
తిరుపతి రూరల్: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రకు సంఘీభావంగా చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాదయాత్ర చేయనున్నారు. ఈ నెల 30న తిరుపతికి సమీపంలోని తుమ్మలగుంట నుంచి తిరుత్తణి సుబ్రమణ్యస్వామి ఆల యం వరకు పాదయాత్ర చేస్తారు. ఈ సందర్భంగా తుమ్మలగుంటలోని శ్రీకల్యాణ వెంకన్న ఆలయం, తిరుచానూరు పద్మావతీ అమ్మవారి ఆలయం, తిరుత్తణి సుబ్రమణ్యస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన వందలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ పాదయాత్రలో పాల్గొంటారు.
Comments
Please login to add a commentAdd a comment