సి.రామాపురంలో ఉద్రిక్తత
తిరుపతి :
సి.రామాపురంలోని డంపింగ్‌యార్డును తరలించాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి చేస్తున్న నిరవధిక నిరసన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో సి.రామాపురం గ్రామంలో 144 సెక్షన్ విధించారు. గత మూడు రోజులుగా రామాపురంలోని డంపింగ్ యార్డును ఎత్తివేయాలని గ్రామస్తులతో కలిసి చెవిరెడ్డి రోడ్డుపైనే బైఠాయించి, నిరవధిక నిరసనకు దిగిన విషయం తెలిసిందే.
కాగా శుక్రవారం పోలీసులు చెవిరెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు 50మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. పలువురు మహిళా కార్యకర్తలను కూడా అరెస్ట్ చేశారు.