గుంటూరులో పోలీసుల అత్యుత్సాహం | police acitng as per chandra babu wishes, says chevireddy bhaskar reddy | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 6 2016 6:11 PM | Last Updated on Thu, Mar 21 2024 5:25 PM

భూమన కరుణాకరరెడ్డిని విచారించే సందర్భంగా.. పోలీసులు గుంటూరు సీఐడీ కార్యాలయం వద్ద అత్యుత్సాహం ప్రదర్శించారు. రోడ్డు మీద.. సీఐడీ కార్యాలయానికి అవతలివైపు ఉన్న వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను అక్కడి నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. తాము ఆఫీసులోకి రాలేదని.. అలాంటప్పుడు ఎందుకు తమను వెళ్లిపొమ్మంటున్నారని అడిగినా వినిపించుకోలేదు. దీనిపై వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి మండిపడ్డారు. ''మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామో, పాకిస్థాన్‌లో ఉన్నామో అర్థం కావట్లేదు. మేం రోడ్డుమీద ఉన్నాం. వెళ్లిపోవాలంటే కరుణాకర రెడ్డిని ఏం చేయబోతున్నారో అర్థం కావట్లేదు. ఆయన ఏం తప్పు చేయలేదన్న విషయం అందరికీ తెలుసు. ఒకటి స్పష్టంగా చెబుతున్నాం.. ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించడం సరికాదు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement