జగనన్నతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం | Jagan Is The Development Of State | Sakshi
Sakshi News home page

జగనన్నతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం

Published Thu, Mar 14 2019 12:21 PM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM

Jagan Is The  Development Of State - Sakshi

వెంకటరెడ్డిని వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హాజరైన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు

సాక్షి, ఎర్రావారిపాళెం: రాష్రాభివృద్ధి జగనన్నతోనే సాధ్యమవుతుందని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నాటి స్వర్ణయుగాన్ని జననేత తిరిగి తీసుకువస్తాడని చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఎర్రావారిపాళెంలో వైఎస్సార్‌సీపీ ఆధర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ జగనన్న ప్రకటించిన నవరత్నాల పథకాలతో అన్ని వర్గాలకు మేలు చేకూరుతుందన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే యువశక్తికి తోడ్పాటుంటుందన్నారు. ప్రత్యేకహోదా విషయంలో అధికార పార్టీ ఊసరవెళ్లి ధోరణిలో ప్రజలను మోసం చేసిందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించగల సత్తా ఒక జగనన్నకు మాత్రమే ఉందన్నారు.

జగనన్న ప్రకటించిన ప్రతి హామీ కూడా వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తారన్నారు. వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ సీనియర్‌ నాయకుడు చెరుకువారిపల్లె పంచాయతీ పులిపుతృవారిపల్లెకు చెందిన టీడీపీ సీనియర్‌ నాయకుడు తిమ్మసముద్రం వెంకటరెడ్డి తన భారీ అనుచర ఘనంతో కలసి వైఎస్సార్‌సీపలో చేరారు. వెంకటరెడ్డికి చెవిరెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వెంకటరెడ్డి మాట్లాడుతూ టీడీపలో అవినీతి, అక్రమాల తీరు, పార్టీ విధానాలు నచ్చకనే వైఎస్సార్‌ సీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఎంపీపీ రేవతిరెడ్డెప్పరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు చెంగల్‌రెడ్డి, వైఎస్సార్‌ సేవాదళ్‌ రాష్ట్ర కార్యదర్శి దేపట్ల నాగార్జునరెడ్డి, కరుణాకర్‌రెడ్డి, రమేష్, నాగరాజనాయుడు, మహేశ్వర్‌రెడ్డి, నాగరాజ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement