చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసుకునే పరిస్థితి కల్పించాలని ఎన్నికల సంఘాన్ని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోరారు. తిరుపతిలో చెవిరెడ్డి గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. ‘పోలింగ్ రోజు సీసీ ఫుటేజీ పరిశీలించండి.. పట్టించుకోకుంటే సుప్రీంకోర్టుకు వెళ్తానని చెప్పాను.. ఎన్నికల సంఘం క్షుణ్ణంగా పరిశీలించి ఈరోజు రీపోలింగ్‌కు అనుమతించారు. ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు దళితులకు ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం అధికారుల దృష్టికి తీసుకెళ్లాం.