సాక్షి, తిరుపతి:
సీఎం చంద్రబాబు నాయుడు బ్యానర్లు, ఫ్లెక్సీ బోర్డులు తొలగించారన్న అభియోగం కింద చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై నమోదైన కేసును కొట్టివేస్తూ తిరుపతి మూడో అదనపు జూనియర్ సివిల్ జడ్జి జస్టిస్ సాయికుమారి శుక్రవారం తీర్పు చెప్పారు. కేసులోని వివరాల మేరకు 2014 జనవరి 13న సంక్రాంతి పండుగకు సీఎం చంద్రబాబు నారావారిపల్లెకు వస్తున్నారన్న సందర్భంగా రెండు రోజులు ముందుగా చంద్రగిరి టీడీపీ నాయకుడు కె.ఇందుశేఖర్ మహిళా వర్సిటీ క్రాస్ నుంచి తుమ్మలగుంట రోడ్డు చాముండేశ్వరి దేవాలయం వరకు 99 ఫ్లెక్సీ బోర్డులు, బ్యానర్లను ఏర్పాటు చేశారు. వాటిని వైఎస్సార్‌సీపీకి చెందిన ఎమ్మెల్యే భాస్కర్‌రెడ్డి టీడీపీపై కోపంతో తొలగించారని ఆయన ఎంఆర్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అప్పటి డీఎస్పీ వెంకటరామానుజులు, ఎస్‌ఐ ఆదినారాయణరెడ్డి కేసు దర్యాప్తు చేసి ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన న్యాయమూర్తి దీన్ని తప్పుడు ఫిర్యాదుగా భావించి ప్రాసిక్యూషన్ సరైన సాక్షాధారాలతో నిరూపించకపోవడంతో ఎమ్మెల్యేపై కేసును కొట్టివేస్తూ తీర్పు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment