకం సిద్ధం చేయాలన్నది ప్రభుత్వ నిర్ణయం. భవన నిర్మాణ పనులు పూర్తిచేస్తే మోటార్ల విషయంలో అదనంగా అందుబాటులోని వాటిని వినియోగించుకోవచ్చని ఆలోచన. ప్రధాన కాలువపైనున్న ఎం–1, ఎం–2, ఎం–3 ఎత్తిపోతల పథకాలకు అదనపు మోటార్లున్నాయి, వీటిలో ఒక్కొక్కటి చొప్పున మూడింటిని తీసుకొచ్చి పెద్దమండ్యం ఎత్తిపోతల పథకానికి అమర్చి నీటిని ఎత్తిపోయాలని చూస్తోంది. అంచనాల ప్రతిపాదన, ప్రభుత్వ ఆమోదం, టెండర్ల నిర్వహణ చర్యలను వేగవంతం అయ్యేలా చూస్తున్నారు. రూ.28కోట్ల నుంచి పెరుగుతూ.. వాస్తవంగా 20ప్యాకేజీలోని 5.1కిలోమీటర్ల సొరంగ మార్గం తవ్వేందుకు 2006లో రూ.47.57కోట్లతో ఎకేఆర్కోస్టల్కు అప్పగించారు. ఈ కంపెనీ రూ.18.97కోట్ల విలువైన 630మీటర్ల సొరంగం పనులతో చేతులుదులుపుకొంది. మిగిలిన రూ.28.6కోట్ల పనులను 20ఎ ప్యాకేజీగా 2015లో ఆర్‌కేఇన్‌ఫ్రా సంస్థకు ఒప్పంద విలువతో అప్పగించగా రూ.3.6కోట్ల విలువైన 800మీటర్ల సొరంగం పనులుచేసి వదిలేసింది. మిగిలిన 3.5కిలోమీటర్ల సొరంగం పనుల్లో 2.1కిలోమీటర్ల పనులను 20బీ ప్యాకే జి కింద రూ.16.77కోట్ల పనికి రూ.70.82కోట్లకు పెంచి టెండర్లు నిర్వహించినా కాంట్రాక్టర్లు ముందుకురాలేదు.