విచారణ పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను వేధిస్తోందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆరోపించారు. ఒక పద్ధతి ప్రకారం తమపై ప్రభుత్వం బురద చల్లే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. మంగళవారం ఆయన గుంటూరులోని సీఐడీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.