పాకాల : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న పాదయాత్రను విజయవంతం చేయాలని చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆ పార్టీ శ్రేణులను కోరారు. శనివారం దామలచెరువు రెడ్డెప్పరెడ్డి కల్యాణమండపంలో ఎమ్మెల్యే అ««ధ్యక్షతన ఆ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల కష్టసుఖాలు తెలుసుకునేందుకు జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న పాదయాత్రను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. పేదప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలంటే జగన్‌మోహన్‌రెడ్డికే సాధ్యమని తెలిపారు. పార్టీలోని సభ్యులంతా కుటుంబసభ్యులుగా మెలగాలని, అప్పుడు పార్టీ అభివృద్ధికి కృషిచేసిన వారవుతారని చెప్పారు.
ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే: మండలంలోని పదిపుట్లబైలు, పేరసానిపల్లి మార్గాల్లో జరిగే జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర ప్రదేశాలను ఎమ్మెల్యే పరిశీలించారు. దామలచెరువులో జరిగే బహిరంగ సభ ప్రదేశాన్ని కూడా పరిశీలించారు. పార్టీ నాయకులకు పలు సూచనలు చేశారు. వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ జ్యోతిప్రసాద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్‌ఆర్ జయదేవ్‌నాయుడు, తుడా మాజీ చైర్మన్ ఎల్‌బీ ప్రభాకర్‌నాయుడు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి నంగా బాబురెడ్డి, చిటిపిరాళ్ల చెన్నకేశవరెడ్డి, ప్రకాష్‌రెడ్డి, గుండ్లూరి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment