పెద్దమండ్యం మండలంలోని ఈ సొరంగం పనులు ఇక లేనట్టే
సొరంగానికి మంగళం
Published Sat, Sep 3 2016 11:32 PM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM
–ప్రత్యామ్నాయంగా ఎత్తిపోతల పథకం
–నిర్మాణ వ్యయం రూ.200కోట్ల అంచనా
–నాలుగు నెలల్లో పూర్తిచేసేలా ప్రణాళిక
–అవుకు అనుభవంతో తాజా నిర్ణయం
హంద్రీ–నీవా రెండోదశ ప్రాజెక్టు ద్వారా రెండుజిల్లాలకు నీటిని అందించేందుకు అడ్డంకిగా మారుతున్న సొరంగం పనులను వదిలేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రెండుసార్లు టెండర్లు నిర్వహించినా∙కాంట్రాక్టర్ల నుంచి స్పందన లేకపోవడంతో కొత్తగా ఎత్తిపోతల పథకాన్ని తెరమీదకు తెచ్చింది. దీనిని నిర్మించే దిశగా ప్రభుత్వం ప్రణాళిక చేపట్టింది. సొరంగం పనులు చేపట్టినా మరిన్ని ఇబ్బందులు ఎదురైతే ఎదుర్కొవడం అటుంచితే కాలయాపన తప్పదన్న భావంతో ఎత్తిపోతల ప«థకానికి పథక రచన చేసింది.
బి.కొత్తకోట: సొరంగం అడ్డంకిగా మారిని నేపథ్యంలో హంద్రీనీవా ప్రాజెక్టు ఉన్నతస్థాయి అధికారులు ప్రత్యామ్నాయ పథకం రూపొందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా ఇచ్చిన ఆదేశాలతో ఇందుకు ప్రత్యామ్నాయంగా ఎత్తిపోతల పథకానికి ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నారు. అంచనా అమాంతం పెరిగిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పెద్దమండ్యం మండలంలోని గొళ్లపల్లె నుంచి వైఎస్సార్‌కడపజిల్లా చిన్నమండ్యం మండలం కొటగడ్డకాలనీ వరకు ప్రధానకాలువలో భాగంగా 5.1కిలోమీటర్ల సొరంగ మార్గంలో కష్టతరమైన 2.1కిలోమీటర్ల పనికి మొదటిసారి నిర్వహించిన టెండర్లకు మ్యాక్స్ ఇన్‌ఫ్రా ఒక్కటే టెండర్ వేయడం దాన్ని ప్రభుత్వం రద్దు చేయడం జరగ్గా, రెండోసారి టెండర్లకు ఒక్కరూ పాల్గొనలేదు. కర్నూలుజిల్లాలో అవుకు సొరంగం పనుల అనుభవంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం. అవుకులో ఇప్పటికీ 140మీటర్ల సొరంగం పనులు చేయలేని స్థితిలో ఉన్నారు. అక్కడి పరిస్థితే ఇక్కడి టన్నల్‌లో కనిపిస్తున్న కారణంగానే ఎత్తిపోతల ప£ý కంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది.
రూ.200కోట్ల అంచనాతో ఎత్తిపోతలు
ప్రధానకాలువపై 506 కిలో మీటరు నుంచి 511 కిలోమీటరు మధ్యలో 5.1సొరంగం పనులు చేయాలి. ఇందులో సమస్యాత్మకంగా మారిన సొరంగం పని 506కిమీ వద్ద ప్రారంభౖమవుతుంది. ఇక్కడినుంచి 2.1కిలోమీటర్ల పనులు చేయాలి. దీనికి ప్రత్యామ్నాయంగా 506కిమీ వద్ద ఒక ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తారు. ఇక్కడ భూమి సముద్రమట్టానికి 30మీటర్ల ఎత్తుంది. ఎత్తిపోతల పథకం నుంచి 508.5కిలోమీటరు వరకు 2.5 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మాణం ప్రారంభమై 511కిలోమీటరు వద్ద ఇప్పటికే పూర్తయిన కాలువలో పైప్‌లైన్ కలుస్తుంది. ఈ కాలువనుంచి నీరు వైఎస్సార్‌జిల్లాలోని శ్రీనివాసపురం, జిల్లాలోని అడవిపల్లె రిజర్వాయర్లకు వెళ్తుంది. ఈ పనిచేపట్టేందుకు తాత్కాలిక అంచనా ప్రకారంరూ.200కోట్లు అవుతుందని నిర్ణయించారు. మోటార్లు, పంపులు, ౖపైప్‌లైన్ పనులు, మట్టి, కాంక్రీట్ పనులు కలుపుకొని అంచనాలు తయారుచేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
జనవరిలోగా పూర్తిచేసేలా ..
వచ్చే జనవరి నాటికి ఎత్తిపోతల పథకం సిద్ధం చేయాలన్నది ప్రభుత్వ నిర్ణయం. భవన నిర్మాణ పనులు పూర్తిచేస్తే మోటార్ల విషయంలో అదనంగా అందుబాటులోని వాటిని వినియోగించుకోవచ్చని ఆలోచన. ప్రధాన కాలువపైనున్న ఎం–1, ఎం–2, ఎం–3 ఎత్తిపోతల పథకాలకు అదనపు మోటార్లున్నాయి, వీటిలో ఒక్కొక్కటి చొప్పున మూడింటిని తీసుకొచ్చి పెద్దమండ్యం ఎత్తిపోతల పథకానికి అమర్చి నీటిని ఎత్తిపోయాలని చూస్తోంది. అంచనాల ప్రతిపాదన, ప్రభుత్వ ఆమోదం, టెండర్ల నిర్వహణ చర్యలను వేగవంతం అయ్యేలా చూస్తున్నారు.
రూ.28కోట్ల నుంచి పెరుగుతూ..
వాస్తవంగా 20ప్యాకేజీలోని 5.1కిలోమీటర్ల సొరంగ మార్గం తవ్వేందుకు 2006లో రూ.47.57కోట్లతో ఎకేఆర్‌కోస్టల్‌కు అప్పగించారు. ఈ కంపెనీ రూ.18.97కోట్ల విలువైన 630మీటర్ల సొరంగం పనులతో చేతులుదులుపుకొంది. మిగిలిన రూ.28.6కోట్ల పనులను 20ఎ ప్యాకేజీగా 2015లో ఆర్‌కేఇన్‌ఫ్రా సంస్థకు ఒప్పంద విలువతో అప్పగించగా రూ.3.6కోట్ల విలువైన 800మీటర్ల సొరంగం పనులుచేసి వదిలేసింది. మిగిలిన 3.5కిలోమీటర్ల సొరంగం పనుల్లో 2.1కిలోమీటర్ల పనులను 20బీ ప్యాకే జి కింద రూ.16.77కోట్ల పనికి రూ.70.82కోట్లకు పెంచి టెండర్లు నిర్వహించినా కాంట్రాక్టర్లు ముందుకురాలేదు.
Advertisement
Advertisement