
సాక్షి, అమరావతి : టీడీపీ పాలనలో రోజురోజుకు అరాచకాలు పెరిగిపోతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి ఆరోపించారు. చంద్రగిరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని తుద ముట్టించడానికి టీడీపీ నేతలు కుట్ర పన్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే ఇంటి వద్ద ఇద్దరి చేత రెక్కీ నిర్వహించడం దారుణమన్నారు. సుపారీ చెల్లించి మనషులను పెట్టారంటే ఇంతకన్నా దారుణం ఉంటుందా అన్ని ప్రశ్నించారు. సాక్ష్యాధారాలతో సహా నిందితులను పోలీసులకు అప్పగించినా ఇప్పటి వరకు కేసు నమోదు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. టీడీపీ నేతల ఒత్తిడితోనే కేసు నమోదు చేయటంలేదని విమర్శించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అందించిన సాక్ష్యాధారాలతో వెంటనే కేసు నమోదు చేయాలని పోలీసులకు గౌతమ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.