
తిరుపతి రూరల్: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర విజయవతం కావాలంటూ చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాదయాత్ర ప్రారంభించారు. ఈ రోజు తిరుపతికి సమీపంలోని తుమ్మలగుంట నుంచి తిరుత్తణి సుబ్రమణ్యస్వామి ఆలయం వరకు 100 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తారు. ఈ సందర్భంగా తుమ్మలగుంటలోని శ్రీకల్యాణ వెంకన్న ఆలయం, తిరుచానూరు పద్మావతీ అమ్మవారి ఆలయం, తిరుత్తణి సుబ్రమణ్యస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. పాదయాత్రలో పాల్గొనేందుకు చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన వందలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు.
’ప్రజాసంకల్పయాత్ర’ విజయం కోసం చెవిరెడ్డి పాదయాత్ర
Comments
Please login to add a commentAdd a comment